అమెరికన్ పాప్ స్టార్ డెమి లోవాటో త్వరలోనే ఓ డాక్యుమెంట్ సిరీస్‌తో మన ముందుకు రాబోతున్నారు. ‘‘డ్యాన్సింగ్ విత్ డెవిల్’’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంట్‌ని యూట్యూబ్ వేదికగా విడుదల చేయనున్నారు. తాజాగా బుధవారం ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కి సంబధించి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో డెమి లోవాటో బాల్యం నుంచి నుంచి.. 2018లో డ్రగ్స్ ఓవర్‌డోస్ వరకు ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనలు ఉన్నాయి. దాంతో పాటు డెమి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె జీవితంలో చూసిన చీకటి రోజుల గురించి.. వాటి నుంచి ఆమె ఎలా బయటపడగలిగారు అనే విషయాల గురించి వారు మాట్లాడటం ఈ వీడియోలో చూడవచ్చు.
డ్రగ్స్ ఓవర్‌డోస్ అవ్వడం వల్ల 2018లో డెమి లోవాటోకి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. డ్రగ్స్ పరిమితికి మించి తీసుకోవడం వల్ల వచ్చి లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో స్పృహ తప్పి పడిపోయారు డెమి లోవాటో. సమయానికి సిబ్బంది గమనించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. హాస్పటిల్‌లో ఉండగానే తనకు మూడు సార్లు స్ట్రోక్ వచ్చిందని డెమి లోవాటో వెల్లడించారు.
ఈ సందర్భంగా డెమి లోవాటో మాట్లాడుతూ.. ‘‘25వ ఏట నా జీవితంలో భయానక సంఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల లాస్ ఏంజెల్స్‌లోని నా నివాసం ‘‘హాలీవుడ్ హిల్స్’’లో స్పృహ తప్పి పడిపోయాను. నా పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నన్ను పరీక్షించిన వైద్యులు 5,10 నిమిషాల కన్న ఎక్కువ సమయం బతకను అని తేల్చారు. ఆ సమయంలో నాకు వెంట వెంటనే మూడు సార్లు స్ట్రోక్ వచ్చింది. తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చింది. నా పని అయిపోయింది అనుకున్నారు. కానీ అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాను’’ అన్నారు,
‘‘ఆ తర్వాత కూడా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. నా బ్రెయిన్ డ్యామెజ్ అయింది. ఆ ప్రభావం నా మీద ఇంకా ఉంది. దాని వల్ల నేను సొంతంగా కారు డ్రైవ్ చేయలేకపోతున్నాను. ఇక మెదడు పని తీరు సరిగా లేకపోవడం వల్ల కంటి చూపు సరిగా లేదు. కనీసం న్యూస్ పేపర్ కూడా చదవలేను. ఇలా రెండు నెలలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. ప్రస్తుతం బుక్ చదవగలను. కానీ రోడ్డు చూస్తూ డ్రైవింగ్ చేయడం చాల కష్టం’’ అన్నారు డెమి లోవాటో.
చదవండి: ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?
ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి
Comments
Please login to add a commentAdd a comment