![Wife Who Chained Her Drunken Husband At Chitradurga - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/6/wife1.jpg.webp?itok=kIMBhCLF)
సాక్షి, దొడ్డబళ్లాపురం: తాగుడుకి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య అతడ్ని చైన్లతో కట్టేసిన సంఘటన చిత్రదుర్గలోని హొసహళ్లి గ్రామంలో వెలుగు చూసింది. హిరియూరు తాలూకా పర్తికోట గ్రామానికి చెందిన రంగనాథ్‌కు హొసహళ్లికి చెందిన అమృత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రంగనాథ్ నిత్యం తాగివచ్చి భార్యను హింసించేవాడు.
తాగుడు వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో అమృత తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని కాళ్లకు గొలుసు వేసి తాళం వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని అతన్ని బంధ విముక్తున్ని చేశారు. భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా భార్య సాహసాన్ని ఇరుగుపొరుగు అభినందించారు.
(చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment