
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. 23వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 9 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 9.40 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లోని రాజస్తాన్ భవన్‌లో బస చేస్తారు. శనివారం ఎన్‌పీఏలో ట్రైనీ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు.