chains
-
తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..
సాక్షి, దొడ్డబళ్లాపురం: తాగుడుకి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య అతడ్ని చైన్లతో కట్టేసిన సంఘటన చిత్రదుర్గలోని హొసహళ్లి గ్రామంలో వెలుగు చూసింది. హిరియూరు తాలూకా పర్తికోట గ్రామానికి చెందిన రంగనాథ్‌కు హొసహళ్లికి చెందిన అమృత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రంగనాథ్ నిత్యం తాగివచ్చి భార్యను హింసించేవాడు. తాగుడు వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో అమృత తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని కాళ్లకు గొలుసు వేసి తాళం వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని అతన్ని బంధ విముక్తున్ని చేశారు. భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా భార్య సాహసాన్ని ఇరుగుపొరుగు అభినందించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే....
చెడు వ్యసనాలకు బానిసైతే తల్లిదండ్రులు పడే బాధ అంతఇంత కాదు. చేతికందిన కొడుకు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించకపోగా...వ్యసనాలకు బానిసై వేధిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు చేయడంతో తల్లిదండ్రులు విసిగి వేసారి ఏం చేశారంటే... వివరాల్లోకెళ్తే...పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతను డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సుమారు రూ. 800 విలువైన డ్రగ్స్ తీసుకునేవాడు. అందుకోసం ఇంట్లోనే దొంగతనం చేయడం లేదా వస్తువులను అమ్మేయడం వంటి పనులు చేసేవాడు. డబ్బులు దొరక్కపోతే తల్లిదండ్రులపై దాడికి కూడా దిగేవాడు. దీంతో విసిగి వేసారిపోయిన తల్లిదండ్రులు ఆ యువకుడ్ని ఇనుప గొలుసులతో మంచానికి కట్టి బంధించారు. పైగా వాళ్లు ఏ వస్తువు అతని కంటికి కనపడకుండా దాచడం లేదా జాగ్రత్తగా ప్రతిదానికి తాళం వేయడం వంటివి చేసేవారు. ఈ విధంగా ఆ యువకుడు ఎనిమిది రోజుల నుంచి బధింపబడే ఉన్నాడు. ఈ మేరకు ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ...మా గ్రామంలో చాలా సునాయాసంగా డ్రగ్స్ దొరకడమే కాకుండా యాథేచ్ఛగా విక్రయిస్తుంటారని వాపోయారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డ్రగ్స్‌ను అరికట్టాలని కోరుతున్నామని అన్నారు. వాస్తవానికి పంజాబ్‌లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడతుండటం అక్కడ సర్వసాధారణం. (చదవండి: తలుపులు ఆలస్యంగా తెరిచిందని....భార్యను చంపి సూట్ కేసులో పెట్టి...) -
ఇద్దరు పిల్లల కాళ్లను గోలుసులతో కట్టేసి తాళం.. ఆ తర్వాత..
ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టేసి, తాళం పెట్టి వారిని తీవ్రంగా కొట్టారు. ఎలాగోలా వారు అక్కడి నుంచి తప్పించుకుని పేరెంట్స్ వద్దకు చేరుకున్నారు. వారి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. లక్నో సమీపంలో గోసైంగంజ్ శివలార్‌లో ఉన్న సుఫమ్‌దింతుల్ ఉలమా మదర్సాలోని మౌలానా ఇద్దరు పిల్లలను ఇనుప గొలుసులతో కట్టేశాడు. వారిలో ఒక విద్యార్థి గోసైంగంజ్ రాణిమౌ నివాసి అయిన షేరా కుమారుడు షాబాజ్ కాగా.. మరో విద్యార్థి, బారాబంకి జర్మావు నివాసి రాజు. అయితే, వీరిద్దరినీ గొలుసులతో కట్టివేడయంతో ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో రోడ్డుమీద వీరిని చూసిన స్థానికులు పిల్లలను ఆపి విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరినీ వెంటనే గోసైంగంజ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో పోలీసు అధికారి శైలైంద్ర గిరి.. పిల్లలను అడిగి విషయం తెలుసుకున్నారు. మదర్సా ఉపాధ్యాయులు తమను బెత్తంతో కొట్టారని, కాళ్లను గొలుసుతో కట్టేశారని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం ఈ సమాచారాన్ని షాబాజ్ తండ్రి షేరాకు చేరవేశారు. స్టేషన్‌కు వచ్చిన షేరా.. గతంలో కూడా తమ బిడ్డ రెండు సార్లు మదర్సా నుంచి పారిపోయాడని తెలిపారు. షాబాజ్‌కు చదువు రాదని షేరా పోలీసులకు చెప్పారు. షాబాజ్‌కు చదువు నేర్పించేదుకే వారు ఇలా కొట్టారని పేర్కొన్నారు. షాబాజ్ తమ మాట వినడని అందుకే ఉపాధ్యాయులే అతడికి బుద్దిచెప్పాలని తాము కోరినట్టు వివరించారు. షాబాజ్‌కు ఇష్టం లేకున్నా మదర్సాకు పంపించామని అన్నారు. ఈ సందర్బంగానే మదర్సా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని లిఖితపూర్వంగా ఆయన పోలీసు స్టేషన్లో నోట్ రాసి ఇచ్చారు. ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్తుండగా మృత్యుపంజా -
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి 6ఈ025 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా అందులో 2.7 కేజీల బంగారు గొలుసులు, కవర్లలో చుట్టి తీసుకొచ్చిన బంగారం పేస్టు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..
సాక్షి, వెబ్‌డెస్క్: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. చిన్న తనంలో మనం విన్న కథల్లో దెయ్య కథలది ఓ ప్రత్యేక స్థానం. పెద్దలు, స్నేహితులు దెయ్యం కథలు చెబుతున్నపుడు భయపడుతూ వినేవాళ్లం. ఆ రాత్రి వాటిని గుర్తుకు తెచ్చుకుని విపరీతంగా భయపడి సరిగా నిద్రకూడా పోయేవాళ్లం కాదు. ‘ఇంకోసారి దెయ్యం కథలు వినకూడదు బాబోయ్’ అని ఆ రాత్రే తీర్మానం కూడా చేసుకునేవాళ్లం. అయితే, మళ్లీ దెయ్యం కథలు వినడానికి తీరుకునేవాళ్లం. దెయ్యం కథల మీద ఆసక్తి మనల్ని దెయ్యం పట్టినట్లు పట్టి పీడించేది మరి. ప్రాంతాల వారీగా కొన్ని దెయ్యం కథలు బాగా ప్రచారంలో ఉండేవి. కొందరు కొన్నింటిని తమ ఇంట్లో వారికి.. తమకే జరిగినట్లుగా పిల్లలకు చెప్పేవారు. గీకుర మల్లయ్య.. దెయ్యం కొంప.. మేక దెయ్యం లాంటి కథలు ఒక్క మనదగ్గరే కాదు ప్రపంచ నలుమూలలా ప్రచారంలో ఉన్నాయి. అలాంటిదే సంకెళ్ల దెయ్యం కథ.. ప్రాచీన ఏథెన్స్లో ప్రచారంలో ఉండిన సంకెళ్ల దెయ్యం కథ : ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందనే కథ ప్రచారంలో ఉండటంతో అక్కడ ఉండటానికి జనం భయపడేవారు. అయితే, ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆ ఇంటిలోకి చేరాడు. ఆ రోజు రాత్రినుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినపడసాగింది. ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది. గొలుసుల శబ్ధానికి మేలుకున్న వారికి మసి కొట్టుకుపోయి, చిరిగిన దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు. సంకెళ్లతో ఉన్న ఆవ్యక్తి ఇంటి సభ్యుల దగ్గరకు వచ్చి, తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయాలని ప్రాథేయపడేవాడు. ఆ వ్యక్తి ప్రతి రోజు రాత్రి అలా సంకెళ్లతో వచ్చి కుటుంబసభ్యులను ప్రాథేయపడుతుంటంతో వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ సంకెళ్ల వ్యక్తి ఎవ్వరికీ కనిపించలేదు. ఎవరైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు. తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయమని ప్రాథేయపడేవాడు. ఈ దెయ్యం కథను విన్న ‘‘అథెనోడొరస్’’ అనే వ్యక్తి ఆ ఇంట్లో దిగాడు. ఆ ఇంట్లో ఏ దెయ్యమూ లేదని నిరూపించటం అతడి ఉద్ధేశ్యం. అయితే, అతడి ఆలోచనలను తలకిందులుచేస్తూ ప్రతి రోజు రాత్రి ఇంటి బయటినుంచి సంకెళ్ల చప్పుడు వినపడేది. తనను సంకెళ్లనుంచి విముక్తుని చేయమని ఓ వ్యక్తి మాటలు కూడా వినపడేవి. ఓ రోజు రాత్రి అథెనోడొరస్ ధైర్యం తెచ్చుకుని శబ్ధం వస్తున్న వైపు వెళ్లాడు. అలా ఆ శబ్ధాన్ని ఫాలో అవుతూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి కాళ్లు భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. అథెనో అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంకెళ్లనుంచి బయటకు విడిపించమని ప్రాథేయపడ్డాడు. కొన్ని నిమిషాల తర్వాత మాయమయ్యాడు. ఉదయం కాగానే అథెనో సంకెళ్ల మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు. అక్కడో కుళ్లిన శవం బయటపడింది. రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్లతో బంధించి ఉంది. అథెనో సంకెళ్లను తీసి, ప్రజలతో కలిసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఎవ్వరికీ ఆ సంకెళ్ల దెయ్యం మళ్లీ కనిపించలేదు. -
చెవి దుద్దులు,కాళ్ల పట్టీలు ఎత్తుకెళ్లాడు
హైదరాబాద్ : బాలికకు మాయమాటలు చెప్పి ఆమె బంగారు చెవికమ్మలను, కాళ్ల పట్టీలను ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడిషనల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన జానయ్య కూతురు ధరణి (13) ఆరో తరగతి చదువుతోంది. ఈ నెల 4వ తేదీన ఇంటి దగ్గర తమ్ముడితో కలిసి ఆడుకుంటుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పైన వచ్చి.. నీకు క్యారమ్బోర్డు కొనిస్తాను రమ్మని చెప్పడంతో శిరీషతో పాటు ఆ బాలిక తమ్ముడు కూడా బైక్‌పై ఎక్కారు. కొంత దూరం వెళ్లగానే బాలిక చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు తీసుకుని వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. సీసీ పుటేజీల ద్వారా లభించిన ఆ దొంగ ఫోటోను గుర్తించిన పోలీసులు ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. దొంగ ఆచూకీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా సెల్: 9490676378 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
రూ.కోట్లు స్నాచింగ్
నగరంలో భారీగా చైన్‌స్నాచర్ల చేతివాటం మూడేళ్లల్లో రూ.8.6 కోట్ల సొత్తు స్వాహా ‘దోపిడీ’కి అడ్డంకిగా మారిన ‘బాంబే’ తీర్పు సిటీబ్యూరో: సిటీలో పంజా విసురుతున్న గొలుసు దొంగలు గడిచిన మూడేళ్లల్లో లాక్కుపోయిన సొత్తు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.8,60,54,337. అన్ని రకాలైన సొత్తు సంబంధిత నేరాల్లో ప్రజల కోల్పోయిన దాంట్లో ఇది 7.5 శాతం. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ సిటీలో పంజా విసురుతున్నారు. పోలీసుల ఎత్తులకు స్నాచర్లు పై ఎత్తులు వేస్తున్నారు. మార్కెట్లో బంగారం ధరలు పైపైకి దూసుకుపోతుండడంతో పాతనేరస్తులే కాదు... కొత్తవారూ స్నాచర్ల అవతారం ఎత్తుతున్నారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారు, విద్యార్థులు కూడా జల్సాల కోసం స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటా చిక్కుతున్న స్నాచర్లలో 40 శాతం కొత్తవారే ఉంటుండడం పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీరి వివరాలు, వేలిముద్రలు వంటి ఎలాంటి సమాచారం పోలీసు రికార్డుల్లో ఉండకపోవడంతో వీరిని గుర్తించడం, పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులకు చిక్కేవరకు నేరాలు చేసుకుంటూ పోతున్నారు. పోలీసు యాక్షన్‌కు స్నాచర్ల రియాక్షన్... స్నాచింగ్ నేరాల్ని కట్టడి చేయడానికి పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్నాచర్లు పైఎత్తులు వేస్తున్నారు. తెల్లవారుజామున, సాయంత్రం వేళ నిర్మానుష్య ప్రదేశాల్లో నడిచి వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వాహనంపై పక్క నుంచి వెళ్తూ గొలుసుకు తెంచుకుపోతున్న స్నాచర్లకు కట్టడి చేయడం కోసం పోలీసులు రెండు రకాల వ్యూహాలు పన్నారు. ఒకటి మఫ్టీలో పోలీసుల్ని మోహరించడం.. మరోటి మహిళా పోలీసులే సాధారణ దుస్తుల్లో బంగారంతో నడిచి వెళ్లే డెకాయ్ ఆపరేషన్. ఈ రెండింటినీ గమనించిన గొలుసు దొంగలు తమ పంథాను పూర్తిగా మార్చేసుకున్నారు. ఓ ప్రాం తంలో పంజా విసిరే ముందు అక్కడ తమ ముఠా సభ్యులతో రెక్కీ చేయించి పరిస్థితులను గమనించి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. కొన్నిసా ర్లు ఇళ్ల వద్దే ఉన్న, పనులు చేసుకుంటున్న మహిళల మెడలోని గొలుసులు తెంచుకుపోతున్నారు. తగ్గిన కేసులు... పెరిగిన సంచలనాలు... నగరంలో చైన్‌స్నాచింగ్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. పదేపదే నేరాలు చేస్తున్న, మూడు కంటే ఎక్కువ కేసులు ఉన్న వారిపై నగర పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడం ప్రారంభించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లు, ఇళ్లలో చోరీలు చేసేవారు, గుడుంబా విక్రేతలు, మాదకద్రవ్యాల విక్రేతలు, మోసగాళ్లు, బందిపోటు దొంగలతో కలిపి మొత్తం 263 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా... ఇందులో 60 మంది చైన్ స్నాచర్లే ఉన్నారు. 2014లో 523గా ఉన్న కేసుల సంఖ్య గతేడాది 263గా ఉంది. అయితే ఒకేరోజు వరుసపెట్టి అనేక చోట్ల స్నాచింగ్స్ జరగడం, స్నాచర్ల బారిపడన పడిన వారిలో పలువురు వీఐపీ సం బంధీకులు ఉండటం, అనేక మంది క్షతగాత్రులు కావడం, కొందరైతే తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చేరడం తదితర సంచలనాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నేరాలు నిత్యం వార్తల్లో ప్రముఖ స్థానంలో నిలుస్తూనే ఉన్నాయి. ‘దోపిడీ’కి రెండు నెలల్లోనే బ్రేక్... స్నాచర్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నగర పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. స్నాచింగ్‌కు పాల్పడి చిక్కిన వారిపై ఒకప్పుడు కేవలం ఐపీసీలోని 379 (చోరీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసేవారు. అయితే ఓసారి ఇలా ఈజీ మనీకి అలవాటుపడిన వారు మళ్లీ రెచ్చిపోతుండటం, సంచనాలు నమోదు కావడంతో ఈ నేరగాళ్లకు తేలిగ్గా బెయిల్ దొరక్కుండా ఉండటానికి స్నాచింగ్ తీరుతెన్నులను బట్టి దోపిడీ కేసు (ఐపీసీ 392) నమోదు చేస్తున్నారు. దాదాపు 40 మందిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల బాంబే హైకోర్టు అక్కడి ఓ కేసులో స్నాచింగ్ నేరాన్ని దోపిడీ కింద నమోదు చేయడం తగదంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. -
బస్టాండ్‌లో దొంగలు..
అందినకాడికి దోచుకుంటున్నారు అదును చూసి పర్సులు కొట్టేస్తున్న చోరులు మెడల్లోంచి గొలుసులు తెంపుకెళ్తున్న కేటుగాళ్లు ఆదమరిస్తే ఒంటిమీదున్న వస్తువులూ మాయం పోలీసులున్నా.. ప్రయోజనం సున్నా పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం 2013 జనవరి నుంచి ఇప్పటివరకు నిజామాబాద్ బస్టాండ్‌లో 132 చోరీ కేసులు నమోదయ్యాయి. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, ఆరు బైకులు, రెండు ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. వాటి వివరాలిలా ఉన్నాయి. గొలుసు దొంగతనాలు 16 బైకులు 06 కంప్యూటర్ పరికరాలు 02 చిల్లర దొంగతనాలు 12 ఇతర దొంగతనాలు 96 నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్ : నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో దొంగల బెడద ఎక్కువైంది. ఆదమరిస్తే ఒంటిమీద ఉన్న నగలను దోచేస్తున్నారు. ప్రయాణికులు బస్సులో సీటు సంపాదించడం కోసం ఆరాటపడే సమయం లో చోరులు తమ కళను ప్రదర్శిస్తున్నారు. పర్సులు, గొలుసులు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. సీట్లో కూర్చున్న తర్వాతగానీ ప్రయాణికులకు తెలియడం లేదు తమ వస్తువులు చోరీకి గురయ్యాయని. ఇలా రోజూ ఇద్దరు ముగ్గురైనా తమ వస్తువులు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది. బస్టాండ్‌లోని పోలీసు బూత్ వద్ద కు వచ్చి మొరపెట్టుకోవడం, తమ ఖర్మ ఇంతేనని ఇంటికి వెళ్లి పోవడం చేస్తున్నారు. రోజూ లక్షల మంది ప్రయాణం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మీదుగా నిత్యం 1,125 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. అంతర్రాష్ట్ర బస్సులు అదనం. వీటిద్వారా సుమారు రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. దీంతో బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. చోరులు తమ కళ ప్రదర్శించడానికి ఈ రద్దీని అవకాశంగా తీసుకుంటున్నారు. ఏమరుపాటుగా ఉన్న ప్రయాణికుల వస్తువులు అపహరించి పారిపోతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు కిక్కిరిసి ఉండే ప్లాట్‌ఫామ్‌ల వద్ద దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇంత రద్దీగా ఉండే బస్టాండ్‌లో ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి పోలీసులు, ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. బస్టాండ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. చూసీ చూడనట్లుగా బస్టాండ్లలో చోరీలను నివారించడంలో పోలీసు శాఖ విఫలమవుతోంది. చోరీలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తువులు పోగొట్టుకున్నవారు వచ్చి మొరపెట్టుకుంటున్నా సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం, పోలీసులు స్పందించి బస్టాండ్లలో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. 2013 జనవరి 22 : రంగారెడ్డి జిల్లా సుచిత్ర జంక్షన్, రాఘవేంద్ర కాలనీకి చెందిన దేవభక్త గిరిజారాణి మాక్లూర్ మండలంలోని దుర్గానగర్‌లో ఉన్న బంధువుల ఇం టికి వెళ్లడానికి నిజామాబాద్ బస్టాండ్‌కు చేరుకున్నారు. దుర్గానగర్‌కు వెళ్లేందుకు నందిపేట బస్సు ఎక్కారు. సీటులో కూర్చున్న తర్వాత మెడను తడుముకోగా గొలుసు కనిపించలేదు. నాలుగు తులాల బంగారు ఆభరణం చోరీకి గురయ్యిందని ఆమె నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2013 మే 13 : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చెందిన బీర్కూర్ పద్మావతి నిజామాబాద్ వచ్చారు. పని పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామానికి వెళ్లడానికి బస్టాండ్‌కు చేరుకుని బోధన్ బస్సు ఎక్కారు. టికెట్టు తీసుకోవడం కోసం హ్యాండ్ బ్యాగును తెరచి చూడగా డబ్బులు లేవు. బస్సు ఎక్కినప్పుడు తన పక్కన కూర్చున్న మహిళ కనిపించలేదు. బ్యాగులోని బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, రెండు వేల నగదు అపహరణకు గురయ్యాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 జూలై 16 : బాన్సువాడ ప్రాంతానికి చెందిన మైలవరం తరుణ్‌కుమార్ నిజామాబాద్ బస్టాండ్ వచ్చారు. బాన్సువాడ బస్సు వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడం తో తన చేతిలో ఉన్న బ్యాగును కిటికీలోంచి సీటుపై వేశారు. తర్వాత నెమ్మదిగా బస్సు ఎక్కారు. బ్యాగు తెరచి చూడగా ల్యాప్‌టాప్ కనిపించలేదు. బస్సంతా గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేశారు. 2013 అక్టోబర్ 14 : నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కాలనీకి చెందిన ఎర్ర లింగం తన పిల్లలను కామారెడ్డి బస్సు ఎక్కించడానికి బైక్‌పై బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్ ఆవరణలో బైక్‌ను పార్క్ చేశారు. పిల్లలను బస్సు ఎక్కించి వచ్చే సరికి బైక్ మాయమైంది. చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.