Trainee IPS
-
కృష్ణా: కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్ మ్యారేజ్
సాక్షి, కృష్ణా: కాబోయే కలెక్టర్.. కాబోయే ఎస్పీల వివాహం నిరాడంబరంగా జరిగింది. అదీ రిజిస్టర్ మ్యారేజ్‌గా సింపుల్‌గా దండలు మార్చుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని ఛాంబర్ వీళ్ల వివాహానికి వేదిక అయ్యింది. వీళ్లిద్దరిదీ రాజస్థాన్ కావడం గమనార్హం. ఈ కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. వివాహం తర్వాత కొత్త జంట గుడ్లవల్లేరు వేమవరంలోని శ్రీకొండాలమ్మ ఆలయాన్ని దర్శించారు. ఇదిలా ఉండగా.. దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. -
శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లకు సీఎం జగన్ విషెస్
సాక్షి, తాడేపల్లి: ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు.. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉంది అంటూ ఈ సందర్భంగా ఆయన యువ ఐపీఎస్‌లకు మార్గనిర్ధేశం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో యువ ఐపీఎస్‌లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్ళి, సునీల్ షెరాన్, రాహుల్ మీనా ఉన్నారు. -
11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది..
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్‌కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్‌లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్‌లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.! చదవండి👉: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా? క్రైం నంబరు 173/2011 సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్ శ్రీనివాస్(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్‌కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్ 2011 జూన్ 20న హైదరాబాద్ ఉప్పల్‌లోని ఏఆర్కే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్మెంట్లో హత్యచేశారు. ఫ్రిజ్‌లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు. పక్కావ్యూహంతో.. వలపు వల ♦ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్ ఉరఫ్ శేఖర్(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్‌కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్ సిరిసిల్లు మకాం మర్చాడు. ♦సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు. ♦తమ ఇంటి యజమాని శ్రీనివాస్ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ అపార్ట్మెంట్లో రెండునెలల కోసం ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్ సుజాతతో శ్రీనివాస్‌కు ఫోన్ చేయించి ట్రాప్ చేశారు. ♦2011 జూన్ 20న శ్రీనివాస్‌ను హైదరాబాద్ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్ వెళ్లి అపార్ట్మెంట్లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్ శ్రీనివాస్‌ను బంధించాడు. శ్రీనివాస్ తండ్రి గడ్దాస్ నర్సప్పకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్‌లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు. ♦బంధీగా ఉన్న శ్రీనివాస్ జూన్ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్‌కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు. చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్.. 2017 సెప్టెంబరు 12న శిక్ష శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్‌ఫోన్ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్‌లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలకు చార్జ్‌షీట్ అప్పుడు నేను సిరిసిల్ల టౌన్ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్‌షీట్ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్‌లకు ఇటీవల పాఠంగా బోధించారు. – సర్వర్, ఎస్బీ, సీఐ, సిరిసిల్ల -
పట్టుదలే ఐపీఎస్‌ను చేసింది: ప్రతాప్ శివకిషోర్
చిన్నతనంలోనే పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఎలాగైనా సాధించాలని పట్టుదలతో శ్రమించారు. తొలి రెండు ప్రయత్నాల్లో దక్కకున్నా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో ప్రిపేర్ అయి తన ఆశయమైన ఐపీఎస్ సాధించారు కొమ్మిప్రతాప్ శివకిశోర్. శిక్షణలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఈ యువ ఐపీఎస్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కొమ్మి నారాయణ, నిర్మలకు ఉదయ్ ప్రశాంతి, కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సంతానం. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి. వీరు కుమారుడు కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌కు ఐపీఎస్‌పై ఆసక్తి ఉందని తెలుసుకుని చిన్నప్పటి నుంచి చదువులో ప్రోత్సహించారు. శిక్షణలో భాగంగా కొండల్లో తిరుగుతున్న కొమ్మి ప్రతాప్ శివకిశోర్ కసితో చదివి.. ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిశోర్ 1 నుంచి 8 వరకు నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చంచులూరు జెడ్పీ పాఠశాలలో చదివారు. 9, 10 జవహర్ నవోదయ విద్యాలయంలో చదవగా, ఇంటర్మీడియెట్ నారాయణ కాలేజీలో పూర్తి చేశారు. 2015లో ఖరగ్‌పూర్ ఐఐటీలో చేరి ఇంజినీరింగ్ చదివారు. తర్వాత బెంగళూరులోని బాసే సెంట్రల్ ఆర్ట్‌మీ ఇంటెలిజెన్సీలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2016, 2017 సంవత్సరాల్లో రెండు సార్లు సివిల్స్ పరీక్షలు రాశారు. మంచి ర్యాంక్ రాకపోవడంతో 2018లో మరింత కసితో ప్రిపేర్ అయి అనుకున్న లక్ష్యాన్ని సాధించి హైదరాబాద్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అకాడెమీలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పిల్లల ఆసక్తిని గమనించాలి ప్రతి పిల్లవాడికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. దానిని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక ఎమ్మిగనూరు ప్రజలకు పోలీసులపై ఒక రకమైన అభిప్రాయం ఉంది. వారిలో తెలియని ఆ భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. స్టేషన్‌కు వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. -
ఇద్దరు ట్రైనీ ఐపీఎస్‌లకు పాజిటివ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)కి పాకింది. హైదరాబాద్‌లోని అకాడమీలో శిక్షణ పొందుతున్న 72 ఆర్ఆర్ బ్యాచ్‌లో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు కరోనా సోకినట్లు తెలిసింది. ఇటీవల శిక్షణలో భాగంగా ఐపీఎస్‌లు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో 137 మందికి ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఇరువురిని క్వారంటైన్‌కు తరలించారు. -
ఒంగోలు పీఎస్‌లో ట్రైనీ ఐపీఎస్‌కు వింత అనుభవం
-
పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్‌కు చేదు అనుభవం
ఒంగోలు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. సమస్యలు విన్నవించేందుకు పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుడిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడి, అవమానించిన నేరానికి రైటర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు సీఐ సహా మరో ఆరుగురికి జిల్లా ఎస్పీ ఛార్జి మెమోలు జారీ చేశారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వస్తున్న సామాన్య ప్రజలపై పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలని భావించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఓ ట్రైనీ ఐపీఎస్‌ను ఫిర్యాదిదారుగా ఠాణాకు పంపించారు. ట్రైనీ ఐపీఎస్ అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎస్పీకి రాతపూర్వకంగా తెలియజేయడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలకం రేపింది. ఏం జరిగిందంటే.. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ శుక్రవారం ఉదయం సామాన్యులా ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. సివిల్ దుస్తులలో వెళ్ళిన అతనిని స్టేషన్ సిబ్బంది గుర్తించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కొని పారిపోయారంటూ జగదీష్ ఇచ్చిన ఫిర్యాదును రిసెప్షన్లో ఉన్న సిబ్బంది తీసుకోలేదు. దీంతో ఆయన అక్కడ ఉన్న కానిస్టేబుళ్లతో మాట్లాడారు. వారి నుంచి స్పందన లభించలేదు. సీఐగారు వచ్చిన తరువాత రమ్మంటూ పంపించేశారు. దీంతో వెనుదిరిగి వెళ్లిన ఆయన మళ్లీ సాయంత్రం మరలా స్టేషన్‌కు వెళ్లాడు. అయినా నో రెస్పాన్స్. చివరకు ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ ఆయనను రైటర్ వద్దకు పంపారు. రైటర్‌ను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరగా సీఐ వచ్చిన తరువాత విచారించి, చర్యలు చేపడతామన్నారు. తాను అర్జంటుగా గన్నవరం వెళ్లాల్సి ఉందని, కనీసం ఫిర్యాదు చేసినట్లు రశీదు అయినా ఇవ్వాలని కోరారు. దానికి కూడా స్పందించకుండా ఐఎంఈఐ నంబర్లు, ఫోన్ తనవే అన్నట్లుగా రశీదులు తీసుకురావాలంటూ మరో అధికారి సూచించారు. చివరకు వారంతా కలిసి ఫిర్యాదిని ఎస్సై సాంబశివయ్య వద్దకు పంపారు. అక్కడ కూడా ఎటువంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఫిర్యాది తక్షణమే ఎఫ్ఐఆర్ కాపీ కావాలని, కనీసం రశీదు అయినా ఇవ్వాలంటూ గట్టిగా అడగడంతో స్టేషన్ సిబ్బంది ఆయన పట్ల అసభ్యంగా మాట్లాడారు. దీంతో తిరుగుముఖం పట్టిన జగదీష్ తాను తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళితే జరిగిన అవమానాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రైటర్ సస్పెన్షన్.. సీఐ సహా ఐదుగురికి ఛార్జి మెమోలు: తాలూకా పోలీసుస్టేషన్లో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు కావడంతో ఎస్పీ తక్షణమే క్రమశిక్షణా చర్యలకు పూనుకున్నారు. సభ్యత, సంస్కారంలేని మాటలతో ఫిర్యాదిని అవమానపరచడం, దురుసుగా మాట్లాడడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె.సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ పి.ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎంవీ రాజేష్, మహిళా కానిస్టేబుల్ ఎన్.రమ్యకిరణ్మయిలకు పనిష్మెంట్ కింద ఛార్జి మెమోలు జారీ చేశారు. ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదిదారులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవమానకరంగా మాట్లాడినట్లు తమ దృష్టికి వచ్చినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) కొట్టేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ శిక్షణకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ పోలీస్ అకాడమీలను ఆదేశించింది. మహేశ్వర్‌రెడ్డి భార్య ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయ డాన్ని కారణంగా చూపించి ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పుపట్టింది. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేశారని మహేశ్వర్‌రెడ్డి సవాల్ చేసిన పిటిషన్‌ను క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్ల ధర్మాసనం మంగళవారం విచారించి ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్‌లో సహ విద్యార్థిని భావనను మహేశ్వర్‌రెడ్డి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని, ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో విడాకులు ఇస్తారనే భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని పిటిషనర్ న్యాయవాది కె.సుధాకర్‌రెడ్డి వాదించారు. ఐపీఎస్‌కు ఎంపిక అయ్యాక అధికారిక పత్రాల్లో కూడా వివాహం జరిగినట్లుగా రాశారని, భార్య పేరు భావన అనే రాశారని వివరించారు. ముస్సోరి శిక్షణా సంస్థ డైరెక్టర్‌కు ఆమె ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే దానికి మహేశ్వర్‌రెడ్డి జవాబుతో డైరెక్టర్ సంతృప్తిని వ్యక్తపరిచా రంటూ వాటి పత్రాలను నివేదించారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక సస్పెండ్ చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు. బెంగళూరు సగం ఖాళీ అవుతుంది.. ఈ వాదనలపై జస్టిస్ నర్సింహారెడ్డి స్పందిస్తూ.. ‘రికార్డుల్లో మహేశ్వర్‌రెడ్డి తన భార్య భావన అని చెప్పారు. ఆరోపణలకు ఇచ్చిన జవాబుతో ముస్సోరి అకాడమీ డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ ఉంది. దానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరోపణల దశలో ఉండగానే ఏవిధంగా సస్పెండ్ చేస్తారు..’అని ప్రశ్నించారు. బెంగళూరులో అయితే పది ఫ్యామిలీ కోర్టులకు విడాకుల కోసం వచ్చే వారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారేనని, వాళ్లలో చాలామందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, వారందరినీ సస్పెండ్ చేస్తే బెంగళూరు సగం ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. కాపురంలో కలహాలు సహజమని, కౌన్సెలింగ్ సరిగ్గా జరిగితే కాపురాలు నిలబడతాయని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేకమని, తుది ఆదేశాలను బట్టి స్పందిస్తే తప్పులేదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
భార్య ఫిర్యాదు: ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
-
భార్య ఫిర్యాదు: ట్రైనీ ఐపీఎస్‌పై వేటు
సాక్షి, హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ శిక్షణ నుంచి సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డి తనను మోసం చేశాడంటూ భావన బిరుదల గతంలో హోంశాఖతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో పోలీసులు మహేశ్వరరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో భావనకు పరిచయం... ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. ఏడాదిన్నర క్రితం మహేశ్వరరెడ్డి, భావన కీసర రిజిస్ట్రర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే మహేశ్వరరెడ్డి ఐపీఎస్‌గా ఎంపిక అయిన తర్వాత తనను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు, మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని..విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సికింద్రాబాద్‌లో ఒకేచోట ఉన్నాం: భావన
సాక్షి, హైదరాబాద్ : తన భర్తతో పాటు అతడి మిత్రుడు కూడా తనను వేధించినట్లు ట్రైనీ ఐపీఎస్ కొక్కంటి వెంకట మహేశ్వర్‌రెడ్డి భార్య బిరుదుల భావన ఆరోపించారు. తొమ్మిదేళ్ల ప్రేమలో ఎన్నడూ తన కులం పేరు ప్రస్తావించని మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు తక్కువ కులం దానివి అంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేశ్ రెడ్డి మోసం చేశాడని భావన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె మీడియాకు తెలిపారు. ‘కడపకు చెందిన మహేశ్ రెడ్డి, నేను 2009 నుంచి ప్రేమించుకున్నాం. 2018 ఫిబ్రవరిలో మాకు వివాహం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో ఒకే చోట ఉన్నాం. పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు మహేశ్‌ను చెప్పమంటే సెటిలయ్యాక చెప్తా అన్నాడు. తీరా ఐపీఎస్‌గా ఎంపిక అయిన తర్వాత.. ఎక్కువ కట్నం సంబంధం వస్తుందనే కారణంతో మొహం చాటేశాడు. మీది తక్కువ కులం కాబట్టి ఇంట్లో ఒప్పుకోరని చెబుతున్నాడు’అని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మహేశ్ రెడ్డి స్నేహితుడు నాగేందర్ రెడ్డి కూడా తనను వేధించారని భావన అన్నారు. వారిద్దరూ కలిసి తక్కువ కులం అంటూ తనను మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన చెందారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తెలంగాణ డీజీపీ, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వద్దకు వెళితే వారు కూడా సరైన రీతిలో స్పదించలేదని ఆరోపించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఐపీఎస్ హోదాను ప్రదర్శించారని.. కూషాయిగూడ ఏసీపీ శివకుమార్ తమను నీచంగా చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోగా ఇబ్బందులే ఎక్కువగా ఎదురయ్యాయని వాపోయారు. -
ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపుల కేసు
సాక్షి, హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డి తనను మోసం చేశాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డికి తనకు ఏడాది క్రితం వివాహం అయిందని, తాజాగా ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆమె తెలిపారు. క్రమంగా తనపై ఇష్టాన్ని పెంచుకున్న మహేష్.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పినట్లు వెల్లడించారు.ఘీ ఈ క్రమంలో వివాహం చేసుకున్నామని, ఏడాది నుంచి ఒకే దగ్గర ఉంటున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎస్‌గా సెలెక్ట్ అయిన తర్వాత మహేష్‌లో చాలా మార్పు వచ్చిందని, అదనపు కట్నం తీసుకుని వస్తేనే కాపురం చేస్తానని చెప్పినట్లుగా ఆమె తెలిపింది. పోలీసులు తన కుటుంబానికి రక్షణ కల్పించి.. తనకు న్యాయం చేయాలని భావన కోరింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మహేష్ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జవహెర్ నగర్ పోలీసులు తెలిపారు. -
23న రాష్ట్రానికి అమిత్ షా రాక
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. 23వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 9 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 9.40 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లోని రాజస్తాన్ భవన్లో బస చేస్తారు. శనివారం ఎన్పీఏలో ట్రైనీ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు. -
షార్ ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
శ్రీహరికోట : నేషనల్ పోలీస్ ఆకాడమీ హైదరాబాద్‌కు చెందిన 16 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారుల బృందం శుక్రవారం సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)ను సందర్శించారు. ఇన్‌ఛార్జి సీఐ రత్తయ్య, ఎస్సైలు జీ గంగాధరరావు, విజయకుమార్‌లు వారికి స్వాగతం పలికి షార్ లోపలకు తీసుకెళ్లారు. భాస్కర్ అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసి షార్ ఇంజినీర్లు శ్రీహరికోట రేంజ్ గురించి క్షుణ్ణంగా వివరించారు. ఆ తరువాత షార్ సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం షార్ ఇంజినీర్లు 16 మంది అధికారుల బృందాన్ని రెండోగేట్ తరువాత వున్న మిషన్ కంట్రోల్‌సెంటర్, రెండు ఫ్రయోగవేదికలు, ఇక్కడ జరిగే రాకెట్ ప్రయోగాల గురించి తెలుసుకున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలు, సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం శిక్షణలో భాగమని బృందం నాయకుడు అన్నారు. -
'అది నా అదృష్టం.. అమితానందం'
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణిగా సొంత రాష్ట్రానికే సేవలందించే అదృష్టం రావడం అమితానందంగా ఉందని కె.అపూర్వ రావు అన్నారు. ఈనెల 31న పాసింగ్ పరేడ్ అనంతరం రాష్ట్రానికి సేవలందించేందుకు సిద్ధమవుతున్న యువ మహిళా ఐపీఎస్ ‘సాక్షి’తో మాట్లాడారు. ‘దేశానికి సేవలందించేందుకు అత్యంత అద్బుతమైన మార్గం పోలీస్. అందుకే ఎంతో మక్కువతో ఐపీఎస్ అయ్యా. సివిల్ సర్వీస్ 2013 బ్యాచ్‌లో దేశానికి చెందిన 141 మంది శిక్షణ పొందాం. నాతో పాటు రాహుల్ హెగ్డె బి.కె, సునీల్ దత్‌ను తెలంగాణకి కేటాయించారు. ఇలా సొంత రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి సేవలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టినగడ్డకు రుణం తీర్చుకునే అవకాశం ఈ రకంగా వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలకు మేలు చేస్తా’నని తెలిపారు. ప్రజల కష్టాలు తెలుసు... స్వస్థలం హైదరాబాద్‌లోని బేగంబజార్. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న కె.నాగేశ్వరరావు సివిల్ కాంట్రాక్టర్. అమ్మ అరుణ గృహిణి. సోదరిణి కూడా ఉంది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలమే. అయితే నేను చిన్నదాన్ని కావడంతో ఎక్కువ గారాబం చేశారు. ఆడపిల్లలమని ఎక్కడా మాకు నిబంధనలు పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. చదివింది బీటెక్ అయినా...పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానంటే అమ్మనాన్నలు ఎక్కడ అడ్డు చెప్పలేదు. కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా బీటెక్ అయ్యాక ఓ సంవత్సరం పాటు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఐపీఎస్‌కు ట్రై చేశా. తొలి ప్రయత్నంలోనే 596వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికవడం. అది కూడా సొంతగడ్డకు సేవ చేసే భాగ్యం రావడం జీవితంలోనే అత్యంత మధురక్షణాలు. రోజులు మారాయి... పోలీసుశాఖలో మహిళలు ఎక్కువ చేరడానికి అంతగా ఆసక్తి చూపరనేది గతం. ప్రస్తుతం రోజులు మారాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది కూడా. పోలీసుశాఖలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండటం వాస్తవమే... అయినా ఇది బాధాకరం. పోలీసుశాఖలో 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. ప్రస్తుతం మా బ్యాచ్‌లో 141 మంది 26 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతంతో పోల్చితే ఎక్కువే. ఇది మునుముందు మరింత పెరగాలని ఆశిస్తున్నా. ఇక నా విషయానికొస్తే ఐపీఎస్ అవుతానంటే కుటుంబసభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా అమ్మానాన్నలు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వారి సహకారం వల్లే తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించగలిగా. ట్రైనింగ్‌లో ఎంతో నేర్చుకున్నా.. ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు సంబంధించి మొదట్లో కాస్త కంగారుపడ్డాను. కానీ నేను ఎంతో అభిమానించిన వృత్తి కావడంతో శిక్షణలో ప్రతి రోజూ నూతనొత్సాహంతో నేర్చుకున్నా. ఈ పోలీస్ అకాడమిలో శిక్షణ ఓ అద్బుత అనుభవాన్నిచ్చింది. నేను వృత్తిలో పలు సవాళ్లను ఎదుర్కోగల ధైర్యాన్నివ్వడంతో పాటు పోలీసింగ్‌పై ఎన్నో అంశాలపై అవగాహన కలిగింది. తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు వెళ్లినప్పుడు శాంతిభద్రతలను డీల్ చేసే విధానం, నాసిక్ కుంభమేళాలో రద్దీని అదుపు చేసే విధానం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చాయి. ఇప్పటి దాకా కేవలం వ్యక్తుల్ని లక్ష్యం చేసుకున్న నేరాలను మాత్రమే చూశాం. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు సమాజంపై పెను ప్రభావాల్ని చూపుతున్నాయి. వెబ్సైట్లు ఎలా హాక్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అకృత్యాలను నివారించేందుకు ఓ కామన్ సాప్ట్వేర్ ఉండాలన్నది నా నిశ్చితాభిప్రాయం. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు దేశ వ్యాప్తంగా అడ్డుకట్ట వేయగలం. ఇక నిఫుణులు ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ వంటి వారు ఇచ్చిన ప్రత్యేక తరగతులు మాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. ఎన్నో సామాజిక అంశాలను తెలుసుకోగలిగాము. వారిచ్చిన స్ఫూర్తితో పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా. -
ట్రైనీ ఐపీఎస్‌లకు స్వైన్‌ఫ్లూ: కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)లో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఆరోగ్యకర వాతావరణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలోని ఐపీఎస్ ట్రైనీలకు స్వైన్‌ఫ్లూ సోకడంపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. సకల సదుపాయాలతో అకాడమీ నిర్వహిస్తున్నప్పటికీ ట్రైనీ ఐపీఎస్‌లు అకాడమీ నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించడంపై హోం శాఖ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిి సంది. అకాడమీలో స్వైన్‌ఫ్లూ ప్రబలిన విషయం తెలుసుకున్న ఐపీఎస్ శిక్షణార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 9 మంది శిక్షణార్థులు స్వైన్‌ఫ్లూ బారినపడడానికి దారి తీసిన కారణాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. అకాడమీలోని పరిస్థితులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ఓ బృందం త్వరలో అకాడమీకి రానున్నట్లు తెలిసింది. బయటి నుంచే వైరస్ అటాక్: సువిశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలో ఆరోగ్యకర వాతావరణం ఉందని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు తేల్చారు. బయటి ప్రాంతం నుంచే హెచ్1ఎన్1 వైరస్ అకాడమీలోకి వ్యాపించిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. తిరుపతి ఉప ఎన్నికల పరిశీలన కోసం అక్కడికి వెళ్లి తిరిగి వచ్చాకే ట్రైనీ ఐపీఎస్‌లు అస్వస్థతకు గురయ్యారని అకాడమీ అధికారులు తెలిపారు. వైరస్ సోకిన 9 మంది అకాడమీ వసతి భవనంలోని ఒకే బ్లాక్‌లో బస చేసేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా, వీరిలో ఆరు మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందుకోసం గురువారం రాజేంద్రనగర్ పోలీసులను సీబీఐ విచారిస్తోంది. కేసుకు సంబందించిన అన్ని విషయాలను సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. గత ఏడాది ఆగష్టు లో నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్‌లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కొడుకును హత్య చేశారని మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ అప్పట్లో ఆరోపించారు. తన కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని మానవ్ తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు. ఈనెల 6 తేదీన మానవ్ మృతిపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం సీబీఐ ను ఆదేశించింది. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. ఆకాడమీలో శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై సీబీఐ విచారణ
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గత ఏడాది నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్‌లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్‌లో తోటి ట్రైనీల విందులో మద్యం సేవించి, అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడంతో మనూ ముక్త్ మానవ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. కాగా శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి మృతి చెందారు. దాంతో మానవ్ తల్లిదండ్రులు.. తమ కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతి
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఓ ఐపీఎస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తోటి ట్రైనీల విందులో మద్యం సేవించి, అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడంతో ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం అర్థ్ధరాత్రి చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. వీరి బ్యాచ్‌లో ఉన్న 146 మంది గత ఏడాది నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి వీరంతా కలిసి అక్కడే ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి మృతి చెందారు. ఇతని వెంటే ఉన్న మరో ఇద్దరు ఈ విషయాన్ని పసిగట్టే లోపే ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో తోటి ఐపీఎస్‌లు మానవ్‌ను హుటాహుటిన అదేరాత్రి కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తేల్చారు. ఈ మేరకు యన్‌పీఏ ఎస్ఐ షేక్ అబ్దుల్ సమద్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు మానవ్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో వారు శుక్రవారం నగరానికి చేరుకుని బోరున విలపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుం బ సభ్యులకు అప్పగించారు. హర్యానాలోని స్వగ్రామంలో మానవ్ అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనతో ఎన్పీఏలో విషాదఛాయలు అలుముకున్నాయి. మందుపార్టీ ఎవరు ఇచ్చారు.. ఎవరెవరు పాల్గొన్నారు.. మానవ్ స్విమ్మింగ్‌పూల్‌లోకి ఎలా వచ్చారు.. వెంట ఎవరున్నారు.. తదితర విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై అనుమానాలు
శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి పోలీసు అకాడమీలో మరణించడం సంచలనం కలిగిస్తోంది. అకాడమీలోని స్విమ్మింగ్ పూల్‌లో అర్ధరాత్రి పడి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదమేనా.. మరేమైనా జరిగిందా.. అసలు పోలీసు అకాడమీలో ఏం జరిగిందనే విషయాలన్నీ సస్పెన్స్‌గానే ఉన్నాయి. హిమచల్ ప్రదేశ్‌కు చెందిన మనోముత్తు మానవ్ 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. అకాడమీలోని స్విమింగ్‌పుల్‌లో పడి గాయపడడంతో సహచరులు బంజారాహిల్స్‌లోని కేర్ అసుప్రతికి తీసుకొస్తుండగా మర్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహన్ని కేర్ లోని మార్చురీలో భద్రపరిచి హిమాచల్ ప్రదేశ్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే, ఐపీఏస్ అధికారి మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అకాడమీలో ఏం జరిగింది ? నిజంగానే స్విమ్మింగ్ పూల్‌లో ప్రమదవశాత్తు పడి మృతి చెందాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ఇంకేమైనా జరిగిందా? మరో రెండు నెలల్లో దేశానికి సేవలు అందించాల్సిన ఐపీఎస్ మృతి చెందడంపై పలువురు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లలో కొంతమంది ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో వారంతా అకాడమీలోవిందు ఇచ్చారు. ఈ విందులో మద్యం సేవించడం అనేది వివాదస్పదమవుతోంది. -
ఐపీఎస్ మృతి పై పలు అనుమానాలు
-
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.