chitradurga
-
పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్.. దృశ్యాలు వైరల్..
బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు. #WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw — ANI (@ANI) August 20, 2023 డీఆర్డీఓ మానవ రహిత డ్రోన్లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్’.. ఇక చివరి ఘట్టం అదే -
తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..
సాక్షి, దొడ్డబళ్లాపురం: తాగుడుకి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య అతడ్ని చైన్లతో కట్టేసిన సంఘటన చిత్రదుర్గలోని హొసహళ్లి గ్రామంలో వెలుగు చూసింది. హిరియూరు తాలూకా పర్తికోట గ్రామానికి చెందిన రంగనాథ్‌కు హొసహళ్లికి చెందిన అమృత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రంగనాథ్ నిత్యం తాగివచ్చి భార్యను హింసించేవాడు. తాగుడు వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో అమృత తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని కాళ్లకు గొలుసు వేసి తాళం వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని అతన్ని బంధ విముక్తున్ని చేశారు. భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా భార్య సాహసాన్ని ఇరుగుపొరుగు అభినందించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
కర్ణాటక మఠాధిపతి లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మఠాధిపతి శివమూర్తి మూరుగ లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తేలింది. టీనేజ్ బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఇందులో బాలికలపై అత్యాచారం జరిగినట్లు కనిపించలేదని.. వారి జననాంగాల్లో ఎలాంటి గాయాలు గుర్తించలేదని వెల్లడైంది. కాగా 2019 నుంచి 2022 వరకు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావు స్వామిజీ తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆయన ఆశ్రమంలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు ఆరోపించిన విషయం తెలిసిందే. బాలికల ఫిర్యాదు మేరకు మైసూరు పోలీసు స్టేషన్లో ఆగష్టు 26న శివమూర్తిపై పోక్సో కేసు నమోదైంది. తరువాత కేసును చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేసన్‌కు బదిలీ చేశారు. రాష్ట్రంలో మఠాధిపతికి వ్యతిరేకంగా తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చిత్రదుర్గ జిల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన రెండు రోజులకు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిత్రదుర్గలోని ఆశ్రమంలో తమపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించిన మైనర్ బాలికల స్టేట్మెంట్కు విరుద్ధంగా మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. తాజాగా ఆ నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు(ఎఫ్ఎస్ఎల్) పంపించారు. అయితే ఫైనల్ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ నివేదికపై ఆధారపడి ఉండనున్నట్లు వైద్య పరీక్షల నివేదికలో పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో మరో నలుగురు బాలికలు శివమూర్తిపై ఇవే ఆరోపణలు చేశారు. కానీ వారి వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. చదవండి: : డాక్టర్ నిర్వాకం..ప్రసవ వేదనతో వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి.. -
మురుఘ మఠంలో మృగత్వం...ముగ్గురు కాదు 10 మంది బాలికలపై
బనశంకరి: చిత్రదుర్గలోని ప్రఖ్యాత మురుఘ మఠాధిపతి శివమూర్తి శరణుస్వామి మఠం ఆవరణలోని హాస్టల్ బాలికలపై అత్యాచారం కేసులో పోలీసులు చార్జిషీట్లో విస్మయకరమైన అంశాలను ప్రస్తావించారు. మత్తుమందు కలిపిన యాపిల్ పండ్లను ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యాలకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఆఖర్లో లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించడం తెలిసిందే. తరువాత వారానికి పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల కింద శివమూర్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఉదంతం అంతటా సంచలనం కలిగించింది. చార్జిషీట్లో ఏముంది? ఈ నేపథ్యంలో రెండో పోక్సో కేసు దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ అనిల్ నేతృత్వంలోని పోలీస్‌బృందం సోమవారం చిత్రదుర్గ నగర రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 694 పేజీల చార్జిషీట్‌ను సమర్పించారు. ఇందులో పలు అంశాలను సవివరంగా పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్ రశ్మి బాలికలను బెదిరించి శివమూర్తి స్వామి వద్దకు పంపేది. యాపిల్ పండ్లలో మత్తు కలిపి బాలికలకు తినిపించేవారు. మత్తులో ఉండగా దారుణాలకు పాల్పడేవారు. కార్యాలయం, బెడ్రూమ్, బాత్రూమ్కు బాలికలను తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిని వ్యతిరేకించే బాలికలను తీవ్రంగా హెచ్చరించి, మఠం పాఠశాల నుంచి ఇళ్లకు పంపేవారు. ఈ రకంగా 10 మందికి పైగా బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నిత్యం బాలికలపై అఘాయిత్యాలు జరిగేవి. మఠం మహిళా వార్డెన్ రశ్మి, కార్యదర్శి పరమశివయ్యలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఈ నెల 5న ఆస్పత్రిలో మురుఘ స్వామికి పురుషత్వ సామర్థ్య పరీక్షలు చేయగా, పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఉరి వేయాలి: ఒడనాడి చీఫ్ ఈ ఘటనపై ఒడనాడి సేవా సంస్థ అధ్యక్షుడు పరశురామ్ మాట్లాడుతూ మురుఘ స్వామికి ఉరిశిక్ష విధించాలన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ పోలీసులు బాగా దర్యాప్తు చేశారని, బాధితుల బాధను కోర్టు ముందుంచారని అన్నారు. అలాగే ఏడాది కిందట మఠంలో హత్యకు గురైన బాలిక కేసును బయటకు తేవాలని ఫిర్యాదు చేశామన్నారు. బాలికను హత్య చేసింది ఎవరు అనేదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..) -
మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. అంతేగాక
సాక్షి, బెంగళూరు: ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ అధికారి వరుసకు మరదలైన యువతిపై గత అయిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది. చల్లకేరే పోలీస్ స్టేషన్లో ఉమేష్ అనే వ్యక్తి సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆస్తి సమస్యను పరిష్కరించే ముసుగులో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఐదేళ్లుగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయింది. అంతేగాక ఆరోపణలు ఎదుర్కొంటున్నఇన్‌స్పెక్టర్ మేనమామ కుమారుడని, వరుసకు బావ అవుతాడని పేర్కొంది. ఉమేష్ అయిదేళ్ల కిత్రం దావణగెరె పోలీస్ స్టేషన్‌గా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ బాధితురాలు నిందితుడిని సంప్రదించింది. ఈ కేసులో సాయం చేస్తున్నట్లు సాయం చేస్తున్నట్లు నటించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా పలు సందర్భాల్లో బాధితురాలిని బెదిరించి లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతి అయిదుసార్లు గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడు. ఉమేష్‌కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, తనను మూడో పెళ్లి చేసుకుంటానని అతను కోరుతున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకోకుంటే ఆస్తి తనకు దగ్గకుండా చేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. అంతేగాక తన తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతానని, చెప్పినట్లు వినకేంటే చంపేస్తానని సైతం హెచ్చరిస్తున్నట్లు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై చిత్రదుర్గ మహిళా పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. -
రాజకీయ అండ.. స్వామిజీ ముసుగులో విద్యార్థినులపై అత్యాచారం..
ఇటీవలే బెంగళూరులో ఓ నకిలీ స్వామి ఐదేళ్లుగా యువతిని బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం బయటపడడం తెలిసిందే. ఇంతలోనే ఓ నిఖార్సైన స్వామి, రాష్ట్ర, జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్న మఠాధిపతి లైంగిక దాడి కేసులో ఇరుక్కున్నారు. చిత్రదుర్గంలోని మఠంలోని విద్యాలయాల్లో చదివే బాలికలు స్వామి లీలలపై ఏకంగా మైసూరుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రముఖ మఠం పరువు బజారున పడింది. మైసూరు: చిత్రదుర్గలో ఉన్న ప్రసిద్ధి చెందిన మఠానికి చెందిన స్వామీజీ ఒక ఆ మఠంలో ఉన్న పాఠశాల, కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధిత బాలికలు మైసూరు జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో మఠాధిపతి అయిన స్వామీజీతో పాటు మొత్తం నలుగురిపై మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్వామీజీ మొదటి నిందితుడు, అక్కడి హాస్టల్ వార్డెన్ రశ్మి రెండవ నిందితురాలుగా ఉన్నారు. ఇక్కడైతే న్యాయం జరగదని.. వివరాలు... ఆ మఠం ఆధ్వర్యంలో పలు పాఠశాలలు, కాలేజీలు నడుస్తుండగా వందలాది మంది బాలికలు చదువుకుంటున్నారు. మఠం స్వామీజీ పలువురు బాలికల పైన లైంగిక దాడి చేశాడని, చిత్రదుర్గలో అయితే మాకు న్యాయం జరగదని అలోచించి మైసూరుకు వచ్చి ఒడనాడి సేవా సంస్థ ప్రతినిధులను ఆశ్రయించారు. వారితో కలిసి జిల్లా బాలల సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు. సమితి అధ్యక్షురాలు హెచ్.టి.కమల సెలవులో ఉండటంతో సీనియర్ సభ్యులు ధనంజయ, అశోక్, సవితా కుమారిలు బాధితుల సమస్యలను ఆలకించారు. తమతో పాటు అనేక మంది విద్యార్థినులకు తీరని అన్యాయం జరిగిందని వివరించారు. చిత్రదుర్గానికి కేసు బదిలీ ఈ కేసును చిత్రదుర్గ పోలీసులకు బదిలీ చేశారు. సంఘటన జరిగింది అక్కడే కాబట్టి స్థానిక పోలీసులే విచారణ చేయాలని తెలిపారు. బాధిత విద్యార్థినులు మైసూరు ఒడనాడి సంస్థలో ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ప్రసాదంలో మత్తు మందిచ్చేవారు హాస్టల్ వార్డెన్ రశ్మి తమను తీసుకుని వెళ్ళి స్వామీజీ వద్దకు వదిలేవారని, స్వామీజీ మా కష్టసుఖాలను తెలుసుకునే సాకుతో లైంగికంగా వాడుకొనేవారని, ఒకవేళ తాము ఒప్పుకోక పోతే బెదిరించే వారని బాలికలు తెలిపారు. ప్రసాదంలో మత్తు మందు కలిపి మత్తు వచ్చేలా చేసి ఆపైన అత్యాచారం చేసేవారని, ఈ విషయం బయటకి చెబితే చంపేస్తామని బెదిరించేవారని పోలీసులు ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ మాదిరిగా దౌర్జన్యానికి గురైన అనేక మంది బాలికలు అక్కడ ఉన్నారని, ప్రాణ భయంతో బయటకు రావడం లేదని చెప్పారు. కాగా, నజరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, స్వామీజీ, రశ్మి, మరికొందరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. #BREAKING | Two minors allege that #Lingayat Swami Shivamurthy Sharanaru sexually assaulted them for over 3 years; Mysuru Police registered a case @harishupadhya brings forth the details | @ridhimb pic.twitter.com/TFyJjbSyip — News18 (@CNNnews18) August 27, 2022 -
పునీత్‌కు బసవశ్రీ అవార్డు
సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత) -
తనను ప్రేమగా చూడటం లేదని.. కుటుంబ సభ్యులకు విషమిచ్చి
చిత్రదుర్గ: తోబుట్టువులతో సమానంగా తనను ప్రేమగా చూసుకోవడం లేదని కక్ష పెంచుకున్న ఓ బాలిక(17).. తల్లి, తండ్రి సహా నలుగురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఇసాముద్ర గ్రామం లంబనిహట్టిలో జూలై నెలలో చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. విషప్రయోగంతో బాలిక తల్లి, తండ్రి, చెల్లి, అమ్మమ్మ చనిపోగా అన్న(19) అనారోగ్యానికి గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చిన్న తనం నుంచి అమ్మమ్మ గారింట్లో పెరిగిన బాలిక మూడేళ్ల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే, చెల్లి, అన్నపైనే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ చూపడం, తనను పట్టించుకోకపోవడంపై బాలిక ఆవేదన చెందింది. ఈ క్రమంలో కక్ష తీర్చుకునేందుకు వారికి ఓ పర్యాయం విషం కలిపిన ఆహారం పెట్టేందుకు యత్నించి విఫలమైంది. మరో ప్రయత్నంగా ఈ ఏడాది జూలై 12వ తేదీన పురుగులమందు కలిపి స్వయంగా తయారు చేసిన రాగి ముద్దలను వారికి పెట్టింది. వాటిని తిని, తీవ్రంగా వాంతులు చేసుకుని నలుగురు చనిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల వెల్లడైన ఫలితాల ఆధారంగా వారు తిన్న రాగి ముద్దల్లో విషం కలిసినట్లు తేలింది. పోలీసుల విచారణలో బాలిక నేరాన్ని అంగీకరించింది. మైనర్ కావడంతో ఆమెను జువెనైల్ హోమ్‌కు తరలించారు. -
‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’
సాక్షి, బెంగళూరు: దేశంలో కులవివక్ష జాఢ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట అణగారిన వర్గాలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అల్ప కులస్తులను చిన్నచూపు చూస్తున్నారు. అయితే ఈ వివక్ష సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను సైతం వెంటాడుతోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ దళితుడైనందున తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దని గ్రామస్తులు తీవ్ర అవమానానికి గురిచేశారు. వివరాలు.. బీజేపీ ఎంపీ నారాయణ స్వామి కర్ణాటకలోని చిత్రదుర్గ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వర్షాకాలం కావడంతో తన లోక్‌సభ పరిధిలోని తూమకూరు జిల్లా పావగడ తాలూకులో పర్యటించారు. గ్రామంలో మెడికల్ క్యాంపును నిర్వహించేందుకు వైద్య బృందాన్ని కూడా తన వెంట తీసుకెళ్లారు. అయితే వీరికి స్థానికులు (ఓ కులానికి చెందిన వారు) నుంచి అనుకోని ఘటనను ఎదుర్కొవల్సి వచ్చింది. ‘మా గ్రామంలోకి దళితులు, అల్ప కులస్తులు రావడానికి వీళ్లేదు. మీరు అంటరానివారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపొండి’ అంటూ ఎంపీ బృందాన్ని తీవ్ర అవమానానికి గురిచేశారు. గ్రామంలో ఎంట్రీకి స్థానికులు అనుమతించకపోవడంతో గత్యంతరం లేక ఎంపీ అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఆ గ్రామంలోని వారంత ఒకే వర్గానికి (గొల్ల) చెందిన వారిగా తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులకే ఇలాంటి ఘటన ఎదురైన తమలాంటి వారి పరిస్థితి ఏంటని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
సిద్దరామయ్యపై నిప్పులు చెరిగిన అమిత్‌షా
సాక్షి, బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సిద్దరామయ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భారత వ్యతిరేక సంస్థ అయిన ఎస్పీడీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)పై నమోదైన కేసులను ఎందుకు ఎత్తివేశారని సిద్దరామయ్యను ప్రశ్నించారు. బుధవారం కర్ణాటకలోని చిత్తదుర్గలో పర్యటించిన అమిత్‌షా మాట్లాడారు. 'కేంద్రం కర్ణాటకకు ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఐదేళ్ల కిందట పూరి గుడిసెలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు నాలుగంతస్తుల ఇళ్లు కట్టుకొని.. ఖరీదైన కార్లు ఇంటి ముందు పార్క్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి' అని అమిత్‌షా ప్రశ్నించారు. 'కర్ణాటకకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం చేసిందని సీఎం ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు వచ్చాను. 13 ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా యూపీఏ ప్రభుత్వం హయాంలో కర్ణాటకకు రూ. 88,583 కోట్లు ఇస్తే.. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ఎన్డీయే ప్రభుత్వం కర్ణాటకకు రూ. 2 లక్షల19 కోట్లు ఇచ్చింది' అని అమిత్ షా అన్నారు. -
అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు, ఐదుగురి మృతి
బెంగళూరు : కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా మన్నెకోట వద్ద అంబులెన్స్‌ను రైలు ఢీకొనడంతో అయిదురు మహిళలు దుర్మరణం చెందారు. అయిదు నెలల చిన్నారికి ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాదం నుంచి అంబులెన్స్ డ్రైవర్, అయిదు నెలల చిన్నారి స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మృతులు చెళ్లకెర తాలూకా తిమ్మాపురం వాసులుగా గుర్తించారు. లెవల్ క్రాసింగ్ వద్ద రైల్వేగేటు కాపాలదారుడు లేకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం గురువారం రాత్రి 7.30 సమయంలో జరిగినట్లు చిత్రదుర్గ జిల్లా పోలీసులు తెలిపారు. క్రాసింగ్ లెవల్ దాటే ప్రయత్నంలో అంబులెన్స్ డ్రైవర్ రైలు వేగాన్ని అంచనా వేయలేకపోయాడని పోలీసులు వెల్లడించారు. మృతి చెందినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. -
అంబులెన్స్‌లో పెళ్లాడిన నేత్రావతి
దేవనాగరి: నేత్రావతి ఒకటనుకుంది. విధి మరోలా ఎదురైంది. శరీరాన్ని కదల్చలేని పరిస్థితిలోకి లోనైంది. అయితేనేం విధిని ఎదిరించి, కలల తన కలల రాకుమారుడిని పెళ్లాడింది. కదలలేని స్థితిలో అంబులెన్స్ లో పడుకునే తాళి కట్టించుకుంది. 19 ఏళ్ల నేత్రావతికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ నేత్రావతి సొంత ఊరు. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన ఈమె నర్సింగ్ డిప్లమా థర్డ్ ఇంయర్ చదువుతోంది. కొన్నేళ్ల కిందట ఆమెకు అదే ఊరికి చెందిన గురుస్వామితో పరిచయం ఏర్పడింది. అతను విండ్ మిల్లులో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. పరిచయం ప్రేమగా మారింది. కులాలు ఒక్కటైనా పెద్దలు పెళ్లికి నో చెప్పారు. దీంతో ప్రేమికుల పాటితి దైవం లాంటి మురుగరాజేంద్ర స్వామి నిర్వహించే సామూహిక వేడుకలో వివాహం చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఇంకో వారం ఉదనగా నేత్రావతి తన ఇంట్లో పొరపాటున కాలుజారి పడిపోయింది. వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగిలి, కదలలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. పెళ్లి ఆగిపోవటం ఇష్టంలేని అంబులెన్స్ లోనే మఠానికి వచ్చి ప్రియుడితో తాళి కట్టించుకుంది. ఈ వేడుకను పలు మీడియా సంస్థలు ప్రత్యక్షప్రసారం చేశాయికూడా. కులరహిత సమాజం కోసం పోరాడుతున్న మురుగరాజేంద్ర స్వామి ఇప్పటివరకు తన మఠంలో 23 ప్రేమ పెళ్లిళ్లు జరిపించారు. చిత్రదుర్గ ప్రాంతంలో పారిపోయి పెళ్లిచేసుకోవాలనుకునే యువతకు అండగా నిలుస్తారాయన. నేత్రావతి పూర్తిగా కోలుకోవడానికి కొద్ది నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. -
కారు - లారీ ఢీ: 12 మంది మృతి
చిత్రదుర్గ : కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని చిక్కగొడనహళ్లీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఐరన్ రాడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీలోని ఐరన్ రాడ్లు కారుపై పడిపోయాయని చెప్పారు. మృతుల్లో చిన్నారి కూడా ఉందని తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారని... అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్, ఓనర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్థరాత్రి చిక్కగొడనహళ్లీలో జరిగిన వేడుకల్లో పాల్గొని... స్వగ్రామం కొండ్లహళ్లీకి వారంత కారులో బయలుదేరి.... ఈ ప్రమాదానికి గురయ్యారని చిత్రదుర్గ జిల్లా ఎస్పీ చెప్పారు. -
'అత్తా - కోడళ్ల' జాతర
బెంగళూరు : సాధారణంగా చాలా ఇళ్లలో అత్తా - కోడళ్లు ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవ ఇంకా ముదిరితే ఒకరినొకరు కొట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. అయితే అత్తా - కోడళ్లు కొట్టుకోవడానికే ఓ జాతర ఉంది. చిత్రదుర్గ ప్రాంతంలో ప్రతి ఏడాది ఇలాంటి జాతర జరుగుతుంది. ధనుర్మాస ప్రారంభ సమయంలో చిత్రదుర్గలోని హిరియారు తాలుకా చిక్కీరణ్ణన మాళిగె గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. అందులోభాగంగా ఈ ఏడాది గురువారం జరిగిన జాతర సందర్భంగా గ్రామంలోని వారు అహోబిల నరసింహస్వామి ఊరేగింపును నిర్వహించారు. అనంతరం గ్రామంలోని అత్తా,కోడళ్లు అంతా ఓ చోటకు చేరి వాదులాడుకున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని, జీవితాంతం తలనొప్పి కూడా రాదని ఇక్కడి మహిళల నమ్మకం.