మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. అంతేగాక | Karnataka: Challakere Police inspector Umesh booked for Molested Cousin | Sakshi
Sakshi News home page

మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. అంతేగాక

Published Tue, Oct 25 2022 2:01 PM | Last Updated on Tue, Oct 25 2022 2:37 PM

Karnataka: Challakere Police inspector Umesh booked for Molested Cousin - Sakshi

సాక్షి, బెంగళూరు: ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్‌ అధికారి వరుసకు మరదలైన యువతిపై గత అయిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది. చల్లకేరే పోలీస్‌ స్టేషన్‌లో ఉమేష్‌ అనే వ్యక్తి సర్కిల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆస్తి సమస్యను పరిష్కరించే ముసుగులో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఐదేళ్లుగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయింది. అంతేగాక ఆరోపణలు ఎదుర్కొంటున్నఇన్‌స్పెక్టర్‌ మేనమామ కుమారుడని, వరుస​కు బావ అవుతాడని పేర్కొంది.

ఉమేష్‌ అయిదేళ్ల కిత్రం దావణగెరె పోలీస్‌ స్టేషన్‌గా ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ బాధితురాలు నిందితుడిని సంప్రదించింది. ఈ కేసులో సాయం చేస్తున్నట్లు సాయం చేస్తున్నట్లు నటించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా పలు సందర్భాల్లో బాధితురాలిని బెదిరించి లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతి అయిదుసార్లు గర్భం దాల్చగా.. అబార్షన్‌ చేయించాడు.

ఉమేష్‌కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, తనను మూడో పెళ్లి చేసుకుంటానని అతను కోరుతున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకోకుంటే ఆస్తి తనకు దగ్గకుండా చేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. అంతేగాక తన తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతానని, చెప్పినట్లు వినకేంటే చంపేస్తానని సైతం హెచ్చరిస్తున్నట్లు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై చిత్రదుర్గ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement