చెవి దుద్దులు,కాళ్ల పట్టీలు ఎత్తుకెళ్లాడు | 13 years old girl robbed of gold earrings | Sakshi
Sakshi News home page

చెవి దుద్దులు,కాళ్ల పట్టీలు ఎత్తుకెళ్లాడు

Published Sun, May 8 2016 6:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

13 years old girl robbed of gold earrings

హైదరాబాద్‌ : బాలికకు మాయమాటలు చెప్పి ఆమె బంగారు చెవికమ్మలను, కాళ్ల పట్టీలను ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడిషనల్ ఇన్స్‌పెక్టర్ కె.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన జానయ్య కూతురు ధరణి (13) ఆరో తరగతి చదువుతోంది. ఈ నెల 4వ తేదీన ఇంటి దగ్గర తమ్ముడితో కలిసి ఆడుకుంటుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పైన వచ్చి.. నీకు క్యారమ్‌బోర్డు కొనిస్తాను రమ్మని చెప్పడంతో శిరీషతో పాటు ఆ బాలిక తమ్ముడు కూడా బైక్‌పై ఎక్కారు.

కొంత దూరం వెళ్లగానే బాలిక చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు తీసుకుని వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. సీసీ పుటేజీల ద్వారా లభించిన ఆ దొంగ ఫోటోను గుర్తించిన పోలీసులు ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. దొంగ ఆచూకీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా సెల్: 9490676378 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement