
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది దీక్షాంత్ పరేడ్‌ను గురువారం సిటీ ఆర్మ్‌డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు.
క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, శాఖలో కీలకమైన కమ్యూనికేషన్ విభాగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ రవిగుప్తా, అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, మురళీకృష్ణ, శివప్రసాద్, కమ్యూనికేషన్ డీఐజీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment