అదృశ్యమైన మౌనిక
సాక్షి, కాచిగూడ : ఓ హాస్టల్ నుంచి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా..అంటూ సూసైడ్ నోట్ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్ యాజమాన్యం అప్రత్తమైంది. ఎస్‌ఐ లిఖితరెడ్డి తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లా నబీపేటకు చెందిన మౌనిక(19) హిమాయత్‌నగర్‌లో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ కేశవమెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే హాస్టల్ ప్రాంగణంలో ఉండే బాయ్స్ హాస్టల్‌లో చదువుతున్న మణిరత్నం అనే యువకుడితో కొద్దిరోజులుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 26న ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. 27వ తేదీ ఉదయం 6.30గంటలకు హాస్టల్ రికార్డ్స్‌లో సంతకం చేసి బయటకు వచ్చిన మౌనిక.. ఓ ఆటోలో ప్రయాణించి సచివాలయం సిగ్నల్ వద్ద దిగింది. అక్కడ నుంచి కాలినడకన ట్యాంక్‌బండ్ చిల్డ్రన్‌పార్క్ వైపు వెళ్లింది. ఇదంతా ఆయా పరిధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అదే సమయంలో మణిరత్నం కూడా కనిపించకుండా పోవడంతో.. ఇద్దరూ కలసి వెళ్లిపోయారా లేక ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో ఎస్.ఐ. లిఖితరెడ్డి రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
చదవండి : వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే
Comments
Please login to add a commentAdd a comment