
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసుల దర్యాప్తుపై పర్యవేక్షణకు సిట్ ఏర్పాటైంది. విచారణ జరపకుండానే మూసేసిన ఆనాటి 186 కేసులపై ఈ సిట్ విచారణ జరపనుంది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా నేతృత్వంలో త్రిసభ్య బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది.
ఈ సిట్‌లో ఆయనతోపాటు అభిషేక్ దులార్ (2006 బ్యాచ్ ఐపీఎస్), రాజ్‌దీప్ సింగ్ (రిటైర్డ్ ఐజీ ర్యాంకు అధికారి) సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ రెండు నెలల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. సిట్‌లో ఉండాల్సిన సభ్యులపై హోం మంత్రిత్వ శాఖతోపాటుగా పిటిషనర్ జీఎస్ కహ్లాన్ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే సుప్రీం కోర్టు ఈ పేర్లను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment