
సాక్షి, హైదరాబాద్ : డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడంతో పండు అనే యువకుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చెందిన శివ కుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పండు(19) కొత్తపేట్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యలో మానేసి తన తండ్రికి చెందిన వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు.
గత కొంతకాలంగా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటైన పండు, శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ మాత్రలు తీసుకుని, ఓవర్ డోస్ అవ్వడంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment