షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా పోలీసు డిపార్టుమెంట్ వారు సోషల్ మీడియాలో వినూత్నమైన ట్వీట్‌లు చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం మేఘాలయ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ అమ్మేముఠాలపై ట్విట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో డ్రగ్స్ పేరుతో రస్నా పౌడర్‌ను అమ్ముతున్నారు. అదే విధంగా డ్రగ్ మాదిరిగా ఉన్న రస్నా పౌడర్‌ను కొని మోసపోయిన వారు తమకు ఫిర్యాదు చేయాలని’ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అస్సాంలోని గౌహతి పోలీసులు కూడా వినూత్నంగా ‘ మీలో ఏవరైనా 590 గ్రాముల గంజాయి పోగొట్టుకున్నారా ? అయితే వచ్చి మాకు ఫిర్యాదు చేయండి’ అని ట్విటర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు చేస్తున్న ఈ వినూత్నమైన ట్విట్లు వైరల్ మారుతున్నాయి.
SCAM ALERT!
— Meghalaya Police (@MeghalayaPolice) August 15, 2019
*clears throat*
Shillong market is so dry that peddlers are fooling their clients with Rasna(!?) Powder. 😆😆
If you just got 'Rasna Ripped' off by your drug peddler, you know where to report.
Kudos to ANTF team!
Cc: @Rasna_House pic.twitter.com/7XVZhLaOt8
Comments
Please login to add a commentAdd a comment