రెండంకెల సీట్లతో సత్తా చాటుతాం | We will show our strength with double digit seats says kishan reddy | Sakshi
Sakshi News home page

రెండంకెల సీట్లతో సత్తా చాటుతాం

Published Thu, Mar 28 2024 1:51 AM | Last Updated on Thu, Mar 28 2024 1:51 AM

 We will show our strength with double digit seats says kishan reddy  - Sakshi

ప్రజలు మరోసారి మోదీ పాలన కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనలతో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.

బుధవారం ఆయన సికింద్రాబాద్‌ పార్ల మెంట్‌ పరిధిలోని సనత్‌నగర్‌ నియోజకవర్గం రాంగోపాల్‌పేట, పాన్‌బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కళాసీగూడ, ఓల్డ్‌ బోయిగూడ, నాలాబజార్, మోండా మార్కెట్‌ బస్తీల్లో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచార కా ర్యక్రమం ప్రారంభమైందని, తెలంగాణ లో నిర్వహించిన ఐదు బీజేపీ కార్యక్రమా ల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పోలింగ్‌ బూత్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేడర్‌కు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. భారీ బహిరంగ సభలే కాకుండా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని నిర్ణయించామని వెల్లడించారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మోదీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement