హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం
Published Fri, Aug 29 2014 8:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement