Passing Out Parade
-
మాటల్లేవ్.. అయినవాళ్లతో ఆనంద భాష్పాలు తప్ప! (ఫొటోలు)
-
నాలుగో సింహం.. విమెన్ ఇన్ ఖాకీ
ఎన్ని ప్రయత్నాలు చేశామన్నది కాదు... లక్ష్యం చేరామా? లేదా? అన్నదే ముఖ్యం’ అన్నట్లుగా పట్టుదలతో ఐపీఎస్ సాధించారు ఈ ఆఫీసర్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం అయినా అందరి టార్గెట్ విమెన్ ఇన్ ఖాకీనే. హైదరాబాద్‌లో జరిగిన 76వ బ్యాచ్ రెగ్యులర్ రిక్రూట్స్ ΄ాసింగ్ ఔట్ పరేడ్‌లో ఈ ఐపీఎస్ ్ర΄÷బేషనరీ అధికారులు ‘సాక్షి ఫ్యామిలీ’తో మాట్లాడిన విశేషాలు...సైబర్ నేరాలునియంత్రిస్తానునేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. మా అమ్మ ప్రభుత్వ కళాశాలలో ్ర΄÷ఫెసర్‌గా పని చేస్తున్నారు. నాన్న ఢిల్లీలో జిల్లా విద్యాశాఖ అధికారి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. జేఎన్‌యూలో మాస్టర్స్ చేశాను. తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ గురించి తెలుసుకుంటూ పెరిగాను. ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్ కావాలని కలలు కన్నాను. సమాజ సేవలో విమెన్ ఇన్ ఖాకీగా ఉండాలి అన్నదే నా లక్ష్యం. నా భర్త, మా అత్తమామలు, నా కుటుంబ సహకారంతోనే ఐదో ప్రయత్నంలో నా లక్ష్యాన్ని ఛేదించాను. ఐపీఎస్‌గా సెలెక్ట్ కాకముందు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో నాలుగేళ్లు ఢిల్లీలో పని చేశాను. 2018లో నాకు వివాహం అయ్యింది. నా భర్త ఐఆర్ఎస్ అధికారి. ఐపీఎస్ కావాలన్నది నా కల. నా భర్త సహకారంతో నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాను. ఐదో ప్రయత్నంలో సాధించాను. నాలుగు ప్రయత్నాల్లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను క్లియర్ చేసినా నేను అనుకున్న ఐపీఎస్ రాలేదు. అందుకే ప్రయత్నం కొనసాగించాను. ఐపీఎస్ శిక్షణ అనేది నన్ను మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చింది. ఏపీ కేడర్‌కు వెళుతున్నాను. మహిళల భద్రతకు, సైబర్ నేరాల నియంత్రణకు ్ర΄ాధాన్యత ఇస్తాను. – దీక్ష, ఢిల్లీకిరణ్ బేడి స్ఫూర్తి.నేను పెద్ద ΄ోలీస్ ఆఫీసర్ కావాలన్నది మా అమ్మానాన్నల కల. అది నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో పూర్తి చేశాను. తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నాన్న వ్యా΄ారం చేస్తుంటారు. మా కుటుంబం నుంచి మొదటి ΄ోలీస్ అధికారిని నేనే. మొదటి ఐదు ప్రయత్నాలు విఫలమైనా ఆరో ప్రయత్నంలో సక్సెస్ సాధించాను. సివిల్స్ క్లియర్ చేయాలంటే ఒక మెంటార్ తప్పనిసరి అని నా అభి్ర΄ాయం. లేదంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదువుకుంటూ కూర్చుంటే మన శక్తి, సమయం సరి΄ోదు. అది వృథా ప్రయత్నమే అవుతుంది. ఇప్పటికే సివిల్స్ క్లియర్ చేసిన వారి సూచనలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను ఐదుసార్లు విఫలం అయినా కూడా నా ప్రయత్నాన్ని వదలలేదు. కిరణ్‌బేడీ నాకు స్ఫూర్తి. నేను ఇప్పుడు తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యాను. – వసుంధర యాదవ్, ఉత్తరప్రదేశ్నా శక్తిని తెలుసుకున్నానుచదువుకునే సమయంలో మా నాన్నే నీకో లక్ష్యం ఉండాలమ్మా అన్నారు. ΄ోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. మాది నంద్యాల. వ్యవసాయ కుటుంబం. అమ్మా నాన్నలు పెద్దగా చదవక΄ోయినా మా చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కెరీర్ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సమాజ సేవలో ప్రజలకు దగ్గరగా ఉండాలని నా లక్ష్యం. 2020లో మొదటి అటెంప్ట్ చేశాను. 2022 రెండో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ మెరుగు పర్చుకోవాలన్నది గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. సీనియర్ల సూచనలు తీసుకోవడం ఉపయోగపడుతుంది. మొదటిసారి నేషనల్ ΄ోలీస్ అకాడమీలో అడుగుపెట్టినప్పుడు ఇంత కఠినమైన శిక్షణ చేయగలనా అనుకున్నాను. కానీ అకాడెమీ ట్రైనింగ్ నాలో శక్తిని తెలుసుకునేలా చేసింది. క్రమంగా మనల్ని శిక్షణలో భాగం చేస్తారు. ఏపీ కేడర్‌కు అలాట్ కావడం సంతోషంగా ఉంది. మహిళా భద్రత అనేది నా ప్రధాన లక్ష్యం. – మనీశా రెడ్డి, నంద్యాలఆత్మవిశ్వాసం పెరిగిందినీపై నీకు విశ్వాసం ఉంటే ప్రయత్న లోపం లేకుండా సాధన చేస్తే కాలం కూడా కలిసి వస్తుందని నమ్ముతాను. అపజయాలనేవి మనల్ని నిర్వచించలేవు. కొన్నిసార్లు మీ ప్రయత్నంలో లోపం లేకున్నా ఏదో ఒక చిన్న తప్పుతో విజయం రాక΄ోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందాల్సిన పని లేదు. మాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా. నా విజయంలో కుటుంబ సహకారం ఉంది. నేను రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో 2019లో సెలక్ట్ అయ్యాను. కానీ నా లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశ చెందలేదు. ఐదోసారి ఐపీఎస్ సాధించాను. నా కుటుంబంలో నేనే మొదటి ఐపీఎస్ అధికారిని. ఔట్‌డోర్ శిక్షణలో 15 కిలోల బరువుతో 40 కిలోమీటర్లు నడవడం వంటి ఎన్నో కఠిన శిక్షణల తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను యూపీ కేడర్‌కు అలాట్ అయ్యాను. – సోనాలి మిశ్రాఉత్తరప్రదేశ్ం -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
-
హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట పెరేడ్
-
HYD: ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైన అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 175 మంది ఐపీఎస్ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐపీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమని, దేశానికి సేవలు అందించడంలో ఐపీఎస్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అమిత్‌షా అన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి, భద్రత కోసం నిబద్దతతో పనిచేయాలన్నారు. 75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళలు ఉండడం సంతోషం, గర్వకారణం. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీ పై ఐపీఎస్‌లు దృష్టి కేంద్రీకరించాలి. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఐపీఎస్‌లు అలవోకగా ఎదుర్కొవాలి. అంతిమంగా ఐపీఎస్‌లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. విజయవంతంగా మొదటి దశ శిక్షణ పూర్తి చేసిన యువ ఐపీఎస్ అధికారులు విధి నిర్వహణలో తొలి అడుగు వేయబోతున్నారు. శుక్రవారం ఉదయం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ఆర్) బ్యాచ్‌కు చెందిన 155 మంది యువ ఐపీఎస్ అధికారులు, వీరితోపాటు శిక్షణ పొందిన మరో 20 మంది విదేశీ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. -
75వ IPS బ్యాచ్ కు చెందిన పాసింగ్ అవుట్ పెరేడ్
-
SVPNPA: ఎవరికి వారే.. మహిళా‘మణులే’!
హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడెమీలో (ఎస్వీపీ ఎన్ పీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 155 మంది ఐపీఎస్ ట్రైనీల్లో 32 మంది మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటి ఓవరాల్ టాపర్‌గా నిలిచిన అనుష్త కాలీయా శుక్రవారం జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కు (పీఓపీ) నేతృత్వం వహించనున్నారు. ఇలా ఓ మహిళ ట్రైనీ పీఓపీకి నేతృత్వం వహించడం 75 ఏళ్ళ అకాడెమీ చరిత్రలో ఇది మూడోసారి. ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులుగా బయటకు రానున్న మహిళామణుల్లో ఉన్న ప్రత్యేకతల గురించి... గంటకు 16 కిమీ పరిగెత్తే సత్తా సాధించి... ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా ఢిల్లీ యూనివర్శిటీలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ నుంచి డేటా సైన్్సలో బీటెక్ పూర్తి చేశారు. అక్కడే బ్లింకిట్ అనే స్టార్టప్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలపై ఉన్న ఆసక్తితో ఆరునెలలకే ఈ ఉద్యోగం వదిలారు. కోవిడ్ ప్రభావంతో కోచింగ్ సెంటర్లకు బదులు ఆన్ లైన్ క్లాసులకు పరిమితం అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఇతరుల్ని కలవడం తగ్గిపోవడంతో దాన్ని పాజిటివ్‌గా వాడుకుని చదువుకే పరిమితం అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 143వ ర్యాంకు సాధించారు. స్కూలు, కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్, కరాటే పోటీల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఎన్ పీఏలో అడుగు పెట్టే సమయానికి గంటకు కిలోమీటరు దూరం కూడా పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి శిక్షణ కారణంగా ప్రస్తుతం గంటకు 16 కిమీ పరిగెత్తే సామర్థ్యాన్ని సాధించారు. ఈ బ్యాచ్‌లో ఓవరాల్ టాపర్‌గా, ఔట్‌డోర్ టాపర్‌గానే కాకుండా పరేడ్ కమాండర్‌గా నిలిచే అవకాశంతోపాటు స్వార్డ్ ఆఫ్ ఆనర్ సొంతం చేసుకున్నారు. ప్రజాసేవలో సాంకేతికతని వినియోగించాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నారు. ఎన్ పీఏ శిక్షణలో ఎన్నో అంశాలు నేర్చుకున్నానని, గ్రేహౌండ్స్ ఆ«ధ్వర్యంలో జరిగిన నెల రోజుల జంగిల్ ట్రైనింగ్ మాత్రం కఠినంగా అనిపించిందని చెప్పారు. లాయర్‌గానే సఫాయీ కార్మికుల కోసం... ముంబైకి చెందిన ఇషా సింగ్ తండ్రి యోగేష్ ప్రతాప్ (వైపీ) సింగ్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ వీఆర్ఎస్ తీసుకుని న్యాయవాదిగా మారారు. తల్లి అభాసింగ్ సైతం న్యాయవాది. వైపీ సింగ్ మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్‌లో బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తున్నారు. 2018లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ నుంచి ఇషా పట్టా పొందారు. 26వ ఏటనే పీపుల్స్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి గొవాండీలో ఉన్న మౌర్య హౌసింగ్ సొసైటీలో 2019 డిసెంబర్ 3న జరిగి ఉదంతం ఇషా దృష్టికి వచ్చింది. అక్కడ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు సఫాయీ కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారి భార్యలకు న్యాయం చేయడం కోసం అసిస్టెన్ ్స ఫర్ సఫాయీ కరమ్‌చారీ (ఆస్క్) స్థాపించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి అందించారు. ఇలా మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని 1993 నుంచి మహారాష్ట్ర లో నిబంధనలు ఉన్నా అమలు కాలేదు. దీనిపై ముంబై హైకోర్టులో 2021లో రిట్ దాఖలు చేసి వారి తరఫున పోరాడి వారికి పరిహారం ఇప్పించారు. ఈ కేసుపై అప్పటి జడ్జ్ ఉజ్వల్ భూయాన్ 1993 నుంచి ఇలా చనిపోయిన వారి జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి చూపిన మార్గంలో ఐపీఎస్ కావాలని భావించిన ఇషా రూ.20 లక్షల ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగం వదులుకుని రెండో ప్రయత్నంలో 191వ ర్యాంక్ సా«ధించింది. యూట్యూబ్ చూసి యూపీఎస్సీ పరీక్షలు క్రాక్ చేసి... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న మావు పట్టణానికి చెందిన సిమ్రన్ భరద్వాజ్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పని చేస్తుండటంతో సాధారణంగానే యూనీఫామ్∙సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. తాను నివసించేది చిన్న పట్టణం కావడంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన కోచింగ్ సెంటర్ల వంటి సదుపాయాలు లేవు. దీనికితోడు 2021 జూన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సివిల్స్ పరీక్ష రాయాల్సి ఉంది. కరోనా ప్రభావంతో కోచింగ్ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో యూట్యూబ్ ఛానల్స్‌లో క్లాసులు వింటూ రోజుకు 8 నుంచి 10 గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయింది. మిగిలిన సమయం కంబైన్ ్డ డిఫెన్ ్స సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షకు వెచ్చించింది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ రెండు పరీక్షలు 2021 అక్టోబర్‌లో జరిగాయి. మొదటి ప్రయత్నాల్లోనే సీడీఎస్‌లో ఆరో ర్యాంక్, సివిల్స్‌లో 172వ ర్యాంక్ సాధించింది. 23 ఏళ్ళ వయస్సులోనే ఐపీఎస్‌కు ఎంపికైంది. ఎలాంటి ఇతర యాక్టివిటీస్ లేని కోవిడ్ టైమ్ తనకు కలిసి వచ్చిందని సిమ్రన్ చెప్తున్నారు. ఐఏఎస్ అనుకున్నా ఐపీఎస్‌గా... వరంగల్‌కు చెందిన బి. చైతన్య రెడ్డి అక్కడి ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. తండ్రి గ్రూప్–1 ఆఫీసర్‌గా ఉండటంతో సివిల్ సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. సివిల్ సర్వెంట్స్‌గా ఉంటేనే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం దక్కుతుందని అని తండ్రి చెప్పిన మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయి. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పని చేస్తూనే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు మొగ్గారు. మెయిన్ ్సలో మూడుసార్లు అపజయం ఎదురైనా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళారు. సివిల్స్‌తోపాటు కేంద్ర సాయుధ బలగాల్లో ఎంపికకు సంబంధించిన పరీక్షల్నీ రాశారు. దీంతో ఐఏఎస్ నుంచి దృష్టి ఐపీఎస్ వైపు మళ్ళింది. 2022 లో 161వ ర్యాంక్ సాధించి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు. – శ్రీరంగం కామేష్, సాక్షి సిటీబ్యూరో, హైదరాబాద్ ; ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్
అనంతపురం క్రైం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 28 మంది ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌ను సోమవారం పీటీసీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హోం మంత్రి తానేటి వనిత, డీపీజీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ కోసం సీఎం జగనన్న ‘దిశ’యాప్ తీసుకొచ్చి పోలీస్స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ ద్వారా 30,500 మంది మహిళలు సహాయం పొందారని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసు శాఖలోకి నూతనంగా ప్రవేశిస్తున్న డీఎస్పీలు నిజాయితీగా, సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా సేవలందించాలని సూచించారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పోలీసులు ఒత్తిడికి లోనుకాకుండా బాధితులకు సకాలంలో సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గీతాదేవి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు కేకేఎన్ అన్బురాజన్, మాధవరెడ్డి, తాడిపత్రి బెటాలియన్ కమాండెంట్ గంగాధర్ రావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శం: తానేటి వనిత
సాక్షి, అనంతపురం: ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీస్ శిక్షణా కళాశాలలో సోమవారం.. డీఎస్పీల పాసింగ్ ఔట్ పేరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, సీఎం జగన్ నాయకత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, సీఎం జగన్ ఏపీ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారని హోంమంత్రి అన్నారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు: డీజీపీ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకెళ్లాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని, ఫిర్యాదు వచ్చిన వెంటనే సీరియస్‌గా స్పందించాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ చంద్రబాబు లేఖ వ్యవహారంపై స్పందించిన డీజీపీ.. మీడియాతో మాట్లాడుతూ, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు అనుమతి కోరలేదు. టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు’’ అని డీజీపీ స్పష్టం చేశారు. చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! -
పోలీస్ జాగిలాలకు పాసింగ్ అవుట్ పరేడ్.. మొత్తం 48 జాగిలాలకు శిక్షణ పూర్తి
-
పోలీస్ జాగిలాలకు పాసింగ్ అవుట్ పరేడ్
-
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
-
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ ఫొటోలు
-
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్
-
వెలకట్టలేని సెల్యూట్.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం
లక్నో: పుత్రడు పుట్టినప్పటి కంటే.. అతడు వృద్ధిలోకి వచ్చి.. పదిమంది చేత ప్రశంసలు పొందిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం లభిస్తుంది. అయితే కాలంతో పాటు సమాజం తీరు కూడా మారుతోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే.. అనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లపై వివక్ష చూపకుండా.. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తూ.. వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తోడ్పడుతున్నారు. ఇక వారి అభివృద్ధి చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఐటీబీపీ ఉన్నతాధికారి కుమార్తె ఒకరు అదే రంగంలో ప్రవేశించింది. ఐటీబీపీ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత జరిగే పాసింగ్ ఔట్ పరేడ్కి ముఖ్య అతిథిగా హాజరైన తండ్రికి సెల్యూట్ చేసింది. ఆ క్షణం ఆ తండ్రి పొందిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి అపురూప క్షణాలను తీసుకురాలేం. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తండ్రి, కుమార్తెలకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. (చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!) ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్ పోలీస్ యూనిఫామ్ ధరించి.. తన పైఅధికారి ఐటీబీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏపీఎస్ నింబాడియాకి సెల్యూట్ చేయగా.. ఆయన తిరిగి సెల్యూట్ చేశారు. ఇలా ఒకరినొకరు సెల్యూట్ చేసుకున్నది తండ్రి, కుమార్తె కావడం గమనార్హం. ఇలా వారిద్దరూ పరేడ్‌లో సెల్యూట్ చేసుకునే సమయంలో.. ఫోటో క్లిక్ మనిపించారు. (చదవండి: డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి.. ) ఈ ఫొటోని ఐటీబీపీ విభాగం తన సోషల్ మీడియా షేర్ చేసింది. దీనికి ‘‘కుమార్తె సెల్యూట్ చేయడంతో.. తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు’’ అని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇప్పటివరకు 22వేల మందికిపైగా లైక్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘‘తనయోత్సాహం.. ఆ తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు.. అపురూప క్షణాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆపేక్షా నింబాడియా సివిల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి కుటుంబం నుంచి మూడోతరం వారు కూడా పోలీస్ విభాగంలో సేవ చేయడం విశేషం. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! View this post on Instagram A post shared by ITBP (@itbp_official) -
నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్
సాక్షి, హైదరాబాద్: నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్ నిర్వహించారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఏపీ, తెలంగాణకు నలుగురి చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు 58 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చారు. 144 మంది ఐపీఎస్ ప్రొబేషనరీలతో పాటు 34 మంది ఫారిన్ ఆఫీసర్లు శిక్షణ పొందారు. 2019 బ్యాచ్‌లో 73 శాతం టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారే. -
హైదరాబాద్: నూతన ఐపీఎస్ లకు పాసింగ్ ఔట్ పరేడ్
-
కొత్త కానిస్టేబుళ్లు వచ్చేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 12 బెటాలియన్లలో 3,804 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. దాదాపు అన్ని కేంద్రాల్లో గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) నిర్వహిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాత్రం 23, 24వ తేదీల్లో చేపట్టనున్నారు. గత వారం రోజులుగా పీవోపీ కోసం ట్రైనీ కానిస్టేబుళ్లు శ్రమిస్తున్నారు. నాలుగు రోజులుగా వానలు కురుస్తున్నా ఏ రోజూ సాధన ఆపలేదు. 25వ తేదీ నుంచి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని తొలుత ఉన్నతాధికారులు భావించారు. అయితే ఒక్కరోజు ముందుగా 24వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని బుధవారం తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. వీరు 28వ తేదీన అలాట్ చేసిన యూనిట్లలో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొండాపూర్‌లో జరిగే పీవోపీకి హోం మంత్రి మహమూద్æ అలీ, టీఎస్ఎస్పీ ఏడీజీ అభిలాష్ బిస్త్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీచుపల్లి బెటాలియన్‌లో జరిగే పీవోపీకి గ్రేహౌండ్స్ ఏడీజీ శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారు. కాగా, 19 నెలల పాటు కానిస్టేబుళ్లకు శిక్షణ జరుగుతూనే ఉంది. మొత్తం 3,993 మంది టీఎస్ఎస్పీ శిక్షణకు ఎంపిక కాగా, 155 మంది రిపోర్టు చేయలేదు. వేరే కారణాలతో మరో 34 మంది శిక్షణ నుంచి తప్పుకొన్నారు. విజయవంతంగా ముగిసింది గతేడాది మా వద్ద ఏఆర్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభించగానే కరోనా విజృంభించింది. అన్ని బెటాలియన్లలో పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాం. ట్రైనీల ఆహారం నుంచి పడుకునే బెడ్, దుస్తులు, క్యాంపస్‌లోకి వచ్చి పోయే సిబ్బందికి నిరంతరం పకడ్బందీగా స్క్రీనింగ్ చేశాం. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మా సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లతో కలిపి 14 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. ట్రైనీలకు వ్యాక్సినేషన్, సీనియర్ పోలీస్ అధికారులతో అనేక అంశాలపై ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. 19 నెలల పాటు నిర్వహించిన శిక్షణ విజయవంతంగా ముగిసింది. – అభిలాష బిస్త్, ఏడీజీ -
పోలీసు జాగిలం ప్రత్యేకతలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేర దర్యాప్తు, విపత్తుల సమయంలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో కీలకమని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మంగళవారం జరిగిన 50 పోలీసు జాగిలాలు, 80 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించేలా ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు విధుల్లో మరింత ప్రతిభ కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోలీసు జాగిలాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలు, శిక్షకులతో కలసి ప్రదర్శించిన విన్యాసాలు, సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. 8 నెలల పాటు కఠోర శిక్షణ.. మొయినాబాద్ శిక్షణ కేంద్రంలో 50 జాగిలాలకు 8 నెలల పాటు 80 మంది హాండ్లర్స్ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 50 జాగిలాలలో ప్రధానంగా లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మాలినాయిస్, కొకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. హోం శాఖకు చెందిన పీఎం డివిజన్ పోలీస్ కె–9 డివిజన్ కన్సల్టింగ్ డైరెక్టర్ పీకే ఛుగ్ ఈ బ్యాచ్ తుది పరీక్షకు ఎగ్జామినర్‌గా హాజరయ్యారు. 12 జాతుల వినియోగం.. ప్రపంచవ్యాప్తంగా 435 రకాల జాతులు ఉన్నాయి. ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటోంది. మన రాష్ట్రంలో లాబ్రడార్, డాబర్మన్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షెపర్డ్ జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీల కోసం చిన్నగా ఉండే కొకర్ స్పానియల్ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. కాగా, అకాడమీలో బిహార్‌కు చెందిన 20 జాగిలాలకు అక్రమ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు 669 జాగిలాలు, 965 హ్యాండ్లర్లు శిక్షణ పొందారు. కార్యక్రమంలో ఏడీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. జాగిలాల ప్రత్యేకతలివే.. శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. చదవండి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు వ్యాఖ్య చదవండి: అయ్యా నీకో దండం.. -
ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
-
ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
పోలీస్.. ఈ పదమే వారిని యూనిఫాం వైపు నడిపించింది. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. అందరి కల ఒక్కటే. ఖాకీ యూనిఫాం వేసుకుని చట్టాన్ని రక్షించడం. సామాన్యులకు న్యాయం చేయడం. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు. శిక్షణ సైతం పూర్తి చేసుకున్నారు. చివరగా ప్రజా సేవకు సిద్ధమవుతున్నారు. పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహించారు. సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాల మరో అపురూప ఘట్టానికి వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 మంది స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో ఉదయం 7.40 గంటలకు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం హోంమంత్రి, డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్ రెడ్డి, శమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకట్రామిరెడ్డి, క్రాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం జగన్‌దే. దిశా బిల్లు తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష పడేలా చేశారు. ఏపీలోని అన్ని పోలీసు స్టేషన్లను ఉమెన్ ఫ్రెండ్లీ గా మార్చేశాం' అని అన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో దాదాపు సంవత్సరం పాటు శిక్షణ పొందిన 138 మంది సివిల్ ఎస్ఐలు, 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 69 మంది ఏఆర్, 66 మంది ఏపీఎస్పీ ఎస్ఐలు పరేడ్‌లో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత పురస్కారాలను అందజేశారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. డీజీపీ సమావేశం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉదయం 11.30 నుంచి 12 గంటల సమయంలో డీపీఓలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. జిల్లా పోలీసుల పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం చిత్తూరు, వైస్సార్ కడప జిల్లా పోలీ సులకు రివార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హోంమంత్రికి ఘన స్వాగతం సాక్షి, అనంతపురం: ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్ వేర్వేరుగా గురువారం రాత్రే నగరానికి చేరుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద హోంమంత్రికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ నిశాంత్‌కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల భానుమతి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు కూడా హోంమంత్రికి బొకేలిచ్చి స్వాగతం పలికారు. -
వాయుసేన.. సిద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్ : సరిహద్దుల్లో భారత్ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పగల సత్తా మన సైన్యం వద్ద ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటననను ఆయన గుర్తుచేశారు. చైనా ఆగడాలను ఎల్లప్పుడూ తిప్పుకొడుతున్న భారత జవాన్ల పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) పరేడ్ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. ‘చైనా సరిహద్దుల్లో అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 19 మందికి నివాళులు అర్పిస్తున్నాం. వారి ధైర్యం సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలి. లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. చర్చలు అని చెప్పి చైనా దాడులకు పాల్పడుతుంది. దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాయుసేన సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రతికూల వాతావరణం లో అయినా దేశ సేవ ప్రధానం. పీపుల్ సేఫ్టీ ఫస్ట్.. మిషన్ ఆల్ వేస్... ఎప్పటికి మరిచిపోవద్దు. తమ పిల్లల కళను సాకారం చేసిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. గాల్వాన్ అమరుల త్యాగాలను వృథా కానివ్వం.’ అని పేర్కొన్నారు. కాగా పరేడ్ సందర్భంగా క్యాడేట్ల చేత గౌరవ వందన్నాన్ని చీఫ్ మార్షల్ స్వీకరించారు. కోవిడ్ 19 నేపధ్యంలో పరేడ్ తిలకించడానికి క్యాడేట్ల కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించారు. కాగా మొత్తం 123 మంది క్యాడేట్లలో 19 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ చీఫ్ మార్షల్ అభినందనలు తెలిపారు. -
సీఆర్పీఎఫ్ చరిత్రలో తొలిసారిగా..
గురుగ్రామ్: కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా పరిస్థితులు తారుమారయ్యాయి. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య, పోలీసు సిబ్బంది మాత్రమే ప్రత్యక్ష విధుల్లో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పాలకులంతా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఈ-పాసింగ్ అవుట్ పరేడ్’ నిర్వహించింది. నేరుగా గెజిటెడ్ అధికారులుగా నియమితులైన 51వ బ్యాచ్‌కు చెందిన 42 మంది అధికారుల కోసం కాదర్పూర్ సీఆర్పీఎఫ్ అకాడమీలో ఈ-పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ 42 మంది అధికారులు యూనిఫామ్‌తో పాటు ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లోవ్స్ ధరించి ఈ-పాసింగ్ అవుట్లో పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి కేంద్ర హెంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, డీజీ ఏపీ మహేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 81 ఏళ్ల సీఆర్పీఎఫ్ చరిత్రలో ఈ-పాసింగ్ అవుట్ నిర్వహిచడం ఇదే మొటిసారి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెబ్ లింక్‌ను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ 42 మంది అధికారుల సేవలు ఎంతో అవసరం కావడంతో ఈ-పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించాల్సి వచ్చిందని సీఆర్పీఎఫ్ పీఆర్ఓ డీఐజీ మెసెస్ దినకరన్ తెలిపారు. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ-పాసింగ్ అవుట్‌ను పలువురు నెటిజనులు ప్రశంసించారు. కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే.. -
పరోక్ష యుద్ధంలోనూ పాక్‌కు ఓటమే
పుణే: ప్రత్యక్ష యుద్ధంలో ఎలాగూ గెలవలేమనే పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి ప్రయత్నిస్తోందని అయితే ఇందులోనూ ఆ దేశానికి ఓటమి తప్పదని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ శనివారం జరిగిన 137వ పాసింగ్ ఔట్ పెరేడ్లో ఆయన మాట్లాడారు.‘ సంప్రదాయ యుద్ధమైనా, పరిమిత యుద్ధమైనాసరే తాను భారత్‌పై గెలవలేనని పాకిస్తాన్‌కు 1848 నుంచే తెలుసు. 1965, 1971, 1999ల్లోనూ ఇదే విషయం రూఢి అయ్యింది’ అని అన్నారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాదం రూపంలో పరోక్ష యుద్ధ మార్గాన్ని ఎన్నుకుంది. కానీ ఇందులోనూ ఆ దేశానికి దక్కేది ఓటమే’ అని చెప్పారు. భారత్ ఎల్లప్పుడు ఇతర దేశాలతో సౌహార్దపూర్వక, స్నేహపూరిత సంబంధాలను కోరుకుందని, పరాయి భూభాగాన్ని ఆక్రమించాలన్న ఆలోచన భారత్‌కు లేదని, కానీ రెచ్చగొడితే ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. సైబర్ యుద్ధాన్నీ కాచుకోవాలి.. ఉగ్రవాదంతోపాటు ప్రపంచం ఇప్పుడు తమ సిద్ధాంతాల ప్రచారానికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే సైబర్ యుద్ధ రీతులను ఎదుర్కోవాల్సి ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. శాంతి పరిరక్షణ, మానవతా కార్యక్రమాల్లో భారత సైన్యం ఎంత నైపుణ్యంతో పనిచేస్తుందో ఇప్పుడు అందరికీ తెలుసునని మంత్రి పేర్కొన్నారు. ‘మీరు దేశ రక్షణ వ్యవస్థలో భాగమైనప్పుడు భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని తీర్మానం చేసుకోండి. రాజ్యాంగ పరిరక్షణ అనేది అటు మిలటరీ, ఇటు పౌర సమాజాన్ని కలిపి ఉంచే బంధం’’అని మంత్రి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కేడెట్స్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సైనిక దౌత్యానికీ ప్రాధాన్యమిస్తోందన్నారు. -
మంగళగిరి : 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్
-
'ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి'
సాక్షి, విజయవాడ : 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్‌ను బుధవారం మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఐ.జి.పి ట్రైనీ ఐపిఎస్ సంజయ్ నేతృత్వంలో దీక్షాంత్ పెరేడ్ అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏడాది పాటు అనంతపురం పీటీసీలో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం విశేషం. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ .. 25 మందిలో డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఆపద కలిగినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది పోలీసేనని ఆమె స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి రక్షణగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని వారికి పిలుపునిచ్చారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరబోతున్న 25 మంది డీఎస్సీలకు శుభాకాంక్షలు. టైనింగ్‌లో నేర్పిన నాలుగు ప్రధాన సూత్రాలను గుర్తుపెట్టుకొని న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. పోలీస్ విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా,శారీరకంగా ధృడత్వాన్ని ఏర్పరచుకోవాలన్నారు. ప్రజా సంరక్షణ కోసం నిరంతరం పాటు పడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని డీజీపీ వెల్లడించారు. -
2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్
-
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఆయనకు స్వాగతం పలికారు. ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందన స్వీకరిస్తారు. నగర శివారులోని శివరాంపల్లిలో గల సర్దర్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకడమీలో ఈ కార్యక్రమం జరుగనుంది. పరేడ్‌లో మొత్తం 92 మంది ఐపీఎస్‌లు, 11 మంది ఫారెన్ ఆఫీసర్లు పాల్గొంటారు. వీరిలో 12 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐపీఎస్ ట్రైనీలు ఉన్నారు. ట్రైనింగ్‌లో ఆల్‌రౌండ ప్రదర్శన కనబర్చిన గోష్ ఆలంను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని బీజేపీ నేతలు అమిత్ షాను కోరుతున్నారు. -
23న రాష్ట్రానికి అమిత్ షా రాక
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. 23వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 9 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 9.40 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లోని రాజస్తాన్ భవన్లో బస చేస్తారు. శనివారం ఎన్పీఏలో ట్రైనీ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు. -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఆకాడమీలో విన్యాసాలు
-
ఫ్లయింగ్ పరేడ్
-
మరో ‘సర్జికల్’కు వెనుకాడం
డెహ్రాడూన్: సరిహద్దులకు ఆవల ఉన్న ఉగ్రవాదులపై అవసరమైతే మరోసారి సర్జికల్ దాడులకు వెనుకాడబోమని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ దేవరాజ్ అన్బూ స్పష్టం చేశారు. శత్రువు సవాలు విసిరితే భారత ఆర్మీ తమ శక్తి సామర్థ్యాన్ని చూపేందుకు వెనుకాడదని ఆయన హెచ్చరించారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన భారత మిలిటరీ అకాడెమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కదనరంగంలో మహిళలను నియమించే అంశం పరిశీలనలో ఉందన్నారు. పాకిస్తాన్, చైనాలతో భారత్‌కు ఉన్న సరిహద్దు ప్రాంతాలకంటే మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కాస్త భిన్నమైన పరిస్థితులుంటాయన్నారు. భారత్‌లో ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్నారు. యుద్ధరంగంలో మహిళలను పంపించేందుకు ఈ ఏడాది జూలైలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అనుమతించారని చెప్పారు. క్రమంగా మిలిటరీలో వివిధ స్థానాల్లో మహిళలను నియమిస్తామని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం మిలిటరీ అధికారులతో దేవరాజ్ అన్బూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో భారత భద్రతా బలగాల స్థావరాలపై 2016లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత మిలిటరీ బలగాలు అదే ఏడాది సెప్టెంబర్ 29న ఎల్వోసీ ఆవలిలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసి పాక్‌కు గట్టి హెచ్చరికను పంపిన సంగతి తెలిసిందే. -
వైరల్ ఫోటోలు : గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసినా ఆర్మీ ఆఫీసర్
చెన్నై : ప్రేమించడం అంటే అమ్మలా అక్కున చేర్చుకోవడం.. నాన్నలా బాధ్యతగా చూసుకోవడం.. సోదరునిలా తోడుగా నిలవడం.. మిత్రునిగా సుఖసంతోషాలు పంచుకోవడం.. కానీ నేడు చాలా మంది ప్రేమ అనే పేరుకు కనీసం అర్థం కూడా తెలియని వయసులో.. ప్రేమ పేరు చెప్పి వెర్రిమొర్రి వేషాలు వేస్తూ.. బరువు బాధ్యతలను మర్చిపోయి తిరుగుతున్నారు. ప్రేమ పేరుతో అడ్డు అదుపూ లేకుండా తిరగడం.. బాధ్యతలు మీద పడే సమయానికి నమ్ముకున్న వారిని నట్టేటముంచడం.. కొందరు మరో అడుగు ముందుకు వేసి ప్రేమించిన వ్యక్తి తనకు కాకుండా మరేవరికి దక్కకూడదనే ఆవేశంలో పైశాచికంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా తీయడానికి వెనకడాకపోవడం.. ఇది నేటి కాలం ప్రేమ, ప్రేమికుల పరిస్థితి. అయితే అందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరు. ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం సంతోషంగా ఉంచాలి అనుకునే వారు ముందు అందుకు తగిన విధంగా తమ జీవితాన్ని మార్చుకుంటారు.. మలచుకుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే చంద్రేష్ సింగ్. ప్రేమించిన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికంటే ముందు జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను దాదాపు మూడేళ్లపాటు శ్రమించి కోరుకున్న చెలిని మాత్రమే కాక మనసుకు నచ్చిన ఉద్యగాన్ని కూడా సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివారాలు.. ఠాకూర్ చంద్రేష్ సింగ్(25) డిగ్రీ చదవడం కోసం 2012లో బెంగళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్‌లో చేరాడు. అక్కడ అతనికి ధారా పరిచయమయ్యింది. ఈ క్రమంలో చంద్రేష్, ధారాను ప్రేమించాడు. తన మనసులోని మాటను ధారాకు చెప్పడానికి కంటే ముందు మరో ముఖ్యమైన బాధ్యత అతనికి గుర్తుకు వచ్చింది. ‘ప్రేమించడం తేలికే. కానీ ఆ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలన్నా.. ధారా తల్లిదండ్రులు నా ప్రేమను అంగీకరించాలన్నా ముందు నేను జీవితంలో స్థిరపడాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. అందుకోసం నాకిష్టమైన ఆర్మీలో చేరతాను. ఉద్యోగం సాధించిన తరువాతనే ధారాకు నా మనసులోని మాటను చెప్తాను’ అని నిశ్చయించుకున్నాడు. కానీ చంద్రేష్ ఆర్మీలో చేరడానికి ముందే ధారా గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పి వారి అనుమతి పొందాడు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరాడు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత శిక్షణ చివరి రోజున తన తల్లిదండ్రులతో పాటు ధారాను, ఆమె తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు గుర్తుగా చంద్రేష్ తల్లిదండ్రులు అతనికి స్టార్స్ అలంకిరంచారు. అనంతరం వారందరి సమక్షంలో చంద్రేష్, ధారాకు తన ప్రేమను తెలియజేసి ఆమెను వివాహం చేసుకుంటానంటూ కోరాడు. అందుకు ధారా కూడా సంతోషంగా ఒప్పుకుంది. అటూ ఇరుకుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించడమే కాకా త్వరలోనే వివాహం చేస్తామని తెలిపారు. ఒకే రోజు ఇష్టమైన కొలువును.. మనసుకు నచ్చిన అమ్మాయిని పోందిని చంద్రేష్, ధారాల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఈ ఫోటోలను కొన్ని వేల మంది వీక్షించడమే కాక చంద్రేష్ - ధారాలను అభినందనలతో ముంచేత్తుతూ మీ ప్రేమ ఎందరికో ఆదర్శం అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram Beautiful pictures from OTA Chennai ⚔️🇮🇳❤️ #indianarmy A post shared by SSBCrack™ (@ssbcrackofficial) on Sep 11, 2018 at 6:42am PDT -
ఘనంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది దీక్షాంత్ పరేడ్‌ను గురువారం సిటీ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, శాఖలో కీలకమైన కమ్యూనికేషన్ విభాగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ రవిగుప్తా, అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, మురళీకృష్ణ, శివప్రసాద్, కమ్యూనికేషన్ డీఐజీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
ఆపదలో పోలీసులే దేవుళ్లు
సాక్షి, రంగారెడ్డి: ఆపద సమయంలో బాధితులకు పోలీసులే దేవుళ్లని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించే వారికి సత్వర న్యాయం అందించాలన్నారు. బుధవారం రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం (ఆర్బీవీఆర్ టీఎస్పీఏ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 735 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. సివిల్ 452, ఏఆర్ 283 మహిళా కానిస్టేబుళ్లు ఇక్కడ శిక్షణ పొందారు. పాసింగ్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుపటిలా పరిస్థితులు లేవని, ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిందన్నారు. చట్టానికి లోబడి గౌరవప్రదంగా విధులు నిర్వహించాలని మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ఆపదలో పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కే మహిళలను ఒక స్త్రీగా ఓపికతో సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ పోలీస్ శిక్షణ కేంద్రాల్లో టీఎస్పీఏ ఒకటని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ స్టేషన్ దేవాలయంలా కనిపిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మెరుగైన సేవలు అందిస్తే పోలీస్‌ని దేవుడిలా చూస్తారన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే జీతాలు పొందుతున్న విషయాన్ని గుర్తించి.. వారిని యజమానులుగా భావించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనూ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ అందజేశామని పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్ పేర్కొన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో భాగంగా చట్టం, ఆయుధాల వాడకం, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చామని వివరించారు. -
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: భారత నవనిర్మాణలో ఐపీఎస్‌లు భాగస్వామ్య కావాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 69వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారన్నారు. పనిలో కూడా ప్రతిభ చూపాలన్నారు. ఉగ్రవాదులు ఓ వైపు, సైబర్ దాడులు వంటి సవాళ్లను ఎదురుకోవాల్సి ఉందన్నారు. ప్రజలకు సాయం చేయడంలో ముందుండి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారికి అండగా నిలవాలన్నారు. మంచి అధికారి ఉంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ అభివృద్దికి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. 69 ఐపీఎస్ శిక్షణలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన యువ ఐపీఎస్‌లకు బహుమతులు అందజేశారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 136 మంది ఏపీఎస్ అధికారులు శిక్షణ పొందారు. వీరిలో మన దేశం నుంచి 122 మంది.. భూటాన్, నేపాల్, మాల్దీవుల నుంచి 14 మంది ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారున్నారు. అంతా ఉన్నత విద్యావంతులే. శిక్షణ పొందిన వారిలో ముగ్గురు మెడిసిన్, 75 మంది ఇంజనీరింగ్, ఏడుగురు ఆర్ట్స్, ఆరుగురు సైన్స్, ఇద్దరు కామర్స్, ముగ్గురు ఎంబీఏ, నలుగురు లా, ముగ్గురు ఎంఫిల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వారున్నారు. అత్యధికంగా ఇంజనీరింగ్ నుంచి 75 మంది ఎంపిక కావడం ఎస్వీపీఎన్పీఏ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ బ్యాచ్‌లో మొత్తం 21 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ బ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ షమీర్ అస్లామ్ షేక్ ఎంపికయ్యారు. పాసింగ్ ఔట్ పరేడ్ కు అల్ రౌండర్ షమీర్ అస్లామ్ షేక్ పరేడ్ కమాండర్ గా వ్యహరించారు. ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ అందరిని అకర్షించింది. అకింత భావంతో పనిచేస్తామంటూ ఈ సందర్బంగా యువ ఐపీఎస్ లు ప్రతిజ్ఞ పూనారు. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఈ అకాడమీకి దేశంలోనే అత్యున్నత స్థానం ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ కి ఎంపికైన ఐపీఎస్‌లకు విలువలతో కూడిన శిక్షణ ఇస్తోంది మన నేషనల్ పోలీస్ అకాడెమీ. ఈ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఎందరో ఐపీఎస్ అధికారులు.. కేంద్ర హోం డిపార్ట్ మెంట్ తో పాటు రాష్ట్ర హోంశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పడ్డ రోజు నుండి ఇప్పటి వరకు 68 బ్యాచ్‌ల్లో ఐపీఎస్‌లు ఎన్పీఏలో శిక్షణ పొందారు. ఇందులో ప్రతీ బ్యాచ్ కు 45 వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఇండోర్ ఔట్ డోర్ తో పాటు సైబర్ క్రైం నేరాలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇచ్చామని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డోలే బర్మన్ అన్నారు. ఐపీఎస్‌లు అన్ని విభాగాల్లో 45 వారాల పాటు శిక్షణ పొందారన్నారు. ఏడాది పాటు వివిధ పోలీస్ స్టేషన్స్ లో అక్కడ పరిస్థితుల అవగాహన కల్పిస్తామని 2018, సెప్టెంబర్ లో నుంచి వీరంతా విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈసారి శిక్షణ పొందిన ఐపీఎస్ ల్లో ఏడుగుర్ని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో సతీష్ కుమార్, సుమిత్ సునీల్, వకుల్ జిందాల్, రిషిత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ క్యాడర్‌కు పోతరాజు సాయి చైతన్య, రాజేష్ చంద్ర, శరత్ చంద్ర పవార్లను కేటాయించారు. -
అంతర్గత భద్రత నిర్వహణే సవాల్
* ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో అజిత్ దోవల్ * ఈ సమస్యను పోలీసులే పోరాడి గెలవగలరని వ్యాఖ్య * ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని సూచన * గౌరవ వందనం స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల కారణంగా యుద్ధరీతులు మారుతున్నాయని... ఈ తరుణంలో అంతర్గత భద్రత నిర్వహణే దేశానికి పెను సవాల్‌గా నిలవనుందని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో జరిగిన 67 ఆర్ఆర్ (2014) బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొత్తం 156 మంది ట్రైనీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళలు సహా 141 మంది ఐపీఎస్ ట్రైనీలు, 15 మంది విదేశీ ట్రైనీలు ఉన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అంతర్గత భద్రత పెనుసవాళ్లను విసురుతోందని, దీన్ని అదుపు చేయలేని దేశాలు చీలుతున్నాయన్నారు. పౌర సమాజంలో జరిగే ఇంతటి కీలక సమస్యను పోలీసులు మాత్రమే పోరాడి గెలవగలరని దోవల్ వ్యాఖ్యానించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, ముఖ్యంగా సైబర్ క్రైం పెనుసవాళ్లు విసురుతోందన్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దోవల్ సూచించారు. ఈ సందర్భంగా గౌతమబుద్ధుడు పేర్కొన్న 'ఆత్మ దిపోభవ'ను దోవల్ ప్రస్తావించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు సమర్థ శిక్షణ అందించిన అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణను దోవల్ అభినందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించడం గర్వకారణమన్నారు. అంతకు ముందు ఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ మాట్లాడుతూ... ట్రైనీ ఐపీఎస్‌లకు ఇచ్చిన శిక్షణ తీరును వివరించారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబేషనర్‌గా నిలిచిన గుజరాత్ ట్రైనీ ఐపీఎస్ పార్థ్రాజ్సిన్హ్ ఎన్. గోహిల్‌కు ప్రధాన మంత్రి బాటన్, హోంమంత్రి రివాల్వర్లను దోవల్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన మరికొందరికి కూడా అవార్డులను అందించారు. -
156 మంది ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తి
* రేపు పాసింగ్ ఔట్ పరేడ్ * ఎన్పీఏ డెరైక్టర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2013 బ్యాచ్‌కు చెందిన 156 మంది ఐపీఎస్‌లకు 46 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్వీపీ ఎన్పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ తెలిపారు. వారికి ఈ నెల 31న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారమిక్కడ పోలీసు అకాడమీలో విలేకరులతో చెప్పారు. గత రెండేళ్లుగా యువత ఐపీఎస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందన్నారు. ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ వంటి సాంకేతిక విద్యను అభ్యసించి, కొన్నాళ్లు ఉద్యోగం సైతం చేసిన వారు ఇటువైపు వస్తుండటం మంచి పరిణామన్నారు. పోలీసు విభాగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండేదని ప్రస్తుతం అది కూడా పెరుగుతోందని చెప్పారు. శిక్షణ పొందిన వారిలో భారత్‌కు చెందిన వారు 141 మంది కాగా, మిగతా 15 మంది భూటాన్, నేపాల్, మాల్దీవులకు చెందిన వారున్నట్లు తెలిపారు. వీరికి అన్ని కోణాల్లో విస్తృత శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సైబర్‌క్రైం, ఐటీ, మహిళల అక్రమ రవాణా, ఫోరెన్సిక్ వంటి వాటితో పాటు గ్రేహౌండ్స్‌తో కలసి పనిచేయడం, అడవుల్లో సాహసాలు వంటి క్షేత్రస్థాయి పరిజ్ఞానం కల్పించామన్నారు. శిక్షణలో భాగంగా తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు, రద్దీ సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణ అవగాహన కోసం నాసిక్ కుంభమేళా ఉత్సవాలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరూ ప్రొబెషనరీ పీరియడ్ కోసం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. -
విన్యాసాలు అదుర్స్
-
దేశ రక్షణలో యువత ముందుండాలి
- ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహ - ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్యాడెట్లకు పాసింగ్ అవుట్ పరేడ్ జిన్నారం: ఎయిర్ ఫోర్స్ అకాడమిలోని వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లు దేశ రక్షణలో భాగస్వాములు కావాలని, యువత దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్‌రాహ పిలుపునిచ్చారు. శనివారం మెదక్, రంగారెడ్డి జిల్లాలోని సరిహద్దులో గల దుండిగల్ ఎయిర్స్ అకాడమీలో ఆరు నెలలుగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లకు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరూప్‌రాహ హాజరయ్యారు. శిక్షణ పొందిన క్యాడెట్ల నుంచి అరూప్‌రాహ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆరు నెలలుగా వివిధ రంగాల్లో 193 మంది క్యాడెట్లు శిక్షణను పూర్తి చేసుకున్నారు. వీరిలో 41మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. శిక్షణ పొందిన క్యాడెట్లు మార్చ్ఫాస్ట్ను నిర్వహించారు. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన అనిల్‌కుమార్‌ను ‘స్వార్డ్‌ఆఫ్ హానర్’గా గుర్తించి అరూప్‌రాహ ఆయనకు ఖడ్గ ధారణ చేశారు. గ్రౌండ్ డ్యూటీస్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన దుర్గేష్‌కుమార్, నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబర్చిన సతీష్కుమార్లకు అరూప్‌రాహ మెమొంటోలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరూప్‌రాహ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. గత ఆరు నెలలుగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లు దేశం కోసం సేవ చేయాలని పిలుపునిచ్చారు. యువతులు, యువకులు ఈ శిక్షణలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. నిస్వార్థంగా దేశానికి సేవలందించాలన్నారు. అనంతరం చేతక్ హెలిక్యాప్టర్, సుఖోయ్ యుద్ధ విమానాలు చేసిన పలు విన్యాసాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.