టొరెంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కరోనా సోకింది. అయితే తనకు బాగానే ఉందని ట్రూడో సోమవారం ప్రకటించారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. పబ్లిక్ హెల్త్ నింబంధనలు పాటిస్తూ.. వారం రోజులపాటు దూరంగా ఉంటూనే పనిచేస్తానని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ట్విటర్‌లో తెలిపారు.
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఇంకా కరోనాతో పోరాటం ముగిసిపోలేదు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో కొంతమంది చేస్తున్న నిరసనలు బాధకరమని తెలిపారు. అలాంటి ప్రవర్తనకు దేశంలో చోటులేదని ఓ రహస్య ప్రాంతం నుంచి ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.
దేశంలో ప్రజల నిరసనల నేపథ్యంలో ప్రధాని ట్రూడో.. భార్య పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియరాలేదు. జస్టిన్ ట్రూడోపై సోషల్ మీడియాలో నేటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. కెనడా దేశంలో ప్రజలకు కరోనా వాక్సిన్ తప్పనిసరి చేయడంపై అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రజలు పెద్ద ఎత్తున ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని జస్టిన్ ట్రూడో అజ్ఞాతంలోకి వెళ్లారు.
This morning, I tested positive for COVID-19. I’m feeling fine – and I’ll continue to work remotely this week while following public health guidelines. Everyone, please get vaccinated and get boosted.— Justin Trudeau (@JustinTrudeau) January 31, 2022
Comments
Please login to add a commentAdd a comment