
సాక్షి, బెంగళూరు: దేశంలో 2017–19 మధ్యకాలంలో మాదకద్రవ్యాల అతి వినియోగం వల్ల 2,300 మంది మృత్యువాతపడ్డారు. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన వివరాల ప్రకారం మితిమీరి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల 2017 ఏడాదిలో 745 మంది, 2018లో 875 మంది, 2019లో 704 మంది ప్రాణాలు కోల్పోయారు.
అగ్రస్థానంలో రాజస్థాన్, కర్ణాటక, యూపీ
అతి ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్న రాష్ట్రాల్లో కర్ణాటక రెండో స్థానంలో నిలవడం గమనార్హం. మొదటి స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 2017–19లో రాజస్థాన్‌లో 338 మంది, కర్ణాటకలో 239 మంది, ఉత్తరప్రదేశ్‌లో 236 మందిని డ్రగ్ ఓవర్‌డోస్ బలిగొంది.
అన్ని వయసులవారూ బలి
డ్రగ్స్ భూతానికి 30–45 ఏళ్ల మధ్య వయసున్న వారే అత్యధికంగా (784) మంది మరణించారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు డ్రగ్స్‌కు బానిసయ్యారు. 14 ఏళ్ల లోపు వయసున్న వారు 55 మంది, 14–18 ఏళ్ల మధ్య ఉన్నవారు 70 మంది డ్రగ్స్‌కు అసువులుబాశారు. మృతుల్లో 18–30 ఏళ్ల మధ్య వయసున్న వారు మొత్తం 624 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్లు పైబడిన వారు 241 మంది మత్తు సేవనానికి బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment