ముంబై: సుశాంత్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి ముంబై కోర్టులో చుక్కెదురైంది. సోదరుడి షోవిక్‌తో పాటు ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియాను, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో ముగ్గురిని నార్కోటిక్ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈసారి కూడా రియాతో పాటు మరో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు.
తన చేత బలవంతంగా నేరాన్ని ఒప్పించారని, కస్టడిలో తనకు రేప్ అండ్ మర్డర్ బెదిరింపులు వస్తున్నాయని రియా బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాగే ఉంటే తన మానసిక పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రియా తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రియా ఏ నేరం చేయలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రియను ముంబైలోని బైకులా జైలులో ఉంచారు. ఆ జైలులో కేవలం రియా మాత్రమే మహిళ ముద్దాయిగా ఉన్నారు. చదవండి: మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా?
రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
Published Fri, Sep 11 2020 1:10 PM | Last Updated on Fri, Sep 11 2020 2:20 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment