dhingra commission
-
జస్టిస్ ధింగ్రా నేతృత్వంలో సిట్
-
జస్టిస్ ధింగ్రా నేతృత్వంలో సిట్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసుల దర్యాప్తుపై పర్యవేక్షణకు సిట్ ఏర్పాటైంది. విచారణ జరపకుండానే మూసేసిన ఆనాటి 186 కేసులపై ఈ సిట్ విచారణ జరపనుంది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా నేతృత్వంలో త్రిసభ్య బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. ఈ సిట్‌లో ఆయనతోపాటు అభిషేక్ దులార్ (2006 బ్యాచ్ ఐపీఎస్), రాజ్‌దీప్ సింగ్ (రిటైర్డ్ ఐజీ ర్యాంకు అధికారి) సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ రెండు నెలల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. సిట్‌లో ఉండాల్సిన సభ్యులపై హోం మంత్రిత్వ శాఖతోపాటుగా పిటిషనర్ జీఎస్ కహ్లాన్ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే సుప్రీం కోర్టు ఈ పేర్లను విడుదల చేసింది. -
రాబర్ట్ వాద్రాకు అనుమతుల్లో అక్రమాలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కష్టాలు తప్పేలా లేవు. గుర్గావ్లో ఆయనకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ గ్రూపునకు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా జస్టిస్ (రిటైర్డ్) ఎస్ఎన్ ఢింగ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిగ్గుతేల్చినట్లు తెలిసింది. గుర్గావ్లోని నాలుగు గ్రామాల్లో భూముల వినియోగ మార్పిడి విషయంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఈ కమిషన్‌ను నియమించారు. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ గ్రూపు కూడా ఈ భూమి వినియోగ మార్పిడి వల్ల లబ్ధి పొందింది. ఆ గ్రూపునకు అనుమతులు మంజూరుచేయడంలో సైతం అక్రమాలు జరిగినట్లు ఢింగ్రా కమిషన్ నిర్ధారించిందని సమాచారం. ఈ ప్రాంతంలో పెద్ద మనుషులకు భూవినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వడం వల్ల ఆ తర్వాత ఇక్కడి భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని ఢింగ్రా కమిషన్ గుర్తించింది.