Shivarampally
-
శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు
సాక్షి, రంగారెడ్డి : శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లలోని ఫర్నీచర్, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే సమీపంలో ఉన్న కాటేదాన్ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది. పేలుడు శబ్దం విని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా రసాయన పదార్థం వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమి జరగలేదని పోలీసులు చెప్పారు. -
హైదరాబాద్ శివరాంపల్లిలో పేలుడు
అత్తాపూర్ : టిఫిన్‌బాక్స్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించి చెత్త ఏరుకునే ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ బాక్స్‌లో ఆర్గానిక్ కెమికల్ రసాయనం ఉండటం వల్లే ఈ పేలుడు సంభ వించిందని పోలీసులు అనుమాని స్తున్నారు. హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఆదివారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు శివరాంపల్లికి చెందిన సయ్యద్ ఖాజా ఫరు ద్దీన్ కుమారుడు సయ్యద్ ఖాజా అలీయుద్దీన్(40)గా పోలీసులు గుర్తిం చారు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్ సమీపంలో ఉన్న ఫుట్ పాత్ పక్కనే అలీ ఎప్పటిలాగే ఉద యం పూట చెత్త ఏరుకుంటు న్నాడు. అయితే, అప్పటికే తన చెత్త బ్యాగ్‌లో ఆ బాక్స్‌ను తీసుకొచ్చాడో, లేదంటే ఆ ఫుట్‌పాత్ పక్కనే అది ఉందో తెలియదు కానీ దానిని బలవంతంగా తెరుస్తుండగా భారీ శబ్దంతో పేలింది. పేలుడు ధాటికి అతడి రెండుచేతులు తెగిపడ్డాయి. ఆ పక్కనే ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు కూడా ఎగిరిపడటంతో అటువైపుగా వచ్చిన వాహనదారులు భయపడి పరుగులు తీశారు. భయాందోళన చెందిన స్థానికులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. రక్తమడుగులో ఉన్న ఆలీని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ ఘటనాస్థలాన్ని క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయి. అక్కడ సేకరించిన రసాయన పదార్థాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. కాగా, ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న పెయింట్ పరిశ్రమలకు సంబంధించిన ఆ బాక్స్ పడేసి ఉండగా అతడు దానినితీసుకువచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాక్స్ మూతను మామూలుగా తొలగిస్తే ప్రమాదమేమీ ఉండదని, పగలగొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో పేలేందుకు అవకాశముందని అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీల పరిశీలన... ఈ పేలుడుకు కారణమైన టిఫిన్‌బాక్స్‌ను అలీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని తెలుసుకునేందుకు, అతడు ఎక్కడెక్కడ తిరిగాడో కదలికలను గుర్తించేందుకు రోడ్ల వెంబడి ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడే నిర్మాణంలో ఉన్న కాలువలోనూ తనిఖీలు చేశారు. ఎక్కువగా వీవీఐపీలు తిరిగే మార్గం కావడం , శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గం కావడంతో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి పరిశీలించి ఇది బాంబు పేలుడు కాదని, ప్రజలు భయపడొద్దని సూచించారు. మృతుడు ఆలీ 20 ఏళ్లుగా చెత్త ఏరుకుంటూ అవి అమ్మగా వచ్చిన డబ్బుతో బతుకీడుస్తున్నాడు. శివరాంపల్లిలోనే ఉంటూ అప్పుడప్పుడూ ఆలయాల్లో భిక్షాటన చేసేవాడు. రాత్రిళ్లు ఫుట్‌పాత్‌లపైనే నిద్రించేవాడు. విచారణ ప్రారంభం: కమిషనర్ పేలుడు జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. సంఘటన వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆయనకు వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రాథమికంగా విచారణ ప్రారంభమైందని వెల్లడించారు. తీవ్ర భయాందోళన ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. పేలుడు జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే బస్టాప్ ఉంది. అక్కడ నిత్యం వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో తక్కువ మంది ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. -
డ్రగ్స్ ఓవర్ డోస్.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడంతో పండు అనే యువకుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చెందిన శివ కుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పండు(19) కొత్తపేట్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యలో మానేసి తన తండ్రికి చెందిన వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటైన పండు, శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ మాత్రలు తీసుకుని, ఓవర్ డోస్ అవ్వడంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘విజయా’వారి మాయాబజార్
లీటరు అంటే 755 గ్రాములే! తక్కువ తూకం ప్యాకెట్లను విక్రయిస్తున్న అధికారులు మిగుల్చుకున్న నూనెలను అక్రమంగా అమ్ముకుంటున్న వైనం ఏటా రూ. కోట్లలో అక్రమ సంపాదన.. ఉన్నతాధికారులకూ వాటా! సాక్షి, హైదరాబాద్ ఆయిల్‌ఫెడ్‌లో ఆయిల్ దందా ఏరులై పారుతోంది. వినియోగదారులను మోసగిస్తూ ఇష్టారాజ్యంగా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్ శివారులోని శివరాంపల్లి ఆయిల్ ప్యాకింగ్ యూనిట్లో కల్తీ వ్యవహారం వెలుగుచూడగా, తాజాగా తక్కువ తూకం ఉన్న ప్యాకెట్లను వినియోగదారులకు అంటగట్టడంపై విమర్శలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ గతంలో అనేకసార్లు కేసులు పెట్టి జరిమానాలు విధించినా దందాను ఏమాత్రం ఆపడంలేదు. ఓవైపు సంస్థ నుంచి జరిమానాలు చెల్లిస్తూ.. మరోవైపు ఇష్టారాజ్యంగా తక్కువ తూకం ప్యాకెట్లను వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ప్యాక్ చేసినవి కావడంతో వినియోగదారులు వాటిని కొలిచి తీసుకోరు. దీన్నే కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. మిగుల్చుకున్న నూనెలను అక్రమంగా అమ్ముకుంటూ నెలకు రూ.లక్షల్లో దందా చేస్తున్నారు. అందులో ఒకటీరెండు వాటాలు ఉన్నతాధికారులకు వెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. కిలోకు 150 గ్రాములు తక్కువ.. విజయ నూనెపై ప్రజల్లో నమ్మకముంది. ప్రభుత్వ సంస్థ ద్వారా విక్రయిస్తున్నందున ప్రజలు గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ వారి నమ్మకాన్ని సంస్థలో కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ నెలకు 2,600 టన్నుల విజయ నూనెలను విక్రయిస్తుంటుంది. అందులో వెయ్యి టన్నులు పామాయిల్, వెయ్యి టన్నులు పొద్దు తిరుగుడు, 500 టన్నులు వేరుశనగ, 100 టన్నుల రైస్‌బ్రాన్ నూనెలు అమ్ముతుంది. వీటిలో 1,100 టన్నుల నూనెలను కృష్ణపట్నంలో, 1,500 టన్నులు శివరాంపల్లి వద్ద ప్యాకింగ్ చేస్తున్నారు. వినియోగదారుల కోసం 15 లీటర్లలో, 15 కేజీల్లో వేర్వేరుగా డబ్బాల్లో విక్రయిస్తున్నారు. ఇక వాస్తవానికి లీటర్ ప్యాకెట్లలో 915–920 గ్రాములతో నూనె విక్రయిస్తున్నారు. అయితే లీటర్ ప్యాకెట్లలో కేవలం 755 గ్రాములే ప్యాకింగ్ చేస్తున్నట్లు ఇటీవల ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఫిర్యాదులందాయి. డబ్బాల్లో విక్రయించే నూనెలోనూ తక్కువ తూకమే ఉంటున్నట్లు సమాచారం. శివరాంపల్లిలోనే.. ముఖ్యంగా శివరాంపల్లిలో ప్యాకింగ్ అవుతున్న వాటిలోనే తక్కువ తూకం ఉంటున్నట్లు తేలింది. ఆ సంస్థ వివిధ రకాల నూనెలు నెలకు 2,600 టన్నులు విక్రయిస్తుండగా, తక్కువ తూకంతో దాదాపు 150 టన్నుల వరకు కొందరు అధికారులు మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో కేసులు నమోదైనా అధికారుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయిల్‌ఫెడ్ మాజీ ఉద్యోగి, ఆ సంస్థ యూనియన్ మాజీ నాయకుడు నర్సింహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కేసులు పెడితే సంస్థ తరఫున డబ్బులు చెల్లించి మళ్లీ దందా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాటాలు ఉన్నతాధికారులకూ చేరుతున్నాయని ఆరోపించారు. ఫిర్యాదులు అందలేదు: రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ విజయ నూనెలు తక్కువ తూకంతో ప్యాకింగ్ అవుతున్నట్లు తమకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయిల్‌ఫెడ్ విజయ నూనెల మార్కెటింగ్ మేనేజర్ రాజేశం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లీటరు ప్యాకెట్లో 915–920 గ్రాములు ఉంటుందని తెలిపారు. -
శివరాంపల్లిలో చెరువుకు గండి
-
కుర్రాడిని చితక బాదిన అల్లరిమూక
-
ట్రైనీ ఐపీఎస్ మృతిపై అనుమానాలు
శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి పోలీసు అకాడమీలో మరణించడం సంచలనం కలిగిస్తోంది. అకాడమీలోని స్విమ్మింగ్ పూల్‌లో అర్ధరాత్రి పడి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదమేనా.. మరేమైనా జరిగిందా.. అసలు పోలీసు అకాడమీలో ఏం జరిగిందనే విషయాలన్నీ సస్పెన్స్‌గానే ఉన్నాయి. హిమచల్ ప్రదేశ్‌కు చెందిన మనోముత్తు మానవ్ 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. అకాడమీలోని స్విమింగ్‌పుల్‌లో పడి గాయపడడంతో సహచరులు బంజారాహిల్స్‌లోని కేర్ అసుప్రతికి తీసుకొస్తుండగా మర్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహన్ని కేర్ లోని మార్చురీలో భద్రపరిచి హిమాచల్ ప్రదేశ్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే, ఐపీఏస్ అధికారి మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అకాడమీలో ఏం జరిగింది ? నిజంగానే స్విమ్మింగ్ పూల్‌లో ప్రమదవశాత్తు పడి మృతి చెందాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ఇంకేమైనా జరిగిందా? మరో రెండు నెలల్లో దేశానికి సేవలు అందించాల్సిన ఐపీఎస్ మృతి చెందడంపై పలువురు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లలో కొంతమంది ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో వారంతా అకాడమీలోవిందు ఇచ్చారు. ఈ విందులో మద్యం సేవించడం అనేది వివాదస్పదమవుతోంది. -
ఐపీఎస్ మృతి పై పలు అనుమానాలు
-
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.