
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఆయనకు స్వాగతం పలికారు. ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందన స్వీకరిస్తారు. నగర శివారులోని శివరాంపల్లిలో గల సర్దర్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకడమీలో ఈ కార్యక్రమం జరుగనుంది.
పరేడ్‌లో మొత్తం 92 మంది ఐపీఎస్‌లు, 11 మంది ఫారెన్ ఆఫీసర్లు పాల్గొంటారు. వీరిలో 12 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐపీఎస్ ట్రైనీలు ఉన్నారు. ట్రైనింగ్‌లో ఆల్‌రౌండ ప్రదర్శన కనబర్చిన గోష్ ఆలంను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని బీజేపీ నేతలు అమిత్ షాను కోరుతున్నారు.