Parade
-
కనువిందు చేస్తున్న రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ (ఫోటోలు)
-
జనసంద్రలా ముంబై తీరం.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ (ఫోటోలు)
-
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ (ఫొటోలు)
-
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
అమెరికా స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పులు
కేన్సాస్ సిటీ: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిస్సోరి రాష్ట్రం(స్టేట్) కేన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్‌పై దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. కేన్సాస్ సిటీ చీఫ్స్ ‘సూపర్ బౌల్’ విజేతగా నిలవడంతో.. పరేడ్ నిర్వహించారు. ఆ సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరేడ్‌లో వేలాది మంది పాల్గొనగా.. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగం. ఏటా సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా.. వేల మంది ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. New video shows moment gunfire erupts at the Super Bowl rally in Kansas City. At least 22 people shot pic.twitter.com/dUYM9G07fg — BNO News (@BNONews) February 15, 2024 అమెరికాలో గన్ కల్చర్‌లో మాస్ షూటింగ్(సామూహిక కాల్పుల) ఘటనలూ తరచూ చోటుచేసుకుంటున్నాయి. కిందటి ఏడాది.. ఎన్బీఏ ఛాంపియన్షిప్ విజయం నేపథ్యంలో డెన్వర్(కొలరాడో)లో నిర్వహించిన ఫ్యాన్స్ సంబురాల్లోనూ కాల్పులు జరిగాయి. అప్పుడు పది మంది గాయపడ్డారు. అంతకు ముందు.. 2019లో టోరంటోలో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. -
దేశంలోనే తన సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ
-
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన
న్యూఢిల్లీ: కర్తవ్యపథ్‌లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్‌లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వీక్షకులను ఆకట్టుకుంది. సీటింగ్ ఏరియాలో సుమారు 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్ సూత్ర’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన చీరలను ప్రదర్శనకు పెట్టారు. Here’s a special look at the 'Anant sutra- The Endless Thread' textile installation at #KartavyaPath as a part of the 75th #RepublicDay celebrations!#CultureUnitesAll #AmritMahotsav #BharatKiNariinSaree #RepublicDay2024 pic.twitter.com/DoFQCJuFRm — Ministry of Culture (@MinOfCultureGoI) January 26, 2024 చెక్క ఫ్రేమ్స్‌కు రంగరంగు చీరలను అమర్చి ప్రదర్శించారు. దీంతో సీటింగ్ ఏరియాలో కూర్చన్న వీక్షకులను వాటిని చూసి సందడి చేశారు. ఇక.. ఆ చిరలను ఎక్కడ నేశారో? వాటి వెరైటీ ఎంటో? చీరల ఎంబ్రైడరీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చీరకు యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయటం విశేసం. దీనికి సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తన ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకేసారి దేశంలో ఉన్న పలు వెరైటీ చీరలు చూడటం బాగుంది.. యూఆర్ కోడ్ ఐడియా సూపర్’ అని కామెంట్లు చేస్తున్నారు. -
దాదాపు 40 ఏళ్ల తరువాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అలా...
#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే. #WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua — ANI (@ANI) January 26, 2024 కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. -
ఎర్రకోట వద్ద రిపబ్లిక్ డే వేడుకలు
-
విజయవాడ గణతంత్ర వేడుకల్లో ఉత్సాహంగా సాగిన మార్చ్ ఫాస్ట్
-
ఏపీ విద్యా సంస్కరణలు.. దేశానికి దిక్సూచిగా..
సాక్షి, అమరావతి : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్యా రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఇందుకు చెప్పుకోదగ్గ మొత్తం కూడా ఖర్చుపెట్టదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగున్నరేళ్లుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమేగాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సంకల్పించింది. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యా రంగం సమూలంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. కొద్దిమందికి మాత్రమే పరిమితమైన సీబీఎస్ఈ సిలబస్ సైతం ఇప్పుడు పేద పిల్లలకు అందుతోంది. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. త్వరలో అత్యంత ఖరీదైన ఐబీ సిలబస్ సైతం ఉచితంగా అందించనున్నారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దంపట్టేలా గణతంత్ర దినోత్సవ వేడుల్లో ప్రదర్శించే శకటాన్ని విద్యాశాఖ రూపొందించింది. ఈ నేపథ్యంలో.. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత.. అమలుచేస్తున్న సంస్కరణలపై ప్రత్యేక కథనం.. విద్యా సంక్షేమానికి భారీగా నిధులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. ఇందులో భాగంగా.. ► పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపినందుకు గాను గత నాలుగేళ్లలో ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా 42,61,965 మంది ఖాతాల్లో రూ.26,349.50 కోట్లు ప్రభుత్వం జమచేసింది. ►మనబడి నాడు–నేడు పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారాయి. ►పాఠశాల తెరిచిన మొదటిరోజే ప్రతి విద్యార్థికి ‘జగనన్న విద్యాకానుక’గా ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలీతో మూడు జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగుతో పాటు హైస్కూల్ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించి ప్రైవేటు స్కూలు విద్యార్థుల కంటే మిన్నగా బడికి వెళ్లేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. ►బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసి అందులో ఒకటి బాలికలకు కేటాయించింది. ఇటు ‘గోరుముద్ద’.. అటు డిజిటల్ చదువులు.. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు చిక్కీ, రాగిజావతో సహా 16 రకాల పదార్థాలతో ‘జగనన్న గోరుముద్ద’ను అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,910 కోట్లు అదనంగా ఖర్చుచేస్తోంది. గోరుముద్ద పథకం కింద ఇప్పటిదాకా రూ.6,262 కోట్లు ఖర్చుచేశారు. ►అలాగే, ఏటా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రూ.15 వేల విలువైన బైజూస్ కంటెంట్‌తో రూ.17,500కు పైగా మార్కెట్ విలువగల ట్యాబ్‌ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గత రెండేళ్లలో మొత్తం 9,52,925 ట్యాబులు ఉచితంగా అందించిన ఘనత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరిగింది. ► 62 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను, స్మార్ట్ టీవీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లోను, తరగతి గదుల్లో అమర్చిన ఐఎఫ్‌బీలు, స్మార్ట్ టీవీల్లో బైజూస్ కంటెంట్ ద్వారా బోధన చేపట్టారు. ఫలితాన్నిచ్చిన విద్యా సంస్కరణలు.. ఈ సంస్కరణల ఫలితంగా గత విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించారు. ఇలా ప్రతిభ కనబరిచిన 22,710 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’గా గుర్తించి వారిని సత్కరించి ప్రభుత్వం ప్రోత్సహించింది. విద్యా సంస్కరణల శకటం ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న విద్యా సంస్కరణలను చాటిచెబుతూ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన శకటం శుక్రవారం విజయవాడలో జరిగే గణతంత్ర వేడుకల్లో సందడి చేయనుంది. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోను, విద్య, విద్యార్థుల్లో తీసుకొచ్చిన మార్పులతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. అలాగే, ఢిల్లీలో జరిగే వేడుకల్లో సైతం ఏపీ విద్యా సంస్కరణల ఆధారంగా రూపొందించిన శకటం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ‘డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ విధానంతో ఈ వాహనం దేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని పరిచయం చేయనుంది. -
‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర వేడుకలు ఎందుకంటే..
భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పరేడ్‌లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి. ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆహ్వానించారు. ‘కర్తవ్య పథ్’ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1911లో బ్రిటిష్ సర్కారు తన రాజధానిని కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘కింగ్స్‌వే’ అనే పేరు పెట్టింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్‌పథ్’గా మార్చారు. ఆ తరువాత దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరుపెట్టారు. ఇది కూడా చదవండి: గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి? ముఖ్య అతిథి ఎవరు? గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను ‘కర్తవ్య పథ్’లోనే నిర్వహిస్తున్నారు. ఈ రహదారి వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్‌పథ్’ను ‘కర్తవ్య పథ్’గా మార్చారు. అనంతరం దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు. ఒకప్పడు ‘రాజ్‌పథ్’ అధికార చిహ్నంగా ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్’గా మార్చాక ఈ రహదారి సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవాన ప్రధాని మోదీ మాట్లాడుతూ నాటి ‘కింగ్స్‌వే’ లేదా ‘రాజ్‌పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. -
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. -
విద్యా సంస్కరణలకు అద్దంపట్టేలా రాష్ట్ర శకటం
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దంపట్టేలా ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’’ అనే ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తోందని, తద్వారా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఇప్పటికే 62 వేల డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ ల్యాబ్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ప్లే గ్రౌండ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ అంశాన్ని అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి 55 సెకెన్ల నిడివిగల థీమ్ సాంగ్ రూపొందించామని, శకటం పరేడ్‌లో ప్రదర్శనకు సిద్ధమైందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్‌లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్‌గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో నావిగేషన్ బ్రాంచ్‌లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్‌గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్‌దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్‌కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్‌లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్‌దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్‌లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్‌ఫోర్స్‌కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్‌ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
'మా రాష్ట్రంలోనూ మణిపూర్ తరహా ఘటన'.. మహిళా ఎంపీ ఆవేదన..
కోల్‌కతా: మణిపూర్ తరహా ఘటన పశ్చిమ బెంగాల్లోనూ జరిగిందని హుగ్లీ భాజపా ఎంపీ లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. మణిపుర్ ఘటపై మాట్లాడుతూ మీడియా సమావేశంలో స్పందించారు. జులై 8న పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన జరిగిందని అన్నారు. భాజపా మహిళా అభ్యర్థిని వివస్త్రని చేసి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. ఇదో మణిపూర్ లాంటి ఘటనే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనను ఖండిస్తున్నామని తెలిపిన పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్.. పశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో భాగమేనని అన్నారు. బెంగాల్లో మహిళకు జరిగిన ఘటన కూడా అమానవీయం అని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. హౌరా జిల్లాలోని దక్షిణ్ పంచాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపిన సుకాంత మజుందార్.. దీనిపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Manipur Violence: 'కార్గిల్‌లో పోరాడినా.. భార్యను కాపాడలేకపోయా' మణిపూర్ బాధితుని ఆవేదన -
మణిపూర్‌లో కీచక పర్వం.. స్మృతి ఇరానీ స్పందన
ఇంఫాల్/ఢిల్లీ: అల్లర్లలో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో కీచక పర్వం వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై పంట పొలాల్లోకి లాక్కెల్లి కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కెమెరాల సాక్షిగా ఇది జరగ్గా.. ఈ ఘోరానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌లో తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే.. చుట్టూ ఉన్న మూక వాళ్లను ఇష్టానుసారం తాకుకూ వేధించడం అందులో ఉంది. ఆపై వాళ్లను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్తూ మరో వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆపై ఆ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లా పరిధిలో మే 4వ తేదీన ఇది జరిగిందని ఐటీఎల్ఎఫ్ (ఆదివాసీ గిరిజన నేతల సంఘం) ఆరోపిస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం ఇది వేరే చోట జరిగిందని.. ఎఫ్ఐఆర్ మాత్రం కాంగ్పోక్పిలో నమోదు అయ్యిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందించారు. హైప్రొఫైల్ కేసుగా దీనిని దర్యాప్తు చేపట్టాలని మణిపూర్ పోలీస్ శాఖను ఆదేశించారు. The horrific video of sexual assault of 2 women emanating from Manipur is condemnable and downright inhuman. Spoke to CM @NBirenSingh ji who has informed me that investigation is currently underway & assured that no effort will be spared to bring perpetrators to justice. — Smriti Z Irani (@smritiirani) July 19, 2023 అంతకు ముందు కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై.. భయంకరమైన ఘటన అని ట్వీట్ చేశారామె. ఘటనపై సీఎం బీరెన్, మణిపూర్ సీఎస్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వాళ్లను కోరినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. బాధితులు కుకీ తెగ మహిళలుగా తెలుస్తోంది. *All out effort to arrest culprits as regard to the viral video of 02 (two) women paraded naked :* As regard to the viral video of 02 (two) women paraded naked by unknown armed miscreants on 4th May, 2023, a case of abduction, gangrape and murder etc 1/2 — Manipur Police (@manipur_police) July 19, 2023 PM’s silence and inaction has led Manipur into anarchy. INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur. We stand with the people of Manipur. Peace is the only way forward. — Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023 ఈ ఘటనకు ఒక్కరోజు ముందు నుంచే మణిపూర్ రణరంగంగా మారడం ప్రారంభమైందన్నది తెలిసిందే. గిరిజన హోదా కోరుతూ మెయితీలు చేస్తున్న విజ్ఞప్తులు.. అక్కడి కుకీ గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. మానప్రాణాలు పోతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. అపహరణ, గ్యాంగ్‌రేప్‌తో పాటు హత్యానేరాల కింద కేసులు నమోదు చేసినట్లు మణిపూర్ పోలీస్ శాఖ వెల్లడించింది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. मणिपुर से आ रही महिलाओं के खिलाफ यौन हिंसा की तस्वीरें दिल दहला देने वाली हैं। महिलाओं के साथ घटी इस भयावह हिंसा की घटना की जितनी निंदा की जाए कम है। समाज में हिंसा का सबसे ज्यादा दंश महिलाओं और बच्चों को झेलना पड़ता है। हम सभी को मणिपुर में शांति के प्रयासों को आगे बढ़ाते हुए… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2023 Attention India! The modesty of two tribal women from Manipur were outraged on 4th May. They were paraded naked, fondled and beaten in full public glare! A disturbing video taken by a perpetrator leaked and got viral today. This breaks all level of humanity. @PMOIndia @NCWIndia — hoihnu hauzel - www.thenestories.com (@hoihnu) July 19, 2023 ట్విటర్లో వీడియోలు తొలగింపు.. చర్యలు? మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా ఊరేగిస్తూ.. ఇష్టానుసారం తాకుతూ ఉరేగించిన వీడియో ట్విటర్‌ను కుదిపేసింది. వాళ్లపై సామూహిక అత్యాచారమూ జరిగిందన్న ఆరోపణలతో యావత్ దేశం భగ్గుమంది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఘటనలకు వీడియోలను తొలగించాలని ట్విటర్‌ను కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వీడియోను తొలగించాలని ట్విటర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. భారత చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విటర్‌పై చర్యలకు ఉపక్రమించిబోతున్నట్లు సమాచారం. -
‘సాగర్ కవచ్’ కవాతు ప్రారంభం
సాక్షి,విశాఖపట్నం: దేశంలో రెండో అతి పెద్ద తీరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న ‘సాగర్ కవచ్’ కవాతు బుధవారం ప్రారంభమైంది. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడి తర్వాత తీర భద్రతపై దృష్టిసారించిన భారత్.. ప్రతి ఏటా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో సాగర్ కవచ్‌ని నిర్వహిస్తోంది. భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖ, పోర్టు అథారిటీలు, డీజీఎల్ఎల్తో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, ఏజెన్సీలు, మారీటైమ్ డొమైన్లో భాగస్వాములైన ఏజెన్సీలు ఈ సాగర్ కవచ్‌లో పాల్గొంటున్నాయి. సముద్ర జలాల్లో ఆయా కేంద్ర, రాష్ట్ర రక్షణ విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, విభాగాల వారీగా బలబలాల్ని నిరూపించుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. వనరుల దోపిడీ జరగకుండా ఏవిధమైన భద్రతని పెంపొందించాలనే అంశాలపైనా ఆయా విభాగాలు చర్చించుకుంటాయి. ఏపీ తీరం వెంబడి పూర్తిస్థాయి భద్రత వలయాన్ని నిర్మించేందుకు మత్స్యకారుల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? వారిని ఎలా సుశిక్షుతుల్ని చేయాలనేదానిపైనా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుండగా.. విశాఖలోని కోస్ట్‌గార్డ్ తూర్పు ప్రధాన కార్యాలయం నుంచి సమన్వయ సహకారం జరుగుతోంది. సముద్ర జలాల్లో ఏ చిన్న శత్రు సంబంధిత సమాచారం దొరికినా..పోలీస్(100) లేదా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్‌కు సంబంధించి 1093 లేదా ఇండియన్ కోస్ట్‌గార్డు హెల్ప్‌లైన్ నంబర్ 1554కి సమాచారం అందించాలని రక్షణ విభాగాలు విజ్ఞప్తి చేశాయి. గురువారం సాయంత్రంతో సాగర్ కవచ్ ముగియనుంది. -
President Draupadi Murmu: కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భూమి, సముద్రం, గగనతల రక్షణలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత వాయుసేనలో మహిళల సంఖ్య పెరుగుతుండటం, ఫైటర్ జెట్ పైలట్లలోనూ మహిళలు ఉండటం సంతోషకరమన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీ, 75మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ కేడెట్లు, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో ఎనిమిది మంది అధికారులు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా పాల్గొనడం వాయుసేన చరిత్రలో తొలిసారి కావడం విశేషం. కేడెట్ల నుంచి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని అవార్డులతో సత్కరించారు. వైమానిక దళం ఎంతో సేవ చేసింది భారత వాయుసేనలో ఉద్యోగ జీవితం సవాళ్లతో కూడుకోవడంతోపాటు ఎంతో గౌరవప్రదమైందని రాష్ట్రపతి చెప్పారు. దేశ సేవకోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, కేడెట్లను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అకాడమీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానంలో భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ‘1948, 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో దేశాన్ని రక్షించడంలో భారత వైమానిక దళానికి చెందిన వీరులు పోషించిన గొప్ప పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కార్గిల్ పోరాటంలో, బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడంలో అదే సంకల్పాన్ని, నైపుణ్యాన్ని చూపారు. అందుకే భారత వైమానిక దళానికి వృత్తి నైపుణ్యం, అంకితభావానికి మారుపేరన్న ఖ్యాతి ఉంది. విపత్తుల సమయంలో మానవత్వంతో సాయం చేయడంలోనూ భారత వాయుసేనకు గొప్ప పేరుంది’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. భవిష్యత్ యుద్ధరంగంలో అత్యాధునిక సాంకేతికత ముఖ్య భూమిక పోషిస్తుందని. ఈ నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాలు, చినోక్ హెవీ లిఫ్ట్ చాపర్ల వంటి సాధన సంపత్తిని వాయుసేన సమకూర్చుకుంటోందని చెప్పారు. ఆకట్టుకున్న ఎయిర్ షో పరేడ్ అనంతరం నిర్వహించిన ఎయిర్‌షో ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ ఎస్‌యూ–30, సారంగ్ హెలికాప్టర్లు, సూర్యకిరణ్ ఎరోబాటిక్ బృందాల గగనతల ప్రదర్శనలు అలరించాయి. గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. -
కెనడాలో వైశాఖి పరేడ్..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!
కెనడాలో జరిగే పురాతన వేశాఖి వేడుక కోవిడ్ 19 దృష్ట్యా మూడేళ్ల అనంతరం అట్టహాసంగా జరిగింది. దీనికోసం దాదాపు 2 లక్షలమంది పరేడ్‌లో హజరయ్యి రాస్ స్ట్రీట్ గురద్వారా(నగర కీర్తన)కు స్వాగత పలికారు. ఇది ఖల్సాపంత్కు గుర్తుగా జరిగే సిక్కులకు సంబంధించిన వేడుక. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని వాంకోవర్‌లో 1906లో స్థాపించబడిన ఖల్సా దివాన్ సొసైటీ ఈ ఖల్సా డే పరేడ్‌ను నిర్వహించడమేగాక చారిత్రాత్మకమైన రాస్ స్ట్రీట్ గురద్వారా(నగర సంకీర్తన)ను కూడా నిర్వహిస్తోంది. చివరిసారిగా 2019లో ఖల్సా పంత్‌కు గుర్తుకు జరిగిన ఈ వేడుకలో సుమారు లక్షమంది హజరయ్యారు. ఐతే మూడేళ్ల అనంతర జరుగుతున్న వేడుకలో అంచనాకు మించి దాదాపు రెండు లక్షల మంది హాజరుకావడం విశేషం. గతమూడేళ్ల ఈ వేడుకగా జరుగక కమ్ముకున్న నిరాశను అట్టహాసంగా సాగుతున్న వేడుక భర్తీ చేసింది. ఇందులో సిక్కు మత గ్రంథమైన 52 అడుగుల గురుగ్రంథ్ సాహిబ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు సోసైటీ ప్రెసిడెంట్ కుల్దిప్ సింగ్ తాండి మాట్లాడుతూ..ఈ వేడుక అద్భుతంగా జరిగిందని, ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇది 1979లో తొలిసారిగా జరిగిందన్నారు. ఈ నగర కీర్తన విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ట్రుడో, అతని తోపాటు మంత్రి వర్గ సహచరుడు హర్జిత్ సజ్జన్ కూడా హాజరయ్యారు. (చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు) -
హకీంపేట్ లో CISF రైజింగ్ డే పరేడ్
-
సత్తా చాటారు ఐపీఎస్ అయ్యారు
లక్ష్య సిద్ధి ఉంటే విజయం ఖాయమని నిరూపించారు...లక్షల్లో జీతాలు ఇవ్వని తృప్తి్తని వెతుక్కుంటూ ప్రజాసేవలో అడుగుపెట్టబోతున్నారు. వెన్నుతట్టి ప్రో త్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలమేననడానికి మరోమారు ఉదాహరణగా నిలిచారు యువ ఐపీఎస్ప్రోబేషనరీ అధికారిణులు. కూతుళ్లను ఉన్నతంగా చూడాలన్న ఆ తండ్రుల ఆశయాలను..మహోన్నతంగా తమ విజయంతో చాటారు ఈ యువ ఐపీఎస్ అధికారిణులు. తగినప్రోత్సాహం అందిస్తే.. తామేంటో చూపిస్తామని నిరూపించారు.సమాజంలో అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపిక కావడమే కాదు..ట్రైనింగ్‌లోనూ తాము సివంగులమని పురుషులతో కలబడి నిలబడ్డారు. బెస్ట్ ఔట్‌డోర్ ట్రోఫీని దక్కించుకున్నారు. రేపు శనివారం దీక్షాంత్ పరేడ్‌తో ప్రజాసేవలోకి తొలి అడుగు పెట్టబోతున్న మహిళా ఐపీఎస్ అధికారులు ‘ఫ్యామిలీ’తో తమ శిక్షణ అనుభవాలు..భవిష్యత్ లక్ష్యాలను ఇలా పంచుకున్నారు... – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ ప్రణాళిక ఉండే విజయం తప్పక వస్తుంది నా పేరు శేషాద్రి రెడ్డి... మా నాన్న సుధాకర్‌రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో ప్రో త్సహించేవారు. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ప్రజలకు ఎంత సేవ చేసే అవకాశం ఉంటుంది..వాళ్లకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందన్నది బాగా చెప్పేవారు. అది నాలో ఎంతో ప్రేరణ నింపింది. అలా చిన్ననాటి నుంచే నేను ఐపీఎస్ కావాలని నిశ్చయించుకున్నా. ముందు నుంచి నేను ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వచ్చాను. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రిపరేషన్ పై మరింత ఫోకస్ పెట్టాను. అమ్మా నాన్నల సహకారం నా కష్టంతో చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన నాకు మళ్లీ తెలంగాణ కేడర్‌లో సొంత రాష్ట్రంలోనే సేవ చేసే అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. తెలంగాణలో పోలీస్ టెక్నాలజీ పరంగా, ఇతర అంశాల్లోనూ ఎంతో బాగున్నాయి. ఇప్పటికే మా సీనియర్ అధికారులు అమలు చేస్తున్న విధానాలను తెలుసుకుంటూనే ప్రజలకు పోలీసింగ్ మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తాను. భవిష్యత్తులో మరింతగా పెరగనున్న సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న దానిపైన మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అది మరింత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. – శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్, తెలంగాణ కేడర్ నేనే ఫస్ట్ పోలీస్ మా కుటుంబంలో చాలా మంది బిజినెస్‌లోనే ఉన్నారు. కానీ, నాకు మాత్రం ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో ఉండాలని కోరిక .. అందుకే నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అలా నాల్గో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా సొంతప్రా ంతం మహారాష్ట్ర. కానీ, మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న బిజినెస్‌లో ఉన్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి బీఎస్సీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపై స్థిరంగా ఉన్నాను..అందుకే మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాల్గో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. నేను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యాను. అక్కడి ప్రభుత్వం మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి విన్నాను.ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో జిల్లాల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ఒక ఐపీఎస్ అధికారిగా నా లక్ష్యం ఒక్కటే ...నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రజలు భద్రంగా ఉన్నామన్న భావన కల్పించడం.. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయడం. – అంకిత సురాన, ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ నాన్నే నాకు స్ఫూర్తి నాపేరు దీక్ష.. రాజస్థాన్ లోని జుంజున్ జిల్లా ఖేత్రీ పట్టణం. నాన్న అక్కడే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఏజీఎంగా పనిచేస్తారు. మా అమ్మ గవర్నమెంట్ టీచర్. ఐఐటీ ఢిల్లీ నుంచి నేను బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ్ర΄ారంభించాను. మా నాన్నకు నన్ను ఐపీఎస్‌గా చూడడం ఎంతో ఇష్టం. ఆయన ప్రోత్సాహంతోనే నేను సివిల్స్‌వైపు దృష్టి పెట్టాను. ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో సపో ర్ట్‌గా ఉంటారు. అలాగే మా సీనియర్స్ కూడా సివిల్స్ గురించి గొప్పగా చెప్పడం కూడా ఒక కారణం. సివిల్స్ రెండో ప్రయత్నంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. ఆ తర్వాత మళ్లీ మా నాన్నప్రోత్సాహంతో మూడోసారి సివిల్స్ రాశాను. అలా నాకు మూడో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. ఈ శిక్షణకు వచ్చినప్పుడు చాలా ఆందోళనగా అనిపించింది. కానీ క్రమంగా అన్నీ నేర్చుకున్నాను..గుర్రపు స్వారీ, గన్ షూటింగ్, క్రై మ్ ఇన్వెస్టిగేషన్ ఇలా ప్రతి పని నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. మహిళలు ఏదైనా సాధించగలరు..మన శక్తి ఏంటో మనం గుర్తించాలి. అప్పుడు మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసంతో చేయగల్గుతాం. అందుకు నేను ఉదాహరణ. నాకు బెస్ట్ ఔట్‌డోర్ ప్రోబేషనర్ అవార్డు వచ్చింది. ఆ విషయం తెలియగానే మొట్టమొదట మా నాన్నకే ఫోన్ చేసి చె΄్పా..ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. నాన్న డ్రీమ్ పూర్తి చేశానన్న తృప్తి నాకు ఎంతో అనిపించింది. సివిల్స్ లేదా ఇంకా ఏ పో టీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి నేను చెప్పేది ఒక్కటే... మన లక్ష్యం ఏంటి...? ఎలా సాధించాలన్నదానిపై స్పష్టత ఉండాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక పెట్టుకుని చదవాలి. శ్రద్ధగా, నిష్టగా ఉండాలి..అలా అని మిగిలిన విషయాలు వదిలేయద్దు. మనకు నచ్చినట్టు రిలాక్స్ అవ్వాలి. ఎంత ఏకాగ్రతతో చదువుతామన్న దాన్ని బట్టి రోజుకు ఎన్ని గంటలు చదవాలన్నది ఉంటుంది. నేను రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే చదివాను. పరీక్ష దగ్గరపడే కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్లా..రోజుకు 10 గంటలకు పెంచాను. నాకు విజయం వచ్చింది. – దీక్ష, బెస్ట్ ఔట్డోర్ప్రాబేషనరీ ఐపీఎస్, బీహార్ కేడర్ ఆరేళ్ల బాబును వదిలి ట్రైనింగ్‌కు వచ్చా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం కోసం ఆరేళ్ల బాబును వదిలి ట్రైనింగ్‌కు వచ్చాను..చివరకు మా బ్యాచ్‌లో లేడీప్రోబేషనరీ ఔట్‌డోర్ టాపర్‌గా నేను నిలవడం సంతోషంగా ఉంది. నాది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా. మా నాన్నగారు రైతు, మా అమ్మ టీచర్. నాకు ఒక చెల్లి. వీఐటీ యూనివర్సిటీ వెల్లూరులో నేను బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాను. తర్వాత వివాహం అయ్యింది. సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగం అయినా ఏదో వెలితి ఉండేది. దాన్ని వదిలేశాను. ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్‌లో పనిచేశాను.అదీ మంచి ఉద్యోగమే అయినా తృప్తి లేదు. ప్రజలతో మమేకమై వారికి ఉపయోగపడే వృత్తిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే నాకు కొడుకు పుట్టాడు. ఈ టైంలో మంచి ఉద్యోగం వదిలి సివిల్స్ ఎందుకు అని మా కుటుంబం, ముఖ్యంగా నా భర్త నిరుత్సాహపర్చలేదు.. నీ లక్ష్యం కోసం వెళ్లు.. కుటుంబాన్ని నేను చూసుకుంటా అన్నాడు. దాంతో బాబు పుట్టిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపరేషన్ ్ర΄ారంభించాను. అలా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. నేను ఔట్‌డోర్ ట్రైనింగ్‌లో ట్రోఫీ ΄÷ందానంటే ఈ ట్రైనింగ్ నాలో పెంచిన ఆత్మవిశ్వాసమే కారణం. ఐపీఎస్ శిక్షణ అనేది అంత చిన్న విషయమేమీ కాదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా ఎంతో శ్రమించాలి. శిక్షణప్రారంభంలో చాలా కష్టంగా అనిపించినా..క్రమంగా మనలోని శక్తిని మనం గుర్తిస్తాం. మా కుటుంబం నుంచి నేను మొదటి పో లీస్‌ను. ఎంతోమంది మహిళా పో లీసు అధికారులు నేను చూసిన వాళ్లు.. వాళ్లంతా నాకు ప్రేరణే. ఒక మహిళాపోలీస్ అధికారిగా నా వృత్తి జీవితంలో మహిళలు, చిన్నారుల సంరక్షణకు ఎక్కువప్రా ధాన్యం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. నా శిక్షణలో నా కుటుంబం పోర్ట్ ఎంతో ఉంది. – నిత్యా రాధాకృష్ణన్,ప్రోబేషనరీ ఐపీఎస్, ఏజీఎంటీయూటీ కేడర్ చూశారుగా వీరి ఆశయాలు, లక్ష్యాలు... నెరవేరాలని కోరదాం. -
Delhi: మన ఘన శక్తి.. మహిళా యోధులే సారథులు
న్యూఢిల్లీ: ఆత్మనిర్భరత స్ఫూర్తితో పరిపుష్టమైన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ.. నారీశక్తిని చాటుతూ.. వైవిధ్యమైన, సుసంపన్నమైన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కడుతూ 74వ గణతంత్ర వేడుకలు మువ్వన్నెల జెండాల రెపరెపలతో ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నిర్వహించిన వేడుకల్లో దేశ విదేశీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం సంప్రదాయం ప్రకారం కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలాపన తర్వాత సైనికులు లాంఛనంగా 21 గన్ సెల్యూట్ సమర్పించారు. రక్షణ రంగంలో స్వావలంబనకు సూచికగా పాతకాలపు విదేశీ 25–పౌండర్‌గన్స్ స్థానంలో ఈసారి స్వదేశీ 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చడం విశేషం. అబ్బురపర్చిన విన్యాసాలు కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కన్నుల పండువగా సాగింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపర్చాయి. మన ఆయుధ పాటవాన్ని, సైనిక శక్తిని తిలకించిన ఆహూతుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మరఠా లైట్ ఇన్ఫాంట్రీ, బిహార్ రెజిమెంట్, గూర్ఖా బ్రిగేడ్ తదితర సేనలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు, రక్షణ సామగ్రిని పరేడ్‌లో ప్రదర్శించారు. అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్, కె–9 వజ్ర యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నావికాదళం నుంచి 9 మంది అగి్నవీరులు తొలిసారిగా పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు యువతులున్నారు. వైమానిక విన్యాసాల్లో ఆధునిక మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకేఐ, రఫేల్ ఫైటర్లు, సి–130 సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానాలతోపాటు సి–17 గ్లోబ్ గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు పాల్గొన్నాయి. నావికా దళానికి చెందిన ఐఎల్–38 యుద్ధ విమానం సైతం తొలిసారిగా పాలుపంచుకుంది. దట్టమైన పొగమంచు వల్ల యుద్ధ విమానాల విన్యాసాలను ప్రజలు పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయారు. 800 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూడా కళ్లు చిట్లించుకొని చూడాల్సి వచి్చంది. వాటిని ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయాస పడ్డారు. 25–పౌండర్ శతఘ్నులకు సెలవు రిపబ్లిక్ డే వేడుకల్లో 21 గన్ సెల్యూట్లో భాగంగా 25–పౌండర్ గన్స్ పేల్చడం దశాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇకపై వీటికి శాశ్వతంగా సెలవు ఇచ్చేసినట్టే. ఈసారి దేశీయంగా తయారు చేసిన 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చారు. ఈ వందనంలో మొత్తం ఏడు శతఘ్నులు పాల్గొన్నాయి. ఒక్కొక్కటి మూడుసార్లు పేల్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో స్వదేశీ శతఘ్నులతో వందనం సమరి్పంచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2281 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన 25–పౌండర్ గన్స్ 1940 దశకం నాటివి. ఇవి యునైటెడ్ కింగ్డమ్లో తయారయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. 21 గన్ సెల్యూట్‌కు పట్టే సమయం 52 సెకండ్లు. మహిళా యోధులే సారథులు నారీశక్తిని ప్రతిబింబిస్తూ ‘ఆకాశ్’ ఆయుధ వ్యవస్థను లెఫ్టినెంట్ చేతన్ శర్మ నాయకత్వంలో ప్రదర్శించారు. 144 మంది జవాన్లు, నలుగురు అధికారులతో కూడిన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధూరెడ్డి నేతృత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం(సీఆర్పీఎఫ్) నుంచి పూర్తిగా మహిళా సైనికులతో కూడిన బృందం పరేడ్‌లో పాల్గొంది. ఈ బృందానికి అసిస్టెంట్ కమాండెంట్‌పూనమ్ గుప్తా సారథ్యం వహించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ఆర్మ్డ్ పోలీసు బెటాలియన్‌గా ఈ బృందానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే ఢిల్లీ మహిళా పోలీసుల పైప్ బ్యాండ్ కూడా మొదటిసారిగా గణతంత్ర పరేడ్‌లో భాగస్వామిగా మారింది. ‘ఢిల్లీ పోలీసు సాంగ్’ను వారు ఆలపించారు. పరేడ్ సైడ్‌లైట్స్ ►రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చిన తర్వాత ఇవే తొలి గణతంత్ర వేడుకలు. ►ఈసారి ‘నారీశక్తి’ థీమ్‌తో వేడుకలు జరిగాయి. ►ఈజిప్ట్ సైనిక దళాలు, బ్యాండ్ తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నాయి. ►ప్రధాని మోదీ ధరించిన రంగుల తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ►ముగ్గురు పరమవీర చక్ర గ్రహీతలు, ముగ్గురు అశోక చక్ర అవార్డు గ్రహీతలు పరేడ్‌లో పాల్గొన్నారు. ►బీఎస్ఎఫ్కు చెందిన ఒంటెల దళాన్ని తొలిసారిగా మహిళా సైనికులు నడిపించారు. ►మొత్తం 23 శకటాలను ప్రదర్శించారు. 17 రాష్ట్రాలవి కాగా 6 కేంద్ర శాఖలవి. ►ఢిల్లీ సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న ‘శ్రమయోగీల’తోపాటు పాలు, కూరగాయలు విక్రయించుకొనేవారిని, చిరు వ్యాపారులను గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ► 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) శకటంపై చిరుధాన్యాలను ప్రదర్శించారు. కనువిందుగా అలంకరించిన ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. -
కర్తవ్యపథ్‌లో అబ్బురపరిచిన కోనసీమ ‘ప్రభ’
సాక్షి , అమలాపురం: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో ఏపీలోని కోనసీమ ప్రాంతంలోని ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. కనుమ పండుగ రోజు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థంను శకటంగా రూపొందించారు. వేడుకల్లో మొత్తం 17 రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించగా..అందులో ఏపీ నుంచి ప్రభలతీర్థం ఒకటి కావడం విశేషం. ఈ పరేడ్‌లో పాల్గొన్న వారు ‘సాక్షి’తో తమ భావాలను ఇలా పంచుకున్నారు. ఈ సారి ప్రత్యేకం గతంలో నాలుగుసార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాను. కాని ఈసారి ప్రత్యేకం. మన ప్రాంతానికి చెందిన ప్రభ శకటం కూడా వెళ్లడం చాలా సంబరంగా అనిపించింది. మన ప్రభను అందరూ ప్రత్యేకంగా తిలకించారు. కొంతమంది భక్తితో నమస్కరించారు. ఇది మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. – చింతా వీరాంజనేయులు జన్మ ధన్యమైంది నాద బృందంలో ఇప్పటివరకు మా నాన్న పసులేటి నాగబాబు 15 సార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నారు. నేను పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం ఎప్పుడు దక్కుతుందా అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ప్రతిభాపాటిల్, ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మేము ప్రదర్శనలు చేసినా కవాతులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఏకాదశ రుద్రులతో ఉన్న ఏపీ శకటాన్ని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. విదేశీ ప్రముఖులు పక్కవారిని వివరాలు అడుగుతూ కనిపించారు. 10.51కి శకటం ప్రయాణం ప్రారంభం కాగా, కవాతు ముగిసి ఎర్రకోటకు చేరే సరికి 01.15 అయ్యింది. – పసుపులేటి కుమార్, ముక్కామల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
‘వధువు కావలెను’.. పెళ్లి బట్టలతో రోడ్డెక్కి నిరసనలు
ముంబై: లింగ నిష్పత్తి బేధాలు.. చాలా దేశాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. పురుషులకు సరిపడా మహిళలు లేకపోవడంతో ఏకంగా జనాభా తగ్గిపోతున్న దేశాలనూ చూస్తున్నాం. కడుపులో ఉండగానే.. ఆడ బిడ్డగా నిర్ధారించుకుని చిదిమేయడం, ఇతర కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది, ఈ క్రమంలో.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ కొందరు యువకులు రోడ్డెక్కిన ఘటన మన దేశంలోనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో పెళ్లీడుకొచ్చిన యువకులు.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ వాపోతున్నారు. వయసు మీద పడుతుండడంతో తమకు పెళ్లి కూతుళ్లు దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఏకంగా నిరసనకు దిగారు. పెళ్లికాని ప్రసాదులంతా రోడ్ల మీద పరేడ్ నిర్వహించారు. అదీ వినూత్నంగా.. పెళ్లి దుస్తుల్లో గుర్రాల మీద కొందరు, బ్యాండ్ మేళంతో మరికొందరు.. తమకు వధువులు కావాలంటూ డిమాండ్ వినిపిస్తూ ముందుకు సాగారు. చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలో మగ-ఆడ నిష్పత్తిని పెంపొందించడానికి ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం అమలయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) వినతి పత్రం సమర్పించారు. వీళ్లంతా బ్రైడ్‌గ్రూమ్(వరుడి) మోర్చా పేరిట ఏర్పాటు చేసిన ఓ సంఘంలోని సభ్యులు. ‘‘మమ్మల్ని చూసి నవ్వుకున్నా ఫర్వాలేదు. కానీ, పెళ్లీడు వచ్చినా.. చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదు. వయసు మీద పడుతోంది. ఇదంతా రాష్ట్రంలో పురుష-స్త్రీ లింగ నిష్పత్తి రేటు పడిపోవడం వల్లే’’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేశ్ బరాస్కర్ తెలిపారు. మహారాష్ట్రలో పురుష-స్త్రీ నిష్పత్తి రేటు 1000 మందికి 889 మందిగా ఉంది. భ్రూణ హత్యలు.. అసమానతల వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాలని పలువురు యువకులు కోరుతున్నారు. ये बारात नहीं प्रदर्शन है...जी हां, महाराष्ट्र के सोलापुर में शादी के लिए लड़की नहीं मिली तो डीएम ऑफिस के बाहर युवाओं ने किया प्रदर्शन, दूल्हे की तरह सज निकाली बारात#Maharashtra #ViralVideo #Protest pic.twitter.com/bDIPucE4Cw — Zee News (@ZeeNews) December 22, 2022 ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ నిషేధ చట్టాలను పటిష్టం చేయాలని యువకులు కోరారు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే షోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలుకా అక్లుజ్‌లో ఒక యువకుడు.. కవలలైన అక్కాచెల్లెలను వివాహం చేసుకున్న ఘటన ఈమధ్యే ప్రముఖంగా వార్తల్లో నిలిచింది కూడా. Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t — Siraj Noorani (@sirajnoorani) December 4, 2022 -
ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద పోలీస్ పెరేడ్ రిహార్సిల్ దృశ్యాలు
-
విజయవాడ : ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద పోలీస్ పెరేడ్ రిహార్సిల్ దృశ్యాలు (ఫొటోలు)
-
గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా!
Google's July 4 Animation: అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన వేడుకల్లో ఒక దుండగుడు ఇండిపెండెన్స్ డే పరేడ్ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తదనంతరం ఒక నెటిజన్ జులై 4వ తేదికి సంబంధించిన కంటెంట్ కోసం వెతుకుతున్నప్పుడూ...గూగుల్‌కి సంబంధించిన ప్రత్యేక సెలబ్రేషన్ యానిమేషన్ పేజీ కనిపించింది. అది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐతే ఆ పేజిలో జులై 4న యూఎస్‌లో జరిగిన కాల్పులకు సంబంధించిన తాజా వార్తల పోటో లే అవుట్లతో పాటు కలర్‌ఫుల్ బాణ సంచాలతో రూపొందించింది. దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడూ ఇలా బాణాసంచాలతో కలర్ఫుల్గా ఇవ్వకూడదు. షికాగోలోని ఐలాండ్ పార్క్‌లో జరిగిన సాముహిక కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు, పైగా ప్రజలు భయంతో పరుగులు తీయడం వంటి బాధకరమైన వార్తలను ప్రజెంట్ చేస్తూ... రంగరంగుల బాణాసంచా కాల్పుతో కలర్ఫుల్గా సంబరంలా ఇవ్వడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఈ విషయమై మండిపడుతూ.. నెటిజన్లు ఫిర్యాదులు చేశారు కూడా. అంతేకాదు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడమే కాకుండా చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు సుమారు 24 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడితే ఇవ్వాల్సిన నివాళి ఇదేనా! అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత గూగుల్ యానిమేషన్ పేజీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. God bless America pic.twitter.com/BjVbymWJ1F — Sawbuck Wine (@sawbuckwine) July 4, 2022 (చదవండి: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు) -
US Parade Shooting: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
High-Powered Rifle Is US Shooting Suspect: అగ్రరాజ్యం అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక దుండగుడు షికాగో నగర శివారులోని హైల్యాండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై కాల్పులకు జరిపాడు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్ క్రిమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతను హైపవర్ రైఫిల్‌తో వేడుకలకు వచ్చిన ప్రేక్షక్షులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురుమృతి చెందారని వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు క్రిమో వద్ద ఆయుధాల ఉన్నాయని, అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెబుతున్నారు. అమెరికన్లకు బహిరంగంగా తుపాకీని తీసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటనలు అధికమవ్వడం బాధాకరం. అదీకూడా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరగడమే అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అమెరికన్లే తమ దేశ వేడుకలను భగ్నపరిచి విధ్వంసానికి పాల్పడటం అత్యంత హేయం అంటూ... ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటన పట్ల కలత చెందానన్నారు. బైడెన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాదు తాను తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాడతానని వెనక్కి తగ్గేదేలేదని బైడెన్ నొక్కి చెప్పారు. (చదవండి: America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం) -
America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం
షికాగో: అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీటిలో కనీసం ఆరుగురు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్‌క్లబ్‌లో కాల్పుల్లో మరొకరు అమెరికాలో శాక్రిమాంటో నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. డెన్మార్క్‌లో ముగ్గురు... కోపెన్‌హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో నాలుగు గ్రహాలు
ఏలేశ్వరం(తూర్పుగోదావరి): అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. దీనిని ప్లానెట్స్ పరేడ్ అని అంటారు. ఇది బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య కనువిందు చేసింది. దీనిని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ అన్నారు. -
ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...
కాసింత ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలని అర్ధ శతాబ్దం క్రితం ఒక యువ మేధస్సు ఆలోచించింది. ఆ లక్ష్య సాధనకై ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి, అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కిన్నెర హాస్టల్ ప్రాంగణంలో... ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం ఎదురు నిలిచి పోరాడి నేలకొరిగింది. అతడే ప్రగతి శీల విద్యార్థుల ప్రియ నేత, ఉస్మానియా అరుణ తార, హైదరాబాద్ చేగువేరాగా పిలుచుకునే జార్జి రెడ్డి! 1947 జనవరి 15న కేరళలో జన్మించాడు జార్జి రెడ్డి. 1960–70ల్లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ విద్యార్థిగా, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్‌గా జార్జ్ చెరగని ముద్ర వేశాడు. క్లిష్టమైన అణు భౌతిక శాస్త్రంలో (న్యూక్లియర్ ఫిజిక్స్) గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి అని విశ్వసించే జార్జ్ తనని తాను బాక్సింగ్ ఛాంపియన్‌గా మలుచుకున్నాడు. అంతేగాక తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు బోధిస్తూ, వారిలో నూతన విశ్వాసాన్ని నింపేవాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ గిరిజన పోరాటాలు, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గాలులు ఉస్మానియా గడ్డను తాకాయి. ఆ ప్రజా ‘తిరుగుబాట్లు’ ఉస్మానియా విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నూతన పరిణామాలకు వేదికైంది. రైతాంగ పోరాటాలకు జడుచుకొని నగరాలలో స్థిరపడిన ఆధిపత్య సామాజిక వర్గాల వారసులు... చదువు సాకుతో ఉస్మానియా యూనివర్సిటీలో తిష్ఠ వేశారు. మరోవైపు నాటి ఉద్యమ విజయాలతో చదువుల ఒడిని చేరుకున్న మధ్యతరగతి, రైతు కూలీల బిడ్డలు, ఉన్నత విద్యకై ఉస్మానియా వర్సిటీలోకి అప్పుడప్పుడే చేరుకోవడం ఆరంభమైంది. (క్లిక్: మహిళల వద్దకే ఉద్యోగాలు) మొదటి బృందానికి నాటి పాలక పార్టీ, నేటి అధికార పార్టీ మాతృసంస్థలు దిశానిర్దేశం చేస్తూ... యూనివర్సిటీపై తమ తమ ఆధిపత్యాల కోసం వికృత మార్గాలు ఎంచుకున్నాయి. ఫలితంగా రెండో బృందం విద్యార్థులపై హాస్టళ్లలో, మెస్‌లలో, తరగతి గదులలో, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌ల పేరుతో.. బల ప్రదర్శన, ఆధిపత్యం చేయడం ఆనవాయితీగా మారింది. యూనివర్సిటీ అధికారులపై, ఆచార్యులపై బెదిరింపులకు పాల్పడటం; విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఆరోగ్యకరమైన పోటీ జరగకుండా భయభ్రాంతులు సృష్టించడం, తోటి విద్యార్థుల స్వేచ్ఛను హరించడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థిగా జార్జి రెడ్డి యూనివర్సిటీ గడ్డపై అడుగు పెట్టాడు. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థి లోకానికి పెద్ద దిక్కై నిలిచాడు. క్యాంపస్‌లో విద్యార్థి హక్కుల రక్షణకై నిలబడ్డాడు. భౌతిక దాడులను తన బిగి పిడికిలితో తిప్పికొడుతూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాడు. సైద్ధాంతిక అధ్యయనం, చర్చలతో సహచరులలో స్ఫూర్తి రగిలించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందాన్ని నిర్మించి ఆనతి కాలంలోనే విద్యార్థుల ఆత్మీయ నేతగా ఎదిగాడు. సాధారణ విద్యార్థులను పోటీకి నిలవనివ్వని ‘ఆధిపత్యం’పై విద్యార్థి సంఘాల ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. విజ్ఞానంలోనూ, నాయకత్వంలోనూ పతాక స్థాయికి చేరుకుంటున్న జార్జి ‘ఆధిపత్య వర్గాలకు’ కంటగింపుగా మారాడు. దీంతో ఛాందసవాదులు జార్జిని అమానుషంగా హత్య చేశారు. జార్జి త్యాగాన్నీ, ఆశయాలనూ ఎత్తి పడుతూ జార్జి స్థాపించిన పీడీఎస్ అనతికాలంలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ)గా దేశవ్యాప్తంగా విస్తరించింది. ‘జీనా హై తో మర్ నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్నా సీఖో’ అంటూ మరణానంతరం కూడా యువ తరానికి దిశానిర్దేశం చేస్తున్న హీరో జార్జి రెడ్డి. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు) - ఎస్. నాగేశ్వర్ రావు పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా... నేడు ఓయూలో నిర్వహించే ‘రెడ్ షర్ట్’ కవాతు, బహిరంగ సభ నేపథ్యంలో) -
ఆర్కే బీచ్ లో మిలాన్ విన్యాసాలు తిలకించనున్న సీఎం వైఎస్ జగన్
-
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు రిహర్సల్స్ ఫొటోలు
-
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహర్సల్స్.. ఫోటోలు మీకోసం
-
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్
-
అనంతపురం : ఎస్ఐల ట్రైనింగ్ పూర్తి.. పరేడ్ రిహార్సల్స్
-
తండ్రి మరణించాడు పరేడ్ మిస్ కాలేదు
తమిళనాడు తిరునల్వేలిలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎన్. మహేశ్వరి జీవితం గత రెండు వారాలుగా ఉద్వేగభరితంగా, సంఘటనాయుతంగా ఉంది. ఆమె భర్త బాలమురుగన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. అతణ్ణి కోవిడ్ పేషెంట్స్ రాకపోకల సమాచార నిఘా కోసం తిరునల్వేలి మెడికల్ కాలేజీ దగ్గర డ్యూటీ వేశారు. ఆ డ్యూటీ చేస్తున్న బాలమురుగన్ కోవిడ్ బారిన పడ్డాడు. క్వారంటైన్‌కు వెళ్లక తప్పలేదు. మహేశ్వరి ఒకవైపు డ్యూటీ చేస్తూ ఇంట్లో పిల్లలను చూస్తూ భర్త ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సి వచ్చింది. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్‌లో ఆమె ప్రతి సంవత్సరం గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుంది. ఈసారి కూడా ఆమే ఇవ్వాలి. దానికోసం రిహార్సల్స్‌కు హాజరవుతోంది. శుక్రవారం (ఆగస్టు 14)న కూడా అలాగే పరేడ్ రిహార్సల్స్‌లో పాల్గొని ఇంటికి చేరిన మహేశ్వరికి తండ్రి మరణవార్త తెలిసింది. తిరునల్వేకి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే వడమాదురైలో 83 ఏళ్ల ఆమె తండ్రి ఆనారోగ్య కారణాల రీత్యా మరణించాడు. చివరి చూపులకు మహేశ్వరి వెళ్లాలి. కాని తెల్లవారితే పరేడ్ ఉంది. ఆమె లేకపోతే అది డిస్టర్బ్ అవుతుంది. అప్పటికే క్వారంటైన్ ముగించుకుని ఇల్లు చేరిన భర్త కూడా పరేడ్‌కు హాజరయ్యాకే ఊరికి వెళదాం అన్నాడు. ఇద్దరూ ఈ విషయం పైఅధికారులకు చెప్పలేదు. శనివారం–ఆగస్టు పదిహేను ఉదయం పోలీస్ యూనిఫామ్‌లో తన దళాన్ని లీడ్ చేస్తూ మహేశ్వరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సమక్షంలో పరేడ్‌లో పాల్గొంది. ఆమె ముఖంలోని విషాదాన్ని మాస్క్ కప్పిపెట్టింది. ఆమె వేదనను గంభీరమైన గళం తొక్కి పట్టింది. పరేడ్ విజయవంతం అయ్యింది. ఆ మరుక్షణం భర్తతో కలిసి హుటాహుటిన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి మహేశ్వరి బయలుదేరింది. అప్పటికిగాని ఈ సంగతి తెలియని అధికారులు మహేశ్వరి అంకితభావం పట్ల ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. సినిమాల్లో ఇలాంటివి చూస్తాం. కాని నిజ జీవితపు వ్యక్తులే అలాంటి సినిమాలకు ప్రేరణ. -
రష్యా విక్టరీ పరేడ్‌లో భారత సైనికులు
మాస్కో: భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పరేడ్‌లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని, ఇవి తనకు సంతోషకరమైన క్షణాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రష్యా అధినేత పుతిన్ సమక్షంలో రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో బుధవారం జరిగిన ఈ పరేడ్‌కు రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1941–1945 మధ్య వీరోచితంగా జరిగిన యుద్ధంలో సోవియట్ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తోపాటు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ అడ్మిరల్ హరి కుమార్, భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మ పాల్గొన్నారు. రష్యా విక్టరీ పరేడ్‌లో రష్యా సైనిక దళాలతోపాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17 దేశాలకు చెందిన సైనికులు కూడా పాలుపంచుకున్నారు. ఈ పరేడ్‌ను ఏటా మే 9న నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈసారి జూన్‌లో నిర్వహించారు. -
మా బలం 162
సాక్షి, ముంబై: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ గ్రాండ్ హయత్ సోమవారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చే రోజుకు ఒక రోజు ముందు.. సోమవారం సాయంత్రం మూడు పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ తమ ఎమ్మెల్యేలతో గ్రాండ్ హయత్ హోటల్లో పరేడ్ నిర్వహించింది. 162 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, ఇది గవర్నర్ కోశ్యారీ చూస్తున్నారనే భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శివసేనకు చెందిన 56, ఎన్సీపీకి చెందిన 51, కాంగ్రెస్‌కు చెందిన 44, మిత్రపక్షాలు, ఇతరులు 11 మంది.. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆసక్తి సృష్టించిన ఈ ‘మహా పరేడ్’లో శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, సునీల్ తట్కరే, సుప్రియా సూలే, కాంగ్రెస్ నేతలు ఖర్గే, అశోక్ చవాన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు సమాజ్‌వాదీ నేత అబూ ఆజ్మీ, ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన్’ చీఫ్ రాజు శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ‘ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, తమ పార్టీ నేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని’ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం ప్రతిజ్ఞ చేశారు. పరేడ్ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు, ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సభ్యత్వంపై నాదీ భరోసా ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ కనుక, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ ఆయన జారీ చేసే విప్‌ను ధిక్కరిస్తే శాసనసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందనే భయాలు అక్కర్లేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేల సభ్యత్వానికి తనదే బాధ్యత అని శరద్ పవార్ హామీ ఇచ్చారు. విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందంటూ తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయాందోళనలకు గురి చేస్తోందని పవార్ విమర్శించారు. ‘రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించాను. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలించాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్‌ను తొలగించాం. కాబట్టి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకు లేదు. జారీ చేసినా ఆ విప్ చెల్లదు’ అని పవార్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ‘భయం, ఆందోళన వద్దు. మీ సభ్యత్వానికి నాదీ భరోసా. అక్రమంగా అధికారంలోకి వచ్చినవారిని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై శరద్ పవార్ నిప్పులు చెరిగారు. ‘అక్రమంగా, మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడానికి ఇది గోవా కాదు.. మహారాష్ట్ర. ఈ విషయం బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ఇక్కడున్న 162 మంది ఎమ్మెల్యేలే కాదు.. తమ వెనుక ఇంకా ఎక్కువ మంది శాసన సభ్యులే ఉన్నారన్నారు. ‘కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. బీజేపీని అడ్డుకునే దిశగా ఈ అవకాశం మాకు కల్పించిన మా పార్టీ చీఫ్ సోనియాకు కృతజ్ఞతలు’ అన్నారు. నేరస్తుల్లా పరేడ్: బీజేపీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్వహించిన బల ప్రదర్శనపై బీజేపీ మండిపడింది. నేరస్తుల తరహాలో పరేడ్ నిర్వహించి, దేశం ముందు మహారాష్ట్ర పరువు తీశారని బీజేపీ నేత ఆశిశ్ షెలార్ విమర్శించారు. పరేడ్‌లో 162 కాదు.. 145 మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంతో రాష్ట్రంలో అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. అయితే, ఈ పరేడ్‌కు 137 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం. అడ్డు తొలగండి – ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తొలగాలని బీజేపీని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ‘మళ్లీ వస్తాను’ అనే ఫడ్నవీస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘మేం ఆల్రెడీ వచ్చేశాం’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీ అత్యంత హేయంగా వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కుపై తొలి సంతకం చేస్తున్న ఫడ్నవీస్ -
డ్రిల్‌తో పాటు ఫైరింగ్ కూడా ముఖ్యమే..
విద్యారణ్యపురి: రిపబ్లిక్ పరేడ్ క్యాంపులో పాల్గొనాలంటే ఎన్సీసీ కేడెట్లకు డ్రిల్‌తో పాటు ఫైరింగ్ ప్రతిభ కూడా ముఖ్యమేనని శిక్షణ క్యాంపు కమాండెంట్ కల్నల్ వీరబదిరియన్ అన్నారు. ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో భాగంగా మంగళవారం మూడో రోజు ఫైరింగ్, ఆర్డిసీ సెలక్షన్స్, పీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్‌లో వీరబదిరియన్ పర్యవేణలో శిక్షన సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రిల్ విభాగంలో కూడా సీనియర్, జూనియర్ విభాగాలకు చెందిన బాలురు, బాలికలను కూడా ప్రాధమికంగా ఎంపిక చేశామన్నారు. ఎన్సీసీ అనేది క్రమశిక్షణకు మారుపేరన్నారు. క్రమశిక్షణతో ఉన్న కేడెట్లు అన్నిరంగాల్లో ముందుంటారని, విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని రాణించాలన్నారు. మేజర్ రీనా గోస్వామి, ఏరో పరేడ్ లెఫ్టినెంట్ సతీష్‌కుమార్, ఎం.సదానందం, చీఫ్ ఆఫీసర్ కె.ప్రకాశం, ఎన్సీసీ అధికారులు మహేష్, రాధాకృష్ణ, భగవతి, అనూష, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రభాకర్, బీహెచ్ఎం థాఫ్సె, మణికందనం, కుదే, ప్రదీప్, పాటిల్, జయరాంబడక్, గణేష్, కుమారస్వామి, కవిత, పుత్లీబాయి. సుధామణి, అశోక్, సురేందర్ పాల్గొన్నారు. -
18వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ అవుట్ పెరెడ్
-
అరుదైన గౌరవం.. అంతలోనే అపఖ్యాతి
లండన్ : పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎంత కష్టమో వాటిని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చరణ్‌ప్రీత్ సింగ్ లాల్(22). బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తలపాగా ధరించి మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న సైనికుడిగా రికార్డు సృష్టించిన చరణ్‌ప్రీత్ సింగ్ ఎంతో కాలం గడవకముందే ఆ పేరును పొగొట్టుకోవడమే కాకా ఉద్యోగాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు. వివరాలు.. చరణ్‌ప్రీత్ సింగ్ బ్రిటన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రాణి ఎలిజబేత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొన్న ఏకైక సైనికుడిగా వార్తల్లో నిలిచాడు. ఇంత పేరు సాధించిన చరణ్‌ప్రీత్ సింగ్ గత వారం నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. చరణ్‌ప్రీత్ సింగ్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకున్నట్లు ఈ టెస్ట్‌లో తేలీంది. దాంతో త్వరలోనే అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఆర్మీ అధికారి ఒకరు ‘చరణ్‌ప్రీత్ సింగ్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నామో.. ఇప్పుడు అతను చేసిన పని అంత ఇబ్బందికరంగా మారింది. సైనికులందరికి అప్పుడప్పుడు ఇలా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తుంటాం. ఈ సారి చరణ్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సైనికులు కూడా మత్తు పదర్ధాలు తీసుకున్నట్లు తెలిసింద’ని తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన చరణ్‌ప్రీత్ సింగ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్‌కి వలస వెళ్లాడు. చదువు పూర్తయిన తరువాత 2016, జనవరిలో సైనికుడిగా బ్రిటీష్ ఆర్మీలో చేరాడు. -
పరేడ్ చేయించే అధికారం మీకెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: పలు కేసుల్లో నిందితులను, అనుమానితులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చి బహిరంగంగా పరేడ్ చేయిస్తుండటం పట్ల ఉమ్మడి హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇలా అనుమానితులను, నిందితులను బహిరంగంగా పరేడ్ చేయించి, వారి ఫొటోలను ప్రచురించుకునేందుకు, ప్రసారం చేసుకునేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతిచ్చే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. ఓ పౌరుడి వ్యక్తిగత హుందాతనానికి విఘాతం కలిగించే హక్కు పోలీసులకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కని, పౌరుడు నిందితుడు లేదా దోషి అయినప్పటికీ, అతని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు పోలీసులకు అధికారం లేదని చెప్పింది. ఏ అధికారంతో నిందితులను, అనుమానితులను పోలీసులు ఇలా బహిరంగంగా పరేడ్ చేయిస్తున్నారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా, ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి తన తల్లి కావటి అలివేలును దొంగగా అనుమానిస్తూ ఆమెను అరెస్ట్ చేసి శ్రీశైలంలో మీడియా ముందు ప్రవేశపెట్టడమే కాక, ఆమె ఫొటోలను తీసుకునేందుకు మీడియాకు అనుమతినిచ్చారంటూ ప్రకాశం జిల్లా, చీరాల మండలం, ఆదినారాయణపురానికి చెందిన కావటి సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. -
రేపు మధ్యాహ్నం ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖను సమర్పించిన విషయం తెలిసిందే. మరో వైపు ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం అధికారికంగా 105కు చేరుకుంది. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈలోగా యడ్యూరప్ప తరచూ సంచలన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లలో గుబులు పుట్టిస్తున్నారు. -
ఘనంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది దీక్షాంత్ పరేడ్‌ను గురువారం సిటీ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, శాఖలో కీలకమైన కమ్యూనికేషన్ విభాగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ రవిగుప్తా, అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, మురళీకృష్ణ, శివప్రసాద్, కమ్యూనికేషన్ డీఐజీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
అలర్ట్.. క్షిపణులను తరలిస్తున్న కిమ్
సాక్షి, ప్యాంగ్యాంగ్ : తమను బాగా రెచ్చగొడుతున్న అమెరికాకు ఊహించని షాక్ ఇస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే మరో పరిణామం చోటు చేసుకుంది. రాజధాని ప్యాంగ్ యాంగ్‌కు క్షిపణులను తరలించటం ఆందోళన కలిగిస్తోంది. శాటిలైట్ వీక్షణలో ఈ విషయం వెలుగు చూడటం విశేషం. ఈ నేపథ్యంలో అదను చూసుకుని కిమ్ సైన్యాలు అమెరికాపై విరుచుకుపడే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే అమెరికా ఎంత మాత్రం ఆవేశపడటం లేదు. ‘మొదటి బాంబు పడేవరకు’ దౌత్యపరమైనే చర్చల ద్వారానే ప్రయత్నిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా.. కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా భారీ ఎత్తున డ్రిల్స్ చేస్తుంది. నేవీ డ్రిల్స్ నిర్వహించడం తమను రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన కుట్ర అని కిమ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు నేవీ డ్రిల్స్ ముగిసిన వెంటనే దక్షిణకొరియాతో మరో డ్రిల్ ను అమెరికా నిర్వహించనుందన్న వార్తల నేపథ్యంలో. అమెరికా ఇలాంటి చర్యలను కొనసాగిస్తే...ఆదేశం ఊహించని సమయంలో ఊహకందని విధంగా దాడులు చేస్తామని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రతి రెండేళ్లకోసారి దక్షిణకొరియా, అమెరికాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విన్యాసాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కుళ్లుతోనే అమెరికా ఆరోపణలు... తమ దేశం అభివృద్ధిని చూసి ఓర్వలేక అమెరికా ఆరోపణలు చేస్తోందని ఉత్తర కొరియా అంటోంది. ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా రాయబారి కిమ్ రోయాంగ్ మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో తమ దేశం ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రచించిందని... కానీ, అమెరికా మాత్రం వాటిని వేరేలా అభివర్ణిస్తోందని అన్నారు. ఆర్థికంగా బలపడేందుకు తమ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వినూత్న కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తుంటే.. అమెరికా కుళ్లుకుంటుందని రోయాంగ్ విమర్శించారు. అమెరికా ఆరోపణల ఆధారంగానే ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు కూడా తమ దేశాన్ని అనుమానిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని రోయాంగ్ స్పష్టం చేశారు. -
రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలులో రెడ్‌షర్ట్ వలంటీర్లు కవాతు నిర్వహించారు. ఎర్రెర్రని చొక్కాలు, ఖాకీ ప్యాంటులు ధరించిన వలంటీర్లు ఎర్రజెండాలు చేతబూని విజయనాదం పూరించారు. బళ్లారిచౌరస్తా సమీపంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈ పుల్లయ్య జెండా ఊపి కవాతును ప్రారంభించగా కొత్తబస్టాండ్, పుచ్చలపల్లి సుందరయ్య సర్కిల్, శ్రీరామథియేటర్, ఆర్కే కలర్ ల్యాబ్, రాజ్‌విహార్, జిల్లా పరిషత్, పెద్దపార్కు మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరక కవాతు కొనసాగింది. కార్యక్రమంలో నాయకులు టి.రాముడు, జి.సుబ్బయ్య, ఎండీ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు రాయడానికి ఊరేగించి పంపారు.
బొమ్మనహళ్లి: పరీక్షరాయడానికి వెళ్తూన్నారు..అంటే పెన్ను ఇవ్వడం. లేదా ఆశీర్వదించి పంపడం చూసుంటాం..కాని అందుకు భిన్నంగా ఈ ఊరి జనం చేశారు..వారి ఊరి పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్నారని, వారు విద్యార్థులలో ఉండే భయాన్ని పోగోటాలనే ఉద్దేశ్యంతో గురువారం బాగలకోట జిల్లాలోని సంగానట్టి గ్రామంలో ఉన్న ప్రజలు, ఎస్ డీఎంసీ సభ్యులు విద్యార్థులను గ్రామంలో ఊరేగించి, వారి మెడలో పూలమాలలు వేసి దారి పొడవునా వారి పైన పూల వర్షం కురిపించారు. ఇలా చెయ్యడం ద్వారా విద్యార్థులలో పరీక్షల మీదున్న భయం పోయి వారు పరీక్షలు బాగా రాస్తారని చెబుతున్నారు. ఇంతే కాకుండా ఎవరయితే 95 శాతం మార్కులు సాధిస్తారో వారి పేరును ఊరిలో ఉన్న రోడ్డుకు పెడతామని బహిరంగంగా ప్రకటించారు. అచ్చం ఈ సంఘటన నటుడు సుధీప్ నటించిన రంగ ఎస్ఎస్ఎల్ సీ సినిమాలో ఉందని గ్రామాస్తులు గుర్తుచేసుకున్నారు. -
వైభవంగా చక్రస్నానం
కడప కల్చరల్ : దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి చేర్చారు. అక్కడ రెండున్నర గంటలపాటు వేద మంత్ర యుక్తంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. చందన లేపనం, నారికేళ జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ఏఈఓ శంకర్రాజు, డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యంల ఆధ్వర్యంలో తిరుమల వేద పండితులు శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణమూర్తి తదితరులు పాలు, పెరుగు, తేనె, జలాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో భక్తుల కోలాహలం మధ్య మూలమూర్తులతోసహా అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో మునకలు వేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. స్వామి ప్రత్యేక ప్రసాదంగా ఉత్సవ మూర్తులకు లేపనం చేసిన సుగంధం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వదేశీ బోఫోర్స్ శతఘ్ని!
తొలిసారి ‘ధనుష్’ ప్రదర్శన భోపాల్: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో తొలిసారి దేశీయ బోఫోర్స్ శతఘ్ని.. ‘ధనుష్’ప్రత్యేక ఆకర్షణ కానుంది. తొలిసారి స్వదేశంలో తయారైన ఈ దీర్ఘ పరిధి శతఘ్నిని పరేడ్‌లో ప్రదర్శించ నున్నారు. ఈ 155 ఎంఎం శతఘ్నిని జబల్పూర్కు చెందిన గన్ కారేజ్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్) రూపొందించింది. ఒక్కో దాని ధర రూ.14.5 కోట్లు. 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ప్రత్యేక అతిథులుగా గిరిజనులు: ఈ నెల 26న ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరుకావాలని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 40 మంది గిరిజనులను కేంద్రం ఆహ్వానించింది. పరేడ్, బీటింగ్ రిట్రీట్లను వీక్షంచనున్న వీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కలుసుకుంటారు. -
పరేడ్ కూడా సరిగా చేయలేరా?
పోలీసులకు ఇన్చార్జి డీఐజీ అకున్ సూచన బాన్సువాడ/బిచ్కుంద: ఏమిటీ.. మీరు పరేడ్ కూడా సరిగా నిర్వహించలేరా? అంటూ ఇన్చార్జి డీఐజీ అకున్ సబర్వాల్ పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. మంగళ వారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద సర్కిల్ కార్యాలయాలను సందర్శించి, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాన్సువాడలో పరేడ్ చేసిన సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సిబ్బంది అధిక బరువు కారణంగా సరిగా పరేడ్‌లో పాల్గొనలేకపోయారన్నారు. వారికి సరిగ్గా శిక్షణ కూడా ఇవ్వలేదని, నిర్లక్ష్యంగా పరేడ్ నిర్వహించడం సరికాదని సీఐ వెంకటరమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బిచ్కుందలో ప్రజాప్రతినిధులతో ఇన్చార్జి డీఐజీ సమావేశమయ్యారు. లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయా, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నారా, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారా? అని ప్రశ్నించారు. -
పోలీసులకు వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యం
– వారాంతపు సెలవులను అమలు చేస్తాం – పెరేడ్ పరిశీలనలో ఎస్పీ హామీ కర్నూలు: పోలీసు శాఖలో విధులు నిర్వహించేవారికి వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యమని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శుక్రవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ సిబ్బంది నిర్వహించిన పెరేడ్‌కు ఎస్పీ హాజరై పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధుల్లో వ్యక్తిగత క్రమశిక్షణతో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. 40 ఏళ్లు దాటినవారు అనారోగ్యం బారిన పడి చనిపోవడంతో వారి కుటుంబాలు మానసిక క్షోభకు గురవుతున్నాయని అన్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ భద్రత రుణ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. మీపై ఆధారపడిన కుటుంబాల గురించి ఆలోచించుకోవాలని సూచించారు. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు ప్రజలను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయవద్దన్నారు. సహనం కోల్పోయి ఒక్కరు తప్పు చేస్తే ఆ ప్రభావం పోలీసులందరిపై పడుతుందన్నారు. సంవత్సరాంతంలో నేరాలు తగ్గించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. డీఎస్పీ రమణమూర్తి, సీఐలు నాగరాజరావు, కృష్ణయ్య, మధుసూదన్‌రావు, మహేశ్వరరెడ్డి, ఆర్ఐ రంగముని, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గార్డు డ్యూటీల్లో అప్రమత్తంగా ఉండాలి
– ఏపీఎస్పీ కమాండెంట్ కర్నూలు : గార్డు డ్యూటీలు నిర్వహించే వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మూడో రోజు బుధవారం పెరేడ్ నిర్వహించారు. సిబ్బంది నుంచి కమాండెంట్ గౌరవందనం స్వీకరించారు. అనంతరం సిబ్బందిని సమావేశ పరిచి విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కుటుంబ సంక్షేమం తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటాలంలో పని చేస్తున్న సిబ్బందికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారికి రావాల్సిన రుణాలు, మెడికల్ బిల్లులు, రవాణా భత్యం త్వరితగతిన మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మోటర్ వాహనాల (ఎంటీ) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆర్ఎస్ఐ (అడ్జుడెంట్) కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంటు కమాండెంట్స్ ఎస్ఎం బాషా, గోపాలకృష్ణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు యుగంధర్, బిక్షపతి, సమర్పణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డిలో విధులు నిర్వహించలేం
• విధుల్లో చేరకుంటే తొలగిస్తామని అధికారి హెచ్చరికలు • సీపీ జోక్యంతో ఆర్డర్ రద్దు నిజామాబాద్ క్రైం : పోలీస్‌శాఖలో చిన్న ఉద్యోగులైన తమను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయటం అన్యాయమని, అక్కడ విధులు నిర్వహించలేమంటూ పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డులు శుక్రవారం నిరసనకు దిగారు. చాలీచాలనీ జీతంతో కామారెడ్డిలో పని చేయలేమని, తమను విధుల్లో నుంచి తొలగిస్తే చావే శరణ్యమని వారు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా నుంచి కామారెడ్డి వేరు కావడంతో పోలీస్ సిబ్బందిని రెండు జిల్లాలకు విభజించారు. ఈ విధానాన్ని హోంగార్డులకు కూడా వర్తింపజేశారు. జిల్లాలో మొత్తం 649 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తుండగా వీరిలో 428 మందిని నిజామాబాద్‌కు, 221 మందిని కామారెడ్డికి బదిలీ చేశారు. కాగా 221 మందిలో 120మంది కామారెడ్డికి చెందిన వారు కావడంతో వారంతా కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. మిగిలిన 62 మంది నిజామాబాద్‌లో డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, ఏసీబీ, ఏఆర్ విభాగాల్లో, పోలీస్‌శాఖ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఇందులో నుంచి కూడా కొంతమందిని కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయటంతో వారు ఆందోళన చెందారు. దీంతో వారంతా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుని నిరసనకు దిగారు. తమకు వచ్చే తక్కువ జీతంతో కామారెడ్డిలో అద్దె ఇళ్లలో భార్యాపిల్లలతో ఎలా బతికేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఆర్ ఎస్సై ఒకరు హోంగార్డుల వద్దకు వచ్చి ఖచ్చితంగా కామారెడ్డికి వెళ్లాలని, వెళ్లని వారిని విధుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమను విధుల నుంచి తొలగిస్తే చావే శరణ్యమంటూ హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పిల్లలు చదువులు మధ్యలో నిలిపివేసి కామారెడ్డికి వెళ్లలేమని, భారాపిల్లలను, తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి తాము కామారెడ్డికి నిత్యం వెళ్లిరావాలన్నా రోజుకు రూ. 200 ఖర్చు అవుతుందని అధికారి ముందు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న మీడియా పోలీస్ పరేడ్ మైదానంకు చేరుకోవటంతో మీడియా ముందు హోంగార్డులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. దీంతో ఏఆర్ అధికారులు విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లటంతో స్పందించిన సీపీ కామారెడ్డికి బదిలీ అయిన హోంగార్డుల ఆర్డర్‌ను రద్దు చేశారు. అనంతరం ఏఆర్ ఎస్సై హోంగార్డుల వద్దకు చేరుకుని మీ ఆర్డర్ రద్దు అయ్యిందని, తదుపరి ఆర్డర్ వచ్చే వరకు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే విధుల్లో చేరాలని తెలుపటంతో వారు విధులకు వెళ్లిపోయారు. -
2,800 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన
-
2,800 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన
అనంతపురం కల్చరల్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలో 2,800 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జెండాను జిల్లాలోని రొద్దం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ గుప్తా రూపొందించారు. జెండా ప్రదర్శనను స్థానిక టవర్‌క్లాక్ వద్ద డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు ప్రారంభించారు. దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ టవర్‌క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్, ఆర్ట్స్ కళాశాల వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ భారీ ప్రదర్శనను వీడియో తీయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సుకు పంపుతున్నామని, తప్పకుండా అందులో చోటు దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు, ఎమ్మెల్యేలు ప్రభాకర చౌదరి, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ శమంతకమణి, మేయర్ స్వరూప, జడ్పీ చైర్మన్ చమన్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సచివాలయంలోనే ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాలు.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ పండుగల వేళ జెండా వందన కార్యక్రమం ఇలా ఒక్కోచోట జరుగుతూ వస్తోంది! గోల్కొండ కోటపై జెండా రెపరెపలాడటం ఘనంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా.. అక్కడ స్థలాభావం ఇబ్బంది పెడుతోంది. ఇది కాదంటే మిగిలింది.. రక్షణ శాఖ అధీనంలోని పరేడ్ మైదానం. అసలు ఇవన్నీ ఎందుకు.. సచివాలయం చెంతనే జెండా వందనం నిర్వహిస్తే బాగుంటుంది కదా..! సీఎం మదిలో మెదిలిన ఆలోచన ఇది. కొత్త సచివాలయం ఏర్పడనున్న ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే పరేడ్ మైదానం కూడా కొలువుదీరబోతోంది. ఈ మైదానం కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించనున్నారు. జెండా వందనం, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాలను ఇందులోనే నిర్వహించనున్నారు. దేశంలో మరే సచివాలయం లేని తరహాలో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యంత అధునాతన సచివాలయం రాజధాని నయారాయ్‌పూర్‌లో రూపొందింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలో ఇటీవల అధికారుల బృందం వెళ్లి ఆ సచివాలయాన్ని పరిశీలించి వచ్చింది. అక్కడికన్నా ఎక్కువ ప్రత్యేకతలతో కొత్త సచివాలయం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ప్రస్తుత సచివాలయంలో భవనాల విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. కొత్తగా నిర్మించబోయే సచివాలయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు రాబోతున్నాయి. మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, సిబ్బంది కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండనున్నాయి. వాటితోపాటు ఒక విశాలమైన సమావేశ మందిరం ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేకంగా కేంద్ర సమావేశ మందిరం నిర్మిస్తారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ రూ. 500 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ఇక సందర్శకులు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ పొందే వెసులుబాటు కల్పిస్తారు. అక్కడికి వచ్చేవారికి ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఆధునిక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. 5 వేల వాహనాల సామర్థ్యంతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే హెలీప్యాడ్.. కొత్త సచివాలయంలో సీఎం భవనానికి చేరువలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సచివాలయంలో అనువైన హెలీప్యాడ్ లేక బేగంపేట విమానాశ్రయంలో దిగాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ హెలీప్యాడ్ రూపొందించినా అది భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవటంతో వాడటం లేదు. దీంతో హెలీకాప్టర్ నేరుగా సీఎం కార్యాలయం వరకు వచ్చేలా కొత్త సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలక్‌నుమా తరహాలో అసెంబ్లీ భవనం రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రగడ్డలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలని నిర్ణయించినందున ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో దాన్ని నగరానికి మకుటాయమానంగా మిగిలేలా రూపొం దించాలని అధికారులకు సూచించారు. మ్యూజియంగా మార్చాలా, ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో హోటల్‌గా రూపొందిం చాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో భారీ ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నారు. గతంలో సిగ్నేచర్ టవర్స్ కోసం లుంబినీ పార్కును గుర్తించగా, అక్కడ కుదరదని తాజాగా తేల్చారు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి సచివాలయ ప్రాంగణమే సరిపోతుందని భావిస్తున్నారు. ఐఏఎస్‌లకు ఆధునిక విల్లాలు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అధునాతన రీతిలో 100 విల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత వీటిని ఎర్రగడ్డలోనే నిర్మించాలనుకున్నా.. తాజాగా ఎర్రమంజిల్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇక్కడి పాత క్వార్టర్లు తొలగించి 25 ఎకరాలను నిర్మాణాలకు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం పక్కన ఐఏఎస్ అధికారుల సంఘం భవనం, పాత క్వార్టర్లను తొలగించి.. ముఖ్యమంత్రికి కొత్త అధికారిక నివాసం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు మరో రూ.400 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తమ్మీద కొత్త సచివాలయం, అందులో భవనాల నిర్మాణాలతోపాటు అధికారులకు భవనాలు, సీఎం అధికార నివాసానికి కలిపి రూ.900 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. డిజైన్లు మొదలు నిర్మాణం వరకు వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ వేయనున్నారు. గతంలో అయిదుగురు సభ్యులతో ప్రభుత్వం వేసిన కమిటీలో మరో ముగ్గురిని చేర్చాలని ఇటీవల సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
'రిపబ్లిక్ డే'కు పరేడ్ గ్రౌండ్లో ఎర్పాట్లు
-
పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్
-
స్కెలిటన్ల షో... బెక్హాం
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో విక్టోరియా బెక్హాం ఫ్యాషన్ కవాతు ఇప్పుడు అనేది విమర్శలకు నెలవైంది. అస్థిపంజరాల (స్కెలెటన్స్) ప్రదర్శనగా మారింది. 2010 లో విక్టోరియా బెక్హాం తన క్యాట్ వాక్ లో సన్నని, అనారోగ్యంగా కనిపించే మోడల్స్ ను తాను నిషేధించినట్లు ప్రకటించింది. అయితే అప్పట్లో ఆ విషయం పలు విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ చూస్తే బెక్హాం తన మాటను వెనక్కు తీసుకున్నట్లు కనిపించింది సన్నని, అస్థిపంజరాలను తలపించే శరీరాకృతిలో ర్యాంపుపై నడచిన మోడల్స్ ను చూసిన జనం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ షో స్కెలెటన్ షో ను తలపించిందని ఫేస్ బుక్, ట్విట్టర్లలో గగ్గోలెత్తుతున్నారు. ఆదివారం జరిగిన ఫ్యాషన్ పెరేడ్ కు ఆమె భర్త డేవిడ్, పదహారేళ్ళ కుమారుడు బ్రూక్లిన్, అమెరికన్ వోగ్ సంపాదకుడు అన్నా వింటర్ కూడ హాజరయ్యారు. అయితే పదిహేను మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న స్ట్రాంగ్ సోషల్ మీడియా నోట్లో ఇప్పుడు విక్టోరియా బెక్హాం విమర్శలే నానుతున్నాయి. ఆమె డిజైన్ల ప్రదర్శనకు ఎంచుకున్న మోడల్స్ ఛాయిస్ ను కొందరు తిట్టి పోస్తుంటే... మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కెలెటన్ షోలా ఉందని ఒకరు, ఆ మోడల్స్ అనారోగ్యంగా కనిపిస్తున్నారని మరొకరు ఫేస్ బుక్ లో కామెంట్లు విసిరేస్తున్నారు. ఎక్కువశాతం మంది బెక్హాం డిజైన్లకు పదిహేడేళ్ళ సన్నటి పేటన్ నైట్ ను ఎంచుకోవడాన్నిఆక్షేపిస్తున్నారు. నైట్... మోడల్ ఏజెన్సీలో మొదటిసారి పదకొండేళ్ళ ప్రాయంలోనే సైన్ చేసిందని, ఫ్యాషన్ డిజైనర్స్ అమెరికా కౌన్సిల్ నిర్ణయం ప్రకారం అప్పటికి ఆమె ఒక్క ఏడాది మాత్రమే పెద్దదని అంటున్నారు. మరి కొందరు ఫ్యాషన్ అభిమానులు ఏకంగా మోడల్స్ కు కాస్త తిండి పెట్టే ప్రయత్నం చేయమని సెటైర్లు విసురుతున్నారు. వారిని కాస్త బలంగా కనిపించేట్టు చేయమని దేవుడ్నిసైతం వేడుకుంటున్నారు. అయితే బెక్హాం తన ప్రదర్శనలకు మోడల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో విభిన్న నిర్ణయాలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మొదట్లో కూడ తన కలెక్షన్స్ ప్రదర్శనకు బెక్హాం ఓ సన్నని మోడల్ నే ఎంచుకుంది. అయితే షో తర్వాత కామెంట్స్ పై స్పందించిన బెక్హాం తన కలెక్షన్లు అన్ని సెజుల్లోనూ, ఆకృతుల్లోనూ ఉంటాయని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానని అంది. ఎవరెన్ని అన్నా.. తన డిజైన్లను మహిళలు తమకు బెస్ట్ గా ఫీలవుతారని చెప్పుకొచ్చింది. -
ప్రపంచస్ధాయి శిక్షణనిస్తున్న CISF
-
రాజ్‌నాథ్ ప్రసంగం.. మహిళా పోలీసు అపస్మారకం
దేశ రాజధానిలో సాధారణ మహిళలకే కాదు పోలీసు అధికారులకూ తిప్పలు తప్పట్లేదు! మహిళల రక్షణే ప్రధాన లక్ష్యమని చెప్పే ఢిల్లీ పోలీసుశాఖ తీరులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో సర్వీసులో ఉన్న ఉద్యోగినులపై ఒత్తిడి పెరిగింది. సోమవారం ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్‌లో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. పరేడ్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏసీపీ నియతి మిట్టల్ సొమ్మసిల్లి పడిపోయారు. పరేడ్ నిర్వహణ కోసం కొన్ని రోజులుగా శ్రమించిన ఆమె బాగా అలసిపోవడంతో పడిపోయారని సహ ఉద్యోగినులు తెలిపారు. అయితే అధికారిణి పడిపోవడాన్ని చూసి కూడా పట్టించుకోనట్లే రాజ్‌నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు! 'మహిళా అధికారిణి సొమ్మసిల్లడంలో వింతేముంది? అయినా మా డిపార్ట్మెంట్లో ఇలాంటివి సహజం' అంటూ విషయాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు అక్కడున్న మగ పోలీసులు. -
రిపబ్లిక్ డే పరేడ్‌కు వెంకట్
చిట్యాల : 2015, జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి భవన్ ఎదుట జరిగే పరేడ్‌కు కుందనపల్లి గ్రామానికి చెందిన మాడుగుల వెంకట్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వెంకట్ ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. ఈ క్రమం లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మొ దటిసారిగా యూనివర్సిటీ స్థాయిలో వలంటీర్లను కవాతు కోసం ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అక్టోబర్ 11 నుంచి 22 వరకు వీరికి శిక్షణ ఇచ్చారు. గుజ రాత్, మహారాష్ట్ర, గోవా, దాద్రనగర్ హవేళి, డయ్యూడామన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 200 మంది శిక్షణ పొందారు. అందులో 40 మందిని పరేడ్‌కు ఎంపిక చేశా రు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురిని ఎం పిక చేయగా.. వరంగల్ జిల్లా నుంచి తాను ఒక్కడినే పరేడ్‌కు ఎంపికైనట్లు వెంకట్ తెలిపా డు. ఢిల్లీలో జనవరి 1 నుంచి 25 వరకు కవా తు ప్రాక్టీస్ చేసి 26న రాష్ట్రపతి భవన్ ఎదుట ప్రదర్శన ఉంటుందని తెలిపాడు. కాగా, పరేడ్‌కు ఎంపికైన వెంకట్‌ను ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి.రెడ్యానాయక్, నిజాం కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీధర్, కోచ్ డాక్టర్ రవితేజ అభినందించారు. -
అంతులేని వేదన
గోషామహల్ స్టేడియంలో ఘటన గతంలో రాష్ట్రపతి శౌర్యపతకం పొందిన సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి రోజూలాగానే ఉదయాన్నే పరేడ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికులూ విషాదంలో మునిగిపోయారు. అఫ్జల్‌గంజ్,బంజారాహిల్స్,మలేషియా టౌన్షిప్: పోలీస్ పరేడ్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలి, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం గోషామహల్ పోలీసు స్టేడియంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ సత్తెనపల్లి గ్రామానికి గడ్డిపాటి సుధాకర్ (42) బంజారాహిల్స్ ఠాణాలో కానిస్టేబుల్ (ఐడీపార్టీ)గా విధులు నిర్వహిస్తున్నాడు. గోషామహల్ పోలీసు స్టేడియంలో వారినికోసారి పోలీసులకు జరిగే పరేడ్‌లో పాల్గొనేందుకు శనివారం ఉదయం 6 గంటలకు గ్రౌండ్‌కు చేరుకున్నాడు. ఏడు గంటలకు పరేడ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే గుండెపోటు రావడంతో సుధాకర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన సహచర సిబ్బంది అతడ్ని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో హోరెత్తింది. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు, అడిషనల్ డీసీపీ నాగరాజు, గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్స్పెక్టర్ సత్తయ్యగౌడ్, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి, నేతలు ఎన్.శంకర్‌రెడ్డి, మాధవరెడ్డి, ప్రకాష్, సూరిలు కేర్ ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ సుధాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాల ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి సుధాకర్ మృతి శోచనీయమని, అతడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యవంత జీవనం గడిపేందుకు ఇటీవలే పోలీసు సిబ్బందికి యోగా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. సుధాకర్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కేర్ ఆసుపత్రి నుంచి స్వగృహానికి తరలించారు. విషాదఛాయలు... సుధాకర్ మృతితో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే పోలీసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి. మురళీకృష్ణ కంటనీరు పెట్టుకున్నారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుధాకర్ 15 సంవత్సరాలుగా కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుధాకర్‌కు భార్య శ్యామల, ప్రభాస్, లక్కి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన సుధాకర్ గతంలో రాంగోపాల్‌పేట పంజాగుట్ట, సికింద్రాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో విధులు నిర్వహించాడు. పార్క్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో వీరోచితంగా పోరాడి రోగులను రక్షించినందుకు రాష్ట్రపతి శౌర్యపతకం వచ్చింది. మూడు హత్య కేసులు ఛేదించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు సుధాకర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపినట్లు కేపీహెచ్‌బీ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జనగాం సురేష్‌రెడ్డి పేర్కొన్నారు.