kachiguda
-
కాచిగూడ తుల్జా భవన్లో ఘనంగా మంగళ గౌరీ పూజ (ఫొటోలు)
-
సెల్‌ఫోన్ మాట్లాడవద్దన్నందుకు..
కాచిగూడ: సెల్‌ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాచిగూడ ఎస్ఐ నరేష్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచిగూడ, సుందర్‌నగర్ లోని బంధువుల ఇంటికి వచ్చారు. బాలాజీరావు కుమార్తె సీహెచ్ గౌరీ (13) 8వ తరగతి చదువుతోంది. సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి లోనైన మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. సెల్‌ఫోన్ కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. గౌరి సోదరుడు విష్ణు కార్తి ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో పది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్ల సర్వీసులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు టైమ్‌టేబుల్ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే 20 సంక్రాంతి స్పెషల్ రైళ్లు సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి రైళ్ల వివరాలు ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
ఒకేసారి 9 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. తెలుగు రాష్ట్రాలకు..
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాకే రైల్వేశాఖ నూతన శకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అభివృద్ధి చేపడుతున్నారు. ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను నేడు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో వందే భారత్ రైలు కాచిగూడ, బెంగళూరు ప్రారంభమైంది. మూడు రాష్ట్రాలు, 12 జిల్లాలకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఈ రైలు ఉంటుంది. వచ్చే నెల 1న మహబూబ్ నగర్, వచ్చే నెల 3న నిజామాబాద్ జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తెలంగాణలో కొత్త రైల్వే ప్రోజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణకు రూ.4418 కోట్ల బడ్జెట్ రైల్వే అభివృద్ది కోసం కేంద్రం కేటాయించింది. రూ.31,200 కోట్ల రైల్వే ప్రోజెక్టులు పనులు సాగుతున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ది కూడా చేపట్టబోతున్నాం అని కామెంట్స్ చేశారు. 9 New #VandeBharat poised for debut. Prime Minister #NarendraModi inagurated all the #VandeBharatExpress today. pic.twitter.com/sBgBcRpUWa — Nitu Kumari (@nitukumari_94) September 24, 2023 కాచిగూడ-బెంగళూరు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని కాచిగూడ-బెంగళూరులోని యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో స్థానికంగా ఆగుతుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. Shri Arun Kumar Jain, GM,SCR welcomes Shri G.Kishan Reddy, Hon'ble Union Minister to the inaugural run Kacheguda - Yesvantpur Vande Bharat Express which will be virtually flag off by Hon'ble PM@RailMinIndia#Hyderabad #VandeBharat pic.twitter.com/16B9F61wvi — South Central Railway (@SCRailwayIndia) September 24, 2023 విజయవాడ-చెన్నై వందే భారత్ చెన్నైలో ప్రధాని మోదీ ప్రారంభించిన రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గంలో వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది. 6:40 గంటల్లోనే విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణం పూర్తి కానుంది. టిక్కెట్ ధర ఛైర్ కార్ : రూ.1,420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర : రూ.2,630. -
బెంగళూరు ఎకానమీ చైర్‌కార్ చార్జి రూ.1,600
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ–యశ్వంతపూర్ (బెంగళూరు) వందేభారత్ రైలు (నం.20703) టికెట్ చార్జీలను దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. కాచిగూడ నుంచి యశ్వంతపూర్ స్టేషన్‌కు ఎకానమీ చైర్ కార్లో క్యాటరింగ్ రుసుముతో కలుపుకొని రూ.1,600గా నిర్ణయించారు. క్యాటరింగ్ చార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో ప్రయాణానికి క్యాటరింగ్ చార్జీతో కలుపుకొని రూ. 2,915గా, కేటరింగ్ చార్జీ లేకుండా 2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ (నం.20704)కు ఈ ధరల్లో స్వల్ప తేడా ఉంది. ఎకానమీ చైర్ కార్లో కేటరింగ్ చార్జీలతో కలిపి రూ.1,540, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో కేటరింగ్ చార్జీతో కలిపి రూ.2,865, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.2,515గా నిర్ణయించారు. రైల్లో అల్పాహారం, లంచ్: ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో ప్రారంభమయ్యే వందేభారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. కేటరింగ్ చార్జీతో కలిపి టికెట్ బుక్ చేసుకున్నవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌ను రైల్లో అందిస్తారు. కేటరింగ్ రుసుము చెల్లించని వారికి అవి అందవు. ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని రైల్లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వందేభారత్ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆదివారం సాధారణ ప్రయాణికులను అనుమతించరు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. -
అఫీషియల్: మరో వందేభారత్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి మరో వందేభారత్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే విశాఖ, తిరుపతిల నడుమ సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైళ్లు నడుస్తున్న సంతి తెలిసిందే. ఇప్పుడు మూడో రూట్లో ఉరుకులు పెట్టేందుకు రెడీ అయ్యింది. చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి సోమవారమే రైలు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. దేశంలోనే ఐటీ దిగ్గజ నగరాలుగా పేరొందిన హైదరాబాద్–బెంగళూరు మధ్య వందేభారత్ రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. కాచిగూడ–యశ్వంతపూర్ (బెంగళూరు) స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. దక్షిణ మధ్య రైల్వేకు మూడో వందేభారత్ సర్వీసుగా అందుబాటులోకి రానున్న ఈ రైలు సేవలు ఆగస్టు 6న లేదా 15వ తేదీన లేదంటే ఆ తేదీల మధ్యలో గానీ ప్రారంభం కానున్నాయి. ఎనిమిదిన్నర గంటల్లో.. ప్రస్తుతం నగరం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్ రైలు మాత్రం కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోనుంది. కాచిగూడలో ఉదయం ఆరుగంటల సమయంలో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర వరకు బెంగుళూరు చేరుకుని, తిరిగి అక్కడ 3 గంటలకు బయలు దేరి రాత్రి పదకొండున్నర వరకు కాచిగూడకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రారంభ తేదీని.. సమయాలను మాత్రం ఇంకా రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించలేదు. -
కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ–ఖుర్దారోడ్డు (07223) రైలు ఈ నెల 24న రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్డు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07224) ఈ నెల 25న ఖుర్దారోడ్డులో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటలకు కాచిగూడ చేరుతుంది. రెండు మార్గాలలో ఈ రైలు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెరంపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
Hyderabad: బాత్రూమ్లో జారిపడి గర్భిణి మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు బాత్రూమ్లో జారిపడి గాయపడిన ఓ గర్భిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపిన మేరకు.. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయన భార్య కల్పన (28) ఆరు నెలల గర్భవతి. సీమంతం నిమిత్తం ఆమెను స్థానికంగా ఉండే సంజీవయ్యనగర్ లోని పుట్టింటికి 15 రోజుల క్రితం అతను పంపాడు. గురువారం ఉదయం ఆమె బాత్రూమ్లో జారిపడింది. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఫిట్స్, గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా కుప్పకూలిన గోడ.. హైదరాబాద్‌లో విషాదం
సాక్షి, హైదరాబాద్: గోడకూలి ఓ బాలుడు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ రామ లక్ష్మణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ నుంచి బండి సింగ్, సేవారాజ్ కుటుంబాలు నగరానికి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ కాచిగూడ, నింబోలిఅడ్డలో నివాలముంటున్నారు. బండి సింగ్ కుమారుడు ధీరూ సింగ్ (6), సేవా రాజ్ కుమార్తె రాధిక (5) తమ ఇంటి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా గోడకూలి చిన్నారి ధీరూ సింగ్ అక్కడికక్కడే మరణించగా, రాధిక తీవ్రంగా గాయపడింది. రాధికను కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాలికను అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా నిర్మాణం వల్లే.. ఖాళీ స్థలానికి అనుకుని పక్కనే ఉన్న స్థలంలో సత్యేందర్ నూతనంగా ఇంటి పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నాడు. ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇంటి నిర్మాణపు పనులు చేపడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటి యజమాని సత్యేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని కాచిగూడ పోలీసులు సందర్శించి వివరాల సేకరించారు. చదవండి: Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం -
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్‌గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్‌ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
13న అసెంబ్లీ ఎదుట రెడ్డి సంఘాల నిరసన
కాచిగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోలో పెట్టిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్ల క్రితం మాటిచ్చి మరచిపోయిన ముఖ్యమంత్రికి గుర్తు చేద్దామని, రెడ్డి కార్పొరేషన్ సాధించుకుందామని ఆయన పేర్కొన్నారు. -
త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్
కాచిగూడ: మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అనుకూలంగా ఉన్నారని, త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటవుతుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలోని మున్నూరు కాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమం మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డును త్వరలోనే దేవాదాఖ శాఖ పరిధి నుంచి బయటకు తీసుకువస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నూరుకాపులందర్ని ఏకం చేయడం జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టి 90 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకారా అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, జెల్లి సిద్దయ్య, దామేర జ్ఞానేశ్వర్, మామిండ్ల శ్రీనివాస్, బండి పద్మ, రాకేష్, కొండూరు వినోద్‌కుమార్, గంగం రవి, చింతపండు మల్లేష్, ఎనుగుల మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి
కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. -
బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి
కాచిగూడ: బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో మంగళవారం ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య శిక్షణాతరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల నాయకత్వం పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో బీసీల తిరుగుబాటు మొదలవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జన గణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని అన్నారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, కోల జనార్ధన్, నీల వెంకటేష్, మట్టా జయంతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన
కాచిగూడ: మాదకద్రవ్యాలకు అలవాటు పడితే అది జీవితాన్నే నాశనం చేస్తుందని కాచిగూడ సీఐ హబీబుల్లాఖాన్ అన్నారు. డ్రగ్స్ వాడకంపై జరిగే అనర్థాలపై మంగళవారం కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కాచిగూడ పోలీసులు అవగాహన కల్పిస్తున్న. డ్రగ్స్ వాడకంతో తలెత్తే పరిణామాలను సీఐ వివరించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
15 నిమిషాలు ఆలస్యంగా షో వేసిన థియేటర్‌కు రూ. లక్ష జరిమానా
Hyderabad Theatre Fined Rs 1 Lakh For Wasting Time On Advertisements: హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు కంజ్యూమర్స్ ఫోరమ్ లక్ష రూపాయల జరిమాన విధించి షాకిచ్చింది. షో సమయానికి కంటే 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసి తన సమయాన్ని వృథా చేశారంటూ రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు తాజాగా సదరు థియేటర్‌కు లక్ష రూపాయల జరిమాన విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి టికెట్‌పై ముద్రించిన సమయానికి సినిమా ప్రారంభించకుండా ప్రకటనలు వేసి 15 నిమిషాలు ఆలస్యంగా షో వేశారని ఆరోపిస్తూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! ఈ క్రమంలో 15 నిమిషాలు తన సమయాన్ని వృథా చేసిన సదరు థియేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేశాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలంటూ అతడు విజ్ఞప్తి చేశాడు. విజయ్ తన ఫిర్యాదులో ‘2019 జాన్ 22న వచ్చిన గేమ్ ఓవర్ సినిమాను చూసేందుకు కాచిగూడ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్లు వెళ్లినట్లు చెబుతూ ఆధారాలన్నిటీని సమర్పించాడు. టికెట్‌పై ముంద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాలి, కానీ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభించారని ఆరోపించాడు. చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ థియేటర్ మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేశానని, అయితే, ఆయన స్పందించలేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు చెప్పాడు. దీంతో ఈ కేసులో రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్ అథారిటీ 'హైదరాబాద్ పోలీస్ కమిషనర్'ను చేర్చారు. అయితే, తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత విధానం ప్రక్రారమే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు ఆర్టికల్ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ అయితే, ఐనాక్స్ సంస్థ వాదనలను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించి, ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ. 5 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5 వేలు చెల్లించాలని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేగాక, లైసెన్సింగ్ అథారిటీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి పెనాల్టీ కింద లక్ష రూపాయలు జరిమాన చెల్లించాలని ఆదేశించింది. ఆ థియేటర్ నుంచి వచ్చే ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని పోలీసులకు సూచించింది. -
ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. చిట్టి తల్లికి పెద్ద కష్టం
కాచిగూడ (హైదరాబాద్): చిన్న వయస్సులోనే పెద్ద వ్యాధితో బాధ పడుతోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో ఈ చిన్నారి మంచానికి అతుక్కుపోతోంది. బుడిబుడి అడుగులతో, బోసి నవ్వులతో సందడి చేసిన తమ కలల పంట ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఆమె వైద్యానికి అవసరమైన ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కావడంతో.. దయగల దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధేయపడుతున్నారు. అరుదైన వ్యాధి ఎస్ఎంఏ– 3 హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన దోషిలి వినయ్, శిల్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె సాన్వి జన్యు సంబంధమైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ టైప్ –3) వ్యాధితో పోరాడుతోంది. సాన్వి కొంతకాలం నుంచి సరిగ్గా నడవలేక పోతుండటంతో వైద్యులకు చూపించగా నరాల బలహీనత ఉందని చెప్పి మందులు వాడాలని, ఫిజియోథెరపీ చేయించాలని చెప్పారు. వారి సూచనల మేరకు వైద్యం చేయిస్తూ, ఫిజియోథెరపీ చేయిస్తున్నా చిన్నారి ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇటీవల నిమ్స్ ఆసుపత్రిలో జెనిటిక్ వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రజ్ఞా రంగనాథన్ వద్ద చూపించారు. అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరం సాన్వి.. కోట్ల మందిలో ఏ ఒక్కరికో వచ్చే ఎస్ఎంఏ టైప్ 3 వ్యాధితో బాధపడుతున్నట్టుగా వైద్యులు నిర్ధారించారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం రెయిన్బో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ పర్యవేక్షణలో ఇంటి వద్దే చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వకపోతే జీవితాంతం మంచంపైనే.. ఈ వ్యాధి కోసం ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. పైగా అది ఇక్కడ దొరకదని, విదేశాల నుంచి తెప్పించాల్సి ఉంటుందని, జీఎస్టీతో కలుపుకొని దాదాపు రూ.22 కోట్లు అవుతుందని చెప్పారు. ఐదు సంవత్సరాల వయస్సు లోపే తమ చిన్నారికి ఈ ఇంజెక్షన్ వేయించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు విలపిస్తూ తెలిపారు. ఇటీవల నగరానికే చెందిన ఆయాన్స్ గుప్తాకు నిధుల సమీకరణ ద్వారా ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారని, జీఎస్టీని ప్రభుత్వం మినహాయించిందని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. తక్కువ సమయమే ఉంది తమ కుమార్తెకు చికిత్స ప్రారంభించడానికి తక్కువ సమయం మాత్రమే ఉందని వినయ్, శిల్ప తెలిపారు. నాలుగు నెలల్లో ఇంజెక్షన్ ఇస్తేనే సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. దాతలు తాము చేయగలిగినంత సాయం చేసి (బ్యాంక్ అకౌంట్ నంబర్ : 50100421831334, ఐఎఫ్ఎస్సీ కోడ్: హెచ్డీఎఫ్సీ 000024, గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం నంబర్ : 9618779839) తమ చిన్నారిని కాపాడాలని వారు కోరుతున్నారు. చదవండి: నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి!
సాక్షి, కాచిగూడ: వివాహేతర సంబంధం బయటపడటంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ హబీ బుల్లాఖాన్ వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన దుర్గయ్య కుమారుడు హన్మంతు (23) కాచిగూడలోని చెప్పల్ బజార్లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. అదే ప్రాంతంలో మహారాష్ట్ర లాతూర్కు చెందిన భర్తతో కలిసి ఓ వివాహిత (23) ఉంటున్నారు. హన్మంతుతో ఆమెకు కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఈ నెల 11న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు సాయంత్రం ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. మంగళవారం తన భార్య కనిపించడం లేదని కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. చదవండి: తుపాకీతో బెదిరించి.. కాళ్లు, చేతులు కట్టి! సదరు మహిళ చెప్పల్‌బజార్‌లోని ప్రియుడు హన్మంతు ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో హన్మంతు ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మహిళ నిద్రమాత్రలు మింగి విగతజీవిగా మారింది. మంగళవారం రాత్రి స్థానికులు కాచిగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ లక్ష్మయ్య పేర్కొన్నారు. -
మనోహరాబాద్ రైల్వే లైన్: కరోనా తర్వాతే కూత
సాక్షి, గజ్వేల్: ‘కరోనా దెబ్బ’ ప్రభావం కారణంగా గజ్వేల్‌కు రావాల్సిన రెగ్యులర్ ప్యాసింజర్ రైలు పట్టాలు ఎక్కే వ్యవహారంపై పెండింగ్‌లో పడుతూ వస్తోంది. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ పనులు పూర్తి కాగా రెండు నెలల క్రితం కమిషన్ ఆఫ్ రైల్వే సెఫ్టీ (సీఆర్ఎస్) క్రితం కమిషన్ ఆఫ్ రైల్వే సెఫ్టీ (సీఆర్ఎస్) తనిఖీలు విజయవంతంగా పూర్తయిన విషయం కూడా విధితమే. ఈ నేపథ్యంలోనే సీఆర్ఎస్ తనిఖీలు పూర్తయిన మూడు నెలల్లోపు రైలును పట్టాలెక్కించాలనే ఆనవాయితీలో భాగంగా.. బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సదర్మ దేవరాయ పర్యవేక్షణలో కాచిగూడ– మల్కాజిగిరి– మేడ్చల్– మనోహరాబాద్ గజ్వేల్‌కు వరకు రైలును నమునాగా పట్టాలపై ఎక్కించారు. అదే విధంగా లైన్‌ను మరోసారి పరిశీలించారు. ‘వర్క్ మెన్ స్పెషల్’ పేరిట రైలు పట్టాలపై పరుగులు తీసింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా..రూ.1160.47కోట్లను వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనుంది.. పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్‌లైన్‌కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయితే.. ప్రయాణీకులకు దూరభారం తగ్గనుంది. మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. లైన్లపై ఉన్న వంతెన పనులను పూర్తి చేశారు. మనోహరాబాద్ దాటిన తర్వాత నాగ్‌పూర్ జాతీయ రహదారిని ఈ రైల్వేలైన్ దాటేందుకు చేపడుతున్న పూర్తయిన ఆర్ఓబీ పనులు.. గతంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌క్రిపాల్ రైల్వే ఇంజినీర్ల బృందంతో కలిసి జూన్ 18న తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల తర్వాత మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్న తరుణంలో.. “కరోనా’ ఉధృతి కారణంగా రైలు నడిపే అంశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే జూన్ 28న మనోహరాబాద్ మండలం రామాయపల్లి అండర్‌పాస్ వద్ధ రైల్వే ట్రాక్ కట్ట వర్షాలకు దెబ్బతింది. కొంత మేర ట్రాక్ కంకర, మట్టి కొట్టుకుపోయి లైన్ ధ్వంసమైంది. ఈ ఘటన రైల్వే శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కూడా రైలు నడపడానికి అవరోధంగా మారింది. ‘వర్క్ మెన్ స్పెషల్’ పేరిట నమునా రైలు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రాంతానికి రైలు నడపటం వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తున్న అంశంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రైల్వే అధికారులతో ఈనెల 22న హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్షించారు. నిజానికి కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పరిశీలనలు పూర్తయిన తర్వాత కొద్ది రోజులకు రైలు నడపాలి. కానీ కరోనా వల్ల ఈ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గేంతవరకు పాక్షికంగా నమునాగా “వర్క్ మెన్ స్పెషల్’ పేరిట నమూనా రైలును నడపటానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సదర్మ దేవరాయ పర్యవేక్షణలో కాచిగూడ–మల్కాజిగిరి–అల్వాల్–మెడ్చేల్– నుంచి వయా మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు రైలును నడిపారు. మొత్తంగా 83కిలోమీటర్ల రైలు అప్ అండ్ డౌన్ పరుగులు తీసింది. ఇందులో రైల్వే సిబ్బందితోపాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కారు. అంతేకాకుండా రైల్వే లైన్‌ను మరోసారి పరిశీలన జరిపారు. ఒక రకంగా ఈ ప్రక్రియ గజ్వేల్‌కు రైలును నడిపినట్లయ్యింది. రెగ్యులర్ ప్యాసింజర్ రైలును మాత్రం కరోనా ప్రభావం తగ్గాకే అనుమతి ఇవ్వనున్నారు. ఈ అంశాన్ని గజ్వేల్ ప్రాంతంలో రైల్వేలైన్ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ జనార్థన్ ధృవీకరించారు. -
‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’
సాక్షి, కాచిగూడ : ఓ హాస్టల్ నుంచి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా..అంటూ సూసైడ్ నోట్ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్ యాజమాన్యం అప్రత్తమైంది. ఎస్ఐ లిఖితరెడ్డి తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లా నబీపేటకు చెందిన మౌనిక(19) హిమాయత్‌నగర్‌లో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ కేశవమెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే హాస్టల్ ప్రాంగణంలో ఉండే బాయ్స్ హాస్టల్లో చదువుతున్న మణిరత్నం అనే యువకుడితో కొద్దిరోజులుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26న ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. 27వ తేదీ ఉదయం 6.30గంటలకు హాస్టల్ రికార్డ్స్‌లో సంతకం చేసి బయటకు వచ్చిన మౌనిక.. ఓ ఆటోలో ప్రయాణించి సచివాలయం సిగ్నల్ వద్ద దిగింది. అక్కడ నుంచి కాలినడకన ట్యాంక్‌బండ్ చిల్డ్రన్‌పార్క్ వైపు వెళ్లింది. ఇదంతా ఆయా పరిధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అదే సమయంలో మణిరత్నం కూడా కనిపించకుండా పోవడంతో.. ఇద్దరూ కలసి వెళ్లిపోయారా లేక ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో ఎస్.ఐ. లిఖితరెడ్డి రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదవండి : వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే హైదరాబాద్‌లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా.. బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్ -
యువ పారిశ్రామికవేత్తలకు అండ: కేటీఆర్
కాచిగూడ: యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సీఎం ఎస్టీ ఎంటర్‌పెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీమ్‌లో భాగంగా హిమాయత్‌నగర్‌లో మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన ‘చీసీయానో పిజ్జా’సెంటర్‌ను గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘నేనే స్వయంగా వచ్చి షాప్ ప్రారంభిస్తానని ఈ నెల తొలివారంలో గౌతమికి మాటిచ్చాను. అందులో భాగంగానే ఈరోజు షాప్ ఓపెనింగ్‌కు వచ్చాను’అని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన ఆడబిడ్డలకు హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహకం ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన బిడ్డ ఇక్కడ పిజ్జా షాప్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. హిమాయత్ నగర్లో పిజ్జా సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్ -
రైలు ప్రమాదం: పైలెట్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని గుర్తించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరగిందిని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై పలు కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైలు ఒక ట్రాక్‌పై వెళ్లాల్సిందిగా, మరో ట్రాక్‌పై తీసుకువెళ్లి పైలెట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే.( చదవండి: ఎంఎంటీఎస్‌లో తొలి ప్రమాదం) పైలెట్ పరిస్థితి విషమం.. రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఇంకా కోలుకోనట్లు వైద్యులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. -
లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. రైలు ఇంజిన్‌లో ఇరుక్కొన్న లోకో పైలెట్ శేఖర్‌ను ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించి లోకో పైలెట్‌ను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆగి వున్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను...అదే ట్రాక్ వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. చదవండి: కాచిగూడ : ఆగివున్న ట్రైన్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ -
చెన్నై–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంజీఆర్ చెన్నై–సికింద్రాబాద్ మధ్య వారానికి రెండు చొప్పున ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎంజీఆర్ చెన్నై –సికింద్రాబాద్ (06059/06060) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 18, 20, 25, 27, నవంబర్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29,డిసెంబర్ 1,6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.25 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 19, 21, 26, 28, నవంబర్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30, డిసెంబర్ 2, 7, 9, 14, 16, 21, 23, 28, 30 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. కాచిగూడ–కర్నూలు మధ్య నేడు జనసాధారణ్ రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంగళవారం (15వ తేదీ) కాచిగూడ–కర్నూల్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ–కర్నూల్ (07023/07024) స్పెషల్ ట్రైన్ మంగళవారం ఉదయం 11.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15కు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి రాత్రి 9.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్ (07013/07014) మంగళవారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 3.40 కి బయలుదేరి సాయంత్రం 7.30 కు కాచిగూడ చేరుకుంటుంది. -
‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ వినోదినిపై దాడి.. గాయాలు
సాక్షి, హైదరాబాద్ : జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే, అతని ఇంటి ఓనర్.. వ్యక్తిగత కక్షలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి ఘటనపై వినోద్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి ఓనరే తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. జబర్దస్త్ టీవీ కార్యక్రమంలో అమ్మాయి వినోదినిగా స్కిట్లు వేసి.. అతను అలరిస్తున్న సంగతి తెలిసిందే.