women missing
-
తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో నాలాలో పడిపోయి ఓ మహిళ గల్లంతయ్యింది. వివరాల ప్రకారం.. వర్షాల నేపథ్యంలో గాంధీనగర్ నాలాలో పడిపోయి మహిళ గల్లంతయ్యింది. సదరు మహిళను లక్ష్మిగా గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి మూసీ నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొని మూసీని జల్లెడ పడుతున్నారు. పది కిలోమీటర్ల మేర డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కూతురు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా అమ్మ కనిపించడం లేదు. వర్షం కారణంగానే నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. నాలాను ఆనుకుని మేము గోడ కట్టుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదన్నారు. తాము ఒక గోడ నిర్మించిన తర్వాతే.. మేము గోడ కట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఎన్నో రోజులుగా గోడ నిర్మిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అది జరగలేదన్నారు. ఇది కూడా చదవండి: అనుమానాస్పద స్థితిలో ముంబై ఎయిర్ హోస్టెస్ మృతి -
అమ్మా.. ఎక్కడున్నా వెంటనే రా..!
బంజారాహిల్స్: తమ తల్లి కనిపించడం లేదని, వెదికి పెట్టాలని కన్నీరుమున్నీరవుతూ ఇద్దరు చిన్నారులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే శ్రావణి(37) రెండు వారాల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. భర్త సురేష్ కారు డ్రైవర్ కాగా, శ్రావణి ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్‌గా పని చేస్తోంది. తమ తల్లి కనిపించడం లేదని పదో తరగతి చదువుతున్న హర్ష(15), తొమ్మిదో తరగతి చదువుతున్న శరణ్య(13) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదిహేను రోజులైన తల్లి జాడ తెలియకపోవడం, తండ్రి పట్టించుకోకపోవడంతో పిల్లలిద్దరూ బుధవారం జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చారు. తల్లి లేకుండా ఉండలేకపోతున్నామని ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తుండటం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. అమ్మా.. నువ్వుక్కెడున్నా వెంటనే ఇంటికి రావాలని వారు కోరారు. తరచూ తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగేవి చిన్నారులు ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు శ్రావణి కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఆమె సెల్‌ఫోన్‌ను వెంట తీసుకెళ్లకపోవడంతో జాడ తెలియడం లేదు. భర్త సురేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఆమె రెండు సార్లు ఇలానే అదృశ్యమైనట్టు పోలీసులు చెప్తున్నారు. -
నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం?
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన కేరళలోని పతనంతిట్ట జిల్లా నరబలి కేసు దర్యాప్తులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ చేతిలో చాలా మంది బలైపోయినట్లు తెలుస్తోంది. నరబలి కేసు బయటపడిన క్రమంలో కనిపించకుండా పోయిన మహిళల కుటుంబాలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నాయి. వారు కనిపించకుండా పోవటం వెనక నరబలి నిందితుడు షపీ హస్తం ఉండి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఎలంతూర్ గ్రామంలో ఇద్దరు మహిళలను బలిచ్చిన కేసులో షఫీ, భగవల్ సింగ్, అతడి భార్య లైలాను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 2013 నుంచి కనిపించకుండా పోయిన బింధు పద్మనాభన్ అనే మహిళ బంధువులు.. కేరళ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఆమె మిస్సింగ్‌కు కొద్ది రోజుల ముందు షఫీకి సంబంధించిన ఓ వ్యక్తితో బింధును చూసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై షఫీని ప్రశ్నించామని, ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు తెలిపారు. బింధు పద్మనాభన్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. కందకరపల్లిలో ఒంటరిగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆమె కనిపించకుండా పోయినట్లు 2013లో కేసు నమోదైంది. 2017లో మరోమారు ఆమె ఆస్తులను నకిలీ పత్రాలను ఉపయోగించి సీజ్ చేశారని బాధితురాలి సోదరుడు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సంఘటనలో 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించిన కే. సరోజిని నివాసం.. ఎలాంతూర్ నిందితులకు కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దీంతో ఆమె కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని బంధువులు కోరుతున్నారు. కనిపించకుండా పోయిన మహిళల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులన్నీ తిరిగి దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పతనంతిట్ట జిల్లాలో 12, ఎర్నాకులం జిల్లాలో 14 కేసులు గత ఐదేళ్లలో నమోదైనట్లు సీనియర్ అధికారోకరు తెలిపారు. ఈ 26 మంది మహిళల మిస్సింగ్ వెనుక షఫీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. తల నరికి, నాలుక కోసి.. -
కొడుకు ఒడికి చేరిన తల్లి
కర్లపాలెం(బాపట్ల): ఊరు కాని ఊరు.. భాష రాక, తిరిగొచ్చే దారి తెలీక నాలుగేళ్ల క్రితం తప్పిపోయి ఓ మారుమూల రాష్ట్రంలో నరకయాతన అనుభవిస్తున్న 62ఏళ్ల వృద్ధురాలికి బాపట్లకు చెందిన ఓ వ్యక్తి జవాను ఆదుకున్నాడు. ఆమెను తన కుమారుడి దగ్గరకు చేర్చాడు. తెలంగాణలోని గద్వాల్ జిల్లా కుర్తిరవాళ్ గ్రామానికి చెందిన సోంబార్ నాగేశమ్మ 2018లో తన ఇంటి నుంచి అదృశ్యమై అసోంలోని చకోర్ జిల్లా చిల్‌చార్ సిటీకి చేరుకుంది. అక్కడి భాష రాక మానసిక వేదనతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. అయిన వారు లేక నాగేశమ్మ రోజురోజుకీ మానసికంగా కుంగిపోతోంది. ఇంతలో ఓ రోజు అక్కడే జవానుగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం గ్రామానికి చెందిన ఎన్. వెంకట నరేష్ తోటి జవాన్లతో కలిసి ఆ వృద్ధాశ్రమానికి ఈ నెల 21న వెళ్లాడు. అక్కడున్న వృద్ధ మహిళల మంచిచెడులు తెలుసుకుంటుండగా నాగేశమ్మ గురించి తెలిసింది. ఆమెను నరేష్ తెలుగులో పలకరించి ధైర్యం చెప్పాడు. ఆమె వివరాలు తెలుసుకుని తెలంగాణలోని ఓ న్యూస్ చానెల్ ప్రతినిధికి తెలియబర్చి వారిద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. వీడియో కాల్ ద్వారా తన తల్లిని గుర్తించిన ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు హుటాహుటిన అసోం వెళ్లి తన తల్లిని తీసుకుని వచ్చాడు. -
మహిళలు అదృశ్యం: టైలర్ షాపుకు వెళ్లి ఒకరు.. కాలేజీకి వెళ్లి మరొకరు
ఆనందపురం(విశాఖ జిల్లా): మండలంలోని రెండు గ్రామాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందగా విచారణ జరుపుతున్నారు. ఆనందపురం యాతపేటకు చెందిన కుప్ప లావణ్య (26) ఈ నెల 18న దుస్తులు కుట్టించుకోవడానికని గ్రామంలోని టైలరు వద్దకు వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త లక్ష్మణ అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: పులి కూడా బ్రష్ చేస్తుంది! అలాగే లొడగలవానిపాలెం గ్రామానికి చెందిన మరడాన లావణ్య (22) కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 18న ఆమె స్కూటీపై కళాశాలకు వెళ్లింది. సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ రవి ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’
సాక్షి, కాచిగూడ : ఓ హాస్టల్ నుంచి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా..అంటూ సూసైడ్ నోట్ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్ యాజమాన్యం అప్రత్తమైంది. ఎస్ఐ లిఖితరెడ్డి తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లా నబీపేటకు చెందిన మౌనిక(19) హిమాయత్‌నగర్‌లో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ కేశవమెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే హాస్టల్ ప్రాంగణంలో ఉండే బాయ్స్ హాస్టల్లో చదువుతున్న మణిరత్నం అనే యువకుడితో కొద్దిరోజులుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26న ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. 27వ తేదీ ఉదయం 6.30గంటలకు హాస్టల్ రికార్డ్స్‌లో సంతకం చేసి బయటకు వచ్చిన మౌనిక.. ఓ ఆటోలో ప్రయాణించి సచివాలయం సిగ్నల్ వద్ద దిగింది. అక్కడ నుంచి కాలినడకన ట్యాంక్‌బండ్ చిల్డ్రన్‌పార్క్ వైపు వెళ్లింది. ఇదంతా ఆయా పరిధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అదే సమయంలో మణిరత్నం కూడా కనిపించకుండా పోవడంతో.. ఇద్దరూ కలసి వెళ్లిపోయారా లేక ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో ఎస్.ఐ. లిఖితరెడ్డి రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదవండి : వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే హైదరాబాద్‌లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా.. బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్ -
ఏమైపోయారో?
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరావడం లేదు. నెలలు..సంవత్సరాలైన వారి జాడ తెలియడం లేదు. అసలు బతికున్నాడో..మరే ప్రమాదంలో చిక్కుకున్నాడో అంతుపట్టడం లేదు. ఇలా అదృశ్యమైన వ్యక్తుల్లో అధికంగా మహిళలే ఉంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఏళ్ల తరబడి వీరి జాడ తెలియక అయిన వా రు మానసిక వేదనకు గురవుతున్నారు. మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ దొరుకుతుండగా.. మరికొంత మంది ఏమైపోతున్నారో తెలియడం లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,502 మంది తప్పిపోగా ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,502 మంది అదృశ్యం కాగా 1,379 మంది దొరికారు. ఇంకా 123 మంది ఆచూకీ లభించక ఆ కుటుంబాలు తీరని క్షోభను అనుభవిస్తున్నాయి. అదృశ్యమైన వారిలో చిన్నారుల నుంచి యువత వరకు ఉన్నారు. ఇందులో 18 ఏళ్లలోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక శాతం మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఇటీవల భద్రాద్రి జిల్లాలోని హాజీపూర్ ఘటనతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. వివాహం చేసుకుంటున్నారు.. యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే అధికంగా ఉంటున్నాయి. సాధారణంగా యువతులు ఆదృశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెడుతుంటారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనర్ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొంత మంది యువతుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమ వివాహం చేసుకున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడున్నర ఏళ్లలో మహిళల మిస్సింగ్ కేసులే అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం 1,502 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఇందులో సుమారు 600లకుపైగా మహిళలు అదృశ్యమయ్యారు. కొందరుల ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తిరిగి వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా ఇందులో 500మంది ఆచూకీ లభించింది. ఇంకా 100 మంది మహిళల ఆదృశ్యం మిస్టరిగానే మిగిలిపోయింది. ఏదేమైనా చేతికందిన పిల్లలు కనిపించకుండా పోతున్నారనే బాధ తల్లిదండ్రులను వేధిస్తోంది. ఒక వేళా అదృశ్యమై పెళ్లిళ్లు చేసుకున్నా ఇంటికి రాకుండా బయటనే ఉండే పిల్లల గురించి తెలియక తల్లితండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనకు గురవుతున్నారు. పిల్లల అక్రమ రవాణా.. ఉమ్మడి జిల్లాలో అదృశ్యమైన కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుసుస్తోంది. అదృశ్యమైన 18 ఏళ్లలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు ఇటీవల తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. బాలబాలికల్లో కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతోనే ఇంటిని విడిచి వెళ్లిపోగా.. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్ వంటి పట్టణాల నుంచి మనుషుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి కొంత మందిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ తిరిగి వదిలేయడం, మరికొంత మందిని వ్యభిచార గృహాలకు తరలించడం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలకు డబ్బు ఏరగా వేసి ఇలాంటి పడుపు రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మచ్చుకు కొన్ని సంఘటనలు æ మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఓ బాలిక( 18) తమకు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉచుకొని దగ్గరి బందువైన ఓ యువకునికి తెలిసిన వారి ఇంట్లో పని చేసేందుకని 2014 డిసెంబర్ 21న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సదరు యువతి, యువకుడు కనిపించకుండా పోయారు. కొంత కాలం వేతికి ఎక్కడ ఆచుకి లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. æ 2018 అక్టోబర్ 14న మంచిర్యాల గోదావరిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని కుళ్లిపోయిన మృతదేహం లభించింది. తలకు తీవ్రమైన గాయం ఉండడంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 నెలలు అవుతున్న మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఎవరు హత్య చేసి ఉంటారు అనేది ఇంక మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్సింగ్ కేసులపైదృష్టి సారిస్తాం జిల్లాలో మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశమై ఈ కేసులపై చర్చిస్తాం. ఇప్పటికే సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అన్ని కేసుల్లో దృష్టి సారిస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో పురోగతి సాధించేందుకు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ, జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లాలో మహిళల అక్రమ రవాణా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీçసులకు సమాచారం అందించాలి. 100 కాల్ చేస్తే పోలీసులు క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుంటారు. – రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల -
ఆ ఇంటి యువకుడు ఢిల్లీకి తీసుకొచ్చాడు కాపాడండి
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ నేపాలీ మహిళ అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన హరీష్, తిళా దంపతులు బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి బంజారాహిల్స్, సయ్యద్‌నగర్‌లో ఉంటున్నారు. హరీష్ వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా తిళా ఇంట్లోనే ఉండేది. ఏప్పుడూ స్మార్ట్ ఫోన్లో చాటింగ్ చేస్తుండటంతో హరీష్ భార్యను మందలించాడు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 20న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత హరీష్ డ్యూటీకి వెళ్లిపోగా తిళా పిల్లలను వదిలి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన హరీష్ భార్య కనిపించకపోవడంతో నాలుగు రోజులుగా నగరంలో గాలిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తిళా తన మేనమామ బీమ్‌సింగ్‌కు ఫోన్‌చేసి తాను ఇంటి ఎదురుగా ఉంటున్న యువకుడితో వెళ్లిపోయానని, అతను తనను ఢిల్లీకి తీసుకొచ్చాడని, తనకు ప్రాణహాని ఉందని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో బీమ్సింగ్ సదరు నెంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఆందోళన చెందిన హరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా సెల్ సిగ్నల్స్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. -
23 ఏళ్ల తర్వాత ఇంటికి...
రాజేంద్రనగర్: ఇంటి నుంచి వెళ్లిన 23 సంవత్సరాల అనంతరం ఓ మహిళ కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. ఈ సంఘటన హైదర్షాకోట్ కస్తూర్బా ట్రస్టులో చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మహిళలకు పదేళ్ల చికిత్స తర్వాత ఒక్కొక్కటిగా చిన్ననాటి విషయాలు గుర్తుకు రావడంతో కస్తూర్బా ట్రస్ట్ నిర్వాహకురాలు పద్మావతి పోలీసుల సహాయంతో కుటుంబసభ్యులను వెతికి షీటీమ్ డీసీపీ అనురాధ సమక్షంలో సోమవారం వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ గిరినగర్ ప్రాంతానికి చెందిన యాదమ్మ, సత్తయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్తయ్య హెచ్ఏఎల్లో విధులు నిర్వహించగా యాదమ్మ ఇంటి వద్దే దుస్తు్తలు ఇస్త్రీ చేసేది. పెద్ద కూతురైన మసినూరి రేణుక(40) తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. వీరి ఇంటి పక్కనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం నివసించేంది. 1995లో రాత్రికి రాత్రే తమిళనాడు కుటుంబం రేణుకను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రేణుక కోసం సంవత్సరాల తరబడి వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో రేణుక 17 సంవత్సరాల వయస్సు. 18 ఏళ్లుగా ఆశ్రమాల్లోనే.. 2001లో చెన్నై రైల్వే స్టేషన్లో మతిస్థిమితం లేని రేణుకను అక్కడి పోలీసులు గుర్తించి బనియన్ ఆర్గనైజేషన్ సొసైటీకి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడే ఆశ్రమం పొందుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చాను అనే మాట తప్ప మరే ఇతర వివరాలు చెప్పలేదు. దీంతో నిర్వాహకులు 2011లో హైదరాబాద్‌కు వచ్చి వాకబు చేశారు. అనంతరం 2012 జూలై 20న బనియన్ ఆర్గనైజేషన్ వారు హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్టు నిర్వాహకులకు రేణుకను అప్పగించారు. ట్రస్టు నిర్వాహకులు చికిత్స అందిస్తూ ఆశ్రయం కల్పించారు. 10 రోజుల క్రితం కోలుకున్న రేణుక తాను ఉండే ప్రాంతం పేరుతో పాటు తండ్రి హెచ్ఏఎల్లో పని చేసేవాడని తనకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, తల్లి బట్టలు ఇస్త్రీ చేసేదని తెలిపింది. పోలీసుల సాయంతో ఆచూకీ లభ్యం చిన్ననాటి విషయాలన్ని ఒకొక్కటిగా చెబుతుండడంతో ట్రస్టు నిర్వహకురాలు పద్మావతి బాలానగర్ పోలీసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లను సంప్రదించారు. స్థానికంగా ఇస్త్రీ బట్టలు చేసే వారి వివరాలు సేకరించింది. గిరినగర్ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం రేణుక తప్పిపోయిందని సమాచారం అందడంతో ట్రస్టు నిర్వహకులు ఆమె సోదరుడు వెంకటేష్‌ను సంప్రదించారు. వెంకటేష్ తన సోదరి పూర్తి వివరాలను ట్రస్టు నిర్వాహకులకు అందించాడు. సోమవారం మధ్యాహ్నం షీటీమ్ ఇన్చార్జి డీసీపీ అనురాధ సమక్షంలో రేణుక తల్లి యాదమ్మ, సోదరుడు వెంకటేష్‌లకు ఆమెను అప్పగించారు. రెండు దశాబ్దాల తర్వాత కూతురిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ట్రస్తు నిర్వాహకులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణుక తాను తల్లితో ఇంటికి వెళ్తానని, ట్రస్ట్‌లోని సభ్యులంతా గుర్తుకు వస్తే వచ్చి చూసి వెళ్తానని చెప్పింది. అన్ని వివరాలు నమోదు చేసుకున్నాక పోలీసులు రేణుకను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కాకతీయ కాలువలో మహిళ గల్లంతు
మోర్తాడ్ (నిజామాబాద్): భర్తతో గొడవ పడిన ఓ యువతి కాకతీయ కాలువలో దూకి గల్లంతైన ఘటన ఆదివారం ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాల్కొండకు చెందిన మారుతి, జగిత్యాల్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రేణుకను వివాహం చేసుకున్నాడు. అయితే రెండు రోజుల కింద రేణుక తన తల్లిగారి ఇంటికి ఇబ్రహీంపట్నంకు వెళ్లింది. రేణుకను తమ ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన మారుతి బైకుపై తీసుకుని కాకతీయ కాలువ వెంబడి వస్తుండగా మార్గమధ్యంలో మూత్ర విసర్జన కోసం వాహనం ఆపాడు. అప్పుడు ఇరువురి మధ్య చిన్న వాదన జరిగింది. కాగా రేణుక అకస్మాత్తుగా కాలువలోకి దూకింది. కాలువ ప్రవాహం జోరుగా ఉండటంతో రేణుక కొట్టుకుపోయింది. దీంతో కంగారుపడిన ఆమె భర్త మారుతి ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కాకతీయ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. భీమ్‌గల్ సీఐ సైదయ్య, ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో రేణుక కోసం గాలిస్తున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఠాణాకు చేరిన ఫేస్బుక్ ప్రేమ
వేములవాడ: ఫేస్బుక్ పరిచయం కులాలకు, కన్నకొడుకులకు ఏమాత్రం అడ్డురాలేకపోయింది. కట్టుకున్న మొగున్ని, కన్న కొడుకులను వదిలేసి ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో ఉడాయించి వేములవాడకు చేరుకుని ఏడాదిన్నరగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్న వైనం మంగళవారం వేములవాడలో వెలుగుచూసింది. ఏడాదిన్నరగా మహిళ కోసం వెతుకున్న బంధువులు ఎట్టకేలకు వేములవాడలోని బద్దిపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం అందుకుని మంగళవారం వేకువజామున చేరుకున్నారు. వారిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడంతో తప్పించుకునే యత్నంలో ప్రియుడు బంగ్లా పైనుంచి దూకి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే ఆ ప్రాంతంలో కాసుకుని కూర్చున్న బంధువులు, అతడిని పట్టుకుని బంధించారు. విషయం కాలనీలో తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఇరువురిని ఠాణాకు తరలించారు.\ సీఐ వెంకటస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.... ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన యువతికి, బెల్లంపల్లికి చెందిన నిఖిల్నందాతో ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఆమె ఏడాదిన్నర క్రితం వేములవాడకు చేరుకుని, నందాతో సహజీవనం సాగిస్తోంది. ఆమె కుట్టు మిషన్ పనిచేస్తుండగా, నిఖిల్నందా ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర తరువాత వీరి వ్యవహారం.. ఖమ్మంలో ఉన్న ఆమె బంధువులకు తెలిసింది, వారు మంగళవారం ఇక్కడికి చేరుకుని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఆమె భర్త, ఏడాది క్రితమే.. తన భార్య కనిపించడం లేదంటూ కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. అక్కడి పోలీసులతో మాట్లాడిన అనంతరం మరో కేసు ఇక్కడ నమోదు చేయకుండా తమ కానిస్టేబుల్ ఇచ్చేసి కొణిర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆ ఇద్దరినీ పంపించారు. -
భార్యను హతమార్చి బాత్రూంలో పాతిపెట్టిన భర్త
-
భార్యను చంపి బాత్రూంలో పాతిపెట్టాడు
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. అదృశ్యమైన మహిళను ఆమె భర్తే హతమార్చినట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వెంకంపేట ఏజెన్సీ ప్రాంతానికి చెందిన చిటికల రమణమ్మ గత ఏడాది అక్టోబర్ 15న అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రమణమ్మ కనిపించని రోజు నుంచి ఆమె భర్త నర్సయ్య పరారయ్యాడు. దీంతో పోలీసులు భర్తపై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నర్సయ్యను పట్టుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారించడంతో అసలు నిజలు భయటపడింది. భార్య రమణమ్మను చంపిన నర్సయ్య బాత్రూంలో పాతిపెట్టి పైన ప్లాస్టరింగ్ చేసినట్టు విచారణలో వెల్లడించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రమణమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత అదృశ్యం
పటాన్చెరు టౌన్: వివాహిత అదృశ్యమైన ఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ మండలం బీఎస్ఆర్ కాలనీకి చెందిన నారాయణ, సంధ్య భార్యాభర్తలు. నారాయణ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం నారాయణ సినిమాకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి భార్య సంధ్య ఇంట్లో లేదు. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అదృశ్యమై.. అస్థిపంజరంగా.
కొమురవెల్లి(సిద్దిపేట): మూడు నెలల క్రితం గురువన్నపేటలో అదృశ్యమైన వృద్ధురాలి అస్థిపంజరం లభ్యమైన ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గురువన్నపేటకు చెందిన బండారు గౌరవ్వ(75) జనవరి 22న అదృశ్యమైన సంగతి మనకు తెలిసిందే. కాగా, జనవరి 24న కుటుంబ సభ్యులు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం గురువన్నపేట వాగులో ఓ గొర్రెల కాపరికి మనిషి పుర్రె కనిపించింది. దీంతో ఈ విషయాన్ని ఇరుగుపొరుగుకు తెలియజేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్ఐ సతీశ్‌కుమార్‌తో పాటు గౌరవ్వ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, చీర, కొన్ని వస్తువుల ఆధారంగా అస్థిపంజరం గౌరవ్వదిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
దివ్యాంగురాలి అదృశ్యం
చివ్వెంల (సూర్యాపేట) : దివ్యాంగురాలు అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేటలోని సీతారాంపురం కాలనీకి చెందిన నగరి పార్వతమ్మ తన కూతురు నగరి రేణుకను తీసుకుని చివ్వెంల మండలం వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ గ్రామానికి తన చెల్లెలు పండగ సైదమ్మ ఇంటికి ఈనెల 12వ తేదీన వచ్చింది. కాగా శుభకార్యం అనంతరం శుక్రవారం పార్వతమ్మ సూర్యాపేటకు వెళ్లగా రేణుక చిన్నమ్మ ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వరుసకు బాబాయ్ అయిన పండగ ఉప్పలయ్య రేణుకను తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ నుంచి అడవిలో ఉన్న గొర్రెల వద్ద కాపాలగా ఉండాలని రేణుకను సైకిల్‌పై తీసుకువెళ్లాడు. సాయంత్రం వరకు రేణుక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతుకుతుండగా రేణుకను ఉప్పలయ్య సైకిల్‌పై వ్యవసాయ బా వి వద్దకు తీసుకువెళ్లాడని గమనించిన కొంత మహిళలు చెప్పా రు. దీంతో అడవిలోకి వెళ్లి పరిశీలించగా గ్రామ శివారులోని ఓ గడ్డివాము వద్ద రేణుక వస్త్రం ఒకటి లభించగా, కొంత దూరంలో పత్తిచేనులో పండగ ఉప్పలయ్య సైకిల్ పడి ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో జాగిలాలను రప్పించారు. సాయంత్ర వరకు అడవిలో వెతికినా ఫలితం లేకపోవడంతో తిరుగు ము ఖం పట్టారు. వందల ఎకరాల విస్తీర్ణంలో అడవి వ్యాపించి ఉండటంతో ఆచూకీ లభ్యం ఇబ్బందికరంగా మారింది. బాధితురాలి తల్లి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి ఉండవచ్చా..? దివ్యాంగురాలిని వెంట తీసుకువెళ్లిన ఉప్పలయ్య ఎదైన అఘాయిత్యానికి పాల్పడి ఆమెను హత్య చేసి ఉంవవచ్చా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కని పించక పోవడంతో ఉప్పలయ్య ఎదైనా చేసి పారి పోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. -
టైలర్ దుకాణానికి వెళ్లి యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ డివిజన్ వివేకానంద నగర్‌కు చెందిన నర్సప్ప కుమార్తె బి.సరిత(18) ఇంటి వద్దనే ఉంటుంది. మంగళవారం ఉదయం బట్టలు కుట్టించుకోవడానికి ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్లిన సరిత రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తండ్రి నర్సప్ప బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదాన్ని నింపిన తాడిపూడి రిజర్వాయర్ ఘటన
విజయనగరం : సాగునీటికి ప్రాణాదారమైన తాటిపూడి జలాశయం వద్ద నేటి ఉదయం చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. జలాశయంలో గల్లంతైన మహిళ కోసం వెతుకుతూ వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సింహాచలంగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గల్లంతైన మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు, విశాఖపట్నానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఈ తాడిపూడి జలాశయం ఉంది. ఈ జలాశయానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లుండగా.. వాటిలో మొదటి గేటు శనివారం ఉదయం విరిగిపోయింది. ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు రావడంతో, కిందివైపు దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయారు. వారిలో ఒకరు ఆచూకీ కొన్ని గంటల తర్వాత లభ్యమవడంతో, గల్లంతైన మహిళ కోసం వెతకడం ప్రారంభించారు. జామి గోస్థని నదిలో గాలిస్తూ వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జలాశయ గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మొత్తం గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతున్నారు. -
ప్రియుడి చేతిలో మోసపోయి..!
రాయచోటి: ఆమెను ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తీసుకొచ్చి మధ్యలోనే వదిలేశాడు. అటు ఇంటికి వెళ్లలేక.. ఇటు బయట ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులకు పట్టుబడింది. ఆమె దయనీయ గాథను తెలుసుకున్న పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అక్కడి కృషి నగర్‌కు చెందిన మహేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఈ ఊరిలో ఉంటే మనల్ని పెళ్లి చేసుకోనీయరని నమ్మించి 2013వ సంవత్సరంలో ఆమెతో సహా కడపకు వచ్చాడు. అక్కడి ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలిపెట్టి మళ్లీ వస్తానని చెప్పి పారిపోయాడు. ఈ పరిస్థితిలో పరువు పోతుందని ఆమె ఇంటికి వెళ్లలేకపోయింది. ఆమె తండ్రి, సోదరులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. అప్పటినుంచీ అటు పోలీసులతో పాటు ఇటు కుటుంబసభ్యులు కూడా వెతికి ఫలితం లేదని వదిలేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ లో మునీరు అనే మహిళతో ఆ యువతికి అపట్లో పరిచయమైంది. తనతో వస్తే జీవనోపాధి చూపిస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలోకి దింపింది. శుక్రవారం రాత్రి ఆమె రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంలో పోలీసులకు పట్టుబడింది. వృభిచార గృహ నిర్వాహకురాలు మునీరులో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువతి ఫ్యామిలీకి సమాచారం అందించడంతో ఆమె సోదరులు శనివారం రాయచోటికి వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత తమ సోదరి కనిపించిందని వారు ఎంతో సంతోషించారు. అయితే ఇలా వ్యభిచార గృహంలో పోలీసుల చేతికి చిక్కడం వారికి ఒకింత బాధ కలిగించింది. -
పంట కాలువలో పడ్డ జంట
– కొట్టుకుపోయిన మహిళ – ఒకరిని కాపాడిన స్థానికులు – అవనిగడ్డలో ప్రమాదం అవనిగడ్డ : చేపలకు గాలెం వేస్తూ ప్రమాదవశాత్తు మహిళ పంటకాలువలో పడి గల్లంతైన ఘటన అవనిగడ్డ వంతెన సెంటర్లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం బుడబుక్కల వేషాలు వేస్తూ జీవించే ఒంగోలుకు చెందిన దార్గ తిరుపాలు, దార్ల గురవయ్య వారం రోజుల క్రితం అవనిగడ్డ వచ్చారు. కాకినాడకు చెందిన కుమారి (44) ఉయ్యూరులో పరిచయం కాగా తిరుప్పాలు ఆమెను తనతో తీసుకొచ్చాడు. తిరుపాలు, కుమారి కలిసి గురువారం మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో స్థానిక వంతెన సెంటర్లో మూడు విగ్రహాల కింద ఇనుప పట్టీలపై కూర్చుని చేపలు పడుతూ అదుపుతప్పి పంటకాలువలోకి పడిపోయారు. ఇది గమనించి స్థానికులు కేకలు వేయగా కొబ్బరి బొండాలు అమ్ముకునే కందుల రమేష్ తన లుంగీని తిరుపాలుకు అందించి రక్షించాడు. కుమారి నీటి వేగానికి కొట్టుకుపోయింది. తిరుపాలుకు ప్రథమచికిత్స చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదఘటనతో లాకుల సెంటర్ల పెద్ద ఎత్తున జనం పోగయ్యారు. ప్రమాద సమయంలో ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారం రోజుల క్రితం ఆమె పరిచయమైందని బంధువు గురువయ్య చెప్పాడు. ఈ మేరకు ఏఎస్ఐ మాణిక్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
పంట కాలువలో పడ్డ జంట
– కొట్టుకుపోయిన మహిళ – ఒకరిని కాపాడిన స్థానికులు – అవనిగడ్డలో ప్రమాదం అవనిగడ్డ : చేపలకు గాలెం వేస్తూ ప్రమాదవశాత్తు మహిళ పంటకాలువలో పడి గల్లంతైన ఘటన అవనిగడ్డ వంతెన సెంటర్లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం బుడబుక్కల వేషాలు వేస్తూ జీవించే ఒంగోలుకు చెందిన దార్గ తిరుపాలు, దార్ల గురవయ్య వారం రోజుల క్రితం అవనిగడ్డ వచ్చారు. కాకినాడకు చెందిన కుమారి (44) ఉయ్యూరులో పరిచయం కాగా తిరుప్పాలు ఆమెను తనతో తీసుకొచ్చాడు. తిరుపాలు, కుమారి కలిసి గురువారం మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో స్థానిక వంతెన సెంటర్లో మూడు విగ్రహాల కింద ఇనుప పట్టీలపై కూర్చుని చేపలు పడుతూ అదుపుతప్పి పంటకాలువలోకి పడిపోయారు. ఇది గమనించి స్థానికులు కేకలు వేయగా కొబ్బరి బొండాలు అమ్ముకునే కందుల రమేష్ తన లుంగీని తిరుపాలుకు అందించి రక్షించాడు. కుమారి నీటి వేగానికి కొట్టుకుపోయింది. తిరుపాలుకు ప్రథమచికిత్స చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదఘటనతో లాకుల సెంటర్ల పెద్ద ఎత్తున జనం పోగయ్యారు. ప్రమాద సమయంలో ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారం రోజుల క్రితం ఆమె పరిచయమైందని బంధువు గురువయ్య చెప్పాడు. ఈ మేరకు ఏఎస్ఐ మాణిక్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
విమానాశ్రయంలో మహిళ అదృశ్యం
శంషాబాద్: రియాద్ నుంచి వచ్చిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కనిపించకుండాపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ రహీమున్నీసా(45) ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం రియాద్ వెళ్లింది. ఎయిర్ ఇండియా 9122 విమానంలో ఈ నెల 8వ తేదీన రియాద్ నుంచి ఆమె బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమున్నీసా అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఆమె కోసం గాలించినా ఫలితం లేకుండా పోవడంతో మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నాటు పడవ బోల్తా: మహిళలు గల్లంతు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో సమీపంలో గురువారం నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి... గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం గాలింపు చర్యలు నిలిపివేశారు. గల్లంతైన మహిళల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.