
సాక్షి,యశవంతపుర: తీరప్రాంత నగరం మంగళూరులో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల నుంచి ఒక యువతికి డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళూరు నగరంలోని బిజై ప్రాంతానికి చెందిన మహిళ తన కూతురికి కొందరు డ్రగ్స్‌ను అలవాటు చేసి లైంగికంగా వాడుకొంటున్నట్లు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోను పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కూతురిని ఇలా నాశనం చేశారని మీడియా ముందు విలపించింది. కూతురి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. ఆమెను కాపాడాలని వీహెచ్‌పీ నాయకులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి సురత్కల్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ (47) అనే నిందితున్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇతనికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment