
Medicagos Two-Dose Vaccine Can Be Given To Adults: మెడికాగో అనే మొక్క ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను 18 నుంచి 64 ఏళ్ల పెద్దలకు ఇవ్వవచ్చని కెనడియన్ అధికారులు తెలిపారు. అయితే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇవ్వవచ్చా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ మేరకు 24 వేల మంది పెద్దవాళ్లపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు కోవిడ్ -19 నిరోధించడంలో ఈ టీకా 71% ప్రభావంతంగా ఉందని తెలిపారు.
మెడికాగో అనే మొక్క వైరస్ లాంటి కణాలను పెంచడంలో సజీవ కర్మాగారాలుగా పనిచేస్తుంది. ఇది కరోనా వైరస్‌ను కప్పి ఉంచే స్పైక్ ప్రోటీన్‌ను అనుకరిస్తుంది. మొక్కల ఆకుల నుండి కణాలు తొలగించి శుద్ధి చేస్తారు. ఇది బ్రిటీష్ భాగస్వామి గ్లాక్సో స్మిత్‌క్లైన్ తయారు చేసిన అడ్జువాంట్‌గా పిలిచే రోగనిరోధక శక్తిని పెంచే మరొక వ్యాక్సిన్.
ప్రపంచవ్యాప్తంగా అనేక కోవిడ్-19 వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య అధికారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ల సరఫరాను పెంచాలనే ఉద్దేశంతో మరిన్ని పరిశోధనలను చేస్తున్నారు. క్యూబెక్ సిటీ-ఆధారిత మెడికాగో మెడికల్ ల్యాబ్ అనేక ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా మొక్కల ఆధారిత వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తోంది.
(చదవండి: వీధి కుక్కకు హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం!..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!)
Comments
Please login to add a commentAdd a comment