drug addiction
-
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు
-
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే
వాషింగ్టన్: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన అమాయకురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాలోని ఒహాయోకు చెందిన 63 ఏళ్ల సాండ్రా హెమ్మీ కథ ఇది. మిస్సోరీలో 1980లో ఓ లైబ్రరీ వర్కర్‌ను కత్తితో పొడిచి చంపిందని సాండ్రాను అరెస్ట్ చేశారు. లాయర్‌తో వాదించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మానసిక చికిత్సకు అధిక మోతాదులో తీసుకున్న ఔషధాల మత్తులో ఆమె చెప్పిన నేరాంగీకార వాంగ్మూలాన్నే పోలీసులు కోర్టుకు సమరి్పంచారు. దాంతో ఆమెకు జీవితఖైదు విధించారు. కానీ అసలు హంతకుడు మైఖేల్ హోల్మ్యాన్ అనే పోలీసు అధికారి. ఈ విషయాన్ని సాండ్రా లాయర్లు ఆధారసహితంగా తాజాగా కోర్టులో నిరూపించారు. దాంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. కూతురు, మనవరాలిని హత్తుకుని బోరున విలపించారు. అమెరికా చరిత్రలో చేయని నేరానికి అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళగా సాండ్రా పేరు నిలిచిపోనుంది. -
కోర్టుకు నార్సింగ్ డ్రగ్స్ కేసు నిందితులు..
సాక్షి,హైదరాబాద్ : నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను తెలంగాణ పోలీసులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. సోమవారం హైదర్షాకోట్లో డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్, అమన్ తోపాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్‌లు ఉన్నారు. అరెస్ట్ అయిన పెడ్లర్లలో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీలు ఉన్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. -
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్‌ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్‌ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్‌ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్రగ్స్ వాడటం వన్ వే
డ్రగ్స్ వాడటం అనేది వన్‌వే లాంటిది. ఒక్కసారి ఆ దారిలోకి వెళ్లి వాటికి బానిసలుగా మారితే తిరిగి వెనక్కి రావడం అనేది చాలా కష్టం’ అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను నిరోధించడానికే ‘ఎవిడెన్స్ ఈజ్ క్లియర్.. ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్’ (డ్రగ్స్ వాడటంపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. నిరోధంపై దృష్టి పెట్టండి) అనే థీమ్‌తో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సచిన్ గోర్పడే గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్ఇతర దేశాల ఏజెన్సీలతోనూ సమన్వయంఎన్సీబీ కేవలం డ్రగ్స్ నిరోధం కోసమే కాకుండా వీటి విని యోగానికి వ్యతిరేకంగా అవ గాహన కల్పించడానికి కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 26 ఎన్సీబీ జోనల్ కార్యాల యాలు ఉన్నా యి. మాదక ద్రవ్యాలు అనేవి మన దగ్గర వరకు వచ్చేశాయి. అనేక మంది విద్యా ర్థులు, కుటుంబాలు, ప్రము ఖులు సైతం వీటి ప్రభావంలో ఉన్నారు. ఈ నేప థ్యంలోనే డ్రగ్ నెట్ వర్క్స్‌పై నిఘా ఉంచు తున్నాం. దీనికోసం ఇతర దేశాలకు చెందిన ఏజెన్సీల తోనూ సమన్వ యం చేసుకొని పని చేస్తున్నాం. ఆయాదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌కు సంబంధించిన వివ రాలు తెలుసుకొని కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అమెరికా టు అమెరికా వయా హైదరాబాద్ ⇒ ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేసిన అక్కడ ఏజెన్సీలు రెండు రకాలైన డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఇలా జరిగినట్టు తేల్చాయి. ఆ మాదకద్రవ్యా లను సరఫరా చేసింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి సమాచారం ఇచ్చాయి. వెంటనే అప్రమత్తమై దాడి చేసి అతడిని పట్టుకున్నాం. భారీమొత్తం నగదుతో పాటు డ్రగ్స్ సీజ్ చేశాం. ఇతడికి అవి న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తేలడంతో అక్కడి ఏజెన్సీలకు తెలిపాం. వారు కొన్ని అరెస్టులు చేయగా...అసలు మూలం అమెరికాలోని న్యూయార్క్ అని తేలింది. దీంతో అమెరికా ఏజెన్సీలు కీలక సూత్రధారిని పట్టుకున్నాయి. డ్రగ్స్ నెట్వర్క్స్ కార్యకలాపాలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.సాంకేతిక పరిజ్ఞానమే పెనుసవాల్⇒ డ్రగ్స్ మాఫియాలు ఇంటర్నెట్, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ వంటివి వినియోగిస్తుండటం పెద్ద సవాల్‌గా మారింది. అయినా హైదరాబాద్ యూనిట్ సమర్థంగా పనిచేస్తూ గడిచిన రెండేళ్లల్లో 24 భారీ డ్రగ్ నెట్‌వర్క్స్‌ను ఛేదించింది. ఈ కేసుల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎన్సీబీకి చిక్కితే బయట పడటం కష్టమనే భావన వినియోగదారులు, విక్రేతలు, సరఫరా దారులకు ఉంది. బయట నుంచి వచ్చే భారీ డ్రగ్ కన్సైన్మెంట్స్తో పాటు ఇక్కడ తయారయ్యే వాటిపై ఎక్కువ దృష్టి పెడతాం. ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ దానికి అనుబంధమైన కెమికల్ హబ్‌గానూ మారింది. ఇవే కొన్నిసార్లు పక్కదారి పట్టి ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్, ఎంఫిథిటమీన్ వంటి డ్రగ్స్ తయారవుతున్నాయి. ఇలా తయారు చేసే రెండు ల్యాబ్స్‌పై ఇటీవల దాడులు చేశాం.మార్పులు కనిపిస్తే జాగ్రత్త..ప్రధానంగా 12 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. అలాంటి వారితో మాన్పించడం కూడా పెద్ద సవాలే. వీరి ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఒంటరిగా గడపటం, బాగా చదివేవారు ఒక్కసారిగా డల్ అయిపోవడం, ముభావంగా ఉండటం, ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడటం చేస్తుంటే అనుమానించి అప్రమత్తం కావాలి. డ్రగ్స్ వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతారనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి. హైదరాబాద్‌లో డ్రగ్స్ క్రయవిక్రయాలకు సంబంధించి భారీ గ్యాంగ్స్ లేవు. అన్నిరంగాల్లో ఉన్నట్టే అతి తక్కువ శాతమే సినీరంగంలో డ్రగ్స్ ఉన్నాయి. అయితే దీనిపై అందరూ దృష్టి పెట్టడంతోనే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతోంది.డమ్మీవి పంపి పెడ్లర్స్‌ను పట్టుకున్నాం⇒ డ్రగ్ పెడ్లర్స్‌ను పట్టుకోవడానికి ఎన్సీబీ అనేక రకరకాల ఆపరేషన్లు చేస్తుంది. ఇటీవల ఓ కొరియర్ పార్శిల్‌పై మాకు సమాచారం అందింది. దానిని అడ్డుకొని విప్పి చూడగా అందులో 110 ఎల్ఎస్డీ బోల్ట్స్ దొరికాయి. వీటిని ఎవరు ఆర్డర్ ఇచ్చారో వారిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దీంతో ఆ పార్శిల్లో డమ్మీ బోల్ట్స్ ఉంచి చేరాల్సిన చిరుమానాకు పంపి నిఘా ఉంచాం. దాన్ని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు పెడ్లర్స్‌ని గతవారం అరెస్టు చేశాం. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు వేరుగా ఉండవచ్చు. అయితే డ్రగ్స్‌కు మాత్రం అన్ని పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ ‘సే ఎస్ టు లైఫ్... సే నో టు డ్రగ్స్’ అనేది గుర్తుంచుకోవాలి. దీనిపై పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో భారీ ప్రచారం చేస్తున్నాం. -
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్‌లో గంజాయి పొగ పబ్‌లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్‌లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్‌ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్‌కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్‌గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు. -
మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్ చేసిన బీజేపీ నేత
దేశంలోని కొందరు యువతీయువకులు మత్తుకు బానిసలుగా మారి తమ కెరియర్ను నాశనం చేసుకోవడమే కాకుండా, తల్లిదండ్రులను కష్టాలపాలు చేస్తున్నారు. మత్తుపదార్థాల తీసుకోవడం వలన జరిగే హాని గురించి అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితం కనిపించడంలేదు. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మద్యం మత్తులో రాత్రివేళ రోడ్డుపై జోగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో అమృత్‌సర్‌లోని మోహక్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో మత్తుమందులను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను నివారించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మంజీందర్ సింగ్ షేర్ చేసిన వీడియోలో రాత్రివేళ రోడ్డుపై ఒక యువతి మద్యం మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేక పోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రాష్ట్రాన్ని మత్తుమందుల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మాటనే విస్మరించిందని సుజీందర్ సింగ్ ఆరోపించారు. This late night video of Amritsar of a young girl high under Drugs shows the failure of @AAPPunjab Govt! What have you done to Punjab, CM @bhagwantmann Ji?You came to power promising elimination of drugs in 3 months but now your own party people are involved in this!Drug… pic.twitter.com/QdIADuRsZS— Manjinder Singh Sirsa (@mssirsa) June 24, 2024 -
ఇష్టారాజ్యంగా మందులు వాడొద్దు.. మీరు వాడే మందులే మీకు చేటు చేస్తున్నాయి (ఫొటోలు)
-
ఆ డ్రగ్‌తో ఎదుటివాళ్ల మైండ్‌ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!
మత్తుమందులకు బానిసై రోజంతో మత్తులో జోగుతుండే వ్యక్తులు గురించి విన్నాం. వారిని ఆ వ్యసనం నుంచి బయపడేసేందుకు నానాయాతన పడుతుంటారు సంబంధికులు. అందుకోసం డీ అడిక్షన్ సెంటర్లు కూడా వచ్చేశాయి. అయితే ఈ మత్తు మందులన్నీ వాళ్లంతటా వాళ్లు వొళ్లు తెలియకుండా ఊహ ప్రపంచంలో విహరించేందుకు వాడుతుంటారు కానీ ఈ కొత్త రకం డ్రగ్ మాత్రం ఏకంగా అవతలి వాళ్ల మైండ్‌ని కంట్రోల్ చేస్తుందట. కొందరూ దుండగలు ఈ డ్రగ్‌తో అమాయక ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతకీ ఏంటి కొత్త రకం డ్రగ్. ఎలా అవతల వాళ్ల మైండ్‌ని కంట్రోల్ చేయగలరు?ఈ డ్రగ్ పేరు స్కోపోలమైన అనే సింథటిక్ డ్రగ్. దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. వికారం, నిలకడలేనితనం, కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాల్లోనూ దీన్ని కలుపుతారు. అయితే ఇది సహజంగా లభించేది కాదు. కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్‌ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఉమ్మెత్త పువ్వు నుంచి తయారు చేస్తారు. ఒకప్పుడు పిచ్చొళ్లను చేసేందుకు..ఒకప్పుడు దేశంలో, ప్రజల్నిపిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు. అందులో నుంచి కొంత భాగాన్ని తీసి దాన్ని ఉపయోగించి స్కోపోలమైన్ సింథటిక్ డ్రగ్‌గా తయారు చేస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్ గ్యాంగులు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేసినట్లు నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వెల్లడించారు.ఎలా పని చేస్తుందంటే..రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపోలమైన్ డ్రగ్ ఉపయోగించినట్లు ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం. ఆ సమయంలో దీన్ని ద్రవ రూపంలో ఇంజక్షన్‌గా ఇచ్చేవారు. స్కోపోలమైన్‌ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నామని బంగబంధు షేక్ ముజిబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదుర్ రహమాన్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపోలమైన్‌ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు. ఈ డ్రగ్‌ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు. ఎవరితోనైనా నిజాలు మాట్లాడించడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పౌడర్‌ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది. అలాగే దీన్ని వికారం, ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధం లాగా పని చేస్తుందని రహమాన్ వివరించారు.నేరాలలో ఎక్కువగామోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్‌ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్‌ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక. ఈ పౌడర్‌ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద, అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచి ప్రయోగించినా.. అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది. దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు. ఇక్కడ ఈ డ్రగ్‌ని పీల్చిన పది నిముషాల నుంచి సదరు వ్యక్తి మీద ప్రభావం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది. మళ్లీ మాములు కావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది.(చదవండి: ఓటర్లకు స్ఫూర్తి ఆ వృద్ధ మహిళలు..! ఆ ఏజ్‌లోనూ..) -
లాఫింగ్ గ్యాస్ ఇంత డేంజరా..! దీన్ని డ్రగ్‌లా..!
లాఫింగ్ గ్యాస్ గురించి వినే ఉంటారు. సై మూవీలో హీరో నితిన్ జెనీలియాని ఆటపట్టిస్తుండటంతో కోపంతో అతడిపైకి వస్తుంది. దీంతో నితిన్ ఈ గ్యాస్‌ని వదలడం జరుగుతుంది. దీంతో ఆమె తెగ నవ్వుతూనే ఉంటుంది. ఇదేంటీ కోపం రావడం లేదేంటీ నాకు నవ్వు వస్తోందంటూ కింద పడిపోతుంది. దీన్ని పీలిస్తే నవ్వు వస్తుందా? అంటే.. రాదుగాని ఉల్లాసభరితంగా అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మాదకద్రవ్యాల మాదిరి మత్తుని కలిగిస్తుంది. అలాంటి ఈ లాఫింగ్ గ్యాస్‌ని డబ్బాల కొద్ది పీల్చింది ఓ విద్యార్థి. దీంతో ఆమె.. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఎల్లెన్ మెర్సస్ గతేడాది ఫిబ్రవరి 9న తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి హుటాహుటినా తీసుకువెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు ఆమె చనిపోవడానకి గల కారణాలను దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యులు ఆమె నైట్రస్ ఆక్సైడ్(లాఫింగ్ గ్యాస) పీల్చడం వల్లే చనిపోయిందన్నారు. దీంతో ఆమె ఆస్పత్రికి వచ్చేటప్పుడూ.. పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ చేయగా..అబులెన్స్‌లో ఉన్న మెడికల్ టెక్నీషియన్ మైకేలా కిర్ట్లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను ఎమర్జెన్సీ అని పిలుపు రావడంతో మెర్సర్ ఇంటికి వెళ్లామని అక్కడ ఆమె బెడ్ రూంలో స్ప్రుహలోనే ఉందని, కాకపోతే గుండె స్పందనలు అసాధారణంగా ఉన్నాయన్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ కాల్ చేయడంతో తాము వచ్చామని చెప్పారు. ఆమె నైట్రస్ఆ క్సైడ్ పీల్చుతోందని ఆ బాటిల్స్ తనకు చూపించడాని అన్నారు. ఈ తాగే క్రమంలోనే నైట్రస్ ఆక్సైడ్ ఆమె కాళ్లపై పడటంతో గాయలయ్యాయని, దీంతో రెండు వారాల నుంచి బాత్రూంకి వెళ్లడానికి ఇబ్బందిపడి మానేసిందని చెప్పుకొచ్చినట్లు తెలిపారు. ఇక విచారణలో మెర్సర్ బాయ్‌ఫ్రెండ్ ఆమె 600 గ్రాములు ఉండే నెట్రస్ ఆక్సైడ్‌ని రోజుకి మూడు బాటిల్స్ చొప్పున తాగేదని, ఇటీవల తగ్గించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలా నైట్రస్గ్యాస్ని వినియోగించడం చట్ట విరుద్ధం. కానీ పోలీసు ఆ వేలో కేసు నమోదు చేయపోవడం గమనార్హం. ఈ ఘటన అనంతరం యూకే ప్రభుత్వం నవంబర్ 2023లో దీని వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే గాక క్లాస్ సీ డ్రగ్‌గా వర్గీకరించింది. దీన్ని మత్తురాయళ్లు మంచి కిక్ ఇచ్చే డ్రగ్ మాదిరిగా వాడి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారని పేర్కొంది. నిజానికి ఇది అంత ప్రమాదకరమైంది కాదు. వైద్యపరమైన విధానంలో నొప్పి తగ్గించేందుకు, దంత శస్త్ర చికిత్సలోనూ మత్తు ఇవ్వడం కోసం వాడటం జరుగుతుంది. దీన్ని అదే పనిగా పీల్చడం మొదలు పెడితే మాత్రం నాడి సంబంధ సమస్యలు ఉత్ఫన్నమయ్యి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
డ్రగ్స్‌తో పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి!
రంగారెడ్డి: హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్సింగిలో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్‌తో ఓ యువతి.. మరో వ్యక్తి పట్టుబడ్డారు. వాళ్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువహీరో ప్రేయసిగా తేలింది. ఎస్ఓటీ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగీలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్వోటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతియువకుడి దగ్గరనుంచి 4 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో ప్రేయసి గుర్తించారు. షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు దక్కించుకుని వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నాడు ఆ యువ హీరో. మొన్న సంక్రాంతికి ఓ అగ్రహీరో చిత్రంలోనూ ఆ హీరో చిత్రంలోనూ ఆ యంగ్ హీరో నటించాడని పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ విధింపు సదరు యువతి మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ‘దృశ్యం’ తరహాలో హత్య! -
వ్యసనాల నుంచి వెలుగులోకి
పట్నాలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న రాఖీ శర్మ ఆ ఉద్యోగాన్ని వదిలేసి భర్త నడుపుతున్న రీహాబిలిటేషన్ సెంటర్‌ను తను స్వయంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 5 వేల మంది ఇరవై ఏళ్ల లోపు పిల్లలను డ్రగ్స్ బారి నుంచి విముక్తి పొందేలా చేసింది. ఖైదీలలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్స్ ఇస్తోంది. మహిళలు వ్యసనానికి ఎలా లోనవుతున్నారు, వారు ఆ వ్యసనాల నుంచి బయట పడటం ఎలా అనే అంశంపై పని చేస్తున్నాను’ అని వివరిస్తోంది రాఖీ. వ్యసనాలకు గురైన వారు వాటినుంచి బయటపడి తిరిగి సంతోషకరమైన జీవనాన్ని పొందేందుకు ఆమె చేస్తున్న స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం కీలక అంశాలు. ‘‘ఒకరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. విషయం విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళ బ్లేడ్‌తో ఒళ్లంతా కోసుకుంది. డ్రగ్స్ కారణంగా ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. మత్తు పదార్థాల నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. మహిళలు డీ–అడిక్షన్ సెంటర్లకు వెళ్లడం అనేది ఉందా.. అని నన్ను అడిగారు. మద్యపానం, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడిన వ్యక్తులు తమ అలవాటును వదిలించుకోవడానికి సహాయం చేయడం కూడా ఒక ముఖ్యమైన పని. నా మౌనం–పని ఈ రెండింటితో ఈ సెంటర్‌ను 22 ఏళ్లుగా నడుపుతున్నాను. వేలాదిమందిని మాదకద్రవ్య వ్యసనం బారి నుంచి బయటికి తీసుకువచ్చాను. ఒకప్పుడు తమ జీవితాలు అంధకారంలో ఉండి, అన్ని వైపులా నిరాశకు గురైన వారు ఇప్పుడు వారి కుటుంబాలతో జీవిస్తున్నందుకు సంతోషపడుతున్నాను. ► బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి.. పుట్టి పెరిగింది గురుగ్రామ్. కొన్నాళ్లు ఢిల్లీలోనే ఉన్నాను. జంషెడ్పూర్, కోల్‌కతాలలో చదువుకున్నాను. డాక్టర్ కావాలనుకున్నాను కాని బ్యాంక్ ఉద్యోగి అయిన నాన్న కోరిక మేరకు సీఏ చదివాను. పెళ్లయ్యాక పట్నా వచ్చాను. నేనూ బ్యాంకు ఉద్యోగం సంపాదించుకున్నాను. కానీ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఏకకాలంలో నిర్వహించడం అంత సులభం కాదని కొన్ని రోజుల్లోనే అర్థమయ్యింది. అప్పటికే మా వారు డీ–అడిక్షన్ సెంటర్ నడుపుతున్నారు. కొన్నిరోజులు గమనించిన తర్వాత, బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశాను. నిజానికి డీ–అడిక్షన్ సెంటర్ ఎలా పనిచేస్తుంది, మత్తు పదార్థాల నుంచి వ్యసనపరులను ఎలా బయట పడేయాలో ఏమాత్రం తెలియదు. కానీ క్రమంగా నేర్చుకున్నాను. ► కాల్చివేస్తానని బెదిరింపులు.. బీహార్‌లో డీ–అడిక్షన్ సెంటర్ నడపడం చాలా కష్టం. మాదకద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఎక్కువగా నేర నేపథ్యం ఉన్న వారు వస్తారు. మంచి కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్‌కు బానిసలైతే పరువు పోతుందనే భయంతో వారిని బీహార్ నుంచి వేరే చోటకు పంపేవారు. ఇక ఓల్డ్‌సిటీలో డీ అడిక్షన్ సెంటర్‌కు వచ్చిన వారిని నిలువరించడం పెద్ద సవాలుగా ఉండేది. అలాంటి వాళ్లు మా కేంద్రానికి వచ్చి కొడతామంటూ ఉద్రేకంతో వస్తుంటారు. ఆ సమయంలో వారిపై వారికి అదుపు ఉండదు. వారి అలవాట్లను అడ్డుకుంటే బెదిరింపులు ఉండేవి. ‘బయటకు వెళ్లాక చూడు.. నిన్ను కాల్చేస్తామ’నేవారు. కేంద్రాన్ని మూసివేస్తామని బెదిరింపులు. కానీ నేనేం తప్పు చేయట్లేదు. భయమెందుకు? ► జైలులో డ్రగ్స్ నుంచి మహిళా ఖైదీల వరకు... పట్నాలోని బ్యూర్ జైల్లో ఖైదీల కోసం 10 ఏళ్లపాటు డీ–అడిక్షన్ క్యాంప్ నడిపాను. మహిళాఖైదీలతో ఈ క్యాంప్ స్టార్ట్ అయ్యింది. జైలులో ఓ బాలిక తన బట్టలు చింపుకుని బీభత్సం సృష్టించింది. అప్పుడు నన్ను పిలిచారు. ఆమెను చూడగానే ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని అర్థమైంది. తనకు డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఆమె అలా ప్రవర్తించింది. అప్పుడు ఇక్కడ ఖైదీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో జైలు ఐజీకి నివేదించాను. ఐజీ అభ్యర్థన మేరకు జైలులో మూడు రోజుల పాటు డీ–అడిక్షన్ క్యాంపు నిర్వహించారు. శిబిరంలో 1000 మందికి పైగా ఖైదీలు పాల్గొన్నారు. వందలాది మంది ఖైదీలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు. ► నిషేధం తర్వాత.. ఒక డ్రగ్ మానేస్తే మరో మందు వాడటం మొదలు పెడతారు. బీహార్‌లో మద్య నిషేధం తర్వాత ఈ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు ప్రజలు గంజాయి, ఇతర డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు మద్యం కంటే వారి వ్యసనం నుండి బయటపడటం చాలా కష్టం. నిషేధం కారణంగా, ప్రజలు డీ–అడిక్షన్ సెంటర్లకు రావడం మానేశారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ కోసం 15 ప్రత్యేక పడకలను అందించేందుకు కృషి చేశాం. ఆ తర్వాత ఈ విషయంలో వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చాం. 5 వేల మంది పిల్లలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు. ► మహిళల కోసం.. చాలా మంది మహిళలు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండానే డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేందుకు వస్తుంటారు. మహిళల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. చాలా మంది మహిళలు తమ గుర్తింపును దాచుకుంటారు, కొందరు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇక్కడకు వస్తారు. ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం తెచ్చేవాడు. ఆమె తన బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉంటూ మద్యం సేవించి క్రమంగా దానికి బానిసయ్యింది. పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో ఆమె బిడ్డ చదువుకు దూరమయ్యాడు. దాంతో డీ–అడిక్షన్ సెంటర్‌కి వెళ్లి, కొన్ని సెషన్స్ తర్వాత నార్మల్‌గా మారింది. అదేవిధంగా పట్నాలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్‌కు బానిసైంది. ఆమె ఎంబీఏ చేసింది. తల్లి చైనాలో, సోదరుడు అమెరికాలో ఉన్నారు. ఆమె వైవాహిక జీవితం బాగోలేదు. విడాకుల తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. డీ–అడిక్షన్ సెంటర్‌కు వచ్చేటప్పటికి ఆమె శరీరంపై చాలా కోతలు ఉన్నాయి. బ్లేడుతో తానే కోసుకుని ఆనందించేది. కొన్నినెలల చికిత్స తర్వాత ఆమె సాధారణ స్థితికి వచ్చింది. బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యానికి బానిసయ్యాడు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నాడు. భార్య ప్రోద్బలంతో ఆ ఐఏఎస్ డీ–అడిక్షన్ సెంటర్లో చికిత్స తర్వాత తన వ్యసనాన్ని విడిచిపెట్టాడు. చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లు డీఅడిక్షన్ సెంటర్ కు వచ్చి డ్రగ్స్ అలవాటు నుండి విముక్తి పొందారు.’’ అంటూ తను చేస్తున్న సేవ గురించి వివరించే రాఖీశర్మ ఎందరికో స్ఫూర్తిదాయకం. వీధిబాలలు, అనాథలు, వదిలివేయబడిన పిల్లలు ఎక్కువగా మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారు. అలాంటి పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాం. వీధి బాలల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. 30–35 మంది పిల్లలకు భోజనం, పానీయం, విద్య అన్ని ఏర్పాట్లు ఉన్న చోట ఈ కేంద్రానికి వసతి కల్పించే సామర్థ్యం కల్పించాం. -
పచ్చని సంసారానికి ఆకుపచ్చని ఆర్మీ
పచ్చని సంసారానికి గ్రీన్ ఆర్మీ కావాలి అంటున్నారు వారణాసిలోని కుషియారి గ్రామ వాసులు. ఈగ్రామంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వాళ్లే ఎక్కువ.నిరుపేదలు కావడంతో విద్యాగంధం ఉన్న వాళ్లు తక్కువ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. చాలా కుటుంబాల్లో పెద్దరికం వహించాల్సిన భర్తలు తాగుడు, మత్తుపదార్థాలకు బానిసలై భార్యలను కొట్టడం, తిట్టడం, ఇంట్లో ఖర్చులకు డబ్బులు అడిగితే తన్ని తరిమేయడం సర్వసాధారణమైంది. గత కొన్నేళ్లుగా భర్తల తీరుతో విసిగిపోయిన గ్రామ మహిళలకు రవి మిశ్రా అనే టీచర్ చుక్కానిలా దారిచూపుతున్నాడు. భర్త బాధితురాలైన ఆశాదేవిని కలిసిన మిశ్రా సమస్యలు ఆమె ఒక్కదానికే కాదు, ఆమె ఇరుగు పోరుగు వారి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని తెలుసుకున్నాడు. మీరంతా కలసికట్టుగా ఉంటే ఇవేమీ పెద్ద సమస్యలు కాదని చెప్పి, ఆశాదేవితోపాటు మరికొంతమంది మహిళలను కూడగట్టుకుని 2014లో ‘గ్రీన్‌ఆర్మీ’నిప్రారంభించారు. వ్యసనాలకు బానిసలైన భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి సరైన దారిలో నడిపించడమే ఈ ఆర్మీ ముఖ్య ఉద్దేశ్యం. ఆర్మీలోని సభ్యులు పచ్చని రంగు చీర కట్టుకుని, కర్రలు పట్టుకుని ఎవరైనా ఇంట్లో భర్తలు తాగి గొడవచేస్తుంటే వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొస్తారు. లిక్కర్, మత్తుపదార్థాలకు బానిసలైన వారికి రకరకాలుగా కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనుషులుగా మార్చడానికి కృషిచేస్తోంది. భర్తలతోపాటు.. గ్రామాభివృద్ధికి ప్రస్తుతం ఈ ఆర్మీలో 1800 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్మీ చేస్తోన్న కార్యకలాపాలు చూసిన ఎంతోమంది ఇతర గ్రామాల్లో గులాబీ గ్యాంగ్ వంటి రకరకాల పేర్లతో ఆర్మీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మహిళలు తమను తాము రక్షించుకొనేందుకు ఆత్మరక్షణ విద్యలలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. వారణాసి, మీర్జాపూర్ జిల్లాల్లోని చాలామంది మహిళలు ఈ ఆర్మీ ద్వారా భర్తలను మార్చుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మూర్ఖపు భర్తలను మార్చడంతోపాటు, గృహహింస, వరకట్నం, మూఢాచారాలు నిర్మూలించేందుకు ఆర్మీలు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్మీల వల్ల కుటుంబ పరిస్థితులు మెరుగుపడడమేగాక, గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ‘‘నా పేరు ఆశాదేవి. పద్నాలుగేళ్లకే పెళ్లి అయ్యింది. ఐదుగురు పిల్లలు. నా భర్త ఎప్పుడూ కొట్టేవాడు. గర్భవతినని కూడా చూడకుండా హింసించేవాడు. పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. కానీ ఆయన మాత్రం తాగడం మానలేదు. నన్ను కొట్టడం ఆపలేదు. ఆయన కొట్టిన దెబ్బలకు రాత్రులకు నిద్రపట్టేది కాదు. మూలుగుతూ పడుకున్న నన్ను మళ్లీ మళ్లీ కొట్టేవాడు. చలికాలం ఇంటి బయటకు నెట్టేసేవాడు. బాధలు తట్టుకోలేక చచ్చిపోదామని నిప్పు అంటించుకున్నాను.కానీ వేరేవాళ్లు కాపాడడంతోప్రాణాలు రవి మిశ్రా హోప్ వెల్ఫేర్ ట్రస్ట్వాళ్లతో కలసి మా గ్రామానికి వచ్చారు. అప్పుడు నా పరిస్థితి, పిల్లలు స్కూలుకు కూడా వెళ్లడంలేదని తెలుసుకున్నారు. నేను నా బాధల గురించి వివరించాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ఆయన తాగడం మానేశాడు. ఎనిమిదేళ్లుగా మంచి వ్యక్తిగా మారి, నన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. ఆ తరువాతే నాలాంటి మహిళలను ఆదుకునేందుకు మిశ్రా తో కలిసి గ్రీన్ ఆర్మీని ఏర్పాటు చేశాము.’’ ఆశా దేవి లాంటి వందలమంది మహిళలు గ్రీన్ ఆర్మీ ద్వారా సంసారాలను చక్కబెట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. -
కేటీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్
సాక్షి, కరీంనగర్: మంత్రి కేటీఆర్ సవాల్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ వేశారు. తాము సవాల్ చేసింది ఎప్పుడు? మీరు స్పందించింది ఎప్పుడని ప్రశ్నించారు. దొంగలుపడ్డ ఆరు నెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకని మండిపడ్డారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు దొరకననే ధీమాతోనే కేటీఆర్ స్పందించారని విమర్శించారు. డ్రగ్స్ కోసం తన రక్తం, కిడ్నీ కూడా ఇస్తానని, క్లీన్ చీట్‌తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ వద్ద తన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని కేటీఆర్ మంగళవారం సంజయ్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. గతంలో ఎప్పుడో చేసిన సవాల్‌కు ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని విమర్శించారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ అయి ఇప్పుడు రెడీ అంటున్నాడని అన్నారు. తాను తాంబాకు తింటున్నట్లు కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడని, తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తనకు ఆ అలవాటే లేదని, తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలియదని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసింది. మీ భాష చూసి నవ్వుకున్నాం. మేము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారు. మీ చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లే. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చు. ’ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. చదవండి: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్ -
సాఫ్ట్వేర్ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం
బెంగళూరు: కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భర్తే.. భార్యను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఇతరులతో పడక పంచుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. సంపిగేహళ్లికి చెందిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 2011లో వివాహం జరిగింది. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటు పడిన భర్త.. భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు. స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో చిత్ర హింహలకు గురిచేశాడు. మద్యం మత్తులో ఆమెను కొట్టేవాడు. భార్య మరొకరితో బెడ్రూంలో గడిపిన దృశ్యాలను వీడియో రికార్డ్ చేసి రాక్షసానందం పొందాడు. భర్తతో విసిగిపోయిన భార్య.. అతని నుంచి విడాకులు కోరగా.. తన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని వివాహిత చివరికి పోలీసులను ఆశ్రయించింది. భర్త తన ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేశాడని తెలిపింది. భర్త డ్రగ్స్ అలవాటు పడి, ఇంట్లోని పూల కుండీలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం -
'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే'
పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరోసారి సంచలన విషయాలు బయపెట్టాడు. గ్రేడ్ క్రికెటర్స్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అక్రమ్ కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు నాకు ఇష్టం లేకున్నా దాదాపు రెండున్నర నెలల పాటు రీహాబిలిటేషన్‌లో ఉండడం నరకంలా అనిపించదని పేర్కొన్నాడు. అంతేకాదు ఒకరికి ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచానికి చట్టవిరుద్ధం అనిపించొచ్చు.. కానీ పాకిస్తాన్లో మాత్రం అలా ఉండదన్నాడు. అక్రమ్ మాట్లాడుతూ.. ''ఇంగ్లండ్‌లో ఒక పార్టీకి వెళ్లినప్పుడు తెలియకుండానే కొకైన్కు బానిసగా మారిపోయా. ఎంతలా అంటే కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగేలాగా. తొలిసారి కొకైన్ రుచి చూడడం ఇప్పటికి నాకు గుర్తు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రయత్నిస్తారా అని అడిగాడు. అప్పటికే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడంతో పెద్దగా ఇబ్బంది ఉండదనుకొని తొలిసారి కొకైన్ రుచి చూశాను.. అందునా ఒక గ్రామ్ కొకైన్ మాత్రమే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చేశా. అయితే కొకైన్‌లో ఏదో తెలియని పదార్థం నా మనసును జివ్వుమని లాగడం మొదలుపెట్టింది. ఒక్కసారి రుచి చూసిన పాపానికి ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌గా మారిపోయాడు. ఇక కొకైన్ లేనిదే నా జీవితం లేదు అనే స్టేజ్‌కు వచ్చేశాను. అలా నా పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటికే నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని చాలా బాధపెట్టాను.. కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో వెంటనే నా భార్య నీకు చికిత్స అత్యవసరమని చెప్పింది. మా ఇంటికి కొద్ది దూరంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ ఉండడంతో అక్కడ జాయిన్ అవ్వమని చెప్పింది. నేను నెలరోజులు మాత్రమే ఉండడానికి అంగీకరించాను. కానీ నాకు తెలియకుండానే అక్కడ దాదాపు రెండున్నర నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. మనకు ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచంలో చట్టవిరుద్ధం కావొచ్చు.. కానీ పాకిస్తాన్లో అలా కాదు. చివరికి అక్కడి నుంచి బయటపడిన తర్వాత కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఒక రకంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక భయంకరమైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాను. ఇక ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో రీహాబిలిటేషన్ సెంటర్లు చాలా విశాలంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్లో అలా కాదు. కేవలం కారిడార్‌తో కలిపి ఎనిమిది గదులు మాత్రమే ఉంటాయి. దీంతో ఆ ప్రదేశం నిత్య నరకంలా అనిపించి భయంగా గడపాల్సి వచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే నా జీవితంలో అతి పెద్ద విషాదం చోటుచేసుకుంది. నా భర్యా చనిపోవడం నా జీవితాన్ని సరిదిద్దింది. విదేశాల్లో ప్రతీ తండ్రి పిల్లల పట్ల ఎంతో కేరింగ్‌గా ఉంటారు. కానీ మా దేశంలో ఇవన్నీ ఇంట్లోని ఆడవాళ్లు మాత్రమే చూసుకుంటారు. నా భర్య చనిపోవడంతో నాలో మార్పు మొదలైంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.. అవసరమైన సందర్భాల్లో వారికి అండగా నిలబడడం.. కొన్నిసార్లు వారు చదివే పాఠశాలకు వెళ్లడం.. పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చేది. ఈ విషయంలో ఇతర పిల్లల తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు.'' అంటూ ముగించాడు. చదవండి: ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం.. కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో -
షాకింగ్ ఘటన: కన్నకొడుకే కాలయముడిలా కుటుంబ సభ్యులందర్నీ...
న్యూఢిల్లీ: ఒక యువకుడు కుటుంబ సభ్యులందర్నీ హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన దక్షిణ ఢిల్లీలోని పాలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం...25 ఏళ్ల కేశవ్ గత రాత్రి కుటుంబ సభ్యులందర్నీగొంతు కోసి చంపేసినట్లు తెలిపారు. ఒక పదునైన ఆయుధంతో పలుమార్లు దాడి చేసి హతమార్చాడని వెల్లడించారు. మృతులు కేశవ్ నానామ్మ దేవనా దేవి(75), తండ్రి దినేష్(50), తల్లి దర్శన, కూతురు ఊర్వశిగా గుర్తించారు. వారందరూ వేర్వేరు గదుల్లో విగత జీవులుగా పడి ఉన్నారు. కేశవ్ తల్లిదండ్రులిద్దరు బాత్రుంలోనూ, చెల్లెలు, నానమ్మ వేర్వేరు గదుల్లో అతడి చేతిలో హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. గుర్గాన్లో ఉద్యోగం చేస్తున్న కేశవ్ ఒక నెలక్రితమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని, దీపావళి నుంచే ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. అతను డ్రగ్స్‌కు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. నిందితుడు గత రాత్రి సుమారు 10.30 గం.ల ప్రాంతంలో ఈ ఘటనకు ఒడిగట్టినట్లు చెప్పారు. అదే ఇంటిలో ఉంటున్న పక్కింటి వాళ్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే ఇంతలో కేశవ్ తప్పించుకునేందుకు పథకం వేస్తుండగా అతని బంధువులు అడ్డకోవడంతో తాము అతన్న అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
డ్రగ్స్ మత్తులో యువకుడు.. రోడ్డుపై తూలుతూ..15 రోజుల్లో రెండో ఘటన
చండీగఢ్: పంజాబ్‌లో ఈ మధ్య ఓ మహిళ డ్రగ్స్ మత్తులో తూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అమృతసర్ నియోజకవర్గంలోని పంజాబ్‌లోని డ్రగ్స్ మత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది జరిగి 15 రోజులు అవ్వకముందే అదే అమృత్‌సర్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలోని చమ్రాంగ్ రోడ్లో ఓ యువకుడు రోడ్డుపై తూలుతూ కదలలేని స్థితిలో నిలబడి ఉన్నాడు. కనీసం ముందుగా అడుగు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నడిరోడ్డుపై వెళ్తున్న వారందరూ అతన్నే చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి స్మాక్ ప్రభావంలో(డ్రగ్స్ మత్తులో) ఉన్నట్లు చుట్టూ ఉన్న వారు చెబుతుండటం వీడియోలో వినిపిస్తోంది. స్మాక్ అనేది ఓపియాయిడ్ డ్రగ్, దీనినే కొన్నిసార్లు బ్లాక్ టార్ హెరాయిన్ అని కూడా పిలుస్తారు. ఇక సిక్కుల పవిత్ర నగరమైన మక్బూల్‌పురా.. మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి తరచుగా వార్తల్లో నిలుస్తుంది. మద్యం మానేసేందుకు పోలీసులు అనే డి- అడిక్షన్ డ్రైవ్‌లు చేపట్టినటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. Alcohol is a old way ....save our generation.... either it's Punjab or anywhere in india pic.twitter.com/fepQtcfuEf — चौधरी विनय छौक्कर (गुर्जर) (@vinayc050) September 24, 2022 ఈనెలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో దాదాపు కనీసం 350 మంది డ్రగ్స్ స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు. 6.90కేజీల హెరాయన్, 14.41 కేజీల నల్ల మందు, 5 కేజీల గంజాయి, 6.44 క్వింటాళ్ల గసగసాల పొట్టు, 2.10 లక్షల మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు, ఫార్మా ఓపియాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. #Video of man under influence of #DRUGS in #Amritsar, #Punjab goes #Viral Drug menace a major problem in Punjab#PunjabPolice #news #UnMuteIndia pic.twitter.com/RBOPHlVh5i — UnMuteINDIA (@LetsUnMuteIndia) September 24, 2022 మరోవైపు రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం ఎక్కువవడంతో పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఇంకా కొనసాగుతుందని, దీనికి ఇలాంటి ఘటనలే నిదర్శమని విమర్మిస్తున్నాయి. -
గోవా డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి జాన్ డిసౌజా అరెస్ట్
-
వరంగల్‌లో సత్ఫలితాలిస్తున్న ‘నయీ కిరణ్’.. సాయం పొందండిలా!
పుస్తకాల తోటలో విహరించాలని నూనూగు మీసాలు పట్నపుదారులు వెతుకుతున్నాయి. పుస్తకాలు చదివి అనుభవించాల్సిన ఆనందాన్ని పొగ పీలుస్తూ.. లెక్చరర్లు చెప్పింది విని రక్తంలోకెక్కించుకోవాల్సిన జ్ఞానాన్ని రసాయనాల రూపంలో మత్తు ఎక్కించుకుంటూ యువత తాత్కాలిక ఆనందాన్ని పొందుతోంది. మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని ఆ ఊబిలోనుంచి బయటపడేసి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై ఆ తర్వాత మార్పు పొందిన యువత, వారి తల్లిదండ్రుల మనోగతంపై ఆదివారం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – వరంగల్ క్రైం ఉన్నత చదువుల కోసం నగరానికి వస్తున్న యువకుల్లో కొంతమంది గంజాయికి బానిసవుతున్నారు. ఆ ఊబినుంచి బయటపడేస్తూ.. గంజాయి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సీపీ తరుణ్ జోషి, బన్ను ఆరోగ్య సంస్థ, ఎంజీఎం అధికారుల సహకా రంతో ఏర్పాటు చేసిన నయీ కిరణ్ కార్యక్రమం ద్వారా గంజాయికి బానిసైన వారికి కొత్త జీవితాన్ని స్తున్నారు. మొదటి దశలో 159 మంది డ్రగ్స్ బాధితుల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్ అధికారులతో పాటు పోలీస్స్టేషన్ల అధికారులు గంజాయి తాగేవారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. సుమారు వందరోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ బాధితులు సాధారణ జీవితం గడిపేలా చేశారు. కమిషనరేట్ అధికారులు నిర్వహించిన జాబ్‌మేళాలో వారి అర్హతకు అనుగుణంగా 38 మంది బాధితులు ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో నూతన వెలుగులు కనిపిస్తున్నాయి. జీవితాన్ని తీర్చిదిద్దారు.. నగరంలో కళాశాలలో డిగ్రీ చేస్తున్నప్పుడు స్నేహితులతో సిగరేట్లు తాగడం అలవాటైంది. కాజీపేటలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ చదువుకున్నా. రోజూ సిగరెట్లు తాగుతున్నానని అనుకున్నా.. కానీ అందులో గంజాయి ఉందనే విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. 10 బీర్లు తాగితే ఎలా ఉంటుందో ఒక గంజాయి సిగరేట్ తాగితే అలా మత్తు ఉండేది. నయీకిరణ్ కార్యక్రమం ద్వారా ఎంజీఎంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు నా జీవితాన్ని తీర్చిదిద్దారు. – పాల సాయికుమార్, కరీంనగర్ 1నా కొడుకు దక్కేవాడు కాదు.. నాది ప్రభుత్వ ఉద్యోగం. ఉదయం వెళ్తే.. రాత్రెప్పుడో వచ్చేవాణ్ణి. నా కొడుకు నేను పడుకున్నాక వచ్చి పడుకునేవాడు. రాత్రి లేటైంది కదాని.. ఉదయమే వాడిని లేపకపోయేవాణ్ని. నా కొడుకు గంజాయి తాగుతూ పట్టుబడినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. పోలీసుల సహకారంతో వాడి అలవాటు మానుకున్నాడు. నాకొడుకు నాకు దక్కాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు. – చంద్రమోహన్, రాంనగర్, ప్రభుత్వ ఉద్యోగి (పేరు మార్చాం) బలవంతంగా అలవాటు చేశారు.. నా స్నేహితుల మాదిరి సరదాగా గడపాలనే కోరిక ఉండేది. వాళ్లతో కలిసి తిరిగాక నాకూ సిగరేట్ అలవాటు చేశారు. ఆ™ è ర్వాత మరింత ఎంజాయ్మెంట్ కోసమని సిగరెట్లో గంజాయి కలిపి తాగించారు. మత్తుగా ఉండడంతో ఒకటి రెండు సార్లు తాగాను. ఒకరోజు గంజాయి తాగుతూ పోలీసులకు దొరికాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్, మనోధైర్యం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. – విక్రమ్ డిప్లొమా విద్యార్థి, హనుమకొండ (పేరు మార్చాం) ఉద్యోగం పోయింది.. నేను హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్లో ఉద్యోగం చేసేవాణ్ణి. అక్కడికి వచ్చే కస్టమర్ల ద్వారా నాకూ గంజాయి అలవాటయ్యింది. మత్తులో సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఉద్యోగంలోంచి తీసేశారు. ఇంటికొచ్చి న తర్వాత అలవాటు మానలేకపోయా. నయీ కిరణ్ గురించి తెలుసుకొని పోలీసులను సంప్రదించా. వంద రోజుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నా అలవాటును పూర్తిగా మరిచిపోయా. ప్రస్తుతం మళ్లీ ఉద్యోగ వేటలో ఉన్నా. – ప్రశాంత్, ధర్మసాగర్ (పేరు మార్చాం) గంజాయిపై ఉక్కుపాదం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్‌ను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు సీపీ డాక్టర్ తరుణ్ జోషి ప్రత్యేక దృష్టి పెట్టారు. అమ్మకందారులతోపాటు వినియోగదారులపై పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో రూ.4.10 కోట్ల విలువైన 3,918 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 44 కేసులు నమోదు చేసి 155 మందిని అరెస్టు చేశారు. సాయం పొందండిలా.. గంజాయి, ఇతర డ్రగ్స్‌కు అలవాటు పడి మానుకోవాలనుకునే వారు, వారి తల్లిదండ్రులు ‘నయీకిరణ్’ టోల్ ఫ్రీ 94918 60824 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. పోలీస్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి డ్రగ్స్ బాధితుల్లో మార్పులు తీసుకొస్తారు. ఏప్రాంతం వారైనా సాయం పొందవచ్చు. 159 మంది.. 100 రోజులు 159 మంది డ్రగ్స్ బాధితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసైన వారికి డాక్టర్లతో తల్లిదండ్రుల సమక్షంలో చికిత్స అందించాం. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వారిలో మంచి మార్పులు తీసుకొచ్చాం. మొదటి రెండు వారాలు డీ టాక్సిఫికేషన్ కార్యక్రమం, ఆతర్వాత డీ ఎడిక్షన్లో ప్రముఖులతో మాట్లాడించాం. హనుమకొండ కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ప్రభుత్వ చీఫ్ విప్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, మేయర్, ఇలా చాలామందితో మాట్లాడించి డ్రగ్స్ బాధితుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. హైదరాబాద్ నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి గ్రూప్ కౌన్సెలింగ్ ఇచ్చాం. పోలీస్ కమిషనర్ నుంచి హోంగార్డు వరకు గంజాయి నుంచి యువతకు విముక్తి కల్పించడానికి ప్రయత్నంచేస్తున్నాం. – పుష్పారెడ్డి, అడిషనల్ డీసీపీ -
చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్న కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి, సినిమాల ప్రభావం ఎంత కారణమో.. ఇంట్లో తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్‌ను చూసి కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు నేషనల్ డ్రగ్ డిపెండెన్సీ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) సర్వేలో తేలింది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాలలో 8 నుంచి 12వ తరగతికి చెందిన 6 వేల మంది విద్యార్థులతో సర్వే నిర్వహించింది. ఇందులో 10 శాతం మంది యువత పొగాకు, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవిస్తున్నట్లు తేలింది. వారికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఇంట్లో పెద్దలను చూసి అలవాటు చేసుకున్నట్లు బయటపడటం గమనార్హం. స్మార్ట్ ఫోన్లో డ్రగ్స్ కోసం శోధన.. కరోనా అనంతరం పిల్లలకు సెల్‌ఫోన్ వినియోగడంతో ఆన్లైన్లో మత్తు పదార్థాల కోసం శోధిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్స్ వాట్సాప్ గ్రూప్‌లలో యువతను చేర్చి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న కేసులు వెలుగు చూడటమే ఇందుకు నిదర్శనం. నిద్రమాత్రలు, ఆల్ప్రాజోలం, క్లోర్డియాజిపాక్సైడ్ వంటి యాంగ్జైటీ మాత్రలు, దగ్గు టానిక్‌లు, పెయిన్ కిల్లర్స్ వంటి ఫార్మసీ మెడిసిన్స్ కూడా పిల్లలు వినియోగిస్తున్నట్లు అమృతా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ దేవికా రాణి తెలిపారు. రిహాబిలిటేషన్ కౌన్సెలింగ్ పలువురు యువతలో ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. నెలకు సుమారు వంద మంది మత్తు బానిసలు ఆశ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటిలో 10– 15 కేసులు 18 ఏళ్ల లోపు వయసున్న యువతే ఉన్నారు. పసిగట్టకపోతే ప్రమాదమే.. పని ఒత్తిడి లేదా బోర్ అనిపించినా ఇంట్లో పెద్దలు పొగాకు, ఆల్కహాల్ వంటివి సేవిస్తుండటం చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. కరోనా తర్వాత నుంచి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, గొడవలు పెరిగిపోయాయి. ఈ ప్రభావం కూడా పిల్లల మీద చూపిస్తోంది. పిల్లల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. మత్తుకు బానిసలుగా మారి ఎంత దారుణానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉంది. నేరాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. చెడు వ్యవసాల నుంచి యువతను మాన్పించడం సైకాలజిస్ట్లకు కత్తి మీద సాము. ఎందుకంటే ఆ వయసు పిల్లల్లో మెదడు సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి చెందదు. దీంతో తిరిగి సులువుగా చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతుంటారు. ఆడుకోవటం, ఇతరులతో మాట్లాడకపోవటం, ఎప్పుడూ బద్ధకంగా ఉంటారు. ఎక్కువగా ఏడుస్తుంటారు లేదా పడుకుంటారు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. ప్రతి అంశానికీ భావోద్వేగాలకు లోనవుతుంటారు. సామాజిక మాధ్యమాలలో లైఫ్ గురించి నెగిటివ్ కొటేషన్లు పెడుతుంటారు. ఉన్నట్టుండి చదువులో తక్కువ మార్కులు రావటం. ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు. డ్రగ్స్‌కు సంబంధించిన పేర్లను సెల్ఫోన్లలో షార్ట్‌కట్‌లో పేర్లు పెట్టుకుంటారు. చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్లు అత్యవసరం కేరళ, ఢిల్లీ, ముంబైలో ఉన్నట్లు ప్రభుత్వ చైల్డ్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లు మన దగ్గర లేవు. రిహాబిలిటేషన్ వైద్యం ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత చాలా మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మానసిక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీంతో చెడు వ్యసనాల నుంచి పేద విద్యార్థులు, యువతను కాపాడి, ఉజ్వల భవిష్యత్తును అందించినట్లవుతుంది. – కె.దేవికా రాణి, డైరెక్టర్, అమృతా ఫౌండేషన్ (చదవండి: ఇంటికో ఉద్యోగమని మొండిచేయి చూపారు: వైఎస్ షర్మిల) -
మత్తుకు మందేసే ‘డాక్టర్ పోలీస్’
సాక్షి, హైదరాబాద్: ఏదో సరదాగానో, స్నేహితులతో కలిసో డ్రగ్స్‌కు అలవాటవుతున్నారు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తున్నారు. బయటికొచ్చాక అలవాటు మానుకోలేక మళ్లీ డ్రగ్స్ వైపు చూస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌పెట్టే దిశగా పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తామే బాధితులకు తగిన చికిత్స ఇప్పించడం, కౌన్సెలింగ్ చేయడం ద్వారా డ్రగ్స్ నుంచి దూరం చేసేలా ‘రీ–హ్యాబ్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలతో పాటు నాలుగు ప్రైవేట్ సంస్థలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రీ–హ్యాబ్ విధివిధానాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు. ఆ వివరాలివీ.. – ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగర పోలీసులు డ్రగ్స్ కేసుల్లో మొత్తం 372 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 40 మంది బయటి ప్రాంతాల వారితో సహా 193 మంది పెడ్లర్స్ ఉన్నారు. డ్రగ్స్ వినియోగిస్తూ విక్రయిస్తున్న 85 మంది, వినియోగదారులు 94 మందినీ కటకటాల్లోకి పంపారు. – వీళ్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఐదు సంస్థల సహకారంతో వారిపై నిఘా ఉంచనున్నారు. తల్లిదండ్రుల సమ్మతితో వారిని స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైన వారికి ఇన్‌షేషెంట్స్‌గా.. మిగిలిన వారికి ఔట్ పేషెంట్స్‌గా చికిత్స అందించనున్నారు. రెండు నెలల పాటు ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. – మొదటి నెల వారానికి రెండు సార్లు, రెండో నెల వారానికి ఒకసారి చొప్పున కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ కాలంలో వారి సమ్మతితోనే ప్రతి వారం మూత్రం, రక్త పరీక్షలు చేసి ఇంకా డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? అనేది గుర్తిస్తారు. ఇన్‌పేషెంట్స్‌కు కనిష్టంగా 28 రోజుల చికిత్స ఉంటుంది. – ప్రైవేట్ సంస్థల్లో ఒక్కో సెషన్‌కు రూ.2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్తోమత లేని వారికి ఎర్రగడ్డ వైద్యశాలలో రీ–హ్యాబ్ ప్రక్రియ పూర్తి చేయిస్తారు. ఆయా సంస్థల్లోని నిపుణులు వివిధ దశల్లో కౌన్సెలింగ్, వైద్యం చేసి వారు డ్రగ్స్‌కు దూరమయ్యేలా చేస్తారు. ఇది శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. – మాజీ డ్రగ్స్ వినియోగదారులపై ఆయా సంస్థల సహకారంతో పోలీసులు నిఘా కొనసాగిస్తారు. మద్యం అలవాటు నుంచి బయటపడిన వారి (ఆల్కహాల్ అనానిమస్) గ్రూపుల మాదిరిగానే భవిష్యత్తులో నార్కోటిక్ అనానిమస్ గ్రూపులు ఏర్పాటు చేసి, వారంతట వారే తమపై నిఘా ఉంచుకునేలా, ఒకరికొకరు సహకరించుకునేలా నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికే డ్రగ్స్ తీసుకున్నా : స్టార్ హీరో
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చేసినా కేజీఎఫ్-2 పైనే చర్చ నడుస్తుంది. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెస్మరైజ్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా సహా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని సైతం షేర్ చేసుకున్నారు. 'అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాను. కానీ ఈ ప్రాసెస్‌లో డ్రగ్స్‌కి బానిసైన నాకు ఆ సంకెళ్లు తెంచుకోవడానిక ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడిని. నా జీవితంలో ఆ పదేళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్లో గడిపేవాడిని. షూటింగ్‌లపై ఆసక్తి ఉండేది కాదు. అయితే డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపాను. తిరిగి వచ్చాక అందరూ నన్ను డ్రగ్గీ అని పిలిచేవారు. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నా. దీంతో అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’అంటూ ప్రశంసించారు' అంటూ చెప్పుకొచ్చారు సంజూ భాయ్. -
గంజాయికి బానిసైన కొడుక్కి తల్లి దేహశుద్ధి..
-
స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పెట్టి
సాక్షి, కోదాడ: చెడుమార్గంలో వెళ్తున్న కుమారుడిని దారిలో పెట్టేందుకు ఆ తల్లి కఠినంగా వ్యవహరిం చింది. గంజాయికి అలవాటుపడి పది రోజులుగా ఇంటికి రాకుండా తిరుగుతున్న కొడుకును పట్టు కుని కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లలో కారం పెట్టి నాలుగు దెబ్బలు వేసింది. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ ఘటన జరిగింది పట్టణానికి చెందిన వెంకయ్య– రమణమ్మ దంపతులది పేద కుటుంబం. వెంకయ్య రిక్షా తొక్కుతుండగా, రమణమ్మ కూలి పనులు చేస్తోంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. బిడ్డ పెళ్లి అయింది. 15 ఏళ్ల కుమారుడు కరోనా లాక్‌డౌన్‌కు ముందు (రెండేళ్ల క్రితం) వరకు బడికి వెళ్లేవాడు. 8వ తరగతితోనే బడి మానేసి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. బాలుడు గంజాయికి బానిసైన విషయాన్ని తల్లిదండ్రులు ఏడాది క్రితం గుర్తించి మందలించారు. అయినా మానుకోకుండా.. పలుమార్లు గంజాయి తాగి రోడ్ల మీద పడిపోవడం, తల్లిదండ్రులు వెతికి ఇంటికి తీసుకురావడం జరిగింది. అదే తరహాలో ఇటీవల ఇంట్లోంచి వెళ్లిన బాలుడు పది రోజుల తర్వాత సోమవారం ఉదయం తిరిగి వచ్చాడు. అది కూడా గంజాయి మత్తులో ఉండటం చూసిన తల్లి.. తీవ్రమైన బాధ, ఆగ్రహంతో కుమారుడిని ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసింది. తర్వా త కళ్లలో కారం పెట్టి దండించింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. పదిహేనేళ్ల బాలుడిని కట్టేసి, కొట్టినం దుకు పోలీసులు తల్లి మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా మారుతాడనే.. కరోనా మొదలైనప్పటి నుంచి నా కుమారుడు బడికి పోవడం మానేశాడు. ఏడాది నుంచి గంజా యికి అలవాటు పడ్డాడు. గంజాయి తాగి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడిపోతుంటే.. రాత్రివేళ నేను, నా భర్త వెతికి ఇంటికి తీసుకువస్తున్నాం. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మారుతాడనే ఆశతో తప్పనిసరి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాను. – బాలుడి తల్లి చదవండి: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. -
పాకెట్ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని..
సాక్షి, హైదరాబాద్: ‘సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన సాయికుమార్, ప్రతాప్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. పాకెట్ మనీ కోసం గంజాయి వ్యాపారంలోకి దిగారు. ఒడిశా రాష్ట్రంలోని సీలేరు ప్రాంతంలో మంగళ్ అనే వ్యక్తి నుంచి ఎండు గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి బస్సుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. శివారు ప్రాంతంలో వాటిని 5, 10 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి.. రూ.150– 200కు విక్రయిస్తున్నారు’ ‘దుస్తుల వ్యాపారం పేరిట మార్క్ ఒవాలోబీ నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు. బిజినెస్ వీసా గడువు ముగిశాక.. ముంబై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఢిల్లీ నుంచి కొకైన్‌ను తీసుకొచ్చి నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు. పలుమార్లు జైలుకెళ్లాడు. నేరెడ్‌మట్‌కు చెందిన బీకామ్ ఫైనలియర్ విద్యార్థి హర్షవర్ధన్ స్నేహితుడైన అభిషేక్ సింగ్ ఓ చోరీ కేసులో జైలుకెళ్లాడు. అక్కడ మార్క్ ఒవాలోబీతో ఇతగాడికి పరిచయం ఏర్పడింది. బయటికొచ్చాక ఈ ముగ్గురు, మరికొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించారు’ .. ఇలా ఒకటి రెండు సంఘటనల్లోనే కాదు డ్రగ్స్ వినియోగిస్తూ.. విక్రయిస్తూ ఎందరో విద్యార్థులు పట్టుబడుతున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన విద్యార్థులు.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఫ్యాషన్‌గా మొదలు పెట్టి డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు. జైలులో పెడ్లర్లతో పరిచయాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరఫరాదారులే కాదు వినియోగదారులపై కూడా కేసులు నమో దు చేస్తూ అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మూలాలను అంతమొందిస్తే తప్ప డ్రగ్స్‌ను అరికట్టలేమని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. కేవలం సరఫరాదారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమాండ్‌కు తరలించి జైలుకెళ్లిన నిందితులలో సత్ప్రవర్తన రాకపోగా.. జైలులో కొత్త పరిచయాలు ఏర్పరుచుకొని బయటికొచ్చాక సరికొత్త ఎత్తుగడలతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగుచూడటమే ఇందుకు ఉదాహరణ. గంజాయి రవాణాలు రౌడీషీటర్లు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు కూడా దిగారు. ప్యాకెట్‌కు రూ.150– 200.. ►కొకైన్ బంగారం కంటే చాలా ఖరీదైనది, దీన్ని అందరూ కొనుగోలు చేయలేరు. దీంతో గంజాయి విక్రయం, వినియోగం పెరిగింది. కిలో రూ.15– 20 వేలకు కొనుగోలు చేసి.. శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ప్యాకెట్ రూ.150– 200కు దొరకుతుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసే వీలుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ►ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత సొంతూర్లకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాగులలో గంజాయిని తీసుకొస్తున్నారు. తాము సేవించడమే కాకుండా తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి 5, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన లాబా కుమార్ ప్రధాన్, బాపిలను ఇటీవల కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ►ఇదే తరహాలో ఆదిలాబాద్ నుంచి కిలో గంజాయి రూ.15 వేలకు కొనుగోలు చేసి నగర శివార్లలో ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు జవహర్‌నగర్‌కు చెందిన బొడ్డు అభిషేక్, గాజుల పరమేష్, వడ్డారం ప్రవీణ్, ఆర్ శివలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. -
హైదరాబాద్ మాదకద్రవ్యాల కేసులో మలుపు
-
వణుకు పుట్టిస్తోన్న బ్లేడ్‌బ్యాచ్.. రంగంలోకి కమిషనర్!
సాక్షి ప్రతినిధి విజయవాడ: వారికి గంజాయితో నిత్యం సహవాసం.. జన సంచారం అంతగాలేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారే లక్ష్యం.. డబ్బులు ఇవ్వలంటూ బ్లేడుతో దాడి చేయడం, పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే తమను తాము కోసు కుని చస్తామంటూ బెదిరించడం వారికి సహజం.. ఇదీ విజయవాడలో హల్చల్ చేసే బ్లేడ్‌బ్యాచ్ సభ్యుల నైజం. నగరంలో అలజడి సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యుల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. వారి మూలాలను శోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగేవారు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలకు, గంజాయి తాగేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలైన వన్ టౌన్, టూ టౌన్, రైల్వే అప్ యార్డు, సీపీఆర్ ఫ్లై ఓవర్, ఆర్పీఎఫ్ పోస్టు, రామరాజ్యనగర్లోని రైల్వే బ్రిడ్జ్ కింద ఖాళీ ప్రదేశాలు, జక్కంపూడి శివారులోని 60, 40 అడుగుల రోడ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేర చరిత్ర ఆధారంగా బ్లేడ్ బ్యాచ్ సభ్యులను ఆయా పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీస్ కమిషనర్ టి.కె.రాణా వన్‌టౌన్, సింగ్‌నగర్ ప్రాంతంలో బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తాగేవారికి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కదలికలు ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో సీపీ స్వయంగా పర్యటించి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. సన్మార్గంలో నడిస్తే ఉపాధి బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నేర ప్రవృత్తిని మార్చుకుని మంచి మార్గంలో నడవాలని నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆధ్వర్యంలో పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ జన జీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన దండన తప్పదనే సంకేతాలు పంపుతున్నారు. నేర ప్రవృత్తి మార్చుకోని వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచి మార్గంలో నడుచుకునే వారికి వ్యాపార సంస్థలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఆగడాలకు అడ్డుకట్ట ఇలా.. బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగి చెడ్డదారుల్లో నడిచేవారికి ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను సీపీ టి.కె.రాణా ఆదేశించారు. గంజాయి తాగేందుకు అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి పోలీస్ గస్తీ పెంచాలని, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి పిల్లలు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసేలా తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి డీ–ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని పేర్కొన్నారు. నేరాలు జరగడానికి అవకాశం ఉన్న చీకటి ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో స్థానిక అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా... చెడు నడత గల వ్యక్తుల సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు స్వయంగా లేదా, 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సీపీ టి.కె.రాణా ప్రజలను కోరారు. మత్తు పదార్థాల విక్రేతలు, వినియోగదారుల వివరాలను, వీధుల్లో తిరుగుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆకతాయిల వివరాలను పోలీసులకు తెలపాలని కోరారు. ఈ సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. చదవండి: బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు -
ఇదివరకే మూడు పెళ్లిళ్లు.. నాలుగేళ్లుగా యువతిని మత్తులో ముంచి అకృత్యం
సాక్షి,యశవంతపుర: తీరప్రాంత నగరం మంగళూరులో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల నుంచి ఒక యువతికి డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళూరు నగరంలోని బిజై ప్రాంతానికి చెందిన మహిళ తన కూతురికి కొందరు డ్రగ్స్‌ను అలవాటు చేసి లైంగికంగా వాడుకొంటున్నట్లు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోను పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూతురిని ఇలా నాశనం చేశారని మీడియా ముందు విలపించింది. కూతురి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. ఆమెను కాపాడాలని వీహెచ్‌పీ నాయకులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి సురత్కల్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ (47) అనే నిందితున్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇతనికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
అడిక్షన్ సెంటర్‌కి పంపించారన్న కోపంతో...కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కొడుకు
16 Year Old Boy Kills His Parents With An Axe: తల్లిదండ్రులను పిల్లల అబివృద్ధికై అహర్నిశలు పోరాడతారు. వాళ్ల అభివృద్ధిని తమ అభివృద్ధిగా భావించి ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధుల తల్లిదండ్రల పై అత్యంత పాశవికమైన దాడులు చేయడమే కాక క్రూరమైన ఘాతుకాలకు పాల్పడతున్న ఉదంతాలే కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) అసలు విషయంలోకెళ్లితే... రాజస్తాన్‌లోన హనుమాన్‌ఘర్‌లోని ఒక గ్రామంలోని 16 ఏళ్ల మైనర్ బాలుడు మాదక ద్రవ్యాలకు బానిసై అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకు జీవితం బావుండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్‌కి పంపించారు. అయితే సదరు బాలుడు కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకుని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. అంతేకాదు తననెందుకు డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించారంటూ సదరు బాలుడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సదరు బాలుడు తనను మళ్లీ డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించే నిమిత్తమే తనను ఇంటికి తీసువచ్చారన్న కోపంతో నిద్రిస్తున్న తన తల్లిదండ్రలను అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో సమాచరం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు మీడియాకి తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్
Drug Based Cough Syrup Smuggling: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో "లీన్" "సిజర్ప్" అనే మారుపేరుతో కూడా పిలిచే కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ (సీబీఎస్) ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వైద్యుడితో సహా సుమారు ఆరుగురిని అరెస్టు చేశామని కోల్‌కతా జోన్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తెలిపింది. అయితే ఎన్సీబీ కోల్‌కతా జోన్ బారక్పూర్లో నిర్వహించి దాడులలో ఈ ఘటన వెలుగు చేసింది. (చదవండి: ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి! అంతేకాదు ఆ నిందుతులు కోడైన్ సిరప్‌ను స్మగ్లింగ్ చేస్తున్న సిండికేట్‌లో భాగమని, పైగా మాదకద్రవ్యాల బానిసలు త్వరితగతిన అధిక ధర వెచ్చించి కొనేవాళ్లకే ఇవి ఎక్కువగా విక్రయిస్తుంటారని ఎన్సీబీ అధికారులు తెలిపారు. పైగా ఇరుదేశాల మధ్య సరిహద్దుగా ఉండే ముళ్ల కంచె వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన దాదాపు 2,245 డయలెక్స్ డీసీ బాటిళ్లను కూడా ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ మేరకు ఆ నిందితులు వాహనాల్లో బరాక్‌పూర్ నుంచి నదియాకు సీబీఎస్‌ను రవాణా చేస్తున్నారని చెప్పారు. ఈ కమంలో ఎన్సీబీ బృందం మాట్లాడుతూ..."మొదట, మేము ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నాము, ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్‌కి సంబంధించిన మెడికల్ ప్రాక్టీషనర్ రిప్రజెంటేటివ్‌ని పట్టుకున్నాం. అయితే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ సీబీఎస్ డ్రగ్‌ని నిల్వ చేయడానికి తన మెడికల్ గోడౌన్‌ను ఇచ్చాడు. పైగా ఆ గోడౌన్‌కి లైసెన్స్ లేదు. అంతేకాదు బరాక్‌పూర్‌లోని రామ్ మెడికల్ హాల్ నుంచి నగరంలోని మహిస్బథన్ (ధాపా) ప్రాంతంలో గుర్తింపు లేని కొన్ని సంస్థలకు నిషిద్ధ వస్తువులు సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది." అని అన్నారు. ఈ క్రమంలో మయన్మార్‌కి సంబంధించిన యాబా ట్యాబ్లెట్లు భారత్‌లో తయారు చేయబడిన కోడైన్ ఆధారిత సిరప్‌లకు వంటి అక్రమ రవాణాలను తనిఖీ చేయడంలో ఢాకా ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ సహాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. భారత్ కొన్ని మెడిల్ మందులపై నిషేధం విధించినట్లుగా బంగ్లదేశ్ బోర్డర్ గార్డ్స్ కూడా నిషేధం విధించాలని కోరింది కానీ అవి దేశంలో ప్రసిద్ధ వైద్య నివారిణలు కావడంతో సాధ్యం కాలేదు. (చదవండి: అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం) -
మందు, డ్రగ్స్‌కి దూరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొత్తగా తీసుకోవాలని అనుకునే వారికి ఆ పార్టీ నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, పార్టీ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికీ బహిరంగ వేదికలపై విమర్శించబోమని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ పత్రం) ఇవ్వాలని షరతు విధించింది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేపట్టనుంది. సభ్యత్వం కోసం రూపొందించిన దరఖాస్తు పత్రంలో కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారు కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఆదాయానికి మించి ఆస్తులు లేవని, పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల కోసం శారీరక శ్రమకు సిద్ధమేనని అంగీకరించాలి. సామాజిక వివక్ష చూపించమని, వివక్ష, అసమానతల నిర్మూలనకు కృషి చేస్తామని ఇలా మొత్తం 10 పాయింట్లకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లభిస్తుంది. -
ముంబై డ్రగ్స్ కేసులో NCB దూకుడు
-
Drugs: అలవాటయ్యే వరకు అగ్గువ!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): గంజాయి సంబంధిత ద్రవ పదార్థమైన హష్ ఆయిల్ విక్రయంలో ఓ ముఠా కొత్త ఎత్తు వేసింది. ప్రధానంగా యువత, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకున్న వీళ్లు..ఈ మత్తుకు అలవాటు పడేవరకు వారికి తక్కువ రేటుకు అమ్మారు. బానిసలుగా మారిన తర్వాత భారీ రేటు కట్టి విక్రయించారు. ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం వెల్లడించారు. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహబూబ్ అలీ వృత్తిరీత్యా డ్రైవర్ అయినప్పటికీ నేర చరితుడు. మాదాపూర్‌లో రెండు దోపిడీ, మరో హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సార్‌నగర్‌లో డ్రగ్స్ కేసు ఇతడిపై నమోదై ఉన్నాయి. గంజాయి, హష్ ఆయిల్ వినియోగానికి బానిసగా మారిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం హష్ ఆయిల్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించాలని భావించాడు. ఈ ఆలోననను తన స్నేహితులైన సనత్‌నగర్ వాసులు మహ్మద్ సర్ఫ్రాజ్, మహ్మద్ హాజీ పాషాలకు చెప్పడంతో వాళ్లూ జట్టుకట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ త్రయం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్లింది. అక్కడి వెంకట్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేసుకువచ్చింది. తన స్నేహితులు, పరిచయస్తులైన వారికి తక్కువ రేటుకు అమ్మడం మొదలెట్టింది. వారి ద్వారా పరిచయమైన వారికీ ఈ మాదకద్రవ్యం విక్రయించింది. అలా వారిని ఈ మత్తుకు బానిసలుగా మార్చేసిన తర్వాత హష్ ఆయిల్ రేటును అమాంతం పెంచేసి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ పరిధిలోని వారికీ దీన్ని విక్రయిస్తోంది. ఇప్పుడు వీళ్లు వెళ్లాల్సిన పని లేకుండా ఆర్డర్ చేస్తే చాలా వెంకట్ వివిధ రకాలుగా పార్శిల్ చేసి పంపిస్తున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలో హష్ ఆయిల్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 205 చిన్న బాక్సుల్లో ఉన్న 1.02 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకట్ కోసం గాలిస్తున్నారు. -
ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్
ముంబై: చెడు మార్గాలు పట్టకుండా ఇకపై నిరుపేదల అభ్యున్నతి కోసం పని చేస్తానని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అన్నారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఆర్థర్రోడ్ జైల్లో ఉన్న ఆర్యన్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక మీరంతా గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఆర్యన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకు హామీ ఇచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి కోసమే పని చేస్తానని.. చెడు మార్గాల్లో నడవనని ఆర్యన్ చెప్పినట్టుగా ఆ అధికారి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీబీ అధికారులు కలిసి ఆర్యన్, అతడి సహ నిందితులకు జైలులో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 20న తీర్పు వెలువరించనుంది. చదవండి: (తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్..) -
తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్..
డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్షా షారుక్ తనయుడి బెయిల్ విచారణ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్ నిరాకరించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది ముంబై కోర్టు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో ఆర్యన్ మాట్లాడాడు. చదవండి: ఆర్యన్ టార్గెట్ అవ్వడానికి కారణం షారుకే : నటుడు గత 10 రోజులుగా జైలులో ఉంటున్న ఆర్యన్ తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతరమయ్యాడట. అయితే జైలులో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్యన్‌కు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. కాగా డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అక్టోబర్ 20వ తేదీ వరకు జడ్జీ పటిషన్ తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. చదవండి: జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్‌ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్ దీంతో ఆర్యన్ మరో ఐదు రోజుల పాటు ఆర్ధర్ రోడ్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. అతని బెయిల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది. అయితే ఎన్పీబీ ఆరోపణలను ఆర్యన్ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడ లేదంటూ ఆయన వాదించారు. కాగా అక్టోబర్ 2వ తేదీన అర్థరాత్రి ముంబైలోని క్రూయిజ్ ఓడరేవు డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖిలో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!
న్యూయార్క్: కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం విని ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవ సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రముఖ బ్రిటన్ పాప్ సింగర్, రచయిత అయిన అమీ జాడే వైన్ హౌస్ విషయంలో కూడా ఇలానే జరిగింది. వైన్ హౌస్ విషపూరిత ఆల్కహాల్‌ని సేవించి 2011లో అతి చిన్న వయసులో మరణించింది. (చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక) అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే మ్యూసిక్ ఆల్బమ్ సింగర్‌గా, పాప్ గాయనిగా కెరియర్ సాగించి ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు పొందిని గాయని. అయితే ఆమె ఎక్కువ స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక సామాజిక కార్యకర్తగా చాలా చురుగ్గా పాల్గొనేది. దీంతో బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిని జూలియన్స్ అనే ప్రముఖ వేలం సంస్థ ఆమె ధరించిన వస్తువులను వేలం వేసి వాటిని ఆమె మరణాంతరం ఏర్పాటు చేసిన వైన్‌హౌస్ ఫౌండేషన్‌కే వెచ్చించాలని ఆ వేలం సంస్థ డైరక్టర్లు నిర్ణయించారు. పైగా ఈ వేలంలో ఆమో ధరించిన వస్తువులు దాదాపు 2 మిలయన్ డాలర్ల వరకు పలకవచ్చని జూలియన్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్టిన్ నోలన్ బావిస్తున్నారు. ఈ మేరకు 2006లో వచ్చి బాక్ టు బ్లాక్ అనే అల్బమ్ ఆల్కహాల్, తన నిజ జీవితంలో డ్రగ్స్‌కి బానిసై దాని నుంచి బయట పడటానికి సంబంధించిన ఆల్బమ్ కావడమే కాకుండా పలు అవార్డుల ఆ ఆల్బమ్‌కే వరించడం విశేషం. ఆమె పేరు మీద ఏర్పాటైన ఫౌండేషన్ కూడా డ్రగ్స్ బానిసైన యువత కోసం ఏర్పాటు చేసిందే. (చదవండి: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు) -
సోషల్ మీడియాలో 'దమ్ మారో దమ్'..యువతకు చెక్ పెట్టేలా
ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇన్‌స్టాగ్రామ్‌పై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా సైట్స్‌లలో డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోతున్నాయనే కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని భావించిన స్నాప్ చాట్ కొత్త టూల్‌ను లాంఛ్ చేసింది. అమెరికన్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం స్నాప్ చాట్ విమర్శల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది సమ్మర్ సీజన్లో పిల్లల మరణాలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణ చేపట్టారు. ఈ విచారణలో స్నాప్ చాట్‌లో నకిలి డ్రగ్స్ అమ్ముకాలు జరిగినట్లు గుర్తించారు.ఆ మందులు తీసుకోవడం వల్లనే పిల్లలు మరణించారనే ఆధారాలు వెలుగులోకి రావడంతో స్నాప్ చాట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివాదం చల్లారక ముందే గత వారం యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధికారులు సోషల్ నెట్ వర్క్‌లలో ఫెంటానిల్,మెథాంఫేటమిన్ నకిలి డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోతున్నాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్నాప్ చాట్ నష్టనివారణకు సిద్ధమైంది కొత్త టూల్ యూజర్లు స్నాప్ చాట్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేస్తున్నారు? సెర్చ్‌లో ప్రమాదకరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా' వంటి అంశాల్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టూల్‌ను లాంఛ్ చేసింది. దీంతో యూజర్లు ఎవరైనా డ్రగ్స్ గురించి వెతికితే అలర్ట్ చేస్తుంది. వెంటనే యూజర్ల అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. చదవండి: తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గిన జుకర్‌బర్గ్ -
డ్రగ్స్, వ్యభిచారం నేరం కాదు: సీనియర్ నటి
ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా భట్, హృతిక్ రోషన్ సపోర్టు చేయగా.. తాజాగా మరో సీనియర్ నటి సోమీ అలీ సోషల్ మీడియాలో మద్దతు తెలిపింది. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అందులో..‘పిల్లలు డ్రగ్స్ వాడడం సహజం. నాకు ఇది పెద్ద విచిత్రంగా ఏం అనిపించట్లేదు. వ్యభిచారం, డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా తొలగించలేం. అందుకే వాటిని క్రిమినల్ జాబితాలోంచి తొలగించాలి. ఇక్కడ ఎవరు సాధువులు కాదు. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్ తీసుకున్నాను’ అని నటి సోమీ తెలిపింది. అంతేకాకుండా ‘ఆందోళన్’ మూవీ తీస్తున్న సమయంలో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేసినట్లు ఈ సీనియర్ నటి చెప్పింది. ఇది చెప్పడానికి ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేదని ఆమె పేర్కొంది. అయితే శుక్రవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ని విచారించిన మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అనంతరం 3 నుంచి 5 రోజుల క్వారంటైన్ కోసం అతనితో పాటు కేసులో ఉన్న మరో ఏడుగురిని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించాలని చెప్పింది. చదవండి: ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణలో లాయర్ వాదన సాగిందిలా.. View this post on Instagram A post shared by Somy Ali (@realsomyali) -
సోనుసూద్ ట్వీట్, మండిపడుతున్న నెటిజన్లు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన పోలీసులు ఆర్యన్‌తో పులువురి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పోలీసులు పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఎన్సీబీ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో షారుక్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కండల వీరుడు సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజ భట్‌లతో పాటు పలువురు మద్దుతుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఆర్యన్ ఖాన్‌పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్ తండ్రి తాజాగా రియల్ హీరో, నటుడు సోనుసూద్, స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్లు సైతం షారుక్ మద్దుతుగా నిలిచారు. కాగా నిన్న ఆర్యన్‌కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించి అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడిలో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్యన్ పేరు ప్రస్తావించకుండా సోనూసూద్ హిందీలో ట్వీట్ చేశాడు. ‘పిల్లలు విలువైన వారు. నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయంలో పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు. बच्चे बहुमूल्य होते हैं सत्य तो सामने आने में समय लगता है। ख़ुद भगवान न बनें, समय को समय दें, यह समय है, चेहरे याद रखता है। — sonu sood (@SonuSood) October 4, 2021 సోనుసూద్ ఆర్యన్ ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని భావించిన ఓ నెటజన్ స్పందిస్తూ.. ‘23 ఏళ్ల వయసులోనే కపిల్ దేవ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలిచాడు. 23 ఏళ్ల వయసులో నీరజ్ చొప్రా ఒలింపిక్స్ గెలిచిని ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చాడు. 23 ఏళ్ల వయసులోనే సచిన్ 1996 వరల్డ్ కప్ సమయంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. ఇదే 23 ఏళ్లలో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు. మరీ 23 ఏళ్లకు ఆర్యన్ చిన్నపిల్లాడా?’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ కూడా ‘ఆర్యన్ ఎంటో మాకు తెలుసు. 23 ఏళ్లలోనే అతడు రేవ్ పార్టీకి వెళ్లాడంటే అతడు మంచివాడ, చెడ్డవాడనేది తెలిసిపోతుంది. View this post on Instagram A post shared by king khan fan (@king_khan_univers_) చదవండి: తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్ అతడి అలవాట్లు ఎలా ఉంటాయో కూడా అంచన వేయగలం. జనాలు అంత పిచ్చివాళ్లు కాదు. ఇప్పుడు మీరు అతడిని మంచి వాడిలా చూపించే ప్రయత్నం చేయకండి’ అంటూ కామెంట్ చేశాడు. అలాగే హృతిక్ మాజీ భార్య సుసానే కూడా ట్వీట్ చేస్తూ.. ‘ఆర్యన్ మంచి పిల్లాడు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నా. ఒకవేళ ఆర్యన్ అనుకొకుండా తప్పుడు ప్లేస్ ఉండోచ్చు. కావాలనే అతడిని ఇందులో ఇరికించారమో. ఏం జరిగినా షారుక్, గౌరిలకు నా మద్దతు ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది.అయితే వారు చేసిన ట్వీట్లు చూసిన నెటిజన్లు వీరిద్దరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్
Aryan Khan Cried: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారులు మెరుపుదాడి జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్ ఖాన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ముంబై కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అతడిని ఎన్సీబీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. ఇదిలా వుంటే తన కొడుకును కలవడానికి షారుఖ్ కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి కోరగా ఇందుకు ఎన్సీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాకప్‌లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్లాడు షారుఖ్. అయితే తండ్రిని చూడగానే ఆర్యన్ బోరుమని ఏడ్చినట్లు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. కొడుకును అలాంటి దుస్థితిలో చూసి షారుఖ్ సైతం తల్లడిల్లిపోయినట్లు సమాచారం. అధికారులు రైడ్ చేసిన సమయంలో తన కొడుకు దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోయినప్పటికీ అతడిని ఇలా లాకప్‌లో పెట్టడాన్ని చూసి ఎంతగానో బాధపడ్డాడట షారుఖ్. కాగా క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారులు చేసిన మెరుపుదాడిలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 5 గ్రాముల మెఫెడ్రోన్‌తో పాటు కొన్ని పిల్స్‌ను అలాగే రూ.1,33,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌తో సహా మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక, విక్రాంత్ చోకర్, మొహక్ జైస్వాల్ తదితరులను అరెస్ట్ చేశారు. -
ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్ యాక్ట్ 1985 (ఎన్డీపీఎస్) చట్టంలోని పలు నిబంధనలు అభియోగాలుగా ఎన్సీబీ నమోదు చేసింది. ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు వాటికి పడే శిక్షలను ఓసారి చూద్దాం.. ఆర్యన్, మరో ఏడుగురి అరెస్టు మెమో ప్రకారం 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు ఎన్సీబీ సీజ్ చేసింది. అరెస్టయిన వారిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ), 20 (బీ), 27 రెడ్ విత్ సెక్షన్ 35లు నమోదు చేసింది. దోషులుగా తేలితే ఆయా సెక్షన్ల వల్ల శిక్ష, జరిమానా ఇలా... సెక్షన్8(సీ): ఈ సెక్షన్ ప్రకారం ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎవరూ ఉత్పత్తి, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, కలిగి ఉండడం, విదేశాల నుంచి ఎగుమతి, దిగుమతి, సరఫరా వంటివి చేయకూడదు. చదవండి: (ఆర్యన్ ఖాన్‌కు దొరకని బెయిల్) సెక్షన్ 20 (బీ): గంజాయి (కన్నాబిస్) ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్. తక్కువ మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరికతే కఠిన కారాగార శిక్ష(ఏడాది వరకూ) లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. ఎక్కువ మొత్తం దొరికితే.. పదేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా. ఒకవేళ వాణిజ్యపరమైన మొత్తంలో దొరికితే.. పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా విధించొచ్చు. సెక్షన్ 27: ఈ సెక్షన్ ప్రకారం... ఎ). కొకైన్, మార్ఫైన్, డయాసైటైల్మోర్ఫిన్, ఇతర నార్కొటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్‌ను వినియోగించినట్లైతే ఏడాది కఠిన కారాగారం, రూ. 20 వేల జరి మానా లేదా రెండూ విధించొచ్చు. బి). తక్కువ మొత్తంలో అయితే 6 నెలల జైలు, రూ.10 వేల జరిమానా లేదా రెండు విధిం చొచ్చు. దాడిలో దొరికిన నిషేధిత డ్రగ్ పరిమాణాన్ని బట్టి సెక్షన్ 20 కింద శిక్ష ఉంటుంది. వాణిజ్యపరంగా డ్రగ్స్ కలిగి ఉంటే ప్రభుత్వ న్యాయవాది అంగీకారం లేకుండా బెయిలు రావడం కుదరదు. చదవండి: (Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) -
ఆర్యన్ ఖాన్‌కు దొరకని బెయిల్
ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో కీలకమైన తదుపరి విచారణకు వీరిని ప్రశ్నించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆదివారం ఆర్యన్ ఖాన్ మరో ఇద్దరికి విధించిన ఒక్క రోజు కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం అరెస్ట్ చేసిన మరో ఆరుగురికి కూడా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎం నెర్లికర్ ఈనెల 7వ తేదీ వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించారు. ‘సహనిందితుల వద్ద కూడా డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాతో వీరు కలిసే ఉన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తునకు నిందితులను విచారించాల్సిన అవసరం ఉంది. వీరు తమ నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది’ అని మేజిస్ట్రేట్ తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వెలువరించే సమయంలో ఆర్యన్ ఖాన్ నిబ్బరంగా కనిపించగా.. అర్బాజ్, మున్మున్లు ఒక్కసారిగా రోదించారు. ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ సతీశ్ మానెషిండే తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదనీ, అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని తెలిపారు. ఎన్సీబీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ దందాతో సంబంధమున్న ఈ కేసులో వివరాలను రాబట్టాలంటే నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని ఎన్సీబీ లాయర్ వాదించారు. వారిని ఈనెల 11వ తేదీ వరకు, వారంపాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరారు. శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారులు మెరుపుదాడి జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్ ఖాన్ తదితరులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, క్రూయిజ్ షిప్ సోమవారం తీరానికి చేరుకోవడంతో ఎన్సీబీ అధికారులు దాదాపు 6 గంటలపాటు అణువణువూ శోధించారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొన్ని అనుమానిత డ్రగ్స్ కూడా లభించాయన్నారు. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి డ్రగ్స్ వ్యవహరం బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆర్యన్‌తో పాటు మున్మున్ ధమేచ అనే యువతి, ఆర్బాజ్ సేతు మర్చంట్లతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆర్భాజ్.. ఆర్యన్‌కు క్లోజ్ ఫ్రెండ్ కాగా మున్మున్ ధామేచ ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీయగా.. మున్మున్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యాషన్ మోడల్‌గా తెలిసింది. చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఆమె వయసు 39. మున్మున్ స్వస్థలం మధ్య ప్రదేశ్‌లోని సాగర్ జిల్లా. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరణించడంతో తన సోదరు ప్రిన్స్ ధమేచతో కలిసి 6 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తుంది. అయితే స్కూలింగ్ అంతా సాగర్‌లో చేసిన ఆమె ఆ తర్వాత పై చదువుల నిమిత్తం భోపాల్ల్కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఆర్యన్, మున్మున్తో పాటు ఆర్భాజ్ మర్చంట్, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా విచరాణలో నాలుగేళ్లుగా తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ పోలీసులతో వెల్లడించాడు. చదవండి: Shahrukh Khan: షారుక్ ఖాన్‌కి భారీ షాక్! -
Shahrukh Khan: షారుక్ ఖాన్‌కి భారీ షాక్!
Aryan Khan Arrest In Drugs Case: కెరీర్ సంగతేమోగానీ.. వివాదాలు తారల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీస్తాయా? అంటే.. అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఓ కూల్‌డ్రింక్ కంపెనీ, మరొక కంపెనీ బలవంతంగా అంబాసిడర్ హోదా నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఎడ్యుకేషన్ టెక్ ప్లాట్‌ఫామ్ బైజూస్‌కి గత కొన్నేళ్లుగా షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన యాడ్స్ సైతం బుల్లితెరపై కనిపిస్తుంటాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ని బైజూస్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ‘డ్రగ్స్ వ్యవహారంలో’ అరెస్టైన విషయం తెలిసిందే. ఓ క్రూయిజ్‌షిప్ పార్టీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు నిర్వహించడం.. అందులో ఆర్యన్ ఉండడం, అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం, ఆపై అరెస్ట్ పరిణామాలు అందరికీ తెలిసినవే. అయితే పిల్లల్ని సరిగ్గా పెంచడం చేతకానీ షారుక్.. ఓ మేధావి క్యారెక్టర్లో బైజూస్ యాడ్‌లో నటించడం, పేరెంట్స్‌కు పిల్లల విషయంలో పాఠాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం మింగుడు పడడం లేదని చాలామంది విమర్శిస్తున్నారు. దీంతో నిన్నంతా(ఆదివారం) బైజూస్ ట్యాగ్ ట్విటర్ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. పిల్లల్ని సక్రమంగా పెంచలేని షారుక్‌ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు బైజూస్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బైజూస్ రంగంలోకి దిగినట్లు సమాచారం. షారుక్‌ను అంబాసిడర్‌గా తప్పించడంతో పాటు ఇప్పటికే తీసిన యాడ్లను సైతం టీవీల్లో టెలికాస్ట్ కాకుండా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఓ జాతీయ మీడియా ప్రముఖంగా కథనం ప్రచురించింది. మరోవైపు ఈ వ్యవహారం ప్రభావంతో మరికొన్ని బ్రాండ్లు సైతం షారుక్‌కి దూరమయ్యే అవకాశం ఉందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా సినిమాలతో సక్సెస్‌కి దూరమైన షారుక్.. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్‌కూ దూరమైతే కష్టమే మరి! చదవండి: నా కొడుకు అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి: షారుక్ వీడియో వైరల్ జయపై ట్రోలింగ్ ఇక గతంలో బాలీవుడ్‌పై డ్రగ్స్ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. పార్లమెంట్ సాక్షిగా నటి జయా బచ్చన్, చిత్ర పరిశ్రమను వెనకేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జయను సైతం ఈ వ్యవహారంలోకి లాగి..‘‘Thali me ched wali’’ aunty పేరుతో ట్విటర్లో ఏకీపడేశారంతా. అసలు విషయం ఏంటంటే.. గతంలో నటుడు, లోక్‌సభ ఎంపీ రవికిషన్(రేసు గుర్రం ఫేమ్) గతంలో పార్లమెంట్లో మాట్లాడుతూ.. బాలీవుడ్లో డ్రగ్స్ సంస్కృతి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజ్యసభలో మాట్లాడిన జయా బచ్చన్.. కొందరి ఆధారంగా మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆవేశంగా ప్రసగించారు. అయితే ఆర్యన్ అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో ‘ఇప్పుడేమంటావ్ జయా ఆంటీ?’ అంటూ జయా బచ్చన్‌ను నిలదీస్తున్నారు చాలామంది నెటిజన్స్. Reminds me this epic defence of drug abuse in Bollywoodpic.twitter.com/EcBiD07aLy — Rishi Bagree (@rishibagree) October 3, 2021 #AryanKhan #JayaBachchan No Shor from "Thali me ched wali "aunty pic.twitter.com/fisoYanHCb — Shruti (@kadak_chai_) October 3, 2021 -
ముంబై తీరంలో రేవ్ పార్టీ.. ఎన్సీబీ అదుపులో షారుఖ్ కొడుకు?
డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసులు నమోదు అవ్వడం తెలిసిందే. తాజాగా అటువంటిదే ముంబై తీరంలో జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు ఓ షిప్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన బృందంతో కలిసి సముద్రం మధ్య క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 7 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత స్టార్ హీరో కొడుకుతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇంతకుమందు కూడా ఇలాగే సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియాడ్స్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా అనేక ఇతర బాలీవుడ్ ప్రముఖులను ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ విచారించింది. చదవండి: కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి -
డ్రగ్స్ కోసం దాడి: అవమానం తట్టుకోలేక ఫ్రెండ్ ఆత్మహత్య
లుధియానా: స్నేహితుడు తీవ్రంగా దాడి చేసి అవమానించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాబ్ లుధియానా సమీపంలోని ఖన్నా సిటీలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్వింధర్ సింగ్, సోను అనే ఇద్దరు యువకులు స్నేహితులు. అయితే సోను డ్రగ్స్ బానిసగా మారాడు. అయితే సోమవారం రోజు తన స్నేహితుడు సుఖ్వింధర్ సింగ్‌ను మోటర్‌సైకిల్‌పై వెళ్లి డ్రగ్స్ తీసుకురావాలని సోను చెప్పాడు. డ్రగ్స్ కోసం వెళ్లిన సుఖ్వింధర్ కొన్ని గంటల వరకు తిరిగి రాకుండా.. డ్రగ్స్ కూడా తీసుకురాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సోను సుఖ్వింధర్‌పై దాడి చేసి అవమానించాడు. చదవండి: బస్సులో బాలికపై అమానుషం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన సుఖ్వింధర్.. విషం దాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే సుఖ్వింధర్ కూడా సోనుతో పాటు కొంతకాలంగా డ్రగ్స్ తీసుకోవడంతో అతని శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు తెలిపారు. సుఖ్వింధర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సోను కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి.. -
Karnataka: అర్ధరాత్రి.. అడవిలో రేవ్ పార్టీలు
సాక్షి,బనశంకరి(కర్ణాటక): నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం అర్ధరాత్రి బెంగళూరు రూరల్ పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిపారు. పెద్దసంఖ్యలో యువతీ యువకులు మత్తు పదార్థాలను సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు. మోడల్స్, డీజే హంగామా నగరానికి చెందిన అభిలాష్ అనే వ్యక్తి రేవ్‌పార్టీ నిర్వాహకుడు. ఒక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. మోడల్స్‌ను, డీజేలను పిలిపించారు. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం కాగా నిర్వాహకులు అర్ధరాత్రి డీజేతో హోరు పెంచారు. చుట్టూ అడవి ఉండడంతో పార్టీ సంగతి ఎవరికీ తెలియదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకుల వాహనాల్ని, డీజే సామగ్రిని సీజ్ చేశారు. అడవిలో 30 మందికి పైగా ఉడాయించగా ఆనేకల్ పోలీసులు ఆదివారం గాలింపు చేపట్టారు. చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత -
మొదట తక్కువ ధరకు అమ్ముతారు.. బానిసగా మారిన తర్వాత..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ముగ్గురు స్నేహితులు డ్రగ్స్ దందాను ‘వ్యూహాత్మకంగా’ నిర్వహించారు. తాము విక్రయించే హష్ ఆయిల్‌కు ఎదుటి వారు బానిసలయ్యే వరకు తక్కువ రేటుకు అమ్మారు. ఇది తీసుకోకుండా ఉండలేని స్థితికి వాళ్లు చేరిన తర్వాత భారీ మొత్తానికి విక్రయించడం మొదలెట్టారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరిని పట్టుకుని వీరి నుంచి హష్ ఆయిల్‌తో కూడిన 25 చిన్న డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. దందా అంతా ఓ ప్లాన్ ప్రకారం ► బోరబండ పద్మావతి నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీకి ఘరానా నేరచరిత్ర ఉంది. గతంలో కొందరిపై కాల్పులు జరపడంతో ఇతడికి షూటర్ ఎజాజ్ అనే పేరూ వచ్చింది. ఇతగాడిపై విజయవాడలోనూ కేసు ఉంది. దాని విచారణ కోసం నిత్యం అక్కడి కోర్టుకు వెళ్లేవాడు. అక్కడే ఇతడికి అరకు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయమైంది. అతడు ఇచ్చిన సమాచారంతో గంజాయి, దాని నుంచి తీసే హష్ ఆయిల్ ఏజెన్సీలో దొరుకుతాయని తెలిసింది. ► ఇతడి స్నేహితులైన బోరబండ వాసి మహ్మద్ ఇబ్రహీం ఖాన్, యూసుఫ్‌గూడ వాసి మహ్మద్ ఖాజా ముబీనుద్దీన్‌తో కలిసి వీటిని తీసుకువచ్చి వినియోగించేవాడు. ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఈ ముగ్గురూ వాటి దందా మొదలెట్టారు. ► వ్యక్తిగత వాహనాలు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అక్కడకు వెళ్లే ఈ త్రయం హష్ ఆయిల్‌ను ఖరీదు చేసి తీసుకువస్తోంది. అక్కడ 5 ఎంఎల్ రూ.వెయ్యికి కొని.. నగరంలో రూ.2,500 వరకు విక్రయిస్తోంది. ఒక్కోసారి రూ.5 వేలకు అమ్ముతోంది. తమ వద్దకు కొత్తగా వచ్చిన కస్టమర్‌కు వీళ్లు హష్ ఆయిల్‌ను తక్కువ రేటుకు అమ్ముతారు. అలవాటు పెరిగి అతడు దీనికి బానిసగా మారిన తర్వాత హఠాత్తుగా ఎక్కువ మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు. ► భారీస్థాయిలో ఈ దందా చేస్తుండటంతో హైదరాబాద్, సైబరాబాద్ పరిధుల్లో నివసించే అనేక మంది డ్రగ్స్ వినియోగదారులకు వీరి పేర్ల సుపరిచితంగా మారాయి. దీంతో యథేచ్ఛగా హష్ ఆయిల్ విక్రయాలు చేస్తున్నారు. దీనిపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ సోమవారం వలపన్నారు. ► ఇబ్రహీం ఖాన్, ఖాజా చిక్కగా.. షూటర్ ఎజాజ్ పరారయ్యాడు. చిక్కిన ద్వయంతో పాటు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న హష్ ఆయిల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్సార్ నగర్ ఠాణాకు అప్పగించారు. చదవండి: ఇద్దరితో యువకుడి ప్రేమ.. వధువు కోసం లాటరీ! -
విషాదం: డ్రగ్స్ మధ్యలో నటుడి మృతదేహం
Michael K. Williams Death News: డ్రగ్స్ మత్తు మరో మంచి నటుడిని బలి తీసుకుంది!. హాలీవుడ్ సీనియర్ నటుడు మికాయిల్ కెన్నెత్ విలియమ్స్(54) డ్రగ్స్‌కు బానిసై కన్నుమూశాడు. హెచ్‌బీవో బ్లాక్‌బస్టర్ డ్రామా ‘ది వైర్’లో ఒమర్ లిటిల్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు మికాయిల్ కె విలియమ్స్. బ్రూక్లిన్‌లోని అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన మృతిని.. సోమవారం మధ్యాహ్నం పోలీసులు ప్రకటించారు. దశాబ్దాలుగా టీవీ ఆడియొన్స్‌ను అలరించిన మికాయిల్ కె విలియమ్స్.. ఐదుసార్లు ప్రైమ్‌టైం ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2021లోనూ ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’కి ఎమ్మీ నామినేషన్ దక్కించుకున్నారాయన. రెండురోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దగ్గరి బంధువు ఒకరు సోమవారం మైకేల్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. అక్కడ డ్రగ్స్ ప్యాకెట్స్ మధ్య విలియమ్స్ మృతదేహాంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు ఆ బంధువు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మికాయిల్ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్దారణ అయ్యింది. డ్రగ్స్ నుంచి బయటపడలేక.. ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తో ఆడియొన్స్‌కు బాగా గుర్తుండిపోయిన మికాయిల్ కె విలియమ్స్.. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్నారు. అయితే కొన్ని నెలలుగా ఆయన డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ అలవాటు గురించి ప్రస్తావించి.. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారాయన. బుల్లెట్లో మికాయిల్(కుడి చివర) 1966 నవంబర్‌లో బ్రూక్లిన్‌లో పుట్టిన మికాయిల్ విలియమ్స్.. 22 ఏళ్లకు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. సుమారు 50కిపైగా మ్యూజిక్ వీడియోలు చేశారు. 1996లో ‘బుల్లెట్’ మూవీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపైనా రాణించారు. మార్టిన్ స్కొర్సెజే డైరెక్షన్‌లోనూ.. ‘చాకీ, బ్రాడ్‌వాక్ ఎంపైర్, బెస్సీ, 12 ఇయర్స్ ఏ స్లేవ్’ లాంటి సినిమాల్లో నటనతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారాయన. అయితే మికాయిల్కు గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు దక్కింది మాత్రం ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తోనే. చదవండి: అబ్బాయి నుంచి అమ్మాయిగా.. -
ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే
అహ్మదాబాద్: ప్రేయసితో కలిసి ఉన్న మైకంలో ఆ యువకుడు తీవ్ర తప్పిదం చేశాడు. ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్ అంటించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఏమైందో తెలియదు గానీ తెల్లారి అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతి చెందాడు. పోస్టుమార్టానికి తీసుకెళ్లగా సంచలన విషయాలు తెలిశాయి. గర్భం రాకుండా ప్రైవేటు పార్ట్‌కు రాసుకున్న డ్రగ్‌తో అతడు మృతి చెందాడని తేలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. గంటల్లో) గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఫతేవాడికి చెందిన ఓ యువకుడు (25) తన ప్రేయసిని కలిశాడు. వారిద్దరూ మరో మహిళతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఒక గది తీసుకున్నారు. అంతకుముందు వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నారు. అనంతరం ఆ మత్తు మైకంలో వారు శారీరకంగా కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో సంరక్షణ మరిచారు. గర్భం రాకుండా ఉండేందుకు ఎలాంటి వస్తువు తెచ్చుకోకపోవడంతో ఆ యువకుడు అక్కడే ఉన్న జిగురుతో పాటు వైట్నర్ అంటించుకున్నాడు. అనంతరం వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు అతడు అంబర్ టవర్ ప్రాంతంలో పొదల చాటున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మృతదేహానికి సోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా ఆ డ్రగ్ అతడికి తీవ్ర ప్రభావం చూపినట్లు తేలింది. అతడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ‘ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ఏం జరిగిందో అందులో తెలుస్తుంది’ అని ఆ ప్రాంత డీసీపీ ప్రేమ్‌సుఖ్ డెలు తెలిపారు. ఈ ఘటన వైద్యులను నివ్వెరపరిచింది. సున్నితమైన అవయవాలకు ఇష్టమొచ్చినట్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కామం మైకంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్ -
మత్తు బానిసలు 275 మిలియన్లు!
న్యూయార్క్: మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ అని 50 ఏళ్ల క్రితం ఓ సినీకవి రాసిననట్టుగా యువత పెడదారి పడుతోంది. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు. తాజాగా వియన్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గురువారం విడుదల చేసిన ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను ఉపయోగించగా.. 36 మిలియన్లకు పైగా ప్రజలు మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలతో బాధపడుతున్నారని పేర్కొంది. 15 నుంచి 64 మధ్య వయస్సు ఉన్నవారిలో 5.5 శాతం మంది గత సంవత్సరం ఒక్కసారైనా డ్రగ్స్ ఉపయోగించారని తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగిందని ఈ నివేదక తెలిపింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా.. 42 శాతం మంది గంజాయి వాడకం పెరిగిందని చెప్పారు. అదే విధంగా ఇతర ఔషధాల వినియోగం కూడా పెరిగిందని వివరించారు. గత 24 ఏళ్లలో, కొన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. "మాదకద్రవ్యాల వాడకం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలియక చాలా మంది ఎక్కువ మోతాదులో డ్రగ్స్ వాడుతున్నారు. యూఎన్ఓడీసీ 2021 ప్రపంచ ఔషధ నివేదిక ఫలితాలు యువతకు అవగాహన కల్పించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి." అని యూఎన్ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గడా వాలీ ఆశా భావం వ్యక్తం చేశారు. చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. మరణాలు Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం -
Anti Drug Day: మత్తును ఆపకపోతే చిత్తే
‘మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ అని 50 ఏళ్ల క్రితం ఓ సినీకవి రాసిననట్టుగా యువత పెడదారి పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పూర్వపు జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్ర బిందువులుగా మారాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు అక్రమ రవాణా ప్రదేశాలలో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, మయన్మార్, కొలంబియా, మెక్సికో, పాకిస్తాన్‌తో పాటు ఇండియాను మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా అమెరికా ప్రభుత్వ నివేదిక గతంలో అభివర్ణించింది. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, యూకే జాతీయ నేర విభాగం, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్, ఆస్ట్రేలియా మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండటం వల్ల– దక్షిణ అమెరికాలోని మత్తు వ్యవస్థలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి. వాటి ఎజెండాను అమలు కానిస్తే, దేశానికి అంతకు మించిన విపత్తు ఉండదు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు. – డాక్టర్ ఎం.డి. ఖ్వాజా మొయినొద్దీన్ -
ఆ మత్తులో ఏంచేశానో.. 20 ఏళ్లకే హెచ్ఐవీ బారినపడ్డా
ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయడం సహజం. అయితే తాము చేసిన తప్పును గ్రహించి సరిదిద్దుకోని భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకునేవారు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే వాన్లాల్రువాటీ కోల్ని. మిజోరంకు చెందిన కోల్ని బాల్యంలోనే మత్తుపదార్థాలకు బానిసైంది. ఇరవై ఏళ్లకే హెచ్ఐవీ బారిన పడింది. అనేక ఇబ్బందులు ఎదురవ్వడంతో తను ప్రయాణించే మార్గం సరైనది కాదని గ్రహించి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తనలా బాధపడుతోన్న వారికి అండగా నిలుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఐజ్వాల్‌కు చెందిన 37 ఏళ్ల వాన్లాల్రువాటి కోల్నికి ఎలా అయిందో కానీ చిన్నప్పుడే డ్రగ్స్ అలవాటయింది. ఆ మత్తులో తను ఏం చేస్తుందో తనకి తెలిసేది కాదు. ఫలితంగా 20 ఏళ్లకే హెచ్ఐవీ బారిన పడడంతో శరీరంపై నొప్పితో కూడుకున్న గుల్లలు వచ్చి వాటి నుంచి చీము కారేది. దీంతో తను చికిత్స తీసుకునే ఆసుపత్రి సిబ్బంది ఆమె దగ్గరకు రావడానికి కూడా వెనకాడేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క సమాజం చూపే చీదరింపులు తనని మానసికంగా కుంగదీశాయి. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంది కోల్ని. పాజిటివ్ ఉమెన్స్ నెట్వర్క్ ఆఫ్ మిజోరం మారాలనుకున్న వెంటనే... డ్రగ్స్ తీసుకోవడం మానేసి ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రార్థనామందిరానికి వెళ్లడం ప్రారంభించింది. వాళ్ల బోధలతో తనని తాను మానసికంగా దృఢపరచుకుంది. సమాజంలో ఛీత్కారానికి గురవుతోన్న హెచ్ఐవీ రోగులను ఆదుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే 2007లో ‘పాజిటివ్ ఉమెన్స్ నెట్వర్క్ ఆఫ్ మిజోరం’(పీడబ్ల్యూన్ఎమ్) పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా హెచ్ఐవీతో బాధపడుతోన్న మహిళలను ఒక చోటకు చేర్చి వారిని మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించడం ప్రారంభించింది. హెచ్ఐవీ రోగుల హక్కులు కాపాడడం, వైద్యసాయం, పునరావాసం ఏర్పాటు చేయడం, వారికి ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను అనుసంధానించడం, వివిధ రకాల వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం...ఇలా ఇప్పటి వరకు ఆమె సంస్థ ద్వారా సుమారు పదివేలమందికి పైగా లబ్ధి పొందారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలోనూ ఎన్జీవో గూంజ్, యూఎన్ ఎయిడ్స్ సంస్థలతో కలిసి డ్రగ్స్ వ్యసనపరులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నారు. సమాజంలో ఎదురైన అనేక చీత్కారాలను దాటుకోని నిబద్ధతతో తన పీడబ్ల్యూఎన్ఎమ్ సంస్థను ముందుకు నడిపిస్తోన్న కోల్నికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2019లో హెల్త్ కేటగిరీలో ‘ఉమెన్ ఎక్సెంప్లార్ అవార్డు ఆమెను వరించింది. ‘‘ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలోనూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మా పరిధిలో చేయగలిగిన సాయం చేస్తున్నాం. గత 18 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో నేర్చుకున్నాను. ఈ అనుభవాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’ అని కోల్ని చెప్పింది. -
డ్రగ్స్ కేసు: నటి రాగిణి, సంజనాపై చార్జిషీట్
సాక్షి, బెంగళూరు : సంచలనాత్మక డ్రగ్స్ వాడకం– రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి ద్వివేది (30), సంజనా గల్రాని (31)తో పాటు 25 మందిపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ), కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్డీపీఎస్ కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. డ్రగ్స్ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్లో సమాచారం పొందుపరిచారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్లో ప్రస్తావించారు. డ్రగ్స్ కేసులో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచడం తెలిసిందే. రాగిణి మత్తు పార్టీలు ఇలా ► 2019 మే 26 న నటి రాగిణి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వద్ద గల హోటల్లో ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి పార్టీ నిర్వహించడం, ఎక్స్టసీ డ్రగ్ మాత్రల సేవనంతో పాటు ఇతరులకూ సరఫరా చేసినట్లు చార్జిషీట్లో ప్రస్తావించారు. ► 2020 జూలై 5 న యలహంక లెరోమా హోటల్లో పార్టీలో డ్రగ్స్ సేవించారు. ► 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్పెపే సాంబాకు ఫోన్ చేసి డ్రగ్స్ కొనుగోలు చేశారు. నైజీరియా పర్యాటకుడు నుంచి రాగిణి డ్రగ్స్ తీసుకుంది. ► ఆమె ఇతర నిందితులకు వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కావాలని అడిగారు. ఆమె ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ మొబైల్‌ఫోన్‌ను సోదా చేయగా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. సంజన గురించీ పెద్దసంఖ్యలో అభియోగాలు ఉన్నాయి. ► ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి డ్రగ్స్ డీల్ గురించి ఏమేం మాట్లాడారు అనేది ప్రస్తావించారు. 69వ పేజీలో 2018 డిసెంబర్ 8వ తేదీన నటి రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్ భార్య చేసిన చాటింగ్‌ను పొందుపరిచారు. -
డ్రగ్స్ ఎలా తీసుకోవాలో ఆ నటుడు నేర్పించారు
తెలుగింటి అమ్మాయిలా కనిపించే కేరళ కుట్టి పూర్ణ.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం నెగిటివ్ రోల్ చేయడానికి సైతం రెడీ అయిపోయింది. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా పవర్ ప్లే. కోట శ్రీనివాస రావ్, ప్రిన్స్, అజయ్, పూజా రామ్‌చంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో పూర్ణ విలన్‌గా నటించింది. మొదటిసారి నెగిటివ్ రోల్ చేస్తున్న పూర్ణ..ఈ సినిమాలో డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిగా కనపించనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పూర్ణ..ఈ సినిమాతో తాను కొత్తగా కనిపిస్తానని, మొదటిసారి నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్లు చెప్పింది. ఇందులో డ్రగ్ అడిక్ట్‌గా కనిపిస్తానని, ఇందుకోసం చాలా కష్టపడ్డానని, డ్రగ్స్ ఎలా తీసుకోవాలో తనకు తెలియక పోవడంతో షూటింగ్ సమయంలో కొంత ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ముక్కుతో డ్రగ్‌ను పీల్చే సన్నివేశాలు ఉంటాయని, అయితే డ్రగ్స్ ఎలా తీసుకుంటారో తెలియక ఒక్కోసారి ఆ పౌడర్ ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది. ఈ క్రమంలో సెట్లో ఉన్న ఓ నటుడు డ్రగ్‌ను ఎలా పీల్చాలో నేర్పించాడని, అది చాలా హెల్ప్ అయ్యిందని చెప్పింది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు (మార్చి5)న విడుదల అయ్యింది. చదవండి : (రియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సోనం) (మీపై ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేను!) -
ఓవర్‌డోస్.. 5 నిమిషాలకు మించి బతకదు
అమెరికన్ పాప్ స్టార్ డెమి లోవాటో త్వరలోనే ఓ డాక్యుమెంట్ సిరీస్‌తో మన ముందుకు రాబోతున్నారు. ‘‘డ్యాన్సింగ్ విత్ డెవిల్’’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంట్‌ని యూట్యూబ్ వేదికగా విడుదల చేయనున్నారు. తాజాగా బుధవారం ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కి సంబధించి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో డెమి లోవాటో బాల్యం నుంచి నుంచి.. 2018లో డ్రగ్స్ ఓవర్‌డోస్ వరకు ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనలు ఉన్నాయి. దాంతో పాటు డెమి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె జీవితంలో చూసిన చీకటి రోజుల గురించి.. వాటి నుంచి ఆమె ఎలా బయటపడగలిగారు అనే విషయాల గురించి వారు మాట్లాడటం ఈ వీడియోలో చూడవచ్చు. డ్రగ్స్ ఓవర్‌డోస్ అవ్వడం వల్ల 2018లో డెమి లోవాటోకి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. డ్రగ్స్ పరిమితికి మించి తీసుకోవడం వల్ల వచ్చి లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో స్పృహ తప్పి పడిపోయారు డెమి లోవాటో. సమయానికి సిబ్బంది గమనించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. హాస్పటిల్‌లో ఉండగానే తనకు మూడు సార్లు స్ట్రోక్ వచ్చిందని డెమి లోవాటో వెల్లడించారు. ఈ సందర్భంగా డెమి లోవాటో మాట్లాడుతూ.. ‘‘25వ ఏట నా జీవితంలో భయానక సంఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల లాస్ ఏంజెల్స్‌లోని నా నివాసం ‘‘హాలీవుడ్ హిల్స్’’లో స్పృహ తప్పి పడిపోయాను. నా పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నన్ను పరీక్షించిన వైద్యులు 5,10 నిమిషాల కన్న ఎక్కువ సమయం బతకను అని తేల్చారు. ఆ సమయంలో నాకు వెంట వెంటనే మూడు సార్లు స్ట్రోక్ వచ్చింది. తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చింది. నా పని అయిపోయింది అనుకున్నారు. కానీ అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాను’’ అన్నారు, ‘‘ఆ తర్వాత కూడా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. నా బ్రెయిన్ డ్యామెజ్ అయింది. ఆ ప్రభావం నా మీద ఇంకా ఉంది. దాని వల్ల నేను సొంతంగా కారు డ్రైవ్ చేయలేకపోతున్నాను. ఇక మెదడు పని తీరు సరిగా లేకపోవడం వల్ల కంటి చూపు సరిగా లేదు. కనీసం న్యూస్ పేపర్ కూడా చదవలేను. ఇలా రెండు నెలలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. ప్రస్తుతం బుక్ చదవగలను. కానీ రోడ్డు చూస్తూ డ్రైవింగ్ చేయడం చాల కష్టం’’ అన్నారు డెమి లోవాటో. చదవండి: ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!? ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి -
అతి వినియోగం.. అన్ని వయసులవారూ బలి
సాక్షి, బెంగళూరు: దేశంలో 2017–19 మధ్యకాలంలో మాదకద్రవ్యాల అతి వినియోగం వల్ల 2,300 మంది మృత్యువాతపడ్డారు. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన వివరాల ప్రకారం మితిమీరి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల 2017 ఏడాదిలో 745 మంది, 2018లో 875 మంది, 2019లో 704 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రస్థానంలో రాజస్థాన్, కర్ణాటక, యూపీ అతి ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్న రాష్ట్రాల్లో కర్ణాటక రెండో స్థానంలో నిలవడం గమనార్హం. మొదటి స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 2017–19లో రాజస్థాన్‌లో 338 మంది, కర్ణాటకలో 239 మంది, ఉత్తరప్రదేశ్‌లో 236 మందిని డ్రగ్ ఓవర్‌డోస్ బలిగొంది. అన్ని వయసులవారూ బలి డ్రగ్స్ భూతానికి 30–45 ఏళ్ల మధ్య వయసున్న వారే అత్యధికంగా (784) మంది మరణించారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు డ్రగ్స్‌కు బానిసయ్యారు. 14 ఏళ్ల లోపు వయసున్న వారు 55 మంది, 14–18 ఏళ్ల మధ్య ఉన్నవారు 70 మంది డ్రగ్స్‌కు అసువులుబాశారు. మృతుల్లో 18–30 ఏళ్ల మధ్య వయసున్న వారు మొత్తం 624 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్లు పైబడిన వారు 241 మంది మత్తు సేవనానికి బలయ్యారు. చదవండి: నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా?: మాజీ సీఎం టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి -
30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలు
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్ధాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చిన్నారులను వాటి నుంచి దూరం చేయలేకపోతున్నారనడానికి దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యానికి బానిసయ్యారనే విషయమే నిదర్శనం. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ), ఎయిమ్స్, ఢిల్లీల ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా పలు అంశాలు వెల్లడించారు. దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలేనని తెలిపారు. తొలిసారిగా 2017–18లో మత్తుపదార్ధాల వినియోగంపై సర్వే నిర్వహించామని ఆయా వివరాలు 2019లో ప్రచురించామని తెలిపారు. ప్రజలను మద్యం బానిస నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేశామని తెలిపారు. జువైనల్ హోమ్స్‌లో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మత్తుపదార్ధాలకు బానిసలైన చిన్నారులను ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారిని సంరక్షించాలని సూచించామన్నారు. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట అవగాహన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. 10 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారులను గుర్తించి వారికి అవగాహనతోపాటు ఇతరత్రా నైపుణ్య కార్యక్రమాల్లో భాగస్తులను చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి కటారియా పేర్కొన్నారు. -
8-10 టాబ్లెట్లు.. 4 గంటల మత్తు!
చెన్నై : మత్తుకు అలవాటు పడి మెడికల్ షాపులను దోచుకుంటున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైకి చెందిన పింకీ అలియాస్ అరుణ్ కుమార్(21) మత్తుకు అలవాటు పడ్డాడు. మందు, గంజాయి కొనటానికి డబ్బులేని సమయంలో మెడికల్ షాపులనుంచి టాబ్లెట్లు దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే ఖరీదైన మందులను మాత్రమే దొంగిలించేవాడు. తను దొంగతనం చేయబోయే షాపులలో ఆ టాబ్లెట్లు ఉన్నాయా లేదా అని విచారించుకునేవాడు. బాక్సుల మీద ఉన్న పేర్లను గుర్తుపట్టి వాటిని తీసుకెళ్లేవాడు. ( ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు ) అనంతరం 8-10 టాబ్లెట్లను నీళ్లతో కలిపి ఓ మిశ్రమంలా తయారుచేసేవాడు. ఆ తర్వాత దాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. దీంతో దాదాపు నాలుగు గంటలపాటు మత్తులో ఉండేవాడు. ఓ మెడికల్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. చదవండి : ‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’ -
పేటలో వ్యభిచారం.. ‘ఆమె’ చెరలో 16 మంది
సాక్షి, సూర్యాపేట క్రైం : రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుట్టుగా వ్యభిచారం సాగుతోంది. పట్టణంలోని అంజనాపురి కాలనీకి చెందిన ఓ మహిళ బాలికల చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు మరో ముగ్గురు కలిసి వివిధ చోట్ల వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నట్లు గురువారం వెలుగుచూడడంతో ఈ విషయం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో హైటెక్ బస్టాండ్ సమీపంలో ఓ బాలిక (13) ఫూటుగా మద్యం సేవించి ఉండడంతో ఓ వ్యక్తి 181 సఖి కేంద్రానికి సమాచారం చేరవేశారు. సఖి కేంద్రం నిర్వాహకులు ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..) తన స్వస్థలం సూర్యాపేట పట్టణమేనని.. తనకు తల్లి కూడా ఉన్నట్లు విచారణలో చెప్పింది. అంజనాపురి కాలనీకి చెందిన మహిళ తనతోపాటు మరో 15మంది బాలికల చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో మూడు రోజులక్రితం ఆ బాలిక వారినుంచి తప్పించుకుంది. దీంతో సఖి కేంద్రం నిర్వాహకులు ఈ విషయాన్ని సూర్యాపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెతికి మళ్లీ ఆ బాలికను సఖికేంద్రం వారికి అప్పగించారు. బాలికను గురువారం నల్లగొండ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సూర్యాపేట సఖి కేంద్రం నిర్వాహకులు తెలిపారు. బాలికలకు డ్రగ్స్, మద్యం సదరు మహిళ.. బాలికలకు మద్యం, గుట్కాలు, డ్రగ్స్, గంజాయి అలవాటు చేయడంతోపాటు హార్మోన్ ఇంజెక్షన్లు కూడా వేయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యభిచారం మార్చి నుంచే జిల్లా కేంద్రంలో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంజనాపురి కాలనీలోనే కాకుండా విద్యానగర్‌లో కూడా వ్యభిచారం దందా నడిపిస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలికల చేత వ్యభిచారం నడిపిస్తున్న ముఠా సభ్యుల గుట్టు రట్టు చేయడంలో పోలీసుల గోప్యతపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్‌కుమార్‌ను వివరణ కోరగా.. బాలికలచే జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పక్కా సమాచారంతో నేరుగా వ్యభిచార గృహంపై దాడి చేసి మహిళ గుట్టు రట్టు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తమ అదుపులో వ్యభిచార గృహం నిర్వహించే ముఠా సభ్యులు ఎవరూ కూడా లేరన్నారు. (రూరల్ సీఐ పోలీసు వాహనం చోరీ) ఆమె చెరలో పలువురు బాలికలు అంజనాపురి కాలనీలోని మహిళ తన నివాసంతో పాటు మరో రెండు నివాస గృహాలను అద్దెకు తీసుకొని వ్యభి చారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురు కలిసి విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ఈ దందాను నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాలికలను టార్గెట్ చేసుకుని వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు తెలిసింది. మరో 15మంది బాలికలు వ్యభిచార గహాల్లో ఉన్నట్లు బాలిక ఇచ్చిన సమాచారంతో వెలుగుచూసింది. (కాసేపట్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి ఎంట్రీ) కూతవేటు దూరంలో ఠాణాలు.. ఇంటలిజెన్స్ సీఐ కార్యాలయం అంజనాపురి కాలనీకి సూర్యాపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లు కూతవేటు దూరంలోనే ఉంటాయి. కానీ పోలీసులు పూర్తిస్థాయిలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం ఆ రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది తిరగడమే కాకుండా.. అదే ప్రాంతంలో ఇంటలిజెన్సీ సీఐ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ, హైటెక్ బస్టాండ్ సమీపంలో బాలిక తిరుగుతుండగా.. అజ్ఞాతవాసి సఖి కేంద్రానికి ఇచ్చిన సమాచారంతో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ లీలలను కనుగొనలేకపోవడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. -
పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్
సాక్షి, ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి ఎన్సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్‌ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) కరిష్మా ప్రకాష్‌కు డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్‌లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లను కూడా గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్
బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్ కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో కొంత మంది ప్రముఖులు వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది. లాక్డౌన్ సమయంలో ఆల్వా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యింది. చదవండి: డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు.. -
ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి
‘‘కొన్ని రోజులుగా ఓ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీ వల్ల ఏం మాట్లాడాలో ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్లో డ్రగ్స్ కాంట్రవర్శీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం గురించి అక్షయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మమ్మల్ని స్టార్స్‌ని చేసింది ప్రేక్షకులే. సినిమాల ద్వారా మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని మేం ప్రచారం చేస్తుంటాం. సుశాంత్ మరణం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. మన ఇండస్ట్రీలో ఉన్న తప్పొప్పుల్ని సమీక్షించుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. కానీ అందరూ తీసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరినీ దోషులుగా చూడొద్దు. ఇది కరెక్ట్ కాదు’’ అని అన్నారు అక్షయ్ కుమార్. -
నలుగురిదీ ఒక్కటే మాట..
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో జరుపుతున్న విచారణలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేతికి కీలక విషయాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌లు ఎన్సీబీకి చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ‘హ్యాష్’ మత్తు పదార్థం కాదనే విషయాన్నే వీరు నలుగురూ చెప్పినట్లు సమాచారం. అయితే, ఇదే విషయం వీరిని మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. దీంతోపాటు, వీరు కీలక సమాచారాన్ని ఎన్సీబీ అధికారుల ఎదుట బయటపెట్టినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఈ హీరోయిన్లను మరోసారి ప్రశ్నించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, సమీర్ వాంఖడే, అశోక్ జైన్ రూపొందించిన సమగ్ర నివేదికపై ఆదివారం రాత్రి ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 20 మంది బడా డ్రగ్ సరఫరాదారులపై ఎన్సీబీ కన్నువేసినట్లు సమాచారం. కోర్టులో కరణ్ పేరు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాల కేసుల్లో దర్శకుడు కరణ్ జోహార్ పేరును ప్రస్తావించారు రియా చక్రవర్తి– క్షితిజ్ రవి ప్రసాద్ తరఫు లాయర్ సతీశ్ మనేషిండే. ఈ కేసులో కరణ్ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్‌ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్‌కు ఆదివారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్ జోహార్ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు. ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు. 2019లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబైకి వస్తున్న కరణ్‌ను గోవా ఎయిర్‌పోర్టులో మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడలేదు. తనకు డ్రగ్స్ అలవాలు లేదనీ ఆయన గతంలోనే వ్యాఖ్యానించడం తెల్సిందే. -
నాకు డ్రగ్స్ అలవాటు లేదు
ముంబై: ముంబైలోని తన నివాసంలో గత ఏడాది జరిగిన పార్టీలో బాలీవుడ్ ప్రముఖ యువనటులు డ్రగ్స్ వాడారంటూ వస్తున్న వార్తలపై దర్శక–నిర్మాత కరణ్ జోహార్ గట్టిగా స్పందించారు. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదనీ, వాటిని వాడాలంటూ ఎవరినీ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తను, తన కుటుంబం, సన్నిహితులు, తన బ్యానర్ ధర్మా ప్రొడక్షన్‌పై జరుగుతున్న ప్రచారం విద్వేషపూరితం, అసంబద్ధం అని తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపైనా కరణ్ జోహార్ స్పందించారు. వీరిద్దరిలో ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. ‘ఈ వ్యవహారంలో మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నా’అని పేర్కొన్నారు. -
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు. దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను శనివారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. మీడియాకు పోలీసుల వార్నింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్‌పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శాండల్‌వుడ్ కేసులో టీవీ యాంకర్.. మంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్‌తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. విచారణలో వీరేమన్నారు ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్లను అధికారులు సీజ్‌చేశారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ
ముంబై: మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు హాజరయ్యారు. నటుడు సుశాంత్‌సింగ్ మృతి, తదనంతరం వెలుగు చూసిన తారల డ్రగ్స్ వినియోగం, సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్ శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆమెను ఎన్సీబీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. నటి దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాశ్‌ను అధికారులు శనివారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. దీపిక పదుకోన్‌ను శనివారం విచారించనున్నట్లు సమాచారం. క్షితిజ్ రవిని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. రవి ఇంట్లో ఎన్సీబీ జరిపిన సోదాల్లో డ్రగ్స్ లభించినట్లు సమాచారం. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్‌తో పాటు పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. సుశాంత్‌సింగ్ కోసం రియా తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ తెప్పించేదని ఎన్సీబీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అది నిజమేనని విచారణలో షోవిక్ కూడా అంగీకరించాడు. పారిహార్, కైజెన్ ఇబ్రహీంల నుంచి డ్రగ్స్‌ను సేకరించిరియాకు ఇచ్చేవాడినని తెలిపాడు. వాటితో రాజ్‌పుత్ మేనేజర్ సామ్యూల్ మిరండా, కుక్ దీపేశ్‌సావంత్ సిగరెట్లు తయారు చేసేవారని షోవిక్ చెప్పాడు. ఎన్సీబీ అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. రియా కుటుంబం పాల్పడిన నగదు అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా ఈ డ్రగ్స్ కోణం ఈడీ దృష్టికి వచ్చింది. దాంతో, ఈడీ ఈ విషయాన్ని ఎన్సీబీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్సీబీ విచారణలో డ్రగ్స్ సరఫరాలో కీలకమైన జాయిద్ పాత్ర బయటపడింది. లాక్డౌన్ కారణంగా తన హోటెల్ బిజినెస్ దెబ్బతిన్నదని, అందువల్ల ఈ డ్రగ్స్ దందాలో దిగానని జాయిద్ ఎన్సీబీ విచారణలో వెల్లడించాడు. బాసిత్ పారిహర్ పేరు కూడా జాయిదే వెల్లడించాడు. అలాగే, కైజెన్ ఇబ్రహీంను విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ సప్లైయర్ అనుజ్ కేశ్వానీ పేరు తెరపైకి వచ్చింది. బాంద్రాలోని ఆయన ఇంటిపై జరిపిన దాడిలో భారీగా చరస్, గంజాయి, టీహెచ్‌సీ, ఎల్సీడీ మాదకద్రవ్యాలు లభించాయి. రియా, షోవిక్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. కరణ్ జోహార్‌ను కూడా? పలువురు బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు కనిపించిన ఒక వీడియోను అప్లోడ్ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోçహార్ను కూడా ఎన్సీబీ విచారించనుందని శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. చాలా కాలం క్రితం నాటి ఆ వీడియోను సాక్ష్యంగా చూపుతూ మంజిందర్ సింగ్ తాజాగా ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎన్సీబీ ఆ వీడియో నిజానిజాలను నిర్ధారించేందుకు టెస్టింగ్‌కు పంపించింది. -
డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!
కోల్‌కతా: బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి స్పందించారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు మాత్రమే మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల కోసం పరితపించిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు కేవలం నటీమణులకు మాత్రమే సమన్లు జారీ అయిన నేపథ్యంలో తనదైన శైలిలో ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు.. ‘‘అవును.. పితృస్వామ్యమా.. బాలీవుడ్లో ఉన్న మహిళలు హష్, డ్రగ్స్ సహా ఇంకేం కావాలనుకున్నా దాన్ని దక్కించుకుంటారు. అయితే అక్కడున్న పురుషులు మాత్రం వంటపని, ఇంటిపనిలో నిమగ్నమై, తమ భార్యలు బాగుండాలంటూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు కళ్ల నిండా నీళ్లు నింపుకొని.. ‘‘దేవుడా తనను కాపాడు’’ అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంటారు’’అని మిమి చక్రవర్తి చురకలు అంటించారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బయటపడ్డ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే అతడి ప్రేయసి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకు ఒక్క నటుడి పేరు కూడా ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మిమి చక్రవర్తి ఈ మేరకు స్పందించారు. ఇక తనను వేధించిన ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కాగా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మిమి టీఎంసీలో చేరి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాదవ్‌పూర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: మిమి చక్రవర్తితో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన) Yes patriarchy Women in bollywood go for Hash nd drugs or whatever nd men in bollywood cook nd clean nd pray for their better half wit joined hands nd tears in eye “Bhagwan unki raksha karna” — Mimssi (@mimichakraborty) September 24, 2020 -
డ్రగ్స్: ప్రముఖ టీవీ నటి ఇంట్లో సోదాలు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్సీబీ ఎదుట హాజరుకాగా, తాజాగా డ్రగ్స్ సెగ టీవీ నటులను కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర నటి అబిగేల్ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ జంట ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈ క్రమంలో డ్రగ్ డీలర్లు, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్న తీరు గురించి అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా అబిగేల్ పాండే, సనం జోహార్ నచ్ బలియే వంటి పలు ప్రముఖ షోల్లో పాల్గొని ప్రాచుర్యం పొందారు. ఇక బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోని ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ పేర్లతో పాటు రకుల్ ప్రీత్‌సింగ్, నమ్రతా శిరోద్కర్, దియా మీర్జా పేర్లు తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ దగ్గర పనిచేసిన టాలెంట్ మేనేజర్ జయ సాహాతో మత్తు పదార్థాల గురించి చాట్ చేసినట్లుగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే. -
నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు: దియా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్‌కు చెమటలు పట్టిస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణలో టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ పేర్లు బయటకు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా నటి దియా మీర్జా పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ ఎన్సీబీ అధికారుల విచారణలో వెల్లడించారని, దీంతో దియాతో పాటు, ఆమె మేనేజర్‌ను కూడా విచారణకు పిలిచే అవకాశమందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఎన్సీబీ జాబితాలో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ పేర్లు) ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన దియా తనెప్పుడూ మాదక ద్రవ్యాలను తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఇలాంటి ఆరోపణలు.. తన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా తనెంతో కష్టపడి నిర్మించుకున్న కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదంటూ వరుస ట్వీట్లు చేశారు. కాగా ఈ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు: తెరపైకి నమ్రత పేరు) -
డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధా కపూర్ పేర్లు
ముంబై: సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై కొనసాగుతున్న దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో బాలీవుడ్‌కు చెందిన ఐదుగురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ కూడా ఉన్నట్లు వినికిడి. త్వరలోనే వీరిద్దరికీ సమన్లు పంపే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్సీబీకి లభ్యమైన డ్రగ్స్ సరఫరాదారుల ఫోన్లలోని వాట్సాప్ కోడ్ చాట్లను బట్టి..డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖుల్లో ప్రధానంగా కె, డి, ఎస్, ఎన్, జెల పేర్లు ఉన్నాయి. ఇందులో ‘డి’ని వైరల్‌గా మారిన కరణ్ జోహార్ పార్టీ వీడియోలో కనిపించిన దీపికా పదుకొణెగాను, ‘కె’ను దీపికా పదుకొణె మేనేజర్, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉద్యోగి అయిన కరీష్మాగా భావిస్తున్నారు. ‘ఎస్’అంటే శ్రద్ధా కపూర్ అనీ, ‘ఎన్’ను 90లలో బాలీవుడ్ ప్రముఖ నటి, ‘జె’ను జయ సాహాగా భావిస్తున్నారు. సుశాంత్‌తో కలిసి సారా అలీఖాన్ ‘కేదార్నాథ్’లోనూ శ్రద్ధాకపూర్ ‘చిభోర్’ సినిమాలోనూ నటించారు. వీరిద్దరూ కూడా సుశాంత్‌తో కలిసి పుణే సమీపంలోని ఓ దీవిలో జరిగిన పలు పార్టీల్లో పాల్గొన్నట్లు తాజా విచారణలో వెల్లడైందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఎన్సీబీ అధికారులు సోమవారం సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాను, మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీని ప్రశ్నించారు. ఈ విచారణలో జయా సాహా.. మరికొందరు సినీ ప్రముఖల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్సీబీ ఈ వారంలోనే సారా అలీఖాన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం కరీష్మాను ఎన్సీబీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా, నటి రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోన్ ఖంబట్టాలను కూడా వచ్చే వారంలో విచారించే అవకాశం ఉంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తి సహా పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్ వాడిన రియా!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో భాగంగా.. మాదక ద్రవ్యాల గురించి చాట్ చేసేందుకు ఆమె తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీని ద్వారానే రియా తన స్నేహితులతో సంప్రదింపులు జరిపేదని, మరెన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోన్ ద్వారా ఆమె కనెక్ట్ అయి ఉందని తమకు సమాచారం అందినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రియా.. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. (చదవండి: రియాను హనీ ట్రాప్‌గా ఉపయోగించారు: నటి) అయితే అప్పుడే తన వద్ద ఫోన్లను స్వాధీనం చేసుకునే క్రమంలో రియా ఈ మొబైల్‌ను ఈడీ అధికారులకు అప్పగించలేదని తెలిసింది. ఇక ఈడీ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి సంబంధించిన చాట్స్ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రియా తల్లి సంధ్యా చక్రవర్తి ఫోన్ వాట్సాప్ గ్రూపులో ఉన్న పలువురిపై కూడా ఎన్సీబీ దృష్టి సారించినట్లు సమాచారం. రియాతో డ్రగ్స్ గురించి చాట్ చేసిన పలువురిని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..) ఇక సుశాంత్ బలవనర్మణం నేపథ్యంలో అనేక కీలక మలుపుల అనంతరం ఎన్సీబీ రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్రా, బాసిత్ పరిహార్ తదితరులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా షోవిక్ వెల్లడించిన వివరాల ఆధారంగా రియాతో పాటు సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో సెప్టెంబరు 22 వరకు ఎన్సీబీ అదుపులో ఉండనున్నారు. -
డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా
"నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే ముంబై వదిలి వెళ్లిపోతా" అన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. గతంలో చేదు అనుభవాల గురించి మాట్లాడిన వీడియో ఆమెను పెద్ద ఇరకాటంలో పడేసింది. ఈ ఏడాది మార్చిలో కంగనా తన జీవితంలోని చెడు అధ్యాయాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. 15 ఏళ్లకే ఇల్లు విడిచి పారిపోయానన్నారు. ఆ తర్వాత రెండేళ్లకే సినిమా స్టార్‌ను అయ్యానని చెప్పారు. యుక్త వయసు వచ్చేసరికి డ్రగ్స్‌కు కూడా బానిసగా మారిపోయానని చెప్పుకొచ్చారు. అప్పుడు తన జీవితమంతా గందరగోళంగా మారిపోయిందని, తాను తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడ్డానని గ్రహించానని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. (చదవండి: కంగన వెనుక ఎవరున్నారు?) కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కాగా సుశాంత్ ఆత్మహత్య కేసు మొదలు కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలో కంగనా ముంబైని పీఓకేతో పోల్చడం, బీఎంసీ అధికారులు కంగనా ఆఫీసును పాక్షికంగా కూల్చివేయడం వంటి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా 2016లో కంగనా మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. (చదవండి: చిన్నప్పుడే డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా) కంగనా మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ వైరల్ కంగనా తనను కొకైన్ తీసుకోవాలని ఒత్తిడి చేసిందని, ఆమె మాదక ద్రవ్యాలను సేవించిందంటూ సుమన్ పలు సంచలన విషయాలను వెల్లడించాడు. దీంతో ఈ వీడియోల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించగా.. వారికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?) View this post on Instagram #KanganaRanaut talks about the time when she couldn’t close her eyes because tears won’t stop. 🙏🙏 A post shared by Kangana Ranaut (@kanganaranaut) on Mar 29, 2020 at 1:27am PDT -
మళ్లీ డ్రగ్స్ కలకలం.. తెరపైకి రకుల్ పేరు
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో చిచ్చురేపుతున్న డ్రగ్స్ మంటలు.. తాజాగా తెలుగు చలనచిత్ర సీమనూ తాకాయి. టాలీవుడ్లో డ్రగ్స్ ఆరోపణలు కొత్తేం కాకపోయినా.. ఈసారి ఇద్దరు తెలుగు హీరోయిన్లపై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ గమ నించాల్సిన అంశం ఏంటంటే.. ఈ ముగ్గురు కథా నాయికలూ తెలుగులో నటించిన వారే కావడం. వాస్తవానికి నటుడు సుశాంత్ సింగ్ అనుమానా స్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ సీబీకి రియా.. డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురు సెలబ్రి టీల పేర్లు చెప్పిందని సమాచారం. అందులో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్ పేర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. రియా చక్ర వర్తి, రకుల్ ప్రీత్‌సింగ్ ఇద్దరూ టాలీవుడ్ నటులే. రకుల్ ప్రీత్‌సింగ్ కన్నా ముందే.. రియా చక్రవర్తిటాలీవుడ్లో 2012లో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత సంవత్సరంలో రకుల్ ప్రీత్‌సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి ఎన్ సీబీ అధికారు లకు వెల్లడించిన దాదాపుకు 25 మందికిపైగా పేర్లలో రకుల్ ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సదరు 25 మంది సెలెబ్రిటీలను త్వరలోనే విచారణకు రావాల్సిందిగా ఎన్ సీబీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని సమా చారం. మరోవైపు రకుల్ మాత్రం వికారాబాద్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో బిజీగా గడిపారు. శనివారం ప్రసార మాధ్యమాల్లో డ్రగ్స్ వివాదంలో ఆమె పేరు ఉందన్న ప్రచారం తీవ్రం కావడంతో షూటింగ్ నుంచి ఆమె వెళ్లిపోయారని తెలిసింది. అభిమానులు ఆమెకు అండగా నిలుస్తుంటే.. నెటిజన్లు మాత్రం నిష్పక్షపాత విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టాలీవుడ్లో బయటపడ్డ డ్రగ్స్ కేసులో పలువురు తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లను అప్పటి ఎక్సైజ్ శాఖ విచారించిన సంగతి తెలిసిందే. తరువాత ఈ కేసు క్రమంగా నీరుగారిందన్న విమర్శలున్నాయి. 2017లో ఏం జరిగిందంటే..? ఎక్సైజ్ అధికారులు 2017, జూలై 24న మణికొండలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో మేనేజర్‌గా పనిచేస్తున్న పుట్టకర్ రాన్సన్ జోసెఫ్ అనే వ్యక్తి ప్లాట్‌పై దాడులు చేశారు. ఈ సందర్భంగా గంజాయి, హుక్కా తదితర నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని విచారించగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారం సంచలనం సృష్టించింది. దీంతోపాటు రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో అలెక్స్ విక్టర్ అనే దక్షిణాఫ్రికా దేశస్తుడి వద్ద కొకైన్ పాకెట్లు లభించాయి. వీరంతా నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్ల చిన్నారులకు కూడా డ్రగ్స్ (ఎల్ఎస్డీ) విక్రయిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం మొదట్లో తీవ్రంగానే పరిగణించింది. ఈ కేసులను లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ )ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సిట్ అధికారులు 62 మంది సినీరంగంతో సంబంధం ఉన్న ప్రముఖులను విచారణకు పిలిచారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయస్థాయిలో పెద్ద దుమారాన్నే లేపింది. విచారణకు వచ్చిన పలువురు సెలబ్రిటీలు తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. వీరిలో పలువురిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరగడం తీవ్ర ఉత్కంఠ రేపింది. తరువాత ఎక్సైజ్ నుంచి అకున్ సబర్వాల్ బదిలీ కావడం, ఈ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. సంజన కూడా.. అదే సమయంలో ప్రస్తుతం ఇవే ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి సంజన కూడా గతంలో తెలుగులో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. గతంలో సంజనతో తెలుగులో కలిసి పనిచేసిన ఓ దర్శకుడు, సహనటులు, టెక్నీషియన్లు కూడా 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవ్వడం గమనార్హం. మూడేళ్ల తరువాత సంజన కూడా అదే కేసులో అరెస్టవడం విశేషం. 2017 డ్రగ్స్ కేసు కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనూ కొందరు నటులపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అసలు ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం కొత్తేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే గ్లామర్‌తో ముడిపడిన సినీపరిశ్రమకు డ్రగ్స్‌కు విడదీయరాని సంబంధం ఉంది. ఎలాగంటే.. ముఖంపై ముడతలు కనిపించకూడదని, బాడీ ఫిట్నెస్గా ఉండాలని, చర్మం కాంతులీనేందుకు, వెండితెరపై నిత్యం యవ్వనంతో కనిపించాలని, వేగంగా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని రకరకాల కారణాలతో కొందరు నటులు డ్రగ్స్ తీసుకుంటుంటారు. ముందు హడావుడి.. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే.. అరెస్టు చేస్తామని మీడియాకు గతంలో లీకులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 62 మంది చిత్రసీమ వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన అధికారులు నటుల గోళ్లు, వెంట్రుకలు, ఇతర నమూనాలు తీసుకుని హడావుడి చేశారు. అరెస్టులు తప్పవన్న ప్రచారం జరిగింది. కానీ, తరువాత ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీటులో ఒక్క సినిమా వ్యక్తి పేరు లేక పోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పటికీ ఈ కేసును విచారిస్తున్నామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఒకవేళ కేసులు పెట్టినా.. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూపిస్తే వారికి పెద్దగా శిక్షలేమీ పడక పోవచ్చ న్నది న్యాయనిపుణుల అభిప్రాయం. ఇప్పుడూ కేసులు నమోదైనా.. అవి నిలిచేనా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. -
చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడున్నారు
సాక్షి, హైదరాబాద్ : సినీ రంగమంతా డ్రగ్స్మత్తకు బానిసగా మారిపోయిందని మాజీ ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్ అన్నారు. బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ లింక్స్ ఉంటాయని అన్నారు. డ్రగ్స్ వాడకం, సరఫరాకు ఏమాత్రం పరిధులు లేవున్నారు. తన దర్యాప్తులో భాగంగా డ్రక్స్కు బానిసలుగా మారిన ఎంతోమంది నటులను చూశామని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలను డ్రక్స్ కేసు ఊపేస్తున్న తరుణంలో చంద్రవదన్ సాక్షి మీడియాతో మాట్లాడారు. చాలామంది నటులు గ్లామర్ కాపాడుకోవాలంటే డ్రగ్స్ వాడక తప్పదని తమతో చెప్పారని వెల్లడించారు. సమాజంపై డ్రగ్స్ ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభత్వం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. (డ్రగ్స్ : షూటింగ్ నుంచి వెళ్లిపోయిన రకుల్) శనివారం సాక్షి మీడియాతో చంద్రవదన్ మాట్లాడుతూ.. ‘గతంలో మా దృష్టకి అనేక డ్రగ్స్ కేసులు వచ్చాయి. కానీ ఆ దర్యాప్తులో ఏం తేలిందో నేను ఇప్పుడు చెప్పలేను. మా విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా, నేను ఒక్కడినే కాదు చాలా మంది ఉన్నారని చెప్పారు. మేమూ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాము. రియా కేసులో ప్రముఖ నటి పేరు వింటున్నాం అది కాస్తా టాలీవుడ్‌కు రాదని మాత్రం చెప్పలేను. ఎన్సీబీ దర్యాప్తు చాలా లోతుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం ఉంది. డ్రగ్స్ వాడే వారిని మేము గతంలో బాధితులుగా చూశాము. అమ్మే వారి సమాచారం అంతా సేకరించాము. (డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?) ఎక్సైజ్ శాఖ దర్యాప్తు తర్వాత హైద్రాబాద్ లో డ్రగ్స్ మూలాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ డ్రగ్స్ మూలాలు మళ్లీ, మళ్లీ బయట పడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో లింక్స్ ఉంటాయి. చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడున్నారు. ఎన్సీబీ చట్టం ప్రకారం.. డ్రగ్స్ వినియోగ దారులు సైతం శిక్షార్హులే. ఇది అశామాశి వ్యవహారం కాదు. సమాజంలో అందరిపై ప్రభావం చూపుతుంది. కేంద్రం చొరవ చూపి కఠినంగా వ్యవహరించి మూలాలను బ్రేక్ చెయ్యాలి’ అని పేర్కొన్నారు. -
16 సార్లు అరెస్ట్ చేసిన వ్యక్తికే ప్రాణదానం
అలబామా : మేలు చేసిన వారికి సాయం చేయడం కృతజ్ఞత భావం.. 16 సార్లు కటకటాల్లోకి నెట్టిన వ్యక్తికి కిడ్నీ దానం చేసి జోసెలిన్ జేమ్స్ మానవత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన అలబామాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. అలబామాకు చెందిన జోసెలిన్ జేమ్స్ .. కొన్ని సంవత్సరాల క్రితం మత్తు పదార్థాలకు బానిసగా మారింది. ఎంతలా అంటే జీవితంలో అన్ని బంధాలను వదులుకొని డ్రగ్స్‌నే తన ఆహారంగా చేసుకొని బతికేసింది. ఈ నేపథ్యంలోనే తను చేసే జాబ్, ఇష్టపడి కొనుక్కున్న కారు, ఇళ్లు కూడా అమ్మేసుకుంది. బతకడానికి దొంగతనాలు కూడా చేసింది. అనతికాలంలోనే జేమ్స్ అలబామాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరు పొందింది. 2007 నుంచి 2012 వరకు దాదాపు 16 సార్లు టెర్రెల్ పాటర్ అనే పోలీస్‌కు చిక్కి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చింది. టెర్రెల్ పాటర్ కూడా ఈ జీవితాన్ని వదిలేసి మంచి మనిషిగా మారు అని ఎన్నోసార్లు చెప్పిచూశాడు. టెర్రెల్ పాటర్ అనే వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడని బహుశా అప్పుడు ఊహించి ఉండదు. (చదవండి :మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన) ఇదలాఉండగా.. జేమ్స్ ఒకరోజు ఇంట్లోనే టీవీ చూస్తుండగా.. మోస్ట్ వాంటెడ్ అనే వార్త ఆమెను షాక్‌కు గురయింది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ అని చూపిస్తుంది ఎవరిదో కాదు.. జోసెలిన్ జేమ్స్ దే. అప్పుడు తనకు అర్థమయింది.. తాను ఏ స్టేజీలో ఉన్నానో.. ఇక ఈ జీవితం వద్దని చెప్పి నేరుగ అధికారుల వద్ద లొంగిపోయింది. ఆరు నెలల జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన జేమ్స్ నేరుగా డ్రగ్ అడిక్షన్ సెంటర్‌కు వెళ్లి తొమ్మిది నెలలు అక్కడే రీహాబిటేట్‌గా మార్చుకుంది. అక్కడి నుంచి జేమ్స్ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం జేమ్స్ తనలాగే డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న మహిళను ఆ మహమ్మారి నుంచి రక్షించే పనిని చేస్తుంది. ఒకరోజు జేమ్స్ తన ఫేస్బుక్ ఓపెన్ చేయగా.. టెర్రెల్ పాటర్ కిడ్నీ దెబ్బతిన్నాయని.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం దాత అవసరం ఉందని టెర్రెల్ కూతురు షేర్ చేసిన పోస్ట్ కనిపించింది. వెంటనే టెర్రెల్ కూతురును కలిసి కిడ్నీని దానమిచ్చేందుకు తాను సిద్దమని తెలిపింది. గత జూలైలో వాండెర్‌బిల్ట్ యునివర్సీటీ మెడికల్ హెల్త్ సెంటర్లో టెర్రెల్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది. ఇప్పుడు జేమ్స్, టెర్రెల్ ఆరోగ్యంతోనే ఉన్నారు.(చదవండి : విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..) ఇదే విషయమై టెర్రెల్ స్పందిస్తూ.. ' నా అనుకున్నవారు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అలాంటిది పోలీస్ ఆఫీసర్‌గా 16 సార్లు జైలుకు పంపించిన అమ్మాయి వచ్చి నాకు కిడ్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఎందుకంటే.. నాకు కిడ్నీ దానం చేస్తమని ఒక వంద మంది ముందుకు వస్తే అందులో జేమ్స్ పేరు కచ్చితంగా ఉండదనే అనుకుంటాం. ఎందుకంటే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత మళ్లీ నాకు కనిపించలేదు.. సరైన కాంటాక్ట్ కూడా లేదు.. కానీ దేవుడు మా ఇద్దరిని ఈ విధంగా కలుపుతాడని మాత్రం నేను ఊహించలేదు అంటూ టెర్రెల్ ఉద్వేగంతో పేర్కొన్నాడు. -
కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్– మహారాష్ట్ర సర్కారు వివాదం ముదురుతోంది. ముంబై మరో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా మారిందన్న కంగనా ఆరోపణలపై.. శివసేన సర్కారు కంగనా ఆఫీసులోని కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమంటూ కూలగొట్టిన విషయం తెలిసిందే. దీంతో, కంగనా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా డ్రగ్స్ వాడేవారన్న ఆరోపణలపై శుక్రవారం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది. మీకేమీ బాధ అనిపించడం లేదా? సోనియాగాంధీకి కంగనా ప్రశ్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం ఠాక్రేను తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తన గురిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వైపు తిప్పారు. మహారాష్ట్రలోని శివసేన–కాంగ్రెస్ ప్రభుత్వం తనను వేధిస్తుంటే సాటి మహిళగా బాధ అనిపించడం లేదా అని ఆమెను ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సోనియాను కోరారు. కంగనకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరారు. ఉద్ధవ్ సర్కార్‌పై ఫడ్నవిస్ మండిపాటు కరోనాపై పోరు ముగిసి, కంగనాపై పోరు ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కారు యంత్రాంగం యావత్తూ కంగనాపైనే పోరాడుతోందన్నారు. ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ, కోవిడ్–19పై పోరాటంపై శ్రద్ధ చూపాలని సూచించారు. చదవండి: కంగనను నడిపిస్తున్నది ఎవరు?