కెనడాలో వైశాఖి పరేడ్‌..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన! | Vaisakhi Parade Held In Vancouver After 3 Years Of Covid In Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో వైశాఖి పరేడ్‌..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!

Published Sun, Apr 16 2023 4:32 PM | Last Updated on Sun, Apr 16 2023 4:32 PM

Vaisakhi Parade Held In Vancouver After 3 Years Of Covid In Canada - Sakshi

కెనడాలో జరిగే పురాతన వేశాఖి వేడుక కోవిడ్‌ 19 దృష్ట్యా మూడేళ్ల అనంతరం అట్టహాసంగా జరిగింది. దీనికోసం దాదాపు 2 లక్షలమంది పరేడ్‌లో హజరయ్యి రాస్‌ స్ట్రీట్‌ గురద్వారా(నగర కీర్తన)కు స్వాగత పలికారు. ఇది ఖల్సాపంత్‌కు గుర్తుగా జరిగే సిక్కులకు సంబంధించిన వేడుక. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని వాంకోవర్‌లో 1906లో స్థాపించబడిన ఖల్సా దివాన్‌ సొసైటీ ఈ ఖల్సా డే పరేడ్‌ను నిర్వహించడమేగాక చారిత్రాత్మకమైన రాస్‌ స్ట్రీట్‌ గురద్వారా(నగర సంకీర్తన)ను కూడా నిర్వహిస్తోంది.

చివరిసారిగా 2019లో ఖల్సా పంత్‌కు గుర్తుకు జరిగిన ఈ వేడుకలో  సుమారు లక్షమంది హజరయ్యారు. ఐతే మూడేళ్ల అనంతర జరుగుతున్న వేడుకలో అంచనాకు మించి దాదాపు రెండు లక్షల మంది హాజరుకావడం విశేషం. గతమూడేళ్ల ఈ వేడుకగా జరుగక కమ్ముకున్న నిరాశను అట్టహాసంగా సాగుతున్న వేడుక భర్తీ చేసింది. ఇందులో సిక్కు  మత గ్రంథమైన 52 అడుగుల గురుగ్రంథ్‌ సాహిబ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ మేరకు సోసైటీ ప్రెసిడెంట్‌ కుల్దిప్‌ సింగ్‌ తాండి మాట్లాడుతూ..ఈ వేడుక అద్భుతంగా జరిగిందని, ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇది 1979లో తొలిసారిగా జరిగిందన్నారు. ఈ నగర కీర్తన విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ట్రుడో, అతని తోపాటు మంత్రి వర్గ సహచరుడు హర్జిత్‌ సజ్జన్‌ కూడా హాజరయ్యారు. 

(చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement