రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వదేశీ బోఫోర్స్ శతఘ్ని!
తొలిసారి ‘ధనుష్’ ప్రదర్శన
భోపాల్: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో తొలిసారి దేశీయ బోఫోర్స్ శతఘ్ని.. ‘ధనుష్’ప్రత్యేక ఆకర్షణ కానుంది. తొలిసారి స్వదేశంలో తయారైన ఈ దీర్ఘ పరిధి శతఘ్నిని పరేడ్‌లో ప్రదర్శించ నున్నారు. ఈ 155 ఎంఎం శతఘ్నిని జబల్పూర్‌కు చెందిన గన్ కారేజ్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్) రూపొందించింది. ఒక్కో దాని ధర రూ.14.5 కోట్లు. 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
ప్రత్యేక అతిథులుగా గిరిజనులు: ఈ నెల 26న ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరుకావాలని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 40 మంది గిరిజనులను కేంద్రం ఆహ్వానించింది. పరేడ్, బీటింగ్ రిట్రీట్‌లను వీక్షంచనున్న వీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కలుసుకుంటారు.