కుప్ప లావణ్య, మరడాన లావణ్య
ఆనందపురం(విశాఖ జిల్లా): మండలంలోని రెండు గ్రామాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందగా విచారణ జరుపుతున్నారు. ఆనందపురం యాతపేటకు చెందిన కుప్ప లావణ్య (26) ఈ నెల 18న దుస్తులు కుట్టించుకోవడానికని గ్రామంలోని టైలరు వద్దకు వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త లక్ష్మణ అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: పులి కూడా బ్రష్ చేస్తుంది!
అలాగే లొడగలవానిపాలెం గ్రామానికి చెందిన మరడాన లావణ్య (22) కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 18న ఆమె స్కూటీపై కళాశాలకు వెళ్లింది. సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ రవి ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment