Bapatla: Police Arrested Youth Who Tried To Molesting A Girl, Thanks To Disha App - Sakshi
Sakshi News home page

బాలికను కాపాడిన ‘దిశ’

Published Wed, Jun 7 2023 11:11 AM | Last Updated on Wed, Jun 7 2023 11:39 AM

Police Arrested Youth For Molestation Girl Thanks To Disha App Bapatla - Sakshi

సాక్షి,యద్దనపూడి(బాపట్ల): తన పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో తప్పించుకున్న బాలిక దిశ యాప్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో నివాసముండే యువకుడు (20) సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్తోన్న పక్కింటి బాలిక(16)ను బలవంతంగా తన గదిలోనికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

తండ్రి ఫోన్‌ నుంచి దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 నిమిషాల్లోనే బాధితురాలి ఇంటికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. విచారణలో యువకుడు బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. కాగా, దిశ యాప్‌ను కొన్ని నెలల కిందటే సచివాలయ సిబ్బంది తమ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయించారని బాలిక తెలిపింది. ఆపదలో ఉçన్న తనకు దిశ యాప్‌ ఎంతగానో ఉపయోగపడిందని తనలాగే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ దిశ యాప్‌ ఒక రక్షణ కవచంలా ఉంటుందని చెప్పింది.

చదవండి: దేవుడు ముడివేసిన జంట.. అడ్డంకులు అధిగమించి అన్యోన్యంగా ముందుకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement