visakha district
-
‘కాపులుప్పాడ’ నుంచి పోటెత్తిన వరద
కొమ్మాది/బీచ్‌రోడ్డు : విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో కాపులుప్పాడ గెడ్డ నుంచి కె.నగరపాలెం మీదుగా భారీఎత్తున వరద పోటెత్తింది. ఈ క్రమంలో కె.నగరపాలెంలో మూడు గేదెలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. అనంతరం ఇవి మృతిచెందినట్లు గుర్తించారు. అలాగే, గోవుపేట, గంగడపాలెం ప్రాంతాలు పూర్తిస్థాయిలో నీట మునగడంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరదేశిపాలెం గెడ్డ కూడా పెద్దఎత్తున ప్రవహించడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.బీచ్ రోడ్డులో చేపలుప్పాడ వద్ద సముద్రం ముందుకు రావడంతో ఇక్కడ తీరం భారీస్థాయిలో కోతకు గురైంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. మంగమారిపేట, రుషికొండ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచి్చంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండలో బోటు షికారు నిలిపివేయడంతో బోట్లన్నీ తీరానికి పరిమితమయ్యాయి. ఇక మృతిచెందిన గేదెలకు రూ.37,500, పడ్డకి రూ.20వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరోవైపు.. బీచ్‌రోడ్డులో కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు రక్షణ గోడను తాకుతూ కెరటాలుఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకురావటంతో చూసేందుకు సందర్శకులు ఎక్కువగా బీచ్‌కు వస్తున్నారు. -
ప్రతి అడుగులోనూ ‘చంద్ర’మోసం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని.. చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.‘‘ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పుకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికీ మించి చేశాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి. జగన్ పలావు ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. పలావు లేదు.. బిర్యానీ లేదు ఇప్పుడు. ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి.’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘జగనే ఉండి ఉంటే.. రైతు భరోసా అందేది. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడీ తల్లులకు అమ్మ ఒడి అందేది. సున్నావడ్డీ కూడా వచ్చి ఉండేది. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్ మెంట్, వసతి దీవెన వచ్చేది. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈసరికే పడి ఉండేది. ఆగస్టు నెలాఖరు లోపల ప్రతి ఏటా ఇవి మనం ఇచ్చాం. సహజంగానే పథకాలు అమలు జరిగింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేకపోవడతో ఇవేమీ రావడంలేదు...ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయింది. జన్మభూమి కమిటీలు చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులందరికీ కూడా ఉచితంగా బీమా ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడంలేదు. 2023-24 సంబంధించి ఏప్రిల్, మేలో ప్రీమయ కట్టేవాళ్లం. జూన్‌లో ఇన్సూరెన్స్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోంది...స్కూళ్లలో టోఫెల్ పీరియడ్ తీసేశారు. ప్రపంచంతో పోటీపడేలా చదువులను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాకానుక పంపిణీకూడా అస్తవ్యస్తం. ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకంలేదు. మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక మెనూ కూడా అస్తవ్యస్తం. ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి. ఆరోగ్య శ్రీ కింద ఒక్కపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు. లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. కక్షలు తీర్చుకునేవారిని పోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది..ఈ మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే మనం మోసం చేయలేదు, ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. ఐదేళ్లలో వేధింపులకు గురిచేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కాని కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. ఇది సృష్టిసహజం. అలాగే ఈ ఐదేళ్లుకూడా ముగుస్తాయి, మనమే అధికారంలోకి వస్తాం. విలువలు, విశ్వసనీయతమీదే మనం రాజకీయాలు చేస్తున్నాం. మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబునాయుడు, టీడీపీ పార్టీ అలవాటు పడింది’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళ, బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నేడు, రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులు వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
మాకిచ్చే గౌరవం ఇదేనా?
కొలువు దీరిన కొత్త మంత్రి వర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన వారిని పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరినే మంత్రి పదవికి ఎంపిక చేయడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు పై చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా అంటూ తమ అనుచరులు వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. కొత్తగా ఎంపిక చేసిన మంత్రివర్గ జాబితాలో తమ పేర్లు లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశించారు.. మీరు కాకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గణబాబు పల్లా శ్రీనివాస్ ఈసారి తమకు మంత్రి పదవి లభిస్తుందని భావించారు.. వీరిని ఎవరిని కాదని జూనియర్ అయినా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.అయ్యన్న ఒకసారి ఎంపీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.. గంటా ఒకసారి ఎంపీ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. గతంలో మంత్రిగా పనిచేశారు.. వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఈసారి మంత్రివర్గ జాబితాలో తమకు స్థానము లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.. వీరందరి ఆశలపైన చంద్రబాబు నీళ్లు జల్లారు.. అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద అయితే టిడిపి కార్యకర్తలు కాబోయే మంత్రి అయ్యన్నపాత్రుడు కి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు..పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ తరపున వాయిస్ వినిపించింది అయ్యన్న పాత్రుడని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు.. చంద్రబాబు లోకేష్ మాటలు విని ఆయన కేసులు కూడా పెట్టించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.. పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి అయితే పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను జనసేనకు విడిచిపెట్టామని గుర్తు చేస్తున్నారు.పొత్తులో భాగంగా తమ సొంత నియోజకవర్గలను వదిలి పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.. పార్టీ కోసం త్యాగాలు చేసిన తాము చంద్రబాబుకు ఎందుకు గుర్తు రాలేదంటున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడమేంటని మండిపడుతున్నారు.. కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశించి గంటా శ్రీనివాసరావు బంగపడ్డారు. గంటను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెట్టారు.. 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అందులో ఎంతమంది సీనియర్లకు అవకాశం కల్పించారని మంత్రివర్గంలో స్థానం లభించని నేతలు అంటున్నారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పును సొంత పార్టీ నేతలే హర్షించని పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాలో నెలకొంది. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి (ఫొటోలు)
-
చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Live Updates.. కొప్పేర్ల చేరుకున్న సీఎం జగన్ సార్ బస్సు యాత్ర భోగాపురం క్రాస్ అయిన సీఎం జగన్ చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ విజయనగరం జిల్లా సిద్ధం విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహా సముద్రం కనిపిస్తోంది ఒక్కసారిగా లక్షలమంది, తాండ్ర పాపారాయుళ్లు, శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచిచూపించడానికి నా ఉత్తరాంద్ర సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వాతాతలకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్‌ను, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్‌ను, పిల్లల భవిష్యత్‌ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా, అడ్డుతగులుతున్న పెత్తందార్లు మీద, ఆ కౌరవ సైన్యం, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి సిద్ధం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఓ కాంగ్రెస్ ఉంది, ఓ బీజేపీ ఉంది.. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు.. చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఓ దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5 ఉంది. ఇవి సరిపోవన్నుట్లుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు ఉన్నాయి ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి ఈ రోజు మీ జగన్ వెనకాల ఆ యెల్లో మీడియా లేదు.. ఆ పార్టీలు లేవు.. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకం అవుతా ఉన్నారు జగన్ కనుక ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే, ప్రతీ ఇంట్లోను జగన్‌ను బిడ్డ గా, తమ్ముడిగా భావించకపోతే.. ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను జగన్ ఒకే ఒక్కడు కాదు.. నాకున్నది కోట్ల మంది మీరు అని సగర్వంగా చెబుతున్నాను ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ.. ఇంటింటికి చేసిన మంచే నాకున్న నమ్మకం.. ఆపై పైనున్న దేవుడి దయ ప్రతీ వర్గానికి మంచి చేశాం.. న్యాయం చేశాం మనం.. మోసం చేసింది మాత్రం వారు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. పేదల్ని ఓడించాలని వారు.. ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చార్మిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న ఆ బాబుకు , ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరతా ఉన్నాను వస్తువులు ఎత్తుకుపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం ఎన్నికలప్పుడు మోసం చేసి, మోసపూరిత చరిత్ర ఉన్న ఆ మూడు పార్టీల కూటమిని ఏమనాలి అని అడుగుతున్నాను ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఆ తర్వాత మోసం చేస్తే.. అలాంటి మోసగాళ్లను ఏమంటాం అలాంటి వాళ్లను 420లు అందామా... వారిని 420లనే అంటాం మళ్లీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం 420 అనే కాదు.. చంద్రముఖి బృందం అని కూడా అంటాం పేదల కలల్ని అర్దం చేసుకుని మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా 40 స్కీమ్స్ పెట్టాం మీ కలల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ ఆ క్రమంలో అందజేసిన సొమ్ము ఎంతో తెలుసా ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే.. ఏకంగా మరో లక్ష కోట్లకు పైగానే ఇచ్చాం నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇది కేవలం 58 నెలల కాలంలోనే పంపడం జరిగింది నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు.. ఇలా డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడులకు పంపలేని పరిస్థితిని నేను నా ఓదార్పుయాత్రలో చూశాను.. నా పాదయాత్రలోనూ చూశాను అలాంటి నిరుపేద కలల్నినిజం చేయడానికే పుట్టింది.. జగనన్న అమ్మ ఒడి అని గర్వంగా చెబుతున్నాను. అంతే కాకుండా ఆ పేద తల్లి తమ పిల్లల గొప్ప భవిష్యత్‌కు కోసం కనే కలలు గురించి అర్ధం చేసుకున్నాను కాబట్టే ఒక నాడు నాడు, ఒక ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఒక సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, బైజూస్ కంటెంట్, ఆరోతరగతి నుంచే డిజిటల్ బోధనలు, ఎనిమిదో తరగతి వచ్చేసరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్... ఇలా ఎంతో సంక్షేమాన్ని తీసుకొచ్చాం ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతం మందికి విద్యా దీవెన, వసతి దీవెన ప్రవేశపెట్టాం ఒక డిగ్రీలో కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ.. విదేశీ విద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్‌ను మన డిగ్రీలతో అనుసంధానం చేశాం మన డిగ్రీల్లో మ్యాండెటరీ ఇంటర్నెషిప్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్.. వాటి నుంచి వచ్చినవే ఈ నా స్కీమ్స్ మరి వీటి గురించి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఆలోచనైనా చేశాడా అని అడుగుతున్నాను మరి ఈ ఆలోచనలు చంద్రబాబుకు ఎందుకు రాలేదంటే.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు.. పేదల రక్తాన్ని తాగేందుకు లకలకాని తపిస్తాడు కాబట్టి ప్రతీ అక్క చెల్లెమ్మకు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఒక కల ఉంటుంది. కుటుంబం బాగుండాలని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కలలు కంటుంది. ఒక రూపాయి సంపాదించి కుటుంబానికి తోడుగా ఉండాలని కలలుకంటుంది. మరి అటువంటి కలలు కన్న వారి కోసం ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చామో చూద్దామా.. ఓ వైఎస్సార్ ఆసరా పథకం, ఓ వైఎస్సార్ సున్నా వడ్డీ అనే పథకం. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారు నిలదొక్కుకునేలా ఉండేందుకే పుట్టిందే వైఎస్సార్ చేయూత అనే పథకం నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది.. కాపునేస్తం అనే పథకం నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఈబీసీ నేస్తం అనే పథకం అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. వాటిని నిజం చేయడానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి అని చెబుతున్నాను డ్రీమ్స్ పేదింటి అమ్మవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అని గర్వంగా చెబుతున్నాను చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్స్ లేవు. చంద్రబాబు హయాంలో నా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచించి రోడ్డు మీద పడేసి వారి రక్తాన్ని పీల్చే చంద్రముఖి పాలన మాత్రమే చూశాం. ప్రతీ అక్క చెల్లెమ్మ కలకంటుంది. సొంత ఇల్లు ఉండాలని కలలు కంటుంది. దీని కోసం జీవితకాలం ఎదురుచూస్తాం. మరి ఆ డ్రీమ్‌ను నెరవేరుస్తూ మీ బిడ్డ ఏం చేశాడు నా అక్క చెల్లెమ్మల పేరిటి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. డ్రీమ్ మీవి.. స్కీమ్ మీ బిడ్డవి, మీ తమ్ముడివి, మీ అన్నవి చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి మీ బిడ్డ పాలనలో ఎటువంటి మంచి జరిగిందో ఆలోచన చేయండి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చుకానీ బాబును నమ్మలేం నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది.. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి చెల్లూరు బహిరంగ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ అశేష జనవాహినితో నిండిపోయిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం విజయనగరం: చెల్లూరు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లక్షలాది మందితో కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం విజయనగరం: కాసేపట్లో చెల్లూరు బహిరంగ సభ వద్ద చేరుకోనున్న సీఎం జగన్ చెల్లూరు సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజలు మేమంతా సిద్ధమంటూ హోరెత్తుతున్న ఉతర్రాంధ్ర విజయనగరం: ఐనాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు రోడ్లకు ఇరువైపులా జన ప్రభంజనం ఐనాడుకు కొద్దీ దూరంలోనే జరగనున్న సిద్ధం సభ. విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ 21 రోజు బస్సుయాత్ర విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర విజయనగరం జిల్లా ఎంట్రన్స్‌లో సీఎం జగన్ బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ నేతలు పదిహేను వందల బైక్‌లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.. ప్రజలు పువ్వులతో స్వాగతం పలుకుతూ హారతులతో ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు సీఎం జగన్ భరోసా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా వేదిక ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదుతో పాటు పార్టీ నుంచి న్యాయ సహాయం దాడులకు భయపడేది లేదు దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి నా చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్ ఇటు వైపు జగన్ ఒక్కడే.. అటు వైపు కూటమితో ఏకమయ్యారు మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం అబద్ధాలు,మోసాలతో యుద్ధం చేస్తున్నాం గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారు టీడీపీ ఎంత దిగజారిందో దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనం సోషల్ మీడియా మనతోనే ఉంది సెల్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ మనతోనే ఉన్నారు విశాఖపట్నం ఏపీకి డెస్టినీ అవుతుంది ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు. మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు. ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు. మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్ కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ.. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం సీఎం జగన్‌కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో స్వాగతం పలికిన ప్రజలు బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం జగన్ విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను నివేదించిన కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది: సీఎం జగన్ ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది: తొలిసారిగా ప్రధానికి లేఖ రాశాం స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైఎస్సార్సీపీకే ఉంది పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను: సీఎం జగన్ 21వరోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎండాడ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాసేపట్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి సాయంత్రం చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ పీఎంపాలెం వద్ద కోలాహలం పీఎంపాలెం వైయస్సార్ స్టేడియం వద్ద సందడి వాతావరణం.. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం(ఏప్రిల్ 23) షెడ్యూల్ సీఎం జగన్ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు ఇదీ చదవండి: ఓ విజేత జైత్రయాత్ర Memantha Siddham Yatra, Day -21. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి ప్రారంభం సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభ అక్కివలస దగ్గర రాత్రి బస#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/IAQvjd6MPK — YSR Congress Party (@YSRCParty) April 23, 2024 జననేతకు అడుగడుగునా జన నీరాజనం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర.. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు తమ బతుకుల్లో వెలుగులు నింపిన నేతకు అడుగడుగునా జన నీరాజనం రాయలసీమ.. దక్షిణ కోస్తా.. ఉత్తర కోస్తా.. ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా అదే ప్రభంజనం మండుటెండల్లోనూ పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకుని మళ్లీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జనసంద్రాలను తలపించిన వైనం కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్ షోలు అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్‌పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక.. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం యాత్ర బస్సు యాత్ర ప్రభంజనంతో పోటీ ఏకపక్షంగా మారిందంటున్న రాజకీయ పరిశీలకులు -
జగన్ అభివృద్ధి మంత్రానికి టీడీపీ కకావికలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా. వైఎస్సార్సీపీ రాకతో గత ఎన్నికల్లోనే ఈ కోటకు బీటలు వారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం, ఈ ప్రాంతాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి, పలు ఐటీ కంపెనీల ఏర్పాటు, బడుగు బలహీనవర్గాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ ఇక్కడ కకావికలైంది. ఆ పార్టీకి కార్యకర్తలూ చేజారిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు. దీంతో పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారు. దీంతో ఓ నియోజకవర్గం.. వంద గ్రూపుల్లా ఆ పార్టీ వ్యవహారం ఉంది. ఈ గ్రూపుల మధ్య సంక్రాంతికి ముందే కోళ్ల పందేలకు దీటుగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. యువగళం ముగింపు సభకు జనసమీకరణ కోసం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారడమే ఇందుకు ఉదాహరణ. యువగళం సభకు వచ్చేది లేదని ఆయనకు తేల్చి చెప్పినట్టు సమాచారం. గంటా తీరుతో విసిగిపోతున్న విశాఖ నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు. గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవలి వరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు మూడు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు మృగ్యమైపోవడంతో ఆయన భీమిలి వైపు చూస్తున్నారు. భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంటా హాజరవుతున్నారు. ఇది భీమిలి టికెట్ ఆశిస్తున్న కోరాడ రాజబాబుకు మింగుడుపడటం లేదు. ఆయన గంటా రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటాను నమ్మరంటూ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. భీమిలిలోనే కాదు.. గంటా శ్రీనివాసరావు పాయకరావుపేట నియోజకవర్గంలోనూ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలోనూ ఆయన జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరూ రాకుండా కూడా అడ్డుపడుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీని కూడా సాగనంపి.. ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలను పొగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అనకాపల్లిలో అయ్యన్న కినుక అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించేకొద్దీ అయ్యన్న వర్గం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా, మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు. మాడుగులలో మూడు ముక్కలాట మాడుగుల నియోజకవర్గం టీడీపీలో మూడు పందెం కోళ్లు కొట్టుకుంటున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి పీవీజీ కుమార్‌తో పాటు రామనాయుడు, పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని, ఆయనకు మాడుగులలో ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే మాడుగుల బరిలో నలుగురు ఉన్నట్టే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్టు దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదు. అరకు నియోజకవర్గం ఇన్చార్జిగా దొన్ను దొరను నియమించడంపై అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దొరకు సహకరించబోమని అబ్రహం వర్గం కరాఖండిగా చెబుతోంది. -
సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం
సాక్షి, తణకు(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారితను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని తణుణు నియోజకవర్గంలో సాగిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. సామాజిక సాధికారత బస్సుయాత్ర బహిరంగ సభ లో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎలక్ట్రానికి మీడియా సలహాదారు అలీ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరావు, మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీ నందిగాం సురేష్, ఎంపీ భరత్‌లతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంకా రవీంద్రనాథ్‌లు పాల్గొన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘తణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. అందుకే ప్రతీ విద్యార్థి ఆయన్ను ఒక మేనమామలా చూస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్. కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగనన్న హయాంలో పేదరికం 12 శాతం నుండి ఆరు శాతం వరకూ తగ్గింది. అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘ఎవ్వరు కొడితే లోకేష్, చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయననే మన జగనన్న. చంద్ర బాబు హయాంలో ఒక్క బీసీనైనా రాజ్యసభ కు పంపారా...?, వందల కోట్లకు సీట్లు అమ్ముకునే వాడు చంద్రబాబు. మళ్లీ కారుమూరి వన్స్‌మోర్’ అంటూ కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు. సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు. కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్,. చంద్రబాబు హయాంలో చేనేతలకు రూ. 200 కోట్లు ఖర్చు పెడితే, నేడు జగనన్న ముఖ్యమంత్రిగా రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగిన సామాజిక సాధికారిత సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ఒక ఊరులో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.ఒక యాదవనైన నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.యాదవులు కు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.శ్రీకృష్ణ డు కూడా గొడ్డెలను కాసుకున్నారు. బీసీలను తోకలు కత్తిరిస్తమని బెదిరించారు.పార్టీ పెట్టి సీఎం కాకూడదనుకున్న వ్యక్తి పవన్. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోబకావద్దు.లోకేష్ ఒక పులకేశి.తండ్రి జైల్ లో ఉండే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..సీఎం జగన్ దమ్ము నాయకుడు.నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారు.. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం అభివృద్ధి దూరంగా ఉన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారు.మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారు. రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునీకరిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు.సుదీర్ఘమైన తీర ప్రాంతన్ని చంద్రబాబు గాలికి వదిలేసారు.మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది.బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవం ను చంద్రబాబు తాకట్టు పెట్టారు.అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను సీఎం జగన్ కాపాడారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారు. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేశారు.విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.విశాఖ ను రాజదాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజదాని గా చేశారు -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
నారాయణ స్కూల్ విద్యార్థి అదృశ్యం
తగరపువలస(విశాఖపట్నం జిల్లా): భీమిలి మండలం తాళ్లవలస నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి విద్యార్థి అజ్జరపు వెంకట హేమశేఖర్(14) మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో స్కూల్ నుంచి అదృశ్యమయ్యాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నారాయణ విద్యా సంస్థల హాస్టల్లో ఉంటున్నాడు. స్కూల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాకపోవడంతో తండ్రి వెంకట సాయిరమణ ఆందోళన వ్యక్తం చేస్తూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువులు, చుట్టుపక్కల స్నేహితుల ఇళ్లలోనూ వెతికారు. దీనిపై స్కూల్ యాజమాన్యం నోరు మెదపడం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. స్కూల్ నుంచి బయటకు వెళ్లిన సమయంలో హేమశేఖర్ బ్లూ జీన్ ఫ్యాంటు, గళ్ల చొక్కా, మాస్క్ ధరించి ఉన్నట్టు స్కూల్ సీసీ కెమెరాల్లో నమోదయింది. భీమిలి హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌తో ఆమె పిల్లలపై.. -
ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు
అనంతగిరి(అరకులోయ): మన్యంలోని ప్రకృతి రమణీయత పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడి సహజసిద్ధ అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలను సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలను తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవు తున్నాయి. చదవండి: అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా? ఈ నేపథ్యంలో మన్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. కొంత మంది సరదాకు ఈతకు దిగి, మరికొంతమంది ప్రమాదవశాత్తూ జారిపడి, మరికొంత మంది సెల్ఫీలు, ఫొటోలు అంటూ అజాగ్రత్త వ్యవహరిస్తూ.. మృత్యువాతపడుతున్నారు. కన్నవాళ్లకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. ఆకట్టుకునే జలపాతాల వెనుక అంతులేని విషాదగాథలెన్నో ఉన్నాయి. సరియా జలపాతం(అనంతగిరి) సరియా జలపాతం 2015లో బహ్య ప్రపంచానికి పరిచయం అయింది. ఈ జలపాతం వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందులో 15 మందికి పైగా యువతే ఉన్నారు. కొంతమంది అజాగ్రత్త కారణంగా.. మరికొంతమంది ఈత రాక ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం ఉరకలేస్తూ.. ప్రవహిస్తోంది. ఇక్కడకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోని స్థానికుల సూచనలు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను చదివి అవగాహన పెంపొదించుకోవాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించవచ్చు. డుడుమ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం సుమారు 2,600 అడుగుల ఎత్తుల్లోంచి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు ఆరుగురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ జారిపడి మృత్యువాత పడ్డారు. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినా.. పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. పొల్లూరు(మోతుగూడెం) పొల్లూరు జలపాతం సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రాస్. అల్లరి నరేష్ నటించిన దొంగలబండి, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. చూసేందుకు జలపాతం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తూ కొంత మంది, ఈతకు దిగి మరికొంత మంది మరణించారు. గాదిగుమ్మి(కొయ్యూరు) చూసేందుకు గాదిగుమ్మి జలపాతం అందంగా కనిపిస్తుంది. అందులో దిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 మందిపైగా పర్యాటకులు మృతి చెందారు. దూరం నుంచే జలపాతం అందాలను వీక్షిస్తే ప్రమాదాలు జరగావు. యువతా.. జాగ్రత్త జలపాతాలను తిలకించే క్రమంలో యువత ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వాళ్లే దూకుడుగా వ్యవహరించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి.. ఈత సరదాలు.. సెలీ్ఫలు అంటూ అక్కడ పరిస్థితులపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబానికి కన్నీరు మిగులుస్తున్నారు. కుటుంబం తమపై పెట్టుకున్న ఆశలను తుంచేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. వర్షాలకు రాళ్లు నాచుపట్టి ప్రమాదకరంగా ఉంటాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో జలపాతాలకు దూరంగా ఉండడమే మంచిదని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు. చాపరాయి(డుంబ్రిగుడ) చాపరాయికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అరకు–పాడేరు ప్రధాన రహదారి అనుకుని ఉండడంతో పాటు అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, పర్యాటకులు చాపరాయి అందాలను తిలకిస్తుంటారు. చాపరాయి వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 25 మందిపైగా మృత్యువాత పడ్డారు. ఈతకు దిగి ప్రమాదవశాత్తూ సొరంగంలోకి వెళ్లడంతో మృత్యువాత పడేవారు. అధికారులు చొరవ.. టెండర్‌దారుల సహకారంతో సొరంగం రాయిని బ్లాస్టింగ్ చేయడంలో ప్రమాదాలు తప్పాయి. అయినప్పటికీ అప్రమత్తత అవసరం. గుడ్డిగుమ్మి(హుకుంపేట) హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ జెండాకొండ మార్గమధ్యలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతం బహ్యప్రపంచానికి పరిచయమై ఏడాదే అయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మత్యువాతపడ్డారు. సరదాగా ఈతకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వీళ్లంతా హుకుంపేట మండలానికి చెందిన వాళ్లే. దాలమ్మతల్లి(సీలేరు) సీలేరు దాలమ్మతల్లి జలపాతం 100 అడుగులు ఎత్తుల్లోంచి జాలువారుతుంది. గుడి బయట నుంచి జలపాతం తిలకిస్తే ప్రమాదాలు జరగవు. జలపాతం పక్కనున్న కొండపై సెలీ్ఫలు, ఫొటోలు దిగేందుకు వెళ్లి 20పైగా మృత్యువాతపడ్డారు. ఏటా ఇద్దరు, ముగ్గురు ఇక్కడ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ►పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచుపట్టి ఉంటాయి. వాటిపై ఎక్కితే జారిపడి పోయే ప్రమాదం ఉంది. ►సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు. ►నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు. ►జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. ►ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు. ►వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. ►జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. యువత జలపాతాల వద్దకు వెళుతూ దూకుడుగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్చరికలు ఉన్నా పట్టించుకోవడం లేదు. దూరంగా జలపాతాల అందాలు వీక్షించడమే మేలు. – కరక రాము, ఎస్ఐ, అనంతగిరి -
విషాదం: అన్నయ్యల ఆశీర్వాదం తీసుకోకుండానే..
చోడవరం/సబ్బవరం(విశాఖపట్నం): సోదరులకు రాఖీ కట్టడానికి కన్నవారింటికి బయల్దేరిందామె.. మరికాసేపట్లో అన్నలిద్దరి ఆశీర్వాదం తీసుకోవాల్సివుండగా.. మృత్యువు ఇసుక లారీ రూపంలో ఎదురొచ్చింది. కొడుకుతో సహా ఆమెను కబళించింది. ఈ విషాదకర ఘటన చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. సబ్బవరం మండలం పెద యాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (34), తన కుమారుడు సుఖేష్‌రామ్ (18)తో కలిసి ఉదయం 8 గంటలకు తన కన్నవారి ఊరైన మునగపాక బయల్దేరారు. చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికిన అత్త.. కారణం అదే? సుఖేష్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా తల్లి సత్యవతి వెనుక కూర్చున్నారు. సబ్బవరం– వెంకన్నపాలెం రోడ్డులో దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలోకి రాగానే ఎదురుగా వెంకన్నపాలెం వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ ఆకస్మికంగా మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. అతివేగంగా వస్తున్న ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో మోటారు సైకిల్‌తోపాటు లారీ కూడా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయాయి. మోటార్ సైకిల్‌పై వస్తున్న తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆనందం.. అంతలోనే విషాదం శరగడం సత్యవతి స్వగ్రామం మునగపాక. అక్కడ ఆమె సోదరులు ఉంటారు. వారికి రాఖీ కట్టి.. ఆ ఊళ్లో ఉన్న తన పొలంలో వరినాట్లు వేయాలని భావించిందామె. కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమెకు భర్త రాంబాబు, కుమార్తె కుందన ఉన్నారు. కన్నీరుమున్నీరవుతున్న వారిద్దరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో సబ్బవరం మండలం పెద యాతపాలెం, మునగపాక గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణం లారీని అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా నడిపాడు. అంతేకాకుండా తాను వెళ్లే వైపు కాకుండా పూర్తిగా కుడివైపునకు ఒక్కసారిగా వచ్చి మోటారు సైకిల్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలో మరే వాహనం వచ్చినా వాటిని కూడా ఈ లారీ ఢీకొట్టి ఉండేదని అక్కడి వారు చెప్పారు. -
‘జబర్దస్త్’ స్క్రిప్ట్ రైటర్‌గా గుర్తింపు.. విశాఖ జిల్లా కుర్రాడు.. ఊరమాస్
కొమ్మాది (భీమిలి)విశాఖపట్నం: ఒకప్పుడు హాస్యనటుడు షకలక శంకర్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన అనుభవంతో సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన పోతిన రమేష్ జబర్దస్త్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో మొట్టమొదటిసారిగా హర్రర్ లవ్ స్టోరీ అటవీ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం పలువురు ప్రముఖ కథానాయకులతో ఊరమాస్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: నడిరోడ్డుపై హీరోయిన్ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య అంతే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే తానే వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినీ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నానని, ఊరమాస్ సినిమా 90 శాతం విశాఖలో చిత్రీకరించానని చెప్పారు. విశాఖలో షూటింగ్‌కు అనుకూలమైన లొకేషన్లతో పాటు, అనేక మంది మంచి నటులు ఉన్నారని, సినీ పరిశ్రమ విశాఖ తరలి వస్తే ఎందరో నటులకు, టెక్నీషియన్స్‌కు మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ మాఫియా, ప్రేమ అనే అంశాలతో తెరకెక్కిస్తున్న ఊరమాస్ సినిమా 5 భాషల్లో నిర్మిస్తున్నామని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. -
చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసిన ప్రజలు నమ్మరు: వైవీ సుబ్బారెడ్డి
-
మహిళలు అదృశ్యం: టైలర్ షాపుకు వెళ్లి ఒకరు.. కాలేజీకి వెళ్లి మరొకరు
ఆనందపురం(విశాఖ జిల్లా): మండలంలోని రెండు గ్రామాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందగా విచారణ జరుపుతున్నారు. ఆనందపురం యాతపేటకు చెందిన కుప్ప లావణ్య (26) ఈ నెల 18న దుస్తులు కుట్టించుకోవడానికని గ్రామంలోని టైలరు వద్దకు వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త లక్ష్మణ అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: పులి కూడా బ్రష్ చేస్తుంది! అలాగే లొడగలవానిపాలెం గ్రామానికి చెందిన మరడాన లావణ్య (22) కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 18న ఆమె స్కూటీపై కళాశాలకు వెళ్లింది. సాయంత్రానికి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ రవి ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తరాంధ్ర భక్తులకు కొంగు బంగారంగా ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి
-
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి సీరియస్
-
Fishermen: నూక తాతకు వింత మొక్కులు
నక్కపల్లి(పాయకరావుపేట): వింత ఆచారాలు.. వినూత్న సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి. వాటి వెనుక ఉన్న చరిత్ర ఆసక్తి కలిగిస్తుంది. ఈ కోవకే చెందుతుంది నూకతాత పండగ. రాజయ్యపేటలో కనీవినీ ఎరుగని వింత ఆచారంతో ఏటా ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాదీ మత్స్యకారులంతా భక్తి శ్రద్ధలతో.. ఘనంగా ఈ పండగ నిర్వహించారు. చదవండి: అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి మత్య్సకారులు అధికంగా ఉండే రాజయ్యపేటలో మహా శివరాత్రి మరుసటి రోజు నూకతాత పండగ జరుగుతుంది. నూక తాతను గంగపుత్రులు తమ కులదైవంగా భావిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కొనసాగించారు. బుధవారం నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకెళ్లారు. తిరిగి ఆలయానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో భక్తులు రోడ్డుపై పడుకున్నారు. వీరి పై నుంచి విగ్రహాలను చేతపట్టిన పూజారులు దాటుకుంటూ వెళ్లారు. ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరుతాయనేది ఇక్కడి మత్య్సకారుల నమ్మకం. నూకతాత పండగలో జంతు బలి నిషేధం. రక్తం చిందించడాన్ని నూకతాత ఒప్పుకోడని మత్య్సకారులు చెబుతారు. ఈ పండగ పురస్కరించుకుని గ్రామంలో పెద్ద తిరునాళ్లు జరిగింది. భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. బాణసంచా సంబరాలు మిన్నంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అదిరిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా నూకతాత పండక్కి రాజయ్యపేట చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో గంగపుత్రుల ఇళ్లన్నీ సందడిగా మారాయి. -
ఆఘోర వేషధారణలో హల్చల్.. నగ్నంగా చిందులేస్తూ..
నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు. బుధవారం ఏకంగా టౌన్ స్టేషన్ ముందు హాల్చల్ చేశారు. చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..? చూసుకుందాం రండిరా అంటూ నగ్నంగా చిందులు వేశారు. పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్చల్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్ ముందు వీరంగం చేశారు. -
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
నర్సీపట్నం/నల్లజర్ల/: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌ని దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఆయనకు 41(ఎ) నోటీసు ఇచ్చేందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. తాడేపల్లిగూడెం సీఐ రఘు ఇద్దరు ఎస్ఐలతో కలిసి ఉదయాన్నే అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. చదవండి: బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా? అయ్యన్నతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో 3 గంటల పాటు నిరీక్షించారు. అయ్యన్నకి ఫోన్ కలపాలని ఆయన పీఏకు సీఐ సూచించగా.. స్విచ్ఛాఫ్ వస్తోందని పీఏ ఆయనకు బదులిచ్చాడు. అయ్యన్న ఎంతకూ రాకపోవడంతో చివరకు ఆయన ఇంటి గోడకు 41(ఎ) నోటీసు అంటించారు. అయ్యన్న మెయిల్ అడ్రస్‌కు నోటీసు ఫార్వర్డ్ చేసి, మరో 2 నోటీసులను పీఏకి ఇచ్చారు. టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
20న వైఎస్సార్, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ఎల్లుండి(ఆదివారం) వైఎస్సార్ జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం, అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. చదవండి: రాష్ట్రపతి పర్యటనలో మార్పులు ఆ తర్వాత కడప రింగ్ రోడ్ జయరాజ్ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్బి.అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్ఎస్ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పనికొద్దు.. ఆ డబ్బులు నేనే ఇస్తా..
తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్‌కు వెళ్లకుండా వెల్డింగ్ పనికి వెళ్లిన ఓ విద్యార్థికి డీఈవో చంద్రకళ అండగా నిలిచారు. పనికెళ్తే వచ్చే డబ్బులు తానే ఇస్తానని, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం జెడ్పీ హైస్కూల్‌ను డీఈవో చంద్రకళ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, సిలబస్ బోధనపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, నాణ్యత, రుచిపై ఆరా తీశారు. చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని.. అనంతరం పదో తరగతి విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. హాజరుకాని వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గొంప లోకేశ్వరరావు అనే విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో వెల్డింగ్ షాపులో పనికి వెళ్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే ఆనందపురం కూడలిలో లోకేశ్వరరావు పనిచేస్తున్న వెల్డింగ్‌షాపు వద్దకు ఉపాధ్యాయులు సాయంతో వెళ్లి మాట్లాడారు. చదువు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించారు. మధ్యలో చదువు ఆపేయవద్దని కోరారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు వెల్డింగ్ పనులకు వెళ్తే ఎంత వేతనం వస్తుందో ఆ మొత్తం తాను సమకూరుస్తానని ఆమె భరోసా కల్పించారు. అలాగే హాస్టల్లో ఉండి చదువుకునేలా చర్యలు తీసుకుంటానని లోకేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసరావు ఉన్నారు. -
కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని..
జి.మాడుగుల(విశాఖ జిల్లా): నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చాడు. కూరతో కాకుండా రసంతో భోజనం పెట్టిందని గొడవకు దిగి గొడ్డలితో దాడి చేశారు. ఈ కిరాతక దుశ్చర్య జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ మారుమూల గ్రామమైన అడ్డులులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. చదవండి: రూ.లక్షల్లో బెట్టింగ్.. హార్స్ రేసుల్లాగా పావురాల రేస్.. ఇలా తీసుకొచ్చి.. చివరికి.. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రేగం రాజులమ్మ, రామన్న దొర దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె, పెద్ద కుమారుడికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు మత్స్యలింగం, అర్జులమ్మ, రామన్న దొర కలిసి ఓ ఇంటిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యలింగం పూటుగా మద్యం తాగి ఆదివారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భోజనం పెట్టమని తల్లి అర్జులమ్మ (60)ను కోరాడు. రసంతో అన్నం పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూరతో భోజనం పెట్టలేదని కోపగించుకుని తల్లితో గొడవకు దిగి కొట్టాడు. అడ్డుకున్న తండ్రి రామన్న దొరను బెదిరించడంతో ఆయన గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద కొడుకు లక్ష్మణరావు ఇంటికి పరుగుతీశాడు. ఇంతలో మత్స్యలింగం గొడ్డలి వెనుక భాగంతో అర్జులమ్మ తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. పెద్దకొడుకు వద్దకు పారిపోయిన రామన్న సోమవారం ఇంటికి వెళ్లి చూసేసరికి రాజులమ్మ మృతిచెంది ఉంది. మత్స్యలింగం పరారయ్యాడు. రామన్నదొర సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?
మాడుగుల రూరల్(విశాఖ జిల్లా): ముకుందపురం గ్రామానికి చెందిన వివాహిత చెలిబోయిన దేవి (22) ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించడంలేదని శుక్రవారం ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ రామారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. చోడవరం మండలం ఖండిపల్లి గ్రామానికి చెందిన పోలిబాబుతో దేవికి ఏడాది క్రితం వివాహం జరిగింది. చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది.. అయితే ఇటీవల సొంతూరు మాడుగుల మండలం ముకుందపురం వచ్చిన ఆమె ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9440796091, 08934–224233 నంబరుకు తెలియజేయాలని ఎస్ఐ కోరారు. -
కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఓ రౌడీ షీటర్‌కు మహిళలు దేహశుద్ధి చేశారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి పుస్తకాలు, పెన్నలు ఎరచూపి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు బడితెపూజ చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లిన చిన్నారావు.. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినీలు.. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పారు. చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం -
Dangerous Snake: అమ్మో ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ..
మాడుగుల: నాగ జాతిలో అత్యంత ప్రాణాంతకర పాము గిరి నాగు విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణంపాలెం గ్రామంలో బుధవారం కనిపించింది. ఓ ఇంటి నుంచి పాము పామాయిల్ తోటలోకి వెళ్తుండగా స్థానికులు వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి 14 అడుగుల గిరి నాగును పట్టుకున్నారు. దాన్ని వంట్లమామిడి మహా అడవిలో వదిలారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి కంఠిమహంతి మూర్తి, మాడుగుల గ్రామానికి చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘కరోనా అని ముందే తెలుసుకుంటే బావ బతికేవాడు’
రోలుగుంట/విశాఖపట్నం: ఇక మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంట మండలం అర్ల గ్రామానికి చెందిన యువతికి తన మేనమామ కుమారుడైన చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)తో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 26న వీరి వివాహం జరగాల్సి ఉంది. రజనీకాంత్ పరవాడలో పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు. వరుడు ఈ నెల 13న పెళ్లి పనుల నిమిత్తం అర్ల గ్రామానికి వచ్చాడు. అప్పటికే కొద్దిపాటి జ్వరం ఉండడంతో నర్సీపట్నంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిల్లో వైద్యం చేయించుకుని అర్ల వచ్చి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు 14వ తేదీన ఫీల్డ్‌కు వచ్చిన హరిబాబు అనే హెల్త్ అసిస్టెంట్ రజనీకాంత్ పరిస్థితి తెలుసుకొని ఆందోళన చెందొద్దని.. మూడు రోజుల్లో తగ్గిస్తానని చెప్పి రూ. 1500కు ఫీజు మాట్లాడుకొని అతనే సొంతంగా వైద్యం ప్రారంభించాడు. సెలైన్ బాటిల్స్ ఎక్కించి, మూడు రోజులపాటు వైద్యం అందించాడు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం ఆస్పత్రికి కాకుండా నర్సీపట్నంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ స్కానింగ్, ఇతర పరీక్షలు చేయించి, కరోనా పాజిటివ్ వచ్చిందని రూ.5 వేలు వసూలు చేశాడు. అప్పటికే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి, పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రజనీకాంత్ శనివారం మృతి చెందాడు. హెల్త్ అసిస్టెంట్ వైద్యం కారణంగానే రజనీకాంత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ముందుగానే టెస్ట్‌లు చేసి నిర్ధారించి తగిన చికిత్స అందించి ఉంటే తనను వివాహం చేసుకోవలసిన తన బావ బతికే వాడని పెళ్లి కుమార్తె, బంధువులు బోరున విలపిస్తున్నారు. వివరణ కోరేందుకు హెల్త్ అసిస్టెంటుకు సాక్షి విలేకరి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. చదవండి: అగ్గిపెట్టి వివాదం.. హత్యకు దారితీసింది ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
పాడేరు: ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఓ యువకుడు ఆదివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్(19) పబ్జీ గేమ్‌తో పాటు ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు. మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన జయకుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జయకుమార్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి గ్రామానికి చేరుకొని.. కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది.. -
కొడుకు ప్రాణం పోయింది.. తండ్రి గుండె ఆగింది..
మాకవరపాలెం (నర్సీపట్నం): మరికొద్దిరోజుల్లో వివాహ వేడుకతో సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. కరోనాతో కొడుకు మృతి చెందడంతో ఈ వార్తను తట్టుకోలేని తండ్రి గుండెపోటుతో మరణించారు. మాకవరపాలెం మండలం తామరంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ముళ్లపూడి రాజారావు (దర్మి) (58) ఇదే గ్రామంలోని ప్రాథమి క పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారం రోజుల కిత్రం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సుబ్బారావు (86) మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజున తండ్రీ కొడుకులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సుబ్బారావు కూడా సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. మే 13న మనుమడి వివాహం.. ఉపాధ్యాయుడు రాజారావుకు కొడుకు, కూతురు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కొడుకు పవన్‌కుమార్‌కు వివాహం నిశ్చయం కావడంతో మే 13న రాజమండ్రిలో వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ పెళ్లి కోసమే 20 రోజుల కిత్రం విశాఖలో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లి వచ్చిన అనంతరం రాజారావుకు జ్వరం వచ్చిందని, పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్ వచ్చిందని కుటుంబీకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో తండ్రీ కొడుకులు మరణించడం అందరినీ కలచివేసింది. చదవండి: మృత్యువులోనూ వీడని బంధం, అరగంట వ్యవధిలో.. కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. -
అమ్మో.. కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు
మాడుగుల రూరల్: మాడుగుల నూకాలమ్మ కాలనీలో 12 అడుగుల కింగ్ కోబ్రా గిరి నాగు ఆదివారం సాయంత్రం హల్చల్ చేసింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలు నూకాలమ్మ జాతరలో వుండగా.. గండి నాని ఇంటి గోడను ఆనుకొని గిరి నాగును గమనించిన జనం భయంతో పరుగులు తీశారు. ఈస్టర్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ (తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ) వారికి స్థానికులు ఫోన్ చెయ్యగా.. చోడవరం ఫారెస్టు రేంజర్ రామ్ నరేష్ బిర్లాంగి నేతృత్వంలో మాడుగులకు చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేశ్ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారు గరికబంద అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గిరి నాగులు హాని చెయ్యవని, ఎక్కడ విషపూరిత సర్పజాతులు వుంటాయో వాటిని తినడానికి వస్తాయని అటవీ అధికార్లు పేర్కొన్నారు. ఈ పాము ఆకారం చూసి భయపడిన వారు కర్రలతో దాడి చేసి చంపడానికి సిద్ధపడుతున్నారు. చుట్టుపక్కల ఇటువంటి సర్పజాతులు కనబడితే వెంటనే అటవీ అధికార్లకు తెలియజేయ్యాలని అటవీ అధికారులు ప్రజలను కోరారు. చదవండి: పాజిటివ్ వచ్చింది బాబూ.. పకోడీలు వేసి వస్తా! అయ్యో బిడ్డా: దూసుకొచ్చిన మృత్యువు -
చెట్టును ఢీకొట్టిన బైక్, ముగ్గురు టెన్త్ విద్యార్థులు మృతి
సాక్షి, విశాఖపట్నం: మాకవరపాలెంలో శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ చెట్టును బలంగా ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోనూ, ఇంకొకరు విశాఖకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు. మృతులను మాకవరపాలెనికి చెందిన పదో తరగతి విద్యార్థులు హేమంత్, అనీశ్, హర్షిత్‌గా పోలీసులు గుర్తించారు. చదవండి: హిందూపురంలో హిజ్రా దారుణ హత్య బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు -
ఓటర్ల దీవెన.. సర్పంచ్‌లుగా ముగ్గురు వలంటీర్లు
మునగపాక/బుచ్చెయ్యపేట/కశింకోట (విశాఖ జిల్లా) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వారి మనసులు గెలుచుకున్న గ్రామ వలంటీర్లు చివరికి ఆ గ్రామాల పాలనా పగ్గాలే చేపట్టారు. వారు చేస్తున్న కృషికి మెచ్చిన ఆయా గ్రామాల ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ విధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు వలంటీర్లు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చెయ్యపేట మండలం మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి పోటీచేసి గెలుపొందారు. వలంటీర్లుగా ప్రజాభిమానం పొందడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని వారంటున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం) 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు! -
ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ..
సహజ ప్రకృతి సందడి చేస్తోంది.. పర్యాటకుల పలకరింతలతో కొండకోనలు పులకరిస్తున్నాయి.. అలరారుతున్న అందాలని చూసి.. ఎన్నాళ్లకెన్నాళ్లకంటూ సందర్శకులు సంబరపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఒంటరైన పర్యాటకం.. సందర్శకుల అడుగుల సడితో కొత్త రూపు సంతరించుకుంది. కోవిడ్–19 కారణంగా వెలవెలబోయిన టూరిజం.. నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది వరకూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: కరోనా కారణంగా పడకేసిన పర్యాటక రంగం మళ్లీ ఊపందుకుంది. సుమారు ఐదున్నర నెలల పాటు మూతపడిన పర్యాటక కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల పునఃప్రారంభానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రకృతి ప్రేమికులు.. ఇప్పుడు సందర్శన స్థలాల్లో విహరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఆగస్ట్‌లో లక్ష మంది మాత్రమే.. పర్యాటక ప్రాంతాలతో, సహజ సిద్ధమైన అందాలతో భాసిల్లుతున్న విశాఖ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. కరోనాకు పూర్వం జిల్లాలో నెలకు సుమారు 15 నుంచి 18 లక్షల మంది పర్యాటకులు వచ్చేవారు. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించడంతో సందర్శకుల సంఖ్య సున్నాకు పడిపోయింది. 2019 జనవరి నుంచి జూలై వరకూ 1,57, 86,500 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది మార్చి 21 వరకూ 26,71,579 మంది మాత్రమే సందర్శించారు. జూలై వరకు లాక్డౌన్ ఉండటంతో ఒక్క పర్యాటకుడు కూడా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లలేదు. అదే విధంగా.. 2019 ఆగస్టులో 19,43,392 మంది రాగా.. ఈ ఏడాది ఆగస్ట్‌లో కేవ లం లక్ష మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రా ఊటీకి రోజుకు 200 మంది.. ఆంధ్రా ఊటీ అరకు ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇన్నాళ్లూ టూరిస్టులు లేక బోసిపోయిన మన్యం.. ఇప్పుడు వారి రాకతో కళకళలాడుతోంది. ఇప్పుడిప్పుడే పర్యాటకానికి అనుమతులు లభించడంతో అక్టోబర్‌నాటి కల్లా.. పర్యాటకం పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అరకు, పాడేరు, బొర్రా గుహలు మొదలైన ప్రాంతాలను రోజుకు 200 మంది సందర్శిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం ఈ సంఖ్య 5 రెట్లకు పెరిగి వెయ్యి మంది వరకు వస్తున్నారు. అయితే గతేడాది మాత్రం ఏజెన్సీకు రోజుకు 1000 నుంచి 1500 మందికి పైగా రాగా.. వారాంతాల్లో 3 వేలకు పైగా మన్యం అందాలు చూసేందుకు పర్యాటకులు వచ్చేవారు. డముకు వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు.. తీర ప్రాంతాల్లో జనసందడి ఐదున్నర నెలల తరువాత వీఎంఆర్డీఏ ఆధీనంలో ఉన్న పార్కులు, మ్యూజియాలు, సందర్శన కేంద్రాలు తెరుచుకున్నాయి. కైలాసగిరి, వైఎస్సార్ సెంట్రల్ పార్కు, తెన్నేటి పార్కులతో పాటు అన్నింటినీ పునఃప్రారంభించడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. తీర ప్రాంతాల్లో జనసందడి నెలకొంటుంది. బీచ్ ఒడ్డున సేదతీరుతూ ఆస్వాదిస్తున్నారు. దసరాకు పెరిగే అవకాశం జిల్లాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్కే బీచ్, ఏజెన్సీలు కళకళలాడుతున్నాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి పర్యాటక కేంద్రం వద్ద పూర్తి రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా సందర్శకులకు అనుమతి లేకపోవడంతో నెమ్మదిగా పుంజుకుంటోంది. దసరా నాటికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. – ఆర్.పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక అధికారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే.. కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ –142 మ్యూజియం వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున.. వాటిలో సందర్శకులకు ఇంకా అనుమతించలేదు. కైలాసగిరి రోప్‌వే, టాయ్ ట్రైన్ ఆరు నెలలుగా ప్రారంభించకపోవడంతో వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహిస్తున్నాం. ట్రయల్ రన్ వేసి, తర్వాత ప్రారంభిస్తాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
ఆ ఘనత జగన్‌దే.. గర్వంగా చెబుతున్నా..
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని భ్రమరావతిగా చూపి టీడీపీ నేతలు అక్కడ భూములను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 కూడా నెరవేర్చని చేతగాని ప్రభుత్వం టీడీపీ అని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నామన్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. -
కన్నతల్లిని కడతేర్చిన కిరాతకుడు..
రోలుగుంట (చోడవరం): మద్యం మత్తులో కన్నతల్లినే హత్య చేశాడో కసాయి కొడుకు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ శివారు బలిజపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గేదెల నూకాలతల్లి (55) భర్త గతంలోనే మృతి చెందాడు. ఆమె తన ఒక్కగానొక్క కుమారుడు కృష్ణ (35)ను అల్లారు ముద్దుగా పెంచుకుంది. యుక్త వయస్సు రాగానే వివాహం చేసింది. అయినా కొడుకు బాగోగులు తల్లే చూసుకునేది. గురువారం రాత్రి ఆ తల్లి కుమారుడి కోసం పండ్ల జ్యూస్ తయారు చేసి ఇచ్చేందుకు ఎదురుచూస్తుండగా.. కృష్ణ పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో మైకంలో ఉన్న అతను కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న గిన్నెతో తల్లి తలపై అనేక సార్లు బలంగా కొట్టడంతో అధిక రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచింది. వీఆర్వో నాగమణి ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి స్థానికులను విచారించారు. శుక్రవారం ఉదయం పంచనామా నిర్వహించి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టానికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ ‘ఘనుల’పై కొరడా
సాక్షి, విశాఖపట్నం/పద్మనాభం: అక్రమ తవ్వకాలతో మైనింగ్ డాన్ అని పేరొందిన శ్రీనివాస్ చౌదరికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే అనకాపల్లి మండలం సీతానగరంలో ఆయనకు చెందిన నాలుగు కంపెనీలకు అక్రమ తవ్వకాలపై రూ.33 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకే చెందిన మరికొన్ని కంపెనీలు పద్మనాభం మండలం కృష్ణాపురంలో అక్రమ మైనింగ్ చేసినందుకు భారీగా జరిమానా విధించారు. రోడ్డు మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేసినట్లు సర్వే చేసి మైనింగ్ శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సహాయ సంచాలకుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి బృందం గుర్తించింది. ఆ ఉల్లంఘనలకు గాను వీవీఆర్ క్రషర్స్, పి.రత్నలత పేరు మీద ఉన్న రెండు క్వారీలతో పాటు సంజనా గ్రానైట్ క్వారీలో అక్రమ మైనింగ్ నేరానికి గాను మొత్తం రూ.80.94 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అన్నీ అక్రమాలే... సంజనా గ్రానైట్ పేరుతో 4.48 హెక్టార్లను శ్రీనివాస్ చౌదరి పరిమితికి మించి తవ్వించేశారు. అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పి.రత్నలత పేరుతో లీజుకు తీసుకున్న 2.43 హెక్టార్ల క్వారీలోనూ, మరోచోట 6.50 హెక్టార్లలో తీసుకున్న క్వారీలోనూ అనుమతి ఇచ్చిన దానికన్నా అధికంగా రోడ్డు మెటల్, గ్రావెల్ తవ్వేశారు. పర్మిట్లను దుర్వినియోగం చేసి భారీ మొత్తంలో కాసులు వెనకేసుకున్నారు. అలాగే వీవీఆర్ క్రషర్స్ పేరుతో మరోచోట 17.50 హెక్టార్లు లీజుకు తీసుకున్న శ్రీనివాస్ చౌదరి అదే తరహాలో దోపిడీ కొనసాగించారు. గత మూడు రోజులుగా ఈటీఎస్ సర్వే నిర్వహించిన ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆ అక్రమాలను నిగ్గు తేల్చింది. దోపిడీ విలువ రూ.కోట్లలో... శ్రీనివాస్ చౌదరికి చెందిన కంపెనీలు పద్మనాభం మండలంలో కొనసాగించిన మైనింగ్ దోపిడీ విలువ రూ.కోట్లలోనే ఉందని అధికారులు గుర్తించారు. రోడ్డు మెటల్ 11,23,178 క్యూబిక్ మీటర్లు, గ్రావెల్ మరో 5,99,688 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించారు. ఈ ఉల్లంఘనలకు సాధారణ సీనరేజి కింద రూ.12,80,71,980 మొత్తంతో పాటు మరో రూ.64,03,59,900 అపరాధ రుసుం విధించారు. అలాగే డీఎంఎ‹ఫ్ కింద రూ.4,09,83,033 చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.80.94 కోట్ల జరిమానా విధిస్తూ ఆయా కంపెనీల యాజమాన్యానికి నోటీసులు పంపారు. జిల్లాలో మైనింగ్ అక్రమాలపై ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
అవినీతి రోగం కుదిరింది!
పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్సీలో యూడీసీ (సీనియర్ అసిస్టెంట్) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, యూడీసీ శోభారాణి తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్ఎంలు యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్‌టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ డిమాండ్ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్‌లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్‌లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్ఎంల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు, లీవ్‌లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్, సీఐ ప్రేమ్‌కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు. -
లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సాయంత్రం(గురువారం) నుంచి నేటి సాయంత్రం(శుక్రవారం) ఆరు గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 929 కేసులు నమోదు చేశామని తెలిపారు. 8 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 54 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. రూ.3,34,355 అపరాధ రుసుం విధించామని పేర్కొన్నారు. కచ్చితంగా లాక్డౌన్, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని.. ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. (రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న) -
భయం గుప్పిట్లో వెంకటాపురం
పద్మనాభం(భీమిలి): మండలంలోని వెంకటాపురం గ్రామస్తులు భయం గుప్పెట్లో ఉన్నారు. గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అధికారులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఎవరూ రాకుండా కట్టడి చేశారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆయన తండ్రికి కూడా పాజిటివ్ నమోదైంది. వెంకటాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. లండన్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ మీదుగా విశాఖ విమానశ్రయానికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ నెల 17న పద్మనాభం మండలంలో ఉన్న తన సొంత గ్రామమైన వెంకటాపురం వచ్చాడు. 20న కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. 21న విశాఖపట్నం చెస్టు ఆస్పత్రిలో చేరాడు. 22న ఇతనికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో యువకుడు కుటుంబంలోని నలుగురితో పాటు మొత్తం 23 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్‌రావడంతో 21 మంది గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా యువకుడు తండ్రి(54)కి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో శుక్రవారం మరో 10 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. వైద్య బృందాల ఆరా దీంతో యువకుడు తండ్రి ఎవరెవరిని కలిశాడో వైద్య శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రేవిడి ఆస్పత్రికి ఎదురుగా ఉన్న హార్డ్ వేర్ షాపు వద్దకు వెళ్లడంతో పాటు అనేక మందిని కలిశాడు. ముందుస్తుగా అనుమానంతో పది మందిని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. వెంకటాపురంలో కరోనా కల్లోలం సృష్టించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరికి కరోనా వైరస్ సోకుతుందోనని ప్రజలు భయ కంపితులవుతున్నారు. రేవిడి, పాండ్రంగి సచివాలయ పరిధిలోని పది గ్రామాల్లో వలంటీర్లు , ఆశలు 50 బృందాలుగా ఏర్పడి రీ సర్వే చేస్తున్నారు. కొనసాగుతున్న ఇంటింట సర్వే మండలంలోని 22 పంచాయతీ పరిధిలో ఆశలు, వలంటీర్లు ససర్వే చేశారు. గ్రామాల్లోకి ఇతర రాష్ట్రాల నుంచి 165 మంది, విదేశాల నుంచి పది మంది వచ్చినట్టు గుర్తించారు. వీరంతా ఇళ్లలోనే ఉండాలని వైద్య శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు సూచించారు. వెంకటాపురం గ్రామంలోకి ఇతరులను ఎవరనీ వెళ్లనివ్వలేదు. -
ఏళ్లనాటి కల ఫలించిన వేళ
రావికమతం(చోడవరం): ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని శివారు గిరిజన గ్రామాలవి. ఏ చిన్న పని కావాలన్నా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సిందే. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. మా పరిస్థితిని పట్టించుకోండి.. అంటూ ఎన్నో మార్లు వినతులు.. విజ్ఞప్తులు.. విసిగి పోయి ధర్నాలు కూడా చేశారు ఆయా గ్రామాల ప్రజలు. అయినా నేతలు, అధికారుల్లో మార్పు రాలేదు. హామీలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మండలంలో... ►రావికమతం మండలంలో గ్రామ పంచాయతీలు 24 ►24 పంచాయతీల పరిధిలో శివారు గ్రామాలు 62 ►పంచాయతీ కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ►ప్రస్తుతం మండలంలో పంచాయతీల సంఖ్య 28కి చేరింది. వమ్మవరం: కన్నంపేట పంచాయతీ శివారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వమ్మవరం గ్రామం పంచాయతీగా ఏర్పాటైంది. జనాభా: 969, ఓటర్లు: 713 రిజర్వేషన్: జనరల్ కె.కొట్నాబిల్లి: టి.అర్జాపురం పంచాయతీ శివారు ఐదు గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో కె.కొటా్నబిల్లి, గదబపాలెం, డోలవానిపాలెం గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా: 766, ఓటర్లు: 593 రిజర్వేషన్: ఎస్టీ మహిళ కేబీపీ అగ్రహారం: కొమిర పంచాయతీ శివారు 4 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్న కేబీపీ ఆగ్రహారం గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలో యర్రబంద గ్రామాన్ని కలిపారు. జనాభా: 991 ఓటర్లు: 634 రిజర్వేషన్: జనరల్ మహిళ ధర్మవరం: పి.ధమ్రవరం, కె.ధర్మవరం గ్రామాలు జెడ్.కొత్తపట్నం పంచాయతీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏ పని కావాలన్నా సర్పానది దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్ని కలిపి ధర్మవరం పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా: 429, ఓటర్లు: 327 రిజర్వేషన్: జనరల్ మహిళ సమస్య తీరింది టి.అర్జాపురం శివారుగా మా ఐదు గిరిజన గ్రామాలుండేవి. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సరిగ్గా వినియోగించక మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. –గొలుముల రాములు, కె. కొట్నాబిల్లి ఆనందంగా ఉంది మాది కన్నంపేట శివారు వమ్మవరం గ్రామం. ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికకు సిద్ధమవ్వడం ఆనందంగా ఉంది. మా కష్టాలు తీరినట్టే. – గల్లా వెంకటలక్ష్మి, వమ్మవరం నది దాటక్కర్లేదు మాది ధర్మవరం. జెడ్.కొత్తపట్నం శివారుగా ఉండేది. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే సర్పానది దాటాల్సి వచ్చేది. భయం భయంగా వెళ్లేవాళ్లం. ఇకపై ఆ ఇబ్బంది లేదు. – గోరా చిరంజీవి, ధర్మవరం -
మెడికల్ షాపులపై అధికారులు దాడులు
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ సాకుతో మాస్క్‌లను అధిక ధరలకు విక్రయించడంతో విశాఖ జిల్లాలో మెడికల్ షాప్‌లపై సోమవారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కే.రజిత ఆధ్వర్యంలో 65 మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మాస్క్‌లను అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేపట్టారు. మూడు మందుల షాపుల్లో అధిక ధరలకు మాస్క్‌లు విక్రయినట్లు గుర్తించిన అధికారులు.. షాప్‌ల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. -
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరికలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమపాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా పరవాడ మండల పరిధిలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు,మత్స్యకారులు పార్టీలోకి చేరారు. వారికి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిఇసి సభ్యుల శ్రీను, చుక్క రామునాయుడు, రాజు, ఇళ్ల ప్రసాద్, దాడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. (బీసీలకు సాధికారత) రాజంపేట: వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. నందలూరు మండలం నల్లతిమ్మాయిపల్లికి చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీలోకి చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. వారికి మేడా వెంకటమల్లికార్జున రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన, కాంగ్రెస్ నుంచి కూడా.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
సూపర్ వలంటీర్..!
దేవరాపల్లి(మాడుగుల): లబ్ధిదారుల చెంతకు పథకాలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సంకల్పం అక్షరాలా నెరవేరుతోంది. ఒక్క వృద్ధురాలికి పింఛన్ ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి నాటుపడవలో ఏరుదాటి అతికష్టం మీద గ్రామానికి చేరుకుని తన అంకితభావాన్ని చాటుకున్నాడు ఓ వలంటీర్. దేవరాపల్లి మండలం తామరబ్బ పంచాయతీ పరిధిలోని లోవ ముకుందపురం గ్రామంలో ఏటికి అవతలి వైపు వృద్ధురాలు వంతె పోతమ్మకు చెందిన ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే గుట్టలు, కొండల్లో ఏడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. లేదంటే నాటుపడవలో ఏరును దాటి.. మూడు కిలోమీటర్లు నడవాలి. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో స్థానిక వలంటీర్ టేడ సింహాచలం నాటు పడవలో ప్రయాణించి అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ సొమ్మును అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటికి తీసుకొచ్చిన వలంటీర్‌ను పోతమ్మ కుటుంబ సభ్యులు అభినందించారు. గతంలో పింఛన్ అందుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సివచ్చేదని గుర్తుచేసుకుంది పోతమ్మ. పథకాల్ని ఇంటికి చేర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో తమకు బాధలు తప్పాయని ఆనందం వ్యక్తం చేసింది. -
పారదర్శకంగా భూ సమీకరణ..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు నష్టం కలిగించం.. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు.. గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ భూమి తీసుకోవడం లేదన్నారు. రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ వెల్లడించారు. -
కోడి పందాలపై డేగకన్ను
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించే వారిపై పోలీసులు డేగ కన్ను వేశారు. అటు జిల్లాలోను, ఇటు నగరంలోనూ ఈ సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరంలో ఎక్కువగా కోడిపందాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నగరంలో విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో కూడా గతంలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గత ఏడాది కోడిపందాలు నిర్వహించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని.., వారు మళ్లీ పందాల నిర్వహణకు ముందుకొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నగరంలో కొన్ని చోట్ల విచ్చలవిడిగా కోడి కత్తులు తయారుచేస్తూ విక్రయిస్తున్నారు. టాస్‌్కఫోర్స్ పోలీసులు ఇప్పటికే 245 కోడి కత్తులను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే కోర్టులు కూడా పందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ పందాలు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే ఆదేశాలున్నాయి. ఇవీ హాట్స్పాట్లు నగర పరిధిలో కోడి పందాలు జరిగే ప్రాంతాలను పోలీసులు హాట్స్పాట్లుగా గుర్తించారు. వీటీలో ఆరిలోవ, దువ్వాడ, భీమిలి మండలం తాటితూరు, ఆనందపురం మండలం గుళ్లేపల్లి, పద్మనాభం మండలం రేవిడి, పాండ్రంగి తదితర ప్రాంతాలున్నాయి. అలాగే జిల్లాలోని పాయకరావుపేట మండలం పీఎల్ పురం, మంగవరం, పెదరామభద్రపురం, వెంకటనగరం, కుమారపురం, పాల్మాన్పేట, నక్కపల్లి మండలం వేంపాడు, నెల్లిపూడి, గొడిచెర్ల, దేవవరం, రమణయ్య పేట, రేబాక, డీఎల్ పురం, తీనార్ల, ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు, లింగరాజుపాలెం, పెదుప్పలం, కోటఉరట్ల మండలం పాములవాక, రామచంద్రాపురం, ములగల లోవ, యలమంచిలి మండలం పెదపల్లి, గూండ్రుబిల్లి, పులపర్తి, ఏటికొప్పాక, రాంబిల్లి మండలం లాలంకోడూరు, దిమిలి, కట్టుబోలు, మురకాడ, మామిడికొత్తూరు, నాతవరం గునుపూడి, వైబీ పట్నం, నర్సీపట్నం మండలం లింగాపురం, అప్పన్న దొరపాలెం, గొలుగొండ మండలం పాకలపాడు, ఏఎల్ పురం, అమ్మపేట, జోగంపేట, చీడిగుమ్ముల తదితర ప్రాంతాల్లో ఏటా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పెషల్ టీంల ఏర్పాటు ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ కోడి పందాలు నిర్వహించుకుండా మండలంలో ఉన్న పోలీస్‌స్టేషన్ ఎస్ఐల ఆధ్వర్యంలో స్ఫెషల్ టీంలు పనిచేస్తున్నాయి. ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఈ టీంలు నిఘా కొనసాగిస్తాయి. కోడిపందాల నిర్వాహకుల సమచారం తెలుసుకుని అక్కడకు వెళ్లి కేసులు నమోదు చేస్తారు. టాస్‌్కఫోర్స్, క్రైం, లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. -
20 ఏళ్ల క్రితం తప్పిపోయి..
అరకులోయ : విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో 2000 సంవత్సరంలో తప్పిపోయిన గంగాధర్ అనే గిరిజన యువకుడు 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. 9ఏళ్ల వయస్సులో గంగాధర్ విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో తప్పిపోయి చెన్నైకి చేరుకున్నాడు. అప్పట్లో గంగాధర్ ఫొటోతో తప్పిపోయిన బాలుడి పేరిట తమిళనాడు రాష్ట్రంలోని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే గంగాధర్‌కు చక్ర సెంట్రల్ ఆర్గనైజేషన్ అనాథాశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. 2015 సంవత్సరం వరకు ఆశ్రమంలోనే వసతితో పాటు చదువు కొనసాగించిన గంగాధర్ 2015లో కొంతమంది స్నేహితులతో కలిసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. ఐటీఐ, కంప్యూటర్ కోర్సులను పూర్తి చేసిన గంగాధర్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో గంగాధర్ 15 రోజుల కిందట అరకులోయకు చేరుకుని తన తల్లిదండ్రులు, గ్రామం కోసం వెతుకుతున్నాడు. చిన్న వయస్సులో వెళ్లిపోవడంతో తనకు గిరిజన మ్యూజియం, సినిమాహాలు, గార్డెన్ ప్రాంతాలు మాత్రమే గుర్తున్నాయని గంగాధర్ తమిళ భాషలో వాపోతున్నాడు. గంగాధర్ తల్లిదండ్రులు, గ్రామం ఆచూకీని తెలుసుకునేందుకు స్థానిక పోలీసు అధికారులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గంగాధర్ పోలీసుల ఆదీనంలో ఉన్నాడు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
కశింకోట(అనకాపల్లి): పట్టాదారు పాసు పుస్త కం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఏసీబీ అధికారులకు చిక్కారు. అవినీతి నిర్మూలనకు సీఎం ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరును బాధితుడు ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకుని అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపిన వివరాలిలావున్నాయి. కారణం లేకుండా దరఖాస్తు తిరస్కారం.. మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన గల్లా సత్యనారాయణకు అదే గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 133/1లో 49.50 సెంట్ల భూమి ఉంది. దీని వివరాలు ఆన్లైన్లో నమోదు కాలే దు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయాలని 2012లో రెండు దఫాలు తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశాడు. అధికారులు అకారణంగా వాటిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ గత డిసెంబర్ నెలలో తనకు రైతు భరోసా పథకం సొమ్ము పొందేందుకు తన భూమి వివరాలను ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అయితే ఇందుకు రూ.3 వేలు ఇవ్వాలని తాళ్లపాలెం వీఆర్వో పీవీ రాజేష్ డిమాండ్ చేశారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదుతో.. అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 14400కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. వాస్తవమేనని వెల్లడవడంతో వారు రంగంలోకి పథకం రూపొందించారు. సత్యనారాయణ బంధువైన చప్పగడ్డ ప్రసాద్ ద్వారా వీ ఆర్వో రాజేష్‌కు లంచం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా వీఆర్వో రూ.2 వేలకు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. నగదు ఇచ్చిన వెంటనే.. నగదు ఇచ్చిన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి వీఆర్వో అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రసాద్‌తో నాలుగు రూ.500 నోట్లు పంపించారు. వీటిని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వీఆర్వో రాజేష్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వా«దీనం చేసుకొని రాజే‹Ùపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపారు. శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. ఈ దాడిలో సీఐలు గఫNర్, రమే‹Ù, లక్ష్మణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ దాడితో రెవెన్యూ సిబ్బంది కలవరం చెందారు. -
రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి..
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తలపెట్టిన డాక్టర్ వైఎస్సార్ రైతుభరోసా పథకంలో తుది విడత (సంక్రాంతి) చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా జిల్లాలో 3,35,218 మంది రైతు కుటుంబాలకు మేలు జరగనుంది. లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. శనివారం నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున నేరుగా జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాలో 5,72,674 భూమి ఖాతాలు ఉన్నాయి. వీటిలో కొంతమంది రైతులకు రెండు మూడు ఖాతాలు ఉన్నాయి. అలాగాకుండా ప్రతి రైతు కుటుంబంలో ఒక ఖాతా చొప్పున పీఎం కిసాన్–డాక్టర్ వైఎస్సార్ రైతుభరోసా పథకానికి వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది. తుదకు 3,55,478 ఖాతాలను ఎంపిక చేశారు. కొన్ని ఖాతాల్లో సాంకేతిక కారణాల వల్ల జమ ఆగిపోయిన నేపథ్యంలో పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ తొలి రెండు విడతల్లో 3,33,953 ఖాతాలకు సంబంధించి రైతులకు రూ.270 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇక సంక్రాంతి కానుకగా తుది విడత రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. సాంకేతిక కారణాలతో ఆగిన ఖాతాలను పరిష్కరించిన తర్వాత తుదకు 3,35,218 రైతు కుటుంబాలకు ఈసారి లబ్ధి కలగనుంది. ఈ సీజన్లో తుదివిడత.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రధానమైంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయలు ప్రతి రైతుకూ సాయం చేస్తానని ఆయన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ కన్నా రూ.వెయ్యి అదనంగా పెంచి పీఎం కిసాన్–డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు దఫాల్లో రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.67,500 మేర భరోసా అందనుంది. ఈ సీజన్లో తుదివిడత అర్హుల జాబితాలను బుధవారం ఆయా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆయా రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖలను అధికారులు అందించనున్నారు. -
రైతు ఇంట లక్ష్మీకళ!
సాక్షి, విశాఖపట్నం: ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా వ్యవసాయ పంటల సాగుకు ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎరువులు, విత్తనాల ధరలు, మరోవైపు కూలీలు, ట్రాక్టర్ల అద్దె తడిసిమోపెడవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు గ్రామాల్లో కూలీలు దొరకని పరిస్థితి. అదును దాటిపోకూడదనే ఉద్దేశంతో రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు తెచ్చుకోవడానికి అవస్థలు పడేవారు. ఈ సంవత్సరం మాత్రం అన్నదాతలకు ఆ తిప్పలు తప్పాయి. పంటలను బట్టి రుణాలు సాఫీగా మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం స్పందించింది. రుణపరిమితి కూడా గత ఏడాది కన్నా ఈ ఖరీఫ్‌లో అదనంగా పెంచడానికి జిల్లా స్థాయి బ్యాంకుల కమిటీ ఆమోదముద్ర వేసింది. జిల్లాలో అత్యధికంగా పండే వరి సహా ప్రధాన పంటల రుణపరిమితి పెరిగింది. రుణాల లక్ష్య సాధనలోనూ మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఖరీఫ్‌లో 91 శాతం లక్ష్యసాధన.. జిల్లాస్థాయి బ్యాంకుల కమిటీ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2019 ఖరీఫ్‌లో రూ.3,006 కోట్లు, రబీలో రూ.1,762 కోట్లు రుణాల మంజూరుచేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 3,18,153 మంది రైతులకు రూ.2,264 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలి. టర్మ్ రుణాలు 73,237 మంది రైతులకు రూ.742 కోట్లు మంజూరు చేయాలి. ఈ లక్ష్య సాధనకు బ్యాంకులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు కృషి చేశారు. ఫలితంగా 3,19,547 మంది రైతులకు పంటరుణాల కింద రూ.2,102 కోట్లు (93 శాతం) మంజూరయ్యాయి. అలాగే 72,469 మందికి రూ.647 కోట్లు మేర (87 శాతం) టర్మ్ రుణాలు వచ్చాయి. ఖరీఫ్ సీజన్లో మొత్తంమీద 3,92,016 మంది రైతులకు రుణల రుపేణా రూ.2,749 కోట్లు (91 శాతం) మంజూరయ్యాయి. రబీలో సాఫీగా రుణాల ప్రక్రియ.. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించడంతో రైతులు ఉత్సాహంగా రబీ సీజన్‌కూ సిద్ధమయ్యారు. జిల్లాలో 2,23,217 మంది రైతులకు పంటరుణాలు కింద రూ.863 కోట్లు మంజూరు చేయాలి. ఇప్పటివరకూ1,43,759 మందికి రూ.573 కోట్లు (66 శాతం) మంజూరయ్యాయి. టర్మ్ రుణాలు కూడా 73,237 రైతులకు గాను ఇప్పటివరకూ 42,157 మందికి రూ.498 కోట్లు మంజూరయ్యాయి. లక్ష్యం రూ.899 కోట్లలో ఇది 55 శాతం. ‘వైఎస్సార్’ పథకంతో రైతుకు భరోసా.. గతంలో కన్నా ఈసారి రైతులు ఎక్కువగా బ్యాంకు రుణాల వైపు చూపడానికి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రధాన కారణమైంది. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పంటల బీమా ప్రీమియంలో రైతు తన వంతుగా ఒక్క రూపాయి చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. రబీ సీజన్ నుంచి రైతులు ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించాలి్సన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గతంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియం విలువలో రైతులు 2 నుంచి 5 శాతం వరకూ సొమ్ము చెల్లించేవారు. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించేవి. ఈసారి రైతులు చెల్లించాలి్సన ప్రీమియం బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ పథకంపై వ్యవసాయ శాఖ, బ్యాంకింగ్ అధికారులు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో మొత్తం రూ.4,768 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,820 కోట్ల మేర (80 శాతం) రుణాలు మంజూరయ్యాయి. కౌలు రైతులకు సర్కారు అండ భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా వారి భూమిని సాగుచేసుకుంటున్న కౌలురైతులకు 11 నెలల పాటు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలుదార్ల చట్టం తీసుకొచి్చంది. దీంతో కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు పంటల బీమా, నష్టపోయిన పంటలకు పరిహారం పొందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రకారం జిల్లాలో 12,561 మంది కౌలుదార్లకు రుణఅర్హత పత్రాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. మరో 2,906 మందికి భూయజమానుల ద్వారా సాగుహక్కు పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పించారు. ఇలా మొత్తంమీద 15,467 మంది కౌలుదార్లకు మేలు జరిగింది. ఆయా పత్రాల ఆధారంగా జిల్లాలో 11,376 మంది కౌలుదార్లకు రూ.23.26 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
నడిరోడ్డుపై కీచక పర్వం
నర్సీపట్నం: మద్యం మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమ ద్విచక్రవాహనానికి సైడు ఇవ్వలేదన్న సాకుతో ఓ ఆటో డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా అడ్డు వచ్చిన అతని భార్య పట్ల దురుసుగా ప్రవర్తించి, ఆమె చీర లాగేశారు. పట్టణ సీఐ స్వామినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. కోటవురట్ల మండలం యండపల్లికి చెందిన మూర్తి నానిబాబు(ఆటోడ్రైవర్),భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజు కలసి బుధవారం నర్సీపట్నంఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. పూటు గా మద్యం తాగిన బొడగ రామకృష్ణ , ఎలిశెట్టి నాగేశ్వరరావులు బైక్‌పై వస్తూ అబీద్‌సెంటర్ వద్ద ఆటోను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య వల్ల ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు కొంతదూరం వచ్చిన తరువాత ఆటోను ఆపి డ్రైవర్ నానిబాబును ఆటోలోంచి కిందకు దించి తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ భార్య రాజేశ్వరి అడ్డుకోగా ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. చీరలాగేడంతో పాటు కులం పేరుతో దూషించారు. బాధితురాలు రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ, ఇతర కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
రెప్పపాటులో ఘోరం
చోడవరం/మాడుగుల: చోడవరం పెట్రోల్ బంకు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్‌పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం ఉదయం వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్‌పై తిరుగు పయనమయ్యారు. బీఎన్ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై పడింది. స్కూటర్ నడుపుతున్న జగదీష్ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడిపోయారు. రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య చనిపోవడంతో జగదీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నూకరత్నం మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో ముంచెత్తింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ఎంత ప్రయతి్నంచినా రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చాడు. -
మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు
నర్సీపట్నం : మాజీ మంత్రి అయ్యన్న సోదరుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్సీపీలో చేరిన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు) తన ఇంటిపై పార్టీ జెండా కడుతుండగా అడ్డుతగలడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న కుటుంబంలో విభేదాలు నెలకొనడంతో ఇటీవల సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన అనుచరగణంతో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి మాదిరిగానే ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం ముహూర్తం చూసుకుని తాను నివాసముంటున్న ఇంటిపై సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ జెండా కడుతుండగా వరుసకు చిన నాన్నమ్మ అయిన పెదపాత్రుని లక్ష్మి, మరో బంధువు హర్ష వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న లక్ష్మి స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. తన ఇంటిపై జెండా కడుతుండగా అడ్డుకుంటున్నారని, అదేవిధంగా మాజీ మంత్రి తనయుడు విజయ్, మరో బంధువు హర్ష వల్ల తనకు ప్రాణహాని ఉందని వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా అస్వస్థతకు గురైన లక్ష్మి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు సన్యాసిపాత్రుడు, అయ్యన్న నివాసం వద్ద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపై అయ్యన్న దురుసుతనం కాగా ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్న విరుచుకుపడ్డారు. ‘తమాషాగా ఉందా.. మేం కోడితే ఏమిచేస్తావు నీవు.. మర్యాదగా వెళ్లిపొండి..పద్ధతి గల మనుషులము మేము..మా ఇంటికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా రాకూడదు..ఎవరిచ్చారు నీకు అనుమతి?’ అంటూ పోలీసులపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడుతూ దబాయించారు. -
ధాన్యం కొనుగోలుకు వేళాయె..!
ఖరీఫ్ (సార్వా) పంట రైతుల చేతికొచ్చింది. అనుకూల వర్షాలతో జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడి ఆశాజనంగానే ఉంది. చాలాచోట్ల ఇప్పటికే వరికోతలు పూర్తయ్యాయి. మిగతాచోట్ల ముమ్మరంగా కోత పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ధాన్యం మద్దతుధరలనూ ప్రకటించింది. ఈ ప్రకారం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. అధికారులు అందుకతగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూమి విస్తీర్ణం 1,07,428 హెక్టార్లు. దీనిలో సాధారణంగా సాగు అయ్యే విస్తీర్ణం 1,02,312 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 97,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. వర్షాలు అనుకూలించడంతో దిగుబడి పెరిగిందని రైతులు ఆనందంలో ఉన్నారు. దాదాపు 3,68,752 మెట్రిక్ టన్నుల వరకూ ఉంటుందని అంచనా. దీనిలో రైతులు సొంత వినియోగానికి 1,08,657 మెట్రిక్ టన్నుల వరకూ మినహాయించుకున్నా, మిగతా 2,60,095 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి రావాల్సి ఉంది. జిల్లాలో 34 రైస్‌మిల్లులు ఉన్నాయి. ఈ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 55 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ)ను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది. వీటిలో ఐదు వెలుగు (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చోడవరం వ్యవసాయ మార్కె ట్ యార్డు, యలమంచిలి మండల సమాఖ్య (లైన్ కొత్తూరు), నాతవరం మండల సమాఖ్య, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు, పద్మనాభం మండల సమాఖ్య ఆవరణల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా 50 పీపీసీలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు వీటిని తెరుస్తారు. ఇవన్నీ మార్చి నెల వరకూ పనిచేస్తాయి. దళారీలకు అడ్డుకట్ట... రైతుల వద్ద తక్కువ ధరకు ముందుగానే ధాన్యాన్ని కొనేసి లబ్ధి పొందుతున్న దళారీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తాము సాగు చేసిన పంటను ధాన్యం రకాలతో సహా ఈ–క్రాప్‌లో విధిగా నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత మండల వ్యవసాయాధికారిని లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలి. గ్రామ సచివాలయంలోని గ్రామ వ్యవసాయ సహాకుల సలహా, సహకారాలు తీసుకోవచ్చు. కౌలురైతులు రుణ అర్హతపత్రం లేదా సాగు ధ్రువీకరణ పత్రం సంబంధిత కార్యాలయం నుంచి పొందాలి. ధాన్యం కొనుగోలు సమయంలో వెబ్‌ల్యాండ్/ఈ–క్రాప్‌లో నమోదైన వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. దళారీలకు అడ్డుకట్ట వేసి నిజమైన రైతులకు న్యాయం చేయడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నాలుగైదేళ్లుగా తమ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరు నమోదుచేసుకోని రైతులు ఎవ్వరైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్‌కార్డు, పాసుపోర్టు సైజ్ ఫొటోతో పాటు బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం కాపీలను తీసుకెళ్లాలి. అంతకన్నా ముందు అసలు బ్యాంకు ఖాతా మనుగడలో ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పనిచేయని ఖాతా నంబరు ఇస్తే ధాన్యం ధర చెల్లింపు విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే రైతులు తాము ఏ రోజు పీపీసీకి తీసుకొచ్చేదీ ముందుగానే అక్కడి సిబ్బందికి తెలియజేయాలి. అందుకోసం టోకెన్ తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాల ప్రకారమే ధర... ధాన్యానికి కనీస మద్ధతు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,815 చొప్పున, ఏ గ్రేడు రకం ధాన్యానికి రూ.1,835 చొప్పున ధర రైతులకు చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ ధాన్యం సేకరణలో పాటించాలి్సన నాణ్యత ప్రమాణాల వివరాలను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. ధాన్యంలో మట్టిరాళ్లు, ఇసుక తదితర వ్యర్థాలు, గడ్డి, చెత్తతాలు, పొట్టు 1 శాతం వరకూ ఉండవచ్చు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తొలచిన ధాన్యపు గింజలు 4 శాతానికి మించకూడదు. పరిపక్వంకాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన గింజలు 3 శాతం వరకూ ఉండవచ్చు. ఏ గ్రేడు ధాన్యంలో కేళీలు 6 శాతం మించి ఉండకూడదు. ఏ గ్రేడు, సాధారణ రకాలైన సరే తేమ 17 శాతం వరకే ఉండాలి. సమీప కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలి. తక్కువ ధరలకు దళారీల చేతుల్లో పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందండి. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని సొంత ఖర్చుతోనే కేంద్రానికి తీసుకెళ్లాలి. ధాన్యం కొనుగోళ్లకు అన్ని పీపీసీల్లోనూ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ నాణ్యత పరిశీలనలో ఆమోదం పొందిన ధాన్యాన్ని గోనెసంచుల్లో నింపడం, కాటా వేయడం, బస్తాలు కుట్టడం, మార్కింగ్ వేసి లారీలకు లోడు చేయడం తదితర పనులకు అయ్యే ఖర్చు అంతా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భరిస్తుంది. – వి.వినయ్‌చంద్, జిల్లా కలెక్టరు ధాన్యం రకాలన్నీ కలిపేయవద్దు.. నూర్పుడి సమయంలోనే ధాన్యం కలిపేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ రకానికి ఆ రకమే ప్రత్యేకంగా నూర్పిడి చేయాలి. వాటిని ప్రత్యేక సంచుల్లో నింపాలి. తేమ శాతం 17 శాతం మించకుండా కళ్లాల్లో బాగా ఆరబెట్టిన తర్వాత రైతులు ఆ ధాన్యాన్ని పీపీసీకి తీసుకెళ్లాలి. అక్కడి సిబ్బందికి అప్పగించి వారి నుంచి తగు రసీదు పొందాలి. ధాన్యం విలువను నిర్ధారించిన తర్వాత ఎఫ్‌టీవోను తప్పకుండా అడిగి మరీ తీసుకోవాలి. – పి.వెంకటరమణ, జిల్లా మేనేజరు, జిల్లా పౌరసరఫరాల సంస్థ -
త్వరలో పట్టాలపైకి మెట్రో రైలు ప్రాజెక్టు
విశాఖ జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక దృష్టి ఉంది. జిల్లా, నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ క్రమంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధమవుతోంది. రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశాఖ నగరంలో మంచినీటి ఎద్దడి శాశ్వత నివారణకు పక్కా ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో నర్సింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోంది. ఇలా కొత్త కొత్త ప్రాజెక్టులతో త్వరలోనే జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ అందాలి.. అన్ని వర్గాలకూ న్యాయం జరగాలి.. వెరసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో విశాఖ అగ్రస్థానంలో నిలవాలి. అదే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా ఫిర్యాదుల వేదిక అయిన స్పందనలో అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. 11 బృహత్తర పథకాలకు అర్హులను గుర్తించే నవశకం సర్వే కార్యక్రమాన్ని పక్కాగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకు జిల్లాలో జరిగిన యత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని.. నిల్వలు పెంచి వినియోగదారులకు కావలసినంత ఇసుక సరఫరా చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. శనివారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మహరాణిపేట (విశాఖ దక్షిణ): ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల అమలులో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ అన్నారు. స్పందన అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టామన్నారు. ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడానికి ఉద్దేశించిన నవశకం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చురుగ్గా జరుగుతోందని తెలిపారు. విశాఖ సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా పలు అంశాలపై శనివారం ఆయన సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.. మెట్రో రైలుకు ప్రతిపాదనలు సిద్ధం.. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెట్రోరైలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై రూపొందించిన ప్రణాళిక తెరపైకి వచ్చింది. సుమారు 40 మెట్రో స్టేషన్లు నిర్మించి 99 రైళ్లు తిరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేయగా..ఈ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసి మెట్రో రైలుని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఏజెన్సీలో మెడికల్ నర్సింగ్ కళాశాలలు.. పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం. పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోనే 25 ఎకరాల అనువైన స్థలాన్ని గుర్తించాం. ఇటీవలే వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. అరకులో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ యత్నాలు జరుగుతున్నాయి. నగరంలో శాశ్వత మంచినీటి పథకం.. విశాఖ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. భవిష్యత్తులో తలెత్తే నీటిఎద్దడి నుంచి నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం జలాశయం నుంచి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో భారీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఏలేశ్వరం జలాశయం నుంచి 156 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను బట్టి 2.2 నుంచి 2.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు అమర్చుతారు. అవసరమైన ప్రాంతాల్లో పంప్ సెట్స్, సంపులు నిర్మిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రోజూ నీటిని అందించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రోజుకు 10 నుంచి 15 టీఎంసీల నీటిని ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ వాటర్ గ్రిడ్ ద్వారా విశాఖ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకూ ఈ నీటిని అందించనున్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ సెజ్‌కు, తుని మున్సిపాలిటీకి, తూర్పుగోదావరి జిల్లాలోని శివారు గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తారు. విశాఖ జిల్లాలో పైప్‌లైన్ వచ్చాక నక్కపల్లి సెజ్‌కు, నక్కపల్లి, పాయకరావుపేట నగర పంచాయతీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, విశాఖ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు, మహా విశాఖ నగర పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట.. విశాఖలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పెద్ద పీట వేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలను అర్హులకు అందేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రైతు భరోసా, అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేయడం వంటి పనులు విజయవంతంగా చేపట్టాం. ఇప్పడు వైఎస్సార్ మత్స్యకార భరోసా అర్హులైన అందరికీ అందేలా పలు చర్యలు చేపట్టాం. అగ్రిగోల్డ్ బాధితులకు పదివేల రూపాయలలోపు అందడానికి కృషి చేశాం. బాధితులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇసుక కృత్రిమ కొరతపై ఉక్కుపాదం.. జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. వాటిని ఎదుర్కొని అవసరం ఉన్న వారికి ఇసుక అందేలా చర్యలు చేపట్టాం. ఎవరైనా ఇసుక కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా, అక్రమ నిల్వలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక సమస్య విశాఖలో లేకుండా చర్యలు తీసుకున్నాం. స్పందనలో వచ్చే ప్రతి ఆర్జీదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్జీదారుల సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ఓపికతో వింటున్నారు. సీఎం స్ఫూర్తితో విశాఖలో పనిచేస్తున్నాం. ఇదే తరహాలో పనిచేయడం వల్ల విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. చురుగ్గా ఇంటింటి సర్వే కార్యక్రమం.. వైఎస్సార్ నవశకం అమలు కోసం ఇంటింటి సర్వే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. గ్రామం లేదా వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేని వారి పేర్ల నమోదు ఈ ఇంటింటి సర్వే ప్రధాన ఉద్దేశ్యం. పింఛన్‌కు, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యానికి, ఉపకార వేతనాలు, కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది.అలాకాకుండా నవశకం పథకంలో ఉండే ప్రతి పథకానికో కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు..ఇలా నాలుగు రకాల కార్డులను ప్రత్యేకంగా అందజేయనున్నాం. ఉగాదికి పట్టాల పంపిణీ.. ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తాం. ఇప్పటికే స్థలాలు సేకరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులైన పేదలందరికీ పట్టాలు, ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ ధ్యేయం మేరకు పనిచేస్తున్నాం. జనవరి నుంచి పూర్తి స్థాయిలో సచివాలయ వ్యవస్థ.. గతంలో ప్రజలు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చేవారు. కానీ ఇప్పడు గ్రామ సచివాలయం ప్రజల వద్దకు వస్తోంది. ఈ వ్యవస్థ ఎంతో గొప్పది. జనవరి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. అక్కడే అనేక సమస్యలకు పరిష్కారానికి వేదిక అవుతుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి అర్హతల సడలింపు. దాదాపు ప్రతి కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సీఎం ఆశయం మేరకు అధికారులు పనిచేస్తున్నారు. పటిష్టంగా పర్యవేక్షణ.. వైఎస్సార్ నవశకం కార్యక్రమం నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా సాగుతుంది. ఇంటింటి సర్వేతో మొదలై డిసెంబరు 20న లబ్ధిదారులకు కార్డులు అందజేసే వరకూ పటిష్ట కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కార్యక్రమం ఆద్యంతం పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లా స్థాయిలో జిల్లాపరిషత్తు సీఈవో, జాయింట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు–2 పర్యవేక్షిస్తారు. శాఖల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, జీవీఎంసీ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. గ్రామ, వార్డు వలంటీర్లు తాము సర్వే చేసి తీసుకొచ్చిన డేటాను ప్రతి రోజు సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పగిస్తారు. -
భీమిలి ఉత్సవాలకు వడివడిగా ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కలెక్టరేట్లో ఈ నెల 9న జరిగే భీమిలి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి వివిధ శాఖల మధ్య సమన్వయ ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో విశాఖ నెం.1 జిల్లాలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో విశాఖ రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుందని కలెక్టర్ వినయ్‌చంద్ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతుల్లో ప్రస్తుతం 90 శాతం సమస్యలను అధికార యంత్రాంగం పరిష్కరించిందని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా నీటి పారుదల శాఖ నిర్మాణాలు, గ్రామీణ నీటి సరఫరా ట్యాంకులు బలహీన పడినట్లుగా జిల్లా అధికారులు గుర్తించారని చెప్పారు. సమస్యలపై అధికారులతో పరిశీలించి త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
టీడీపీ నేత బరితెగింపు
బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో ఎల్బీ పురానికి చెందిన ప్రభుత్వ భూమిని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆక్రమించాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన సుమారు రూ.15 లక్షల విలువైన పనుల ప్రాంతంలో జేసీబీతో చదును చేయించడంపై పలువురు కూలీలు,రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 109 సర్వే నంబరులో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ భూమిని కొంతమంది ఆక్రమించి అన్యాక్రాంతం చేయడంపై పలువురు కలెక్టర్‌కు, సిట్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు అప్పటి తహసీల్దార్ కె.వి.వి. శివ, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, ఏవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసికుంటామని హెచ్చరిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసికుని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు చేయించారు. ఆరు నెలల కిందట ఇదే భూమిలో రూ.15 లక్షల వ్యయంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వందల మంది కూలీలతో ట్రెంచ్‌లు,భూమి లెవిల్ పనులు చేయించారు. కూలీలు చేసిన పనులకు ఇంకా ఆడిట్ అవలేదని వీఆర్పీ మెల్లి సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆ భూమిని ఆక్రమించుకుని రెండు రోజులుగా జేసీబీతో చదును చేయించాడు. దీంతో గ్రామానికి చెందిన రైతు సంఘ నాయకులు తమరాన శ్రీను,సింహాచలంనాయుడు,గుర్రు రామునాయుడు తదితరులు శనివారం జేసీబీ అడ్డుకుని, వీఆర్వో త్రినాథ్‌కు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఏపీవో, పీడీలకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశం మేరకు వీఆర్వో గ్రామాన్ని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనుల నిలిపివేయాలని తెలిపారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. -
నిధులు ఆవిరి..పారిశుద్ధ్యం కానరాదేమీ..!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసమే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రూ.459 కోట్లు ఖర్చు చేశారు. అవీ తూతూ మంత్రం గా నిర్మించడమే గాక, ఎక్కడా వాటి వెంబడి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇళ్ల మధ్య మురుగునీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. మురుగునీరు పోవడానికి కాలువలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అంటువ్యాధులు, రోగాలు ముసురుతున్నాయి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలైన జన్మభూమి కమిటీల నిర్వాకంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత ఐదేళ్లలో భారీగా నిధులిచ్చినా గ్రామాల్లో పరిస్థితి మారలేదని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శాంపిల్ సర్వే అద్దంపట్టడం గమనార్హం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని, ఇది తమ ఘనతని గత టీడీపీ పాలకులు ప్రతి వేదికపైనా ఊదరగొట్టేవారు. వాస్తవానికి 30 శాతం వరకూ కమీషను మిగుల్చుకోవడానికి కేవలం సీసీ రోడ్లు మాత్రమే తూతూ మంత్రంగా వేసేశారు. కానీ ఇళ్ల మధ్య నుంచి మురుగునీరు పోవడానికి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన నిధుల్లో రూ.459 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. కానీ ఆ స్థాయిలో గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడలేదు. ఇవిగాక గత ఐదేళ్లలో 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం పేరుతోనూ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. జన్మభూమి కమిటీల నిర్వాకం... పేదలైన కూలీలకు సొంత ఊరిలోనే పనులు కల్పిస్తూ మరోవైపు గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలకు మాత్రం కాసుల కక్కుర్తే ప్రధాన ధ్యేయమైంది. చివరకు గ్రామ పంచాయతీల ప్రకారమే అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా తమకు కాసులు కురిపించే పనులనే చేయించారు. సీసీ రోడ్లలో 30 శాతం వరకూ కమీషన్లు రావడంతో వాటికే మొగ్గు చూపించారు. మురుగు కాలువల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎక్కడ పనులు చేశారో వారికే తెలియట్లేదు. టీడీపీ పెద్దల ఒత్తిళ్లతో కొంతమంది అధికారులు కూడా బిల్లులను ఆమోదించేశారు. ఫలితం ఇప్పుడు గ్రామాలు చాలా వరకూ పారిశుద్ధ్యలోపంతో సతమతమవుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడుతున్నారు. -
మాధవి పరిణయ సందడి
గొలుగొండ, కొయ్యూరు: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్‌తో మాధవి వివాహం వేడుక వైభవంగా జరగనుంది. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజుంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల రాకతో గ్రామాలు కళకళలాడాయి. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. -
11 గ్రామాలకు రాకపోకలు బంద్
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉరకగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన శంకరం పంచాయతీకి చేరుకుని బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు..ఎన్టీఆర్ఎఫ్ బృందాలను రప్పించి రేషన్ సరకులు, వైద్య ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో అనకాపల్లి ఆర్డీవో, అధికారులు పాల్గొన్నారు. -
రాకపోకలు బంద్
కొయ్యూరు(పాడేరు): యూ.చీడిపాలెం పంచా యతీ కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో యర్రగొండ ఉంది. యర్రగొండ దాటగానే కాలువ ఉంటుంది. దీనిపై ఎప్పుడో నిర్మాణం చేసిన వంతెన రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కాలువ దాటి అటు తీగలమెట్ట, గంగవరం, నీలవరం, పాలసముద్రం, మర్రిపాకలు, జెర్రిగొంధి వెళ్తారు. ఇప్పుడు ఈ ఆరు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గతంలో ద్విచక్ర వాహనాలు లేదా జీపుల ద్వారా మర్రిపాకల వరకు వెళ్లేందుకు వీలుండేది. ఇప్పుడు నడచి వెళ్లడమే కష్టంగా మారింది. ఇక పలకజీడి నుంచి నీలవరం, గంగవరం వెళ్లేందుకు మార్గం ఉన్నా కాలువను దాటాలి. ఇటీవల కాలువపై చెట్టు కర్రను అడ్డంగా పెట్టి ఉంచారు. దానిపై నుంచి రేషన్ బియ్యం తీసుకువస్తున్న ధర్మయ్య అనే యువకుడు కాలువలో పడిపోయాడు. బియ్యం బస్తాపై ఆయన పడడంతో ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పుడు రేషన్ సరకులను కూడా తీసుకెళ్లే అవకాశం లేదు. వర్షాలు తగ్గితేనే తిరిగి రాకపోకలు పునరుద్ధరించే వీలుంది. ప్రధానంగా కాలువల ఉధృతి తగ్గాల్సి ఉంది. పాడేరు ఐటీడీఏ అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆరు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. -
ఫలితాల సందడి
సాక్షి, విశాఖపట్నం : గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల పోటీపరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. విశాఖపట్నానికి చెందిన సవ్వాన గోపికృష్ణ 118.75 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు. స్టీల్‌ప్లాంట్ ప్రాంతానికి చెందిన పొన్నాడ జ్యోతిర్మయి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులో స్టేట్ ర్యాంకు సాధించింది. స్థానిక జోన్లవారీ ర్యాంకులను ప్రకటించారు. కటాఫ్ మార్కులపై స్పష్టత రావాల్సి ఉంది. శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాలయాలకు పూర్తిస్థాయిలో మెరిట్ జాబితా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 10,872 ఉద్యోగాల కోసం 2,35,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొలువుల కోసం ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ నిర్వహించిన పోటీపరీక్షలకు 2,10,443 మంది హాజరయ్యారు. ఈ అభ్యర్థుల్లో పొరుగు జిల్లాలవారే కాకాండా ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించిన వారు సైతం ఉండటం విశేషం. -
కిలిమంజారో ఎక్కేశాడు
సాక్షి, నక్కపల్లి: రాజయ్యపేటకు చెందిన మత్య్సకార యువకుడు గోసల రాజు దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. 5,895 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పర్వతాన్ని ఈ నెల 5న అధిరోహించినట్లు రాజు తెలిపాడు. ఈ నెల మూడో తేదీన ట్రెక్కింగ్ ప్రారంభించి 5వ తేదీన దిగ్విజయంగా ఎక్కినట్టు పేర్కొన్నాడు. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు. ఇంటర్ వరకూ చదువుకున్న రాజు గతంలో 2018 మే17వ తేదీ ఎవరెస్టు శిఖరం, 2018 సెప్టెంబర్ 18న రష్యాలోని మౌంట్ ఎలబ్రస్, 2019 ఫిబ్రవరి 14న అంకాగ్వా పర్వతాలను కూడా అధిరోహించాడు. హైదరాబాద్‌లో ని ట్రాన్స్‌జెండర్ అడ్వంచర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సాహస యాత్రలు చేస్తున్నట్లు రాజు పేర్కొన్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్ అమెరికాలోని దేనాలిలను అధిరోహించడమే తన లక్ష్యమని ‘సాక్షి’కి చెప్పాడు. -
నిండు కుండల్లా..
రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. రెండురోజులపాటు కురిసిన వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జోలాపుట్ మొదలుకుని తూర్పుగోదావరి జిల్లా పొల్లూరు రిజర్వాయర్ వరకు ప్రస్తుతం నీటి మట్టాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. సాక్షి, సీలేరు: విద్యుత్‌ను నిరంతరం ఉత్పత్తి చేసే జలాశయాల్లో భారీగా నీరు చేరడంతో జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం మినహా అన్నింటిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జోలాపుట్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2,749.25 అడుగుల్లో ప్రమాదస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మరింత నీరు చేరితే రిజర్వాయర్ నిండిపోతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై 20 వేల క్యూసెక్కుల నీటిని బలిమెల రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు. బలిమెల జలాశయంలోకి కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మెల్లమెల్లగా నీరు చేరుతుంది. గత 15 రోజుల కిందట కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌లో భారీగా నీరు చేరింది. దీంతో ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకున్నారు. 1516 అడుగుల నీటి మట్టానికి గాను 1497.01 అడుగుల్లో నీటిమట్టం ఉంది. 19 అడుగుల తేడాతో ఉన్న నీటిమట్టం జోలాపుట్ నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్ 1360 పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 1348 అడుగులకు నీరు చేరింది. దీనికి ఉపనదులైన పిల్లిగెడ్డ నుంచి ప్రస్తుతం వర్షపునీరు చేరుతుంది. దీని దిగువున ఉన్న సీలేరు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గరిష్టస్థాయికి ‘డొంకరాయి’ సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పాలగెడ్డ, వలసగెడ్డ, మంగంపాడు ఉపనదుల నుంచి వస్తున్న వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది. 1037 పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను శనివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు మెయిన్ డ్యాం నుంచి శబరినదిలోకి 10 వేల క్యూసెక్కులును రెండు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో నీటి విడుదల కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం (ఫోర్‌బై) జలవిద్యుత్ కేంద్రంలో మొన్నటి వరకు డొంకరాయి పవర్ కెనాల్ గండి పడడంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నీరు లేక జెన్కో అధికారులు ఇబ్బందులు పడేవారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏవీపీ డ్యాం 930 అడుగుల సామర్ధ్యం అయినప్పటికీ శనివారం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి పవర్ కెనాల్ ద్వారా పొల్లూరు డ్యాంలోకి నీటిని మళ్లిస్తున్నారు. వర్షాలకు అలిమేరు వాగు నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో ఫోర్‌బై జలవిద్యుత్కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నీటి కొరత లేదని, పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సరిపడిన నీరు ఉందని ఏపీ జెన్కో ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ వి.ఎల్ రమేష్ తెలిపారు. కురుస్తున్న వర్షాల కారణంగా నీరు ఎప్పటికప్పుడు చేరుతుండడంతో అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. -
వంద రోజులు..వేల వెలుగులు
సాక్షి, విశాఖ సిటీ: ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ప్రధానం.. ఇదే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నినాదం. రాజన్న రాజ్యం నిజంగా తిరిగి వచ్చిందన్న నమ్మకాన్ని.. ప్రతీ కుటుంబానికి నవరత్నాల వెలుగులు నింపుతానన్న భరోసాని కేవలం వంద రోజుల పాలనలోనే ఆయన కలిగించారు. ముఖ్యంగా జిల్లా పరంగా చూసుకుంటే ‘విశాఖ వికాసమే నా లక్ష్యం’ అన్నట్టుగా ఆయన జిల్లా వాసులపై వరాలు కురిపించారు. పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అనేక ప్రాజెక్ట్‌లను కేటాయించారు. దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. పరిశ్రమలకు చేయూతనిచ్చారు. మరెన్నో సంస్థలకు అండగా నిలిచారు. మొత్తంగా జిల్లా ప్రజలకు ‘నేనున్నా’అంటూ వరాల జల్లు కురిపించారు. తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి గిరిపుత్రులంటే వల్లమాలిన అభిమానం. ఆయన పంథాను కొనసాగిస్తూ గిరిబిడ్డల ఆరోగ్యమే ప్రధానంగా పాడేరు కేంద్రంగా గిరిజన మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఏజెన్సీ వాసులు జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసేందుకు, తమ జేబులు నింపుకునేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్ తవ్వకాల జీవో 97ను తక్షణమే రద్దు చేయించారు. సబ్బవరం కేంద్రంగా మూడు జిల్లాల జీవనాడి...మహానేత వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కమ్ముకున్న నీలినీడలను పటాపంచలు చేస్తూ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేశారు. దాదాపు 40 వేల కుటుంబాల జీవితాలను బాగుచేసే ఉద్దేశంతో రెండున్నర దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సింహచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారు. అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ మొత్తం పెంచి..వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. రోడ్డున పడ్డ దాదాపు వేలాది మంది కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా భీమిలి సమీపంలోని చిట్టివలస జ్యూట్ మిల్లు కార్మికులను ఆదుకున్నారు. వారి సమస్యలను కేవలం 45 రోజుల్లో పరిష్కారించారు. ఇక నగరాభివృద్ధికి కేంద్ర బింధువైన విశాఖపట్నం మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ)కు పునర్జీవం పోశారు. చైర్మన్, కమిషనర్లను తక్షణమే నియమించి సంస్థను గాడిలో పెట్టారు. నగరానికి మరిన్ని సొగబులు అద్దె దిశగా అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇక రైతు, గిరిజన, మత్స్యకార, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కల నెరవేర్చారు. అంగన్వాడీ, ఆశ, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన ‘చరిత్ర’ సృష్టించింది అనడంలో అతిశయోక్తి లేదు. లక్షన్నర మంది మత్స్యకారులకు భరోసా.. సముద్రంలోకి వేటకు వెళితే బతుకులపై భరోసా లేదు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాలకు దిక్కులేదు. ఆదుకునే నాథుడు లేడు. వేట నిషేధ సమయంలో పూట గడిచే పరిస్థితి లేదు. ఇలా మత్స్యకారుల జీవనం అగమ్యగోచరం. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు వరాలు కురిపించింది. నగరంలోని హార్బర్లో ప్రత్యక్షంగా..పరోక్షంగా జీవనం సాగిస్తున్న దాదాపు 20 వేల మందితో పాటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి వలస వచ్చి బతుకుతున్న దాదాపు 7 వేల మందికి, జిల్లాలో ముత్యాలమ్మపాలెం, పరవాడ, పూడిమడక, కొత్త జాలారిపేట, పెదజాలరిపేట, భీమిలి, చేపలుప్పాడ, బంగారమ్మపాలెం, రేవు పోలవరం, తీనార్ల, రాజయ్యపేట ప్రాంతాల్లోని వేలాది మంది మత్స్యకారుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైతే రూ.10లక్షల పరిహారం, వేట నిషేధ కాలంలో గతంలో ఉన్న రూ.4 వేలను రూ.10వేలకు పెంపు, డీజిల్‌పై రాయితీ గతంలో ఉన్న రూ.6.80 ని రూ.12.14 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 132 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలోని 63 మత్స్యకార గ్రామాల్లో నివాసం ఉంటున్న 1.50 లక్షల మంది ఫలం పొందుతారు. వేట నిషేధ సమయంలో దాదాపు 20 వేల మందికి పరిహారం అందనుంది. 40 వేల కుటుంబాలకు సాయం.. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య పరిష్కారం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 40 వేల కుటుంబాలు మేలు పొందుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం జూన్ మొదటివారంలో జరిగిన తొలి కేబినేట్ సమావేశంలో సీఎం మంత్రులతో చర్చించారు. అనంతరం జూలై 17 అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్ భూ సమస్య పరిష్కారం గురించి ప్రశ్న లేవనత్తగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. అదే నెల 26న సమస్య పరిష్కారం కోసం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ త్వరలో పని ప్రారంభిస్తుంది. పోలీసులకు వారాంతపు సంతోషం.. పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరితే కుటుంబంతో గడిపే అవకాశం లేనట్లే. వారాంతపు సంతోషాన్ని విడనాడాల్సిందే. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించారు. పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పోలీసు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లా/నగర వ్యాప్తంగా పోలీసులకు వారంతపు సెలవు అమలవుతుంది. తద్వారా జిల్లాలో 2,500 మంది, నగరంలో 3 వేల మంది పోలీసులు వారంలో ఒకరోజు పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1300 మంది హోంగార్డులకు ఈ సెలవు వర్తించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఆటోవాలాకు ఆనందం.. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు వెంటాడే ఆర్టీఏ కేసులు.. ఇంకోవైపు ఆటో మరమ్మతులు ఇలా ఆటో కార్మికుల కష్టాలకు కొదవలేదు. జిల్లాలో ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ఆటోకార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. దీనిపై ఆలోచన చేసిన సీఎం ఆటో కార్మికులందరితో పాటు సొంత వాహనం కలిగిన ట్యాక్సీ కార్మికులకు కూడా ఏటా రూ.10 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తద్వారా జిల్లాలోని దాదాపు 42 వేల మంది ఆటో కార్మికులు ఈ ప్రతిఫలం పొందనున్నారు. అలాగే మరో 6 వేల మంది ట్యాక్సీవాలాలు ఈ నగదు అందుకోనున్నారు. అందరికీ ఆరోగ్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్ష. అలాంటి దైన్యం నుంచి పేదలను విముక్తి చేసింది డాక్టర్ వైఎస్సార్ పాలన. మళ్లీ ఆ పాలన గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వంద రోజుల పాలనలో ఆరోగ్యశాఖపై ప్రత్యేక కసరత్తు చేశారు. ఆరోగ్యశ్రీకి ఊపిరి పోస్తూ రూ.1000 వైద్య ఖర్చు దాటితే ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొం దించారు. అదే సమయంలో వార్షికాదాయం రూ.40 కాకుండా రూ.5 లక్షలు ఉన్నవారిని ఈ పథకంలోకి ప్రవేశపెట్టారు. దీంతో జిల్లాలో 12,87,187 మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నారు. అంగన్వాడీలకు మరింత లబ్ధి.. అప్పుడు రూ.10,500 వేతనంతో అంగన్వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆ సమయంలో తమకు వేతనాలు పెంచాలని జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. వారి వినతిని పరిశీలించిన ఆయన అధికారంలోకి రాగానే.. అంగన్వాడీలందరికీ రూ.11,500 వేతనం చేస్తూ జీవో జారీ చేశారు. దీనివలన జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 4,952 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 4,786 మంది సిబ్బందికి మేలు జరిగింది. పారిశుధ్య కార్మికుల బతుకులు బాగు.. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. గత ప్రభుత్వాలు కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. వారి ఆలోచనకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ కార్మికులను ఆదుకున్నారు. వారి బతుకుల బాగును కాంక్షిస్తూ హెల్త్ అలవెన్స్‌లను ఇవ్వడంతో పాటు వేతనాలను పెంచారు. అలవెన్స్ కింద రూ.6వేలు ఇవ్వడంతో పాటు వేతనాలను రూ.18 వేలకు పెంచారు. తద్వారా జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో 200 మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. బాక్సైట్ ముప్పు తొలగింది.. టీడీపీ ప్రభుత్వం అక్రమార్జన కోసం జీవో నంబర్ 97 ద్వారా బాక్సైట్ తవ్వకాలకు తెరతీసే ప్రయత్నం చేసింది. అయితే గిరిజనులతో పాటు ప్రజాసంఘాలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా తవ్వకాల కుట్రకు బ్రేక్ వేసింది. కానీ జీవోను రద్దు చేయకుండా ఏజెన్సీ గుండెలపై భారాన్ని అలాగే ఉంచింది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ జీవోను రద్దు చేస్తూ బాక్సైట్ తవ్వకాల ఆలోచనే లేకుండా చేసి గిరిజనులకు భారీ ఊరట కలిగించారు. సుజల స్రవంతికి జీవం.. ఉత్తరాంధ్ర జిల్లాల భూములను సస్యశ్యామలం చేసే కలతో మహానేత డాక్టర్ వైఎస్సార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారు. సబ్బవరం కేంద్రంగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆయన మరణానంతరం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలి బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్‌కు ఊపిరి పోసే దిశగా రూ.170.06 కోట్లు కేటాయించారు. కుల వృత్తిదారులకు వెన్నుదన్ను.. సామాజిక న్యాయం చేస్తూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్ వివిధ కుల వృత్తిదారులకు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచారు. దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఏటా రూ.10 వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 76,667 మంది రజకులు, 38,472 మంది నాయీ బ్రాహ్మణులు, 22,584 మంది దర్జీలు లబ్ధి పొందనున్నారు. గంజాయి రవాణాకు చెక్.. రాష్ట్రంలోనే గంజాయి సాగుకు జిల్లాకు రాకూడని పేరుంది. టీడీపీ హయాంలో గత ఐదేళ్లు జిల్లాలోని ఓ మంత్రే స్వయంగా గంజాయి సాగుకు తనవంతు సహకారం అందించారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంతో పండిన గంజాయి పంట నగరంలో గుప్పుమంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ వంద రోజుల్లో నేరుగా గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపింది. రవాణాపై ఎక్కడిక్కడ నిఘా పెట్టి స్మగ్లర్లకు చెక్ పెట్టారు. సాగు చేయకుండా గిరిజన ప్రాంతాల్లో వీధి నాటికలు, బుర్రకథలు, అవగాహన సదస్సుల ద్వారా చైతన్య పరుస్తున్నారు. తద్వారా గతంలో 10 వేల ఎకరాల్లో ఉన్న గం జాయి సాగును 4 వేల ఎకరాలకు పరిమితం చేశారు. అంతేకాకుం డా దాన్ని కూడా నాశనం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వైఎస్సార్ వైద్య కళాశాల.. మన్యానికి ప్రత్యేకం.. పాడేరు: విశాఖ మన్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వైఎస్సార్ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వైద్య కళాశాల ఏర్పాటుతో గిరిజనుల వైద్యారోగ్య సేవలకు భరోసా లభించనుంది. మన్యానికి ఇప్పటి వరకు వైద్య నిపుణులు అందుబాటులో లేరు. ఏటా గిరిజనులను అనేకమైన ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తహీనత వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించడం లేదు. వైద్యుడిని చూడని గిరిజన పల్లెలు ఎన్నో ఉన్నాయి. రహదారుల సౌకర్యం, రక్షిత మంచినీరు అందుబాటులో లేని వందలాది గిరిజనులు నాటు వైద్యం, సంచి డాక్టర్లపైనే వైద్య సేవలకు ఆధారపడుతున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేయనుండడంతో ఆదివాసీలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వైద్య కళాశాల ఏర్పాటుతో పాడేరు జిల్లా ఆస్పత్రికి అన్ని విభాగాల వైద్య నిపుణులు అందుబాటులోకి రానున్నారు. ఇక గిరిజనులు వైద్య సేవల కోసం కేజీహెచ్ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. సీఎం వైఎస్ జగన్ పాలన అద్భుతం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వందరోజుల పాలన అద్భుతంగా ఉంది. పేద, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగుతోంది. 100 రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ముస్లిం మైనారిటీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులిచ్చి అన్ని కులాలకు సమన్యాయం చేశారు. ఆశ వర్కర్ల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు జీతాలు పెంచి వారికి భరోసా కల్పించారు. ప్రజలంతా వందరోజుల్లో సుఖసంతోషాలతో ఉన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వంద రోజుల పాలన సాగింది. – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ, విశాఖపట్నం చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత పాలన వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. నవరత్న పథకాల హామీలు నెరవేర్చేందుకు ఆయన నిధులు కేటాయించడంతో ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఏర్పడింది. పేదలందరికీ ఏదో ఓ రూపంలో లబ్ధి చేకూర్చడం హర్షించదగ్గ విషయం. – ఎస్.చంద్రశేఖర్, అయ్యప్పనగర్ సంతృప్తినిచ్చిన వందరోజుల పాలన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అవినీతి లేని పాలనకు ప్రాధాన్యమిస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా దోపిడీని అరికట్టేందుకు ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఎంపీగా తాము పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పార్లమెంట్లో ఎన్నో అంశాలపై మాట్లాడేందుకు అవకాశం దక్కింది. ముఖ్యంగా రైల్వే సమస్యలపై సంబంధిత శాఖామంత్రి స్పందించి కోరిన వినతులకు సానుకూలంగా సమాధానాలు పంపించారు. కీలకమైన బిల్లులపై చర్చించేందుకు అవకాశం వచ్చిందంటే అది సీఎం జగన్ చలవే. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలు ఇచ్చిన వినతులకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటున్నాం. ఇచ్చే మాటకు కట్టుబడే వ్యక్తిగా సీఎం జగన్‌కు పేరుందని చెప్పేందుకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ఉదాహరణ. 100 రోజుల పాలనలో ప్రజలకు చేరువవడంతో సంతోషంగా ఉంది. – బి.సత్యవతి, ఎంపీ అనకాపల్లి బాక్సైట్ తవ్వకాల రద్దు..గిరిజనులకు మేలు గత ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన 97 జీవోకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడి ఆదివాసీలకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దుకు నిర్ణయం తీసుకుని గిరిజనులకిచ్చిన హామీను వెంటనే నెరవేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వందరోజుల పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. – గొడ్డేటి మాధవి, ఎంపీ, అరకు -
టీడీపీకి అయ్యన్న సోదరుడు రాజీనామా
-
బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్!
సాక్షి, విశాఖ : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి పుట్టినరోజు నాడే ఆయన సోదరుడు ఝలక్ ఇచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిన విషయం విదితమే. విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. అది కూడా విశాఖ జిల్లాలో నారా లోకష్ పర్యటన వేళ టీడీపీకి షాక్ తగిలినట్లు అయింది. కాగా కొన్నాళ్ల నుంచి ఉప్పూ, నిప్పులా ఉన్న అయ్యన్న అన్నదమ్ముల మధ్య వైరం తీవ్రరూపం దాల్చిన విషయం విదితమే. అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు)ల ఆధిపత్యపోరు అదుపు తప్పడంతో ఇద్దరి మధ్య చాలాకాలంగా మాటలు కూడా లేవు. -
ఆవకాయ స్వీట్...అమెరికాలో హాట్
మామిడికాయ బద్దకు కాస్త ఉప్పూ కారం, ఆవాల పొడి అద్ది.. ఆపై నూనెలో ఈత కొట్టించి.. నలభీమ పాకాన్ని మరిపించే రుచిని సాధించిన గొప్పతనం తెలుగువారిది. అలాంటి ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామం. 70 ఏళ్లుగా తీపి ఆవకాయ తయారు చేస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, అండమాన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం తయారీయే ప్రత్యేకం కల్వటేరు రకానికి చెందిన మామిడి కాయలను మాత్రమే పచ్చడి తయారీకి వినియోగిస్తారు. మే, జూన్ నెలల్లో తూర్పు గోదావరి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి మామిడి కాయల్ని దిగుమతి చేసుకుంటారు. రసాయనాలు వినియోగించకుండా తయారు చేసిన బెల్లాన్ని సేకరిస్తారు. మామిడి కాయ ముక్కల్ని నానబెడతారు. బాగా ఎండబెడతారు. కారం, ఆవ పిండి, బెల్లం దట్టిస్తారు. చివరగా నూనె కలిపి డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. రెండు నెలల పాటు బాగా మగ్గిన తరువాత అమ్మకాలు ప్రారంభిస్తారు. గ్రామంలో హోల్‌సేల్‌గా, ఇతర గ్రామాలకు మోటార్ సైకిళ్లపై వెళ్లి రిటైల్‌గా అమ్మకాలు సాగిస్తారు. 70 ఏళ్లుగా ఇదే వృత్తి హరిపాలెం వాసులు 70 ఏళ్ల క్రితం తీపి ఆవకాయ తయారీనే వృత్తిగా స్వీకరించారు. ఒక్కొక్క కుటుంబం 10 డ్రమ్ముల పచ్చడి తయారు చేస్తుంది. ఏడాది పొడవునా రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు జరుపుతారు. ముఖ్యంగా గ్రామంలో ‘పెంటకోట’, ‘కాండ్రేగుల’ ఇంటిపేరిట గల కుటుంబాలు పచ్చడి తయారీలో సిద్ధహస్తులు. వీళ్లు తయారు చేసే విధానం వల్ల ఏడాది వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. మార్కెట్లో వివిధ బ్రాండ్లలో లభిస్తున్న ఆవకాయ పచ్చడి తయారీకి యంత్రాలను వినియోగిస్తారు. నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతారు. హరిపాలెంలో తయారు చేసే ఆవకాయలో ఎలాంటి రసాయనాలు వినియోగించరు. విదేశాల్లోనూ ఖ్యాతి ఉద్యోగ, వ్యాపార రీత్యా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో స్థిరపడిన చాలామంది హరిపాలెం ఆవకాయ కోసం పరితపిస్తుంటారు. స్వదేశానికి వచి్చ.. తిరిగి వెళ్లే సమయంలో ఇక్కడి నుంచి ఆవకాయ కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. ఇంకొందరికి ఇక్కడి వారు పార్శిళ్ల రూపంలో పంపుతున్నారు. మరోవైపు ఒడిశా, విశాఖ ఏజెన్సీ, పశి్చమ బెంగాల్‌కు చెందిన రిటైల్ వ్యాపారులు ఇక్కడి ఆవకాయ కొనుక్కెళ్లి అక్కడ విక్రయిస్తుంటారు. అండమాన్‌లో స్థిరపడిన హరిపాలెం వాసులు ఏదైనా పనిమీద స్వగ్రామానికి వచి్చనప్పుడు వంద నుంచి రెండొందల కిలోల పచ్చడిని అక్కడ విక్రయించేందుకు తీసుకెళుతుంటారు. ప్రభుత్వ సాయం అందితే.. ప్రతి కుటుంబానికి ఏటా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. నగలు, ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నాం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబానికి రూ.50 వేల చొప్పున బ్యాంకు రుణం ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. – కాండ్రేగుల శ్రీను, తయారీదారు పార్శిళ్లు పంపుతున్నాం హరిపాలెం ఆవకాయకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియాకి కూడా ప్రత్యేక పార్శిళ్లు పంపిస్తున్నాం. అక్కడి నుంచి వచ్చేవారు తమవెంట కచ్చితంగా పచ్చడి తీసుకెళతారు. వారిని చూసేందుకు వెళ్లేవారు కూడా హరిపాలెం ఆవకాయను తీసుకెళుతున్నారు. – బుద్ధ వెంకట సత్యరాము, తయారీదారు -
మరపురాని మహానేత గురుతులు
సాక్షి, విశాఖ సిటీ : మంచితనానికి మరోపేరు..మానవత్వానికి ప్రతిరూపం..చిరునవ్వుకు చిరునామా..తెలుగోడి పౌరుషానికి ప్రతినిధి..అచ్చతెలుగు పంచెకట్టుకు వన్నెతెచ్చిన మగధీరుడు..పేదోడి గుండెచప్పుడు ఇలా ఎన్ని చెప్పుకున్నా ఆ మహనీయుడి కోసమే. వైఎస్సార్..ఈ మూడక్షరాలు తలంపుకొస్తే ఓ రైతన్నకు కొండంత ధైర్యం వస్తుంది..అక్కచెల్లమ్మలకు అన్న అండగా ఉన్నాడన్న భరోసా కలుగుతుం ది.. విద్యార్థి లోకానికి నేనున్నానంటూ పెద్దాయన వెన్నుతట్టి ప్రోత్సహించిన అనుభూతి కలుగుతుంది. పేదోడికి రాజన్న రాజ్యంలో ఉన్నానన్న ధీమా ఏర్పడుతుంది. జిల్లాలో ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు కళ్ల ముందే కదలాడుతాయి. జిల్లా అభివృద్ధికి బాట.. జిల్లాలో 2004–2009 మధ్యలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేనంతగా జిల్లా రూపురేఖలు మార్చేసిన ఘనత వైఎస్సార్‌ది. పెండింగ్ ప్రాజెక్ట్‌లకు పునర్జీవం పోయడం..విశాఖ కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చడం..లక్షలాది మంది సొంతింటి కలను సాకారం చేయడం..పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం..నగరంలో ఉన్న దాదాపు అన్ని పరిశ్రమలకు చేయూతనిచ్చి కార్మికులకు అండగా నిలవడంలో మహానేత తన ముద్ర చూపారు. సాధారణ కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ నగరాన్ని గాజు వాక, మరో 32 పంచాయతీలను విలీనం చేసి 72 వార్డులుగా మార్చి 2005లో జీవీఎంసీగా మార్పు చేశారు. జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్ట్ ద్వారా రూ.1500 కోట్లతో నగరంలో భూగర్భ డ్రైనేజీ చేపట్టారు. భాగ్యనగరానికి దీటుగా శీఘ్ర రవాణ వ్యవస్థ కోసం రూ.456 కోట్లు వెచ్చించి బీఆర్టీఎస్ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. విస్తరణ వైఎస్ చలవే.. ప్రఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరమయ్యే స్థితికి చేరుకున్న దశలో వైఎస్సార్ ఆ ప్రక్రియను సమర్థవంతంగా ఆపగలిగారు. పరిశ్రమకు చేయూతనివ్వడంతో పాటు ఆనాడు కేంద్రంతో పోరాటం చేసి ప్లాంట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. తద్వారా విశాఖ ఉక్కు పరిశ్రము ఉత్పత్తిని రెట్టింపు చేసుకుంది. మూతపడిపోతున్న బీహెచ్ఈఎల్ను బీహెచ్‌పీవీలోకి వీలీనం చేయించారు. అదే స్థితిలో ఉన్న షిప్‌యార్డును నేవీలో విలీనం చేయించారు. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్ విస్తరణకు పునాదులు వేశారు. అచ్యుతాపురంలో ఇండస్ట్రియల్ కారిడార్, భీమిలిలో ఐటీ కారిడార్, పరవాడ ఫార్మాస్యూటికల్ కారిడార్, దువ్వాడ ఐటీ సెజ్ ఇలా ఎన్నో పరిశ్రమలు వైఎస్సార్ పాలనలో విశాఖ సిగలో ఒదిగాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు రూ.100 కోట్లు కేటాయించి అధునాతన టెర్మినల్ నిర్మాణం జరిపించారు. మూడున్నర లక్షల మందికి గూడు.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,56,115 మందికి సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌ది. ఐదేళ్ల పాలనలో సాచురేషన్ పద్ధతిలో పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలతో పనిలేకుండా కేవలం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రజలకు ఇళ్లు కట్టించారు. నగరంలో కూడా పునరావాస, పూర్‌సెటిల్‌మెంట్ కాలనీలను నిర్మించారు. ఇలా నగరంలో దాదాపు లక్ష మందికి సొంత గూడు కల్పించారు. అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ.. వైఎస్సార్ అధికారం చేపట్టడానికి ముందు డ్వాక్రా రుణాలకు 14 శాతం వడ్డీ వసూలు చేసేవారు. వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో వడ్డీ శాతాన్ని 4 శాతానికి(పావలా) తగ్గించి మహిళల జీవీతాల్లో వెలుగులు నింపారు. ఆయన పాలించిన ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1000 కోట్లకు పైగా పావలా వడ్డీ రుణాలను డ్వాక్రా మహిళలు పొందారు. గోదావరి నీరు మళ్లింపు.. గోదావరి నీటిని విశాఖతో పాటు ఉత్తరాంధ్ర తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే సంకల్పంతో పోలవరం ఎడమకాలువను నిర్మించారు. తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం ప్రాజెక్టుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఏలేరు నీటిని మళ్లింంచి స్టీల్‌ప్లాంట్ నీటి సమస్యను తీర్చారు. సబ్బవరం కేంద్రంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిపై తరువాత పాలకులు శ్రద్ధ వహించలేదు. కానీ తాజాగా వైఎస్సార్ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పూర్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. బడ్జెట్లో రూ.170.06 కోట్లు కేటాయించింది. ఉచిత విద్యుత్ వెలుగులు.. జిల్లా వ్యాప్తంగా 25 వేల వ్యవసాయ సర్వీసులకు ఇప్పటికీ ఉచిత విద్యుత్ అందుతుంది అంటే అది కేవలం వైఎస్సార్ చలవే. రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో 17 జిల్లాల పరిధిలో 77.55 లక్షల మంది రైతులకు రూ.1200 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. మాఫీ వర్తించని జిల్లాలోని 55 వేల మంది రైతులకు రూ.5 చొప్పున ప్రోత్సాహకం అందించి అండగా నిలిచారు. చెదరని జ్ఞాపకం వైఎస్సార్.. అక్కయ్యపాలెం: ప్రజల అవసరాలు, సంక్షేమం కోసం శ్రమించే నాయకుడు ఎన్నటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. దానికి సజీవ సాక్ష్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. మహానేత ఈ లోకాన్ని విడిచి దశాబ్దం గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో చెక్కుచెదరలేదు. ఆ మహానేతను దేవుడిలా పూజించే వారు ఎందరో ఉన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్పాహారం పంపిణీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ పార్లమెంట్ కార్యదర్శి కొణతాల రేవతీరావు ఆదివారం అక్కయ్యపాలెం మెయిన్ రోడ్లో 500 మంది రోజువారి కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. మహానేత చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేమని, వైఎస్సార్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇండియన్ జిమ్ రాజేష్, ఆర్పీలు, వలంటీర్లు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సంజీవనిలా ఆదుకుంది.. ఆరోగ్యశ్రీ పథకం నా కుటుంబాన్ని ఆదుకుంది. పెయింటింగ్ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంటున్న సమయంలో నా కుమార్తె షకీలాకు గుండెకు సంబంధించిన అనారోగ్యం చేసింది. నర్సు ఇచ్చిన సలహాతో ఆరోగ్యశ్రీ మా కుటుంబాన్ని సంజీవనిలా ఆదుకుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా కేర్ ఆస్పత్రిలో నా పాపకు ఆపరేషన్ చేయింగలిగాను. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. – షేక్ మదీనా, పెయింటర్, సీతంపేట మది మదిలో రాజన్న.. కొయ్యూరు (పాడేరు): అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2005లో మన్యంలో ఎక్కువగా చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. మన్యంలో వందకుపైగా డ్యాంలను ఇస్తే పాడేరు నియోజకవర్గంలో 50కు పైగా కొత్త చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. దీని తరువాత జలాశయాలకు నిధులు ఇచ్చారు. దీని మూలంగా రైతుల పొలాలకు నీరు చేరింది. ఒక్క కొయ్యూరు మండలంలోనే 20కిపైగా చెక్‌డ్యాంలను నిర్మాణం చేశారు. దీంతో వర్షాధారంపై ఉన్న భూములకు నీరు వస్తుంది. కాట్రగెడ్డ, ఆకులపాడు, పోతవరం, గంగవరం, తీగలమెట్టతో పాటు అనేకచోట్ల చెక్‌డ్యాంలను నిర్మాణం చేశారు.అంతవరకు కొత్తగా చెక్‌డ్యాంలను నిర్మాణం చేయాలని ఎవరూ నిర్ణయించలేదు. రైతు క్షేమాన్ని ఆశించిన నాటి ముఖ్యమంత్రి మూలంగా కొన్నిచోట్ల రైతులు చెక్‌డ్యాంల మూలంగా పంటలను పండించుకోగలుగుతున్నారు. వాటిని నిర్మాణం చేసి 14 సంవత్సరాలు కావడంతో కొన్నిచోట్ల చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వాటికి నిధులు వస్తే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. చెరకు రైతుకు వెన్నుదన్నుగా... అనకాపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అనకాపల్లి అంటే ఎంతో మక్కువ. ఈ ప్రాంతంలోని ప్రధాన పంట అయిన చెరకు, చెరకు ఉత్పత్తులైన పంచదార, బెల్లం పండించే రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాజకీయ లబ్ది కోసం తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని టీడీపీ నేతలు వాడుకోవడంతో పాటు 2002లో ఈ కర్మాగారాన్ని మూసివేశారు. వైఎస్ హయాంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని నిధులు మంజూరు చేసి తెరి పించారు. బెల్లం రైతులకు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతులు చేసిన ఉద్యమానికి వైఎస్ మద్దతుగా నిలిచారు. వ్యవసాయ పంటలకు సాగునీటి వనరైన శారదాలో గ్రోయిన్లు, ఆనకట్టల నిర్మాణానికి అప్పట్లోనే రూ.22 కోట్లు మంజూరు చేశారు. గూడు లేని నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప, శంకరంలో రూ.32 కోట్లతో సమగ్ర మురుగు అభివృద్ధి పథకం, రూ.30 కోట్లతో సంపత్పురంలో మెగా రిజర్వాయర్‌తో పాటు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందించిన వైనాన్ని ఇక్కడి వాసులు గుర్తు చేసుకుంటారు. బెల్లంరైతుకు తీపి పంచారు.. మునగపాక (యలమంచిలి): మహానేత రాజశేఖరరెడ్డితో మునగపాక ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేత హోదాలో మునగపాక వచ్చిన రాజన్న స్థానిక రైతుల కష్టాలు అడిగి తెలుసుకోవడంతో పాటు బెల్లం తయారీ పరిశీలించిన సంఘటన ఉంది. ఏప్రిల్ 2002లో ప్రతిపక్ష నేత హోదాలో పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా అనకాపల్లిలో జరిగిన మహిళా సదస్సుకు రాజశేఖరరెడ్డి వెళుతున్న సందర్భంలో మార్గమధ్యలో మునగపాకలోని ఆడారి పోలయ్య క్రషర్ వద్ద కొంతసేపు ఆగారు. రైతులు తయారు చేస్తున్న బెల్లాన్ని ఆసక్తిగా తిలకించడంతో పాటు రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను రైతు పోలయ్య ఈ సందర్భంగా రాజన్న దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులతో పాటు బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే రైతులకు మెరుగైన సేవలందిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు వ్యవసాయ రంగానికి 7గంటల పాటు ఏకధాటిగా విద్యుత్ సరఫరాతోపాటు బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించారు. రాజన్న సేవలు ఎన్నటికీ మరువలేం.. ఇచ్చిన మాట తప్పని నాయకుడంటే రాజన్న నే చెప్పుకోవాలి. తమ కష్టాలు నేరుగా తెలుసుకున్న రాజన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. రైతు పక్షపాతిగా రాజన్న నిలిచారు. రాజన్న ఇచ్చిన హామీలు అమలు జరగడంతోపాటు రైతులకు మేలు జరిగేలా పాలన అందించారు. రాజన్న సేవలను ఎప్పటికీ మరువలేం. – ఆడారి పోలయ్య, రైతు, మునగపాక -
వైఎస్సార్ సీపీలోకి భారీ చేరికలు
జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు, కృషి ఆస్పత్రి చైర్మన్, డెయిరీ ట్రస్ట్ సీఈవో ఆడారి ఆనంద్, డెయిరీ డైరెక్టర్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి సహా పలువురు నాయకులు అమరావతిలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. సాక్షి, అనకాపల్లి: విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్లైంది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు, కృషి ఆస్పత్రి చైర్మన్, డెయిరీ ట్రస్ట్ సీఈవో ఆడారి ఆనంద్, డెయిరీ డైరెక్టర్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారితో సహా పలువురు నాయకులు అమరావతిలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఆనంద్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దశాబ్దాల కాలంగా టీడీపీలో కొనసాగిన ఆనంద్ కుటుంబసభ్యులు, డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్సీపీలో చేరారు. వీరితోపాటు విశాఖ డెయిరీ డైరెక్టర్లు మలసాల రమణరావు (కశింకోట మండలం), గేదెల సత్యనారాయణ (బుచ్చెయ్యపేట మండలం), దాడి గంగరాజు (చోడవరం), శీరంరెడ్డి సూర్యనారాయణ (చీడికాడ మండలం), సుందరపు గంగాధర్ (కె.కోటపాడు), శరగడం శంకరరావు (పెందుర్తి), రెడ్డి రామకష్ణ (పాయకరావుపేట), చిటికల రాజకుమారి(నర్సీపట్నం), గౌరీశంకర్ (యలమంచిలి), కోళ్ల కాటమయ్య(ఎస్.కోట), ఆరంగి రమణబాబు (అచ్చెర్ల), శీరంరెడ్డి సూర్యనారాయణ (నర్సీపట్నం) తదితర డైరెక్టర్లు వైఎస్సార్సీపీలో చేరినవారిలో ఉన్నారు. రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శరగడం చినఅప్పలనాయుడు, మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను), జి.వి.తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి నుంచి.. : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన వారిలో యలమంచిలికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆడారి శ్రీధర్, ఊటకూటి రమేష్, గొంతిన హరీష్, నగిరెడ్డి కాసుబాబు ఉన్నారు. చోడవరం నుంచి..: గోవాడ చక్కెర కర్మాగారం మాజీ చైర్మన్ దొండా కన్నబాబు, మాజీ ఎంపీపీ పినపోలు వెంకటేశ్వరరావు, బుచ్చెయ్యపేట మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దాడి సూర్యనాగేశ్వరరావు, సూరిశెట్టి రామ సత్యనారాయణవైఎస్ఆర్సీపీలో చేరారు. ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ చేరిక.. ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ సొంత గూటికి తిరిగి చేరారు. బొడ్డేడ ప్రసాద్‌తోపాటు వైఎస్సార్సీపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి అప్పారావు కూడా తిరిగి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి మరింత బలం: మంత్రి అవంతి విశాఖ డెయిరీ డైరెక్టర్లంతా వైఎస్సార్సీపీలో చేరడంతో జిల్లాలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెయిరీ పరిధిలోని రైతులకు అండగా ఉండి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో డెయిరీ డైరెక్టర్లంతా వైఎస్సార్సీపీలో చేరారన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైందని, రానున్న కాలంలో మరికొంతమంది ముఖ్యనేతలు వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతు పక్షపాతి జగన్: ఆడారి ఆనంద్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణ, ప్రేమ చూసి తాము వైఎస్సార్సీపీలో చేరామని కృషి ఆస్పత్రి చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు. జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. విశాఖ డెయిరీ సంక్షేమం కోసం తాము వైఎస్సార్సీపీలో చేరామన్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన నాయకత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని భావించి తాము వైఎస్సార్సీపీలో చేరామన్నారు. విశాఖ డెయిరీ పరిధిలోని మూడు జిల్లాలకు చెందిన రెండున్నర లక్షల కుటుంబాలకు జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారని ఆనంద్ చెప్పారు. డెయిరీ డైరెక్టర్లందరూ సంపూర్ణంగా వైఎస్సార్సీపీలో చేరడం వెనుక రైతులకు న్యాయం చేయాలనే ధృక్పథం ఉందన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. -
అందరికీ పరీక్ష..
సాక్షి, విశాఖపట్నం: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొలువులకు సంబంధించిన పరీక్షలకు తెరలేచింది. 19 కేటగిరీల్లో కల్లా అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలకు.. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు.. అత్య ధిక కేంద్రాల్లో ఆదివారమే పరీక్ష రాయనున్నారు. దీంతో అధికారులకూ ఇదో పరీక్షగా మారింది. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ, జడ్పీ సీఈవో బీవీ రమణమూర్తి తదితర ఉన్నతాధికారులంతా ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో కొద్దిరోజులుగా తలమునకలై ఉన్నారు. అభ్యర్థులు కూడా ప్రభుత్వ కొలువు దక్కించుకునేందుకు ఇన్నాళ్లూ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా స్వీయ ప్రతిభనే నమ్ముకొని ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు. పారితోషికం రూ.1.18 కోట్లు విడుదల... తొలిరోజైన ఆదివారం మొత్తం 10,200 మంది అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బంది పరీక్షల నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. వారికి పారితోషికం కూడా అదే రోజు చెల్లించేందుకు రూ.1.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని చీఫ్ సూపరింటెండెంట్లకు శనివారమే అందజేశారు. ఆదివారం ఉదయం 35 మంది, మధ్యాహ్నం 11 మంది క్లస్టర్ అధికారులుగా వ్యవహరించనున్నారు. అలాగే రూట్ అధికారులుగా ఉదయం 132 మంది, మధ్యాహ్నం 27 మంది, సెంటర్ ప్రత్యేకాధికారులుగా ఉదయం 406 మంది, మధ్యాహ్నం 46 మంది, చీఫ్ సూపరింటెండెంట్లుగా ఉదయం 406 మంది, మధ్యాహ్నం 46 మంది, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లుగా ఉదయం 226 మంది, మధ్యాహ్నం 57 మంది, హాల్ సూపరింటెండెంట్లుగా 1,439 మంది, మధ్యాహ్నం 300 మంది వ్యవహరించనున్నారు. ఇక ఇన్విజిలేటర్ల విషయానికొస్తే ఉదయం 6,325 మందిని, మధ్యాహ్నం 1,218 మందిని నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి నుంచి కార్యాచరణ ప్రారంభించనున్నాయి. వాటి ద్వారా ప్రజలకు చేరువలోనే వివిధ రకాలైన సేవలు అందించేందుకు వీలుగా జిల్లాలో 19 కేటగిరీల్లో మొత్తం 10,872 మంది ఉద్యోగులను నియమించ నున్నారు. ఈ కొలువులను దక్కించుకునేందుకు మొత్తం 2,35,614 మంది పోటీపడుతున్నారు. జిల్లాలోని 39 మండలాల్లో ఉన్న 925 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుకానున్న గ్రామ సచివాలయాల్లో 7,789 పోస్టులు, అలాగే మహావిశాఖ నగరపాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయాలకు 3,083 పోస్టులు ఉన్నాయి. తొలిరోజే కీలకం... తొలిరోజైన ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 5) 404 పోస్టులు, మహిళా పోలీసు, వార్డు సంక్షేమం–విద్యా కార్యదర్శి 1281 పోస్టులు, వార్డు పరిపాలనా కార్యదర్శి 452 పోస్టులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 739 కలిపి మొత్తం 2,876 మంది పోస్టులకు మొత్తం 1,31,817 మంది పరీక్ష రాయనున్నారు. వారి కోసం 406 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలా గే మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 6) డిజి టల్ అసిస్టెంట్ 739 పోస్టులకు సంబంధించి మరో 27,775 మంది పరీక్ష రాయనున్నారు. వారి కోసం 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు రెండు పూటలా కలిపి మొత్తం 1,59,592 మంది పరీక్ష రాయనున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఈ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లకు చేరిన మెటీరియల్... జిల్లాలో 406 పరీక్షా కేంద్రాలకు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటలకల్లా ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర మెటీరియల్ అంతా అందే ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రమైన విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన స్ట్రాంగ్ రూమ్ నుంచి శనివారం ఉదయమే 43 ప్రత్యేక వాహనాల్లో పోలీసు భద్రత మధ్య మెటీరియల్ చేరవేశారు. జిల్లాలోని 35 క్లస్టర్లవారీగా క్లస్టర్‌కు ఒకటి చొప్పున పోలీసుస్టేషన్‌ను స్ట్రాంగ్‌రూమ్‌గా ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 11 స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. చంద్రంపాలెంలో 755 మంది దివ్యాంగులు.. రాష్ట్రంలోనే పెద్ద పాఠశాల అయిన చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో 755 మంది దివ్యాంగులు ఉన్నారు. కాగా 65 శాతం వికలాంగత్వం దాటిన 94 మందికి సహాయకులు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించారు. వీరు పరీక్ష రాయడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 3800 మందితో బందో‘మస్తు’ గ్రామ సచివాలయ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ట్రాఫిక్ పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. -ఈ పరీక్షల కోసం నగరంలో 266 సెంటర్లను ఏర్పాటు చేయగా.. సుమారు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 800 మంది ట్రాఫిక్ పోలీసులు విధులకు సిద్ధమయ్యారు. -శనివారం సాయంత్రానికే పరీక్షాపత్రాలు నగరంలోని క్లస్టర్లకు చేరుకున్నాయి. వీటిని ఆదివారం ఉదయం పరీక్షా కేంద్రాలకు పటిష్టమైన బందోబస్తుతో చేరవేస్తారు. -పరీక్షా కేంద్రంలో 200 మంది అభ్యర్థులుంటే వారికి బందోబస్తుగా నలుగురు పోలీసుల్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉన్న సెంటర్లలో 8 మంది వరకు పోలీసులు విధులకు సిద్ధమయ్యారు. -ప్రతి పరీక్షాకేంద్రం వద్దా ఒక హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేలా ప్రణాళిక రూపొందించారు. -నిషేధిత వస్తువుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా తనిఖీలు నిర్వర్తిస్తారు. -నగరంలోని సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పరీక్షా కేంద్రాల్లో సీఐలు, ఎస్ఐలతో పాటు సబ్‌డివిజన్ ఏసీపీలు కూడా వారి పరిధిలోని కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తారు. -పరీక్షా కేంద్రాల అడ్రస్ తెలియకపోవడం, ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డెస్క్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా పరిధిలో... విశాఖ జిల్లా పరిధిలో 140 సెంటర్లను ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తుకు సిద్ధమయ్యారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 400 లోపు ఉంటే ఒక హెడ్ కానిస్టేబు ల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ బందోబస్తు నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా పరిధిలో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పరీక్షలు జరుగుతున్నాయి. మహిళా అభ్యర్థుల్ని తనిఖీ చేసేందుకు అంగన్వాడీ టీచర్ల సాయం తీసుకోనున్నారు. 105 ప్రత్యేక బస్సులు: డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): గ్రామ సచివాలయ పరీక్షలకు ఏపీఎస్ఆర్టీసీ 105 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఇవి కాకుండా రెగ్యులర్‌గా నడిచే 800 బస్సులు కూడా ఆయా రూట్లలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల వద్ద ఆపనున్నారు. నగర పరిధిలో దాదాపు 60 మంది అధికారులు పర్యవేక్షించనున్నారు. పాయింట్ల వద్దే వివరాలు... బస్సుల రూట్ల వివరాలకు సంబంధించి ద్వారకా బస్‌స్టేషన్ మేనేజర్‌ను (99592 25602) సంప్రదించవచ్చు. బస్సుల సమయాలు, సెంటర్ వివరాలను 222 పా యింట్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, మ ద్దిలపాలెం, ఎన్ఏడీ జంక్షన్, గాజువాక 400 పాయింట్, గాజువాక 600 పాయిం ట్, అనకాపల్లి, చోడవరం, యలమంచలి, నర్సీపట్నం, పాడేరు ట్రాఫిక్ పాయింట్లలో గల హెల్ప్ డెస్క్‌ల్లో తెలుసుకోవచ్చు. డిపో మేనేజర్ల నంబర్లు... మద్దిలపాలెం: 99592 25597, వాల్తేరు: 99592 25590 గాజువాక: 99592 25591, కూర్మన్నపాలెం: 99592 25593 సింహాచలం: 99592 25592, పాడేరు: 94406 28092 నర్సీపట్నం: 99592 25596, విశాఖపట్నం: 99592 25594 అనకాపల్లి–99592 25595, మధురవాడ: 89782 00455 ఏటీఎమ్/ఆర్టీసీ కాంప్లెక్స్: 91001 09731 ప్రత్యేక బస్సులు నడిచే ప్రాంతాలు.. -ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వయా పెందుర్తి మీదుగా ఆనందపురం వరకు 5 బస్సులు (ఉదయం 7.30 నుంచి 8.30 వరకు) -పెందుర్తి నుంచి ఆనందపురం వరకు 11 బస్సులు(ఉదయం 8 నుంచి 9) -నర్సీపట్నం నుంచి చింతపల్లికి 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -పాడేరు నుంచి చింతపల్లికి 3 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -అనకాపల్లి నుంచి దేవరాపల్లికి 2 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -గాజువాక నుంచి పెదగంట్యాడకు 3 బస్సులు(ఉదయం 8 నుంచి 9) -ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అప్పుఘర్‌కు(వయా ఏయూ) 6 బస్సులు(ఉదయం 7 నుంచి 9) -పాత గాజువాక నుంచి దువ్వాడకు 5 బస్సులు(ఉదయం 6.30 నుంచి 8.30) -మద్దిలపాలెం నుంచి పాత గాజువాకకు 10 బస్సులు(ఉదయం 7 నుంచి 9) -పాత గాజువాక నుంచి అచ్యుతాపురం/యలమంచిలి వరకు 10 బస్సులు (ఉదయం 6.30 నుంచి 8.30) -పాత గాజువాక నుంచి బెహరకు 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొమ్మాదికి 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -ఎన్ఏడీ నుంచి కె.కోటపాడుకు 4 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -విశాఖపట్నం నుంచి అరకు ఒక బస్సు(ఉదయం 4.30 గంటలకు) -ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తగరపువలసకు 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాకమర్రికి 5 బస్సులు(ఉదయం 7.30 నుంచి 8.30) -ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భీమిలి వరకు 10 బస్సులు (ఉదయం 7.30 నుంచి 8.30) -ఎన్ఏడీ కొత్తరోడ్డు నుంచి పెందుర్తికి 5 బస్సులు (ఉదయం 7.30 నుంచి 9 ) -
ప్రతిభే కొలమానం
సాక్షి, విశాఖపట్నం: పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఇవి. అభ్యర్థి ప్రతిభ ఆధారంగానే ర్యాంకు నిర్ణయమవుతుంది. ఆ ర్యాంకు బట్టే ఉద్యోగం భర్తీ జరుగుతుంది. అంతేతప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు. ఇది పూర్తిగా పోటీ పరీక్ష. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. బయట అనవసర ప్రచారాలు నమ్మవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. పూర్తి పారదర్శకంగా పరీక్షలు.. ప్రతీ ప్రశ్నాపత్రం నాలుగు సెట్లుగా ఉంటుంది. ఎక్కడా కాపీయింగ్‌కు అవకాశం ఉండదు. ఇవి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇవి పోటీపరీక్షలు కాబట్టి అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైనదే. మాల్‌ప్రాక్టీస్ వంటి అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దు. అది నేరమవుతుంది. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అనవసరంగా భవిష్యత్తు పాడుచేసుకోవద్దు. చక్కగా చదువుకొని పరీక్షల్లో ప్రతిభ చూపించండి. అడిగిన ప్రశ్నకు జవాబు రాయండి. మైనస్ మార్కులు ఉన్నాయి గమనించండి. కేంద్రానికి ముందుగానే చేరుకోండి.. ఇది పోటీ పరీక్ష కాబట్టి అభ్యర్థులంతా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఉదయం 7.30 నుంచి 8 గంటలకల్లా చేరుకుంటే మంచిది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ 8 గంటల నుంచి పరీక్ష కేంద్రం గేటు తెరుస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు లోపలికి వెళ్లవచ్చు. ఏ హాల్లో ఏయే రోల్ నంబర్లు కేటాయించారో అక్కడ నోటీసు బోర్డులో వివరాలు ఉంటాయి. ముందుగానే చూసుకుంటే తనకు సంబంధించిన హాల్ ఎక్కడుందీ తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ లోపలకు అనుమతించరు. అందుకే సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి అభ్యర్థులంతా ప్రయత్నించాలి. అందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే అర్బన్ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల జాబితాను ఆటోడ్రైవర్ల అసోసియేషన్లకు ఇచ్చాం. అభ్యర్థులకు సహకరించాలని ఆటోడ్రైవర్లను కోరాం. బస్సు లేదా ఆటో ఏదైనా ఏదైనా సరే పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరండి. కొంతమంది ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం పరీక్ష రాసిన కేంద్రాన్నే రెండో పూట పరీక్షకూ కేటాయించాం. కానీ ఉదయం పూట కన్నా మధ్యాహ్నం అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి పరీక్ష హాల్, సీటింగ్ మారుతుంది. 12.30 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి. 2 గంటలకల్లా తమకు కేటాయించిన హాల్ ఎక్కడుందో చూసుకొని వెళ్లండి. -ఇతర జిల్లాల నుంచి కూడా పరీక్ష రాయడానికి వస్తున్నారు కాబట్టి పరీక్ష తేదీకి ముందురోజే ఒకసారి పరీక్ష కేంద్రానికి వెళ్లి సరిచూసుకుంటే ఇంకా మంచిది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు.. ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగేవన్నీ వోఎంఆర్ ఆధారిత పరీక్షలే. ప్రశ్నాపత్రంతో పాటు వోఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చదివి జవాబులను వోఎంఆర్ షీట్లో నింపాలి. ఆప్షన్లు నాలుగింటిలో సరైనదాన్ని బాల్‌పాయింట్ పెన్ (బ్లాక్/బ్లూ)తో మాత్రమే నింపాలి. జెల్ పెన్, ఇంక్ పెన్, పెన్సిల్ ఎట్టి పరిస్థితిలోనూ వాడవద్దు. పరీక్ష ప్రారంభించడానికి ముందు అందరూ కచ్చితంగా ప్రశ్నాపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్‌పై ఉన్న సూచనలను తప్పకుండా క్షుణ్నంగా చదవాలి. సాయంత్రానికల్లా ‘కీ’... పరీక్ష పూర్తయిన తర్వాత ఒరిజినల్ ఓఎంఆర్ ఇన్విజిలేటర్‌కు అప్పగించి నకలు (రెండో కాపీ) అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. ప్రశ్నాపత్రం తెచ్చుకోవచ్చు. ఏరోజు పరీక్షది ఆ రోజు సాయంత్రమే ప్రభుత్వం ‘కీ’ విడుదల చేస్తుం ది. అభ్యర్థులు దాన్ని గమనించి ఎన్ని మార్కులు వస్తాయో చూసుకోవచ్చు. పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయనడానికి ఇదే నిదర్శనం. మొబైల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వద్దు.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోను తేవద్దు. ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులేవీ పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఎవరైనా ఫోన్, మెటీరియల్, ఇతరత్రా పుస్తకాలు తెస్తే ఒక బ్యాగ్‌లో పెట్టి భద్రపరచుకోవడానికి పరీక్ష కేంద్రంలో ఒక గది ఉంటుంది. అయితే తమ వస్తువుల బాధ్యత అభ్యర్థులదే. అందుబాటులో వైద్యం శిబిరం.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం (మెడికల్ క్యాంప్) పెడుతున్నాం. ఇద్దరు ఏఎన్ఎంలు, ప్ర థమ చికిత్స కిట్, మందులు ఉంటాయి. 108 అంబులెన్స్‌లను అలెర్ట్ చేసి ఉంచాం. పరీక్ష కేం ద్రంలో మంచినీరు ఏర్పాటు చేశాం. టాయిలె ట్స్ సౌకర్యం ఉంటుంది. పరిశుభ్రంగా ఉంచేం దుకు పారిశుద్ధ్య కార్మికులను ఉంచుతున్నాం. గట్టి పోలీసు భద్రత.. పరీక్షలన్నీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను సిబ్బంది, అధికారులందరికీ ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే పూర్తి అయ్యింది. శనివారం జిల్లాలో కేటా యించిన పోలీసుస్టేషన్లకు మెటీరియల్ చేరుతుంది. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు గట్టిపోలీసు భద్రతతో పంపిస్తాం. ఎక్కడా ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. పరీక్షా నిర్వాహకుల జాబితాలు బయటకు వచ్చాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయనే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్విజిలేటర్లకు కూడా తమను ఏ సెంటర్లకు కేటాయించిందీ ముందు రోజు మధ్యాహ్నం అదీ రహస్యంగా తెలియజేస్తారు. ఏ హాల్ కేటాయిస్తున్నదీ పరీక్ష రోజు ఉదయం 7.30 గంటలకు మాత్రమే సమాచారం ఇస్తారు. అందుకు సంబంధించిన జాబితాలన్నీ సీల్డ్ కవర్లో భద్రంగా ఉన్నాయి. బయటకు ఎలాంటి లీకేజీ జరగలేదు. గుర్తింపు కార్డు ఉంటే మంచిది... హాల్‌టికెట్‌లో కొంతమంది పేరు తప్పుగా వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఆ హాల్‌టికెట్‌పై ఫొటో ఆధారంగానే పరీక్షాహాల్లోకి అనుమతి ఇస్తారు. ఎందుకైనా మంచిది అభ్యర్థులు తమ వెంట ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డులు ఏవైనా వెంట తెచ్చుకుంటే మంచిది. హాల్‌టికెట్‌లో ఏమైనా తప్పులు దొర్లితే సరిచూసుకోవడానికి మాత్రమే ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయి. ఏదేమైనా హాల్‌టికెట్ మాత్రం వెంటతెచ్చుకోవడం మరచిపోవద్దు. అది లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతించరు. -
సవతే హంతకురాలు
సాక్షి, అరకులోయ: అరకులోయలో సమీపంలో శనివారం జరిగిన కిల్లో పుష్ప హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహేష్ మొదటి భార్యే ఈ హత్య చేసినట్టు పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహేష్‌కు కిల్లో పుష్ప రెండో భార్య. మహేష్, రాజేశ్వరి ప్రేమించుకుని 2014లో వివాహం చేసుకున్నారు. అయితే చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్పను మహేష్ రెండో పెళ్లి చేసుకుని, ఈనెల 1న అరకులోయ ‘సి’ కాలనీలో వేరే కాపురం పెట్టాడు. మొదటి భార్య రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక రాజేశ్వరి, రెండో భార్యగా వచ్చిన కిల్లో పుష్పపై కక్ష పెంచుకుంది. ఈనెల 23వతేదీ రాత్రి 9గంటల సమయంలో భర్త మహేష్‌కు ఆరోగ్యం బాగోలేదని నమ్మించి, సి కాలనీలో ఉన్న పుష్పను శరభగుడలో ఉన్న తన ఇంటి వైపునకు రాజేశ్వరి తీసుకెళ్లింది. ఆ మార్గంలోని నీలగిరి తోటల వద్ద పుష్పపై దాడి చేసి,ఆమె చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ చెప్పారు.పుష్పను హత్య చేసిన రాజేశ్వరి...లైంగికదాడిగా నమ్మించే ప్రయత్నంలో ఆమె శరీరంపై దుస్తులు తొలగించిందని తెలిపారు. పుష్పపై లైంగికదాడి జరగలేదని,రెండవ భార్యగా వచ్చిందనే కోపంతోనే పుష్పను, మహేష్ మొదటి భార్య రాజేశ్వరి హత్య చేసిందని డీఎస్పీ తెలిపారు. గిరిజన మహిళ అయిన కిల్లో పుష్పను హత్యచేసిన రాజేశ్వరి గిరిజనేతర మహిళ కావడంతో ఆమెపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి,అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని, ప్రాథమిక దర్యాప్తులో రాజేశ్వరి మొదటి నిందితురాలిగా గుర్తించామని, విచారణ పూర్తయిన వెంటనే ఈకేసులో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో హత్యకు గురైన గిరిజన మహిళ కిల్లో పుష్ప కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో అరకు సీఐ,ఎస్ఐలు పైడయ్య,అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
బడుగులకు బాసట
రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలిచింది. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించింది.ఎస్సీలో మెజారిటీ సామాజిక వర్గాలైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో వై ఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధి కారంలోకి వస్తే మాల, మాదిగలతో పాటు రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం.. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల్లో 46 ఉపకులాలు న్నాయి. అందులో మాదిగ, మాల, రెల్లి, పైడి, ఆది ఆంధ్ర వారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) సుమారుగా 3,29,486 మంది వరకు ఉన్నారు. ఇందులో 1,62,873 పురుషులు, 1,66,613 మహిళలు న్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. 25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశారటూ ఎస్సీ మాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్రంలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి అమలు చేశారు. అయితే ఆ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తున్నారు. అయినా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్‌లో ఓ వర్గం నేటికీ పోరాటం చేస్తూనే ఉంది. దీంతో ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాల, మాదిగల మధ్య సఖ్యత పెంపొందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. కార్పొరేషన్ విభజనపై హర్షం.. ఎస్సీల ఆర్థికాభివృద్ధికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1974లో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ను ఆయా ఉపకులాలను విభజించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ విభజించాలని తామంతా విన్నవించాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. రాష్ట్రంలో 59 ఉపకులాలకు నేరుగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించడం గొప్పవిషయం. మాట తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దళితులమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. – బోని శివరామకృష్ణ. దళితనేత సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాటివ్వడమే గాని హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం మమ్మల్ని వాడుకున్నారే తప్పా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రజాసంకల్పయాత్రలో విన్నవించుకున్నాం. జగనన్న ఇచ్చిన హామీ మేరకు మూడు కార్పొరేషన్లు గా విభజించి సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏపీ సీఎం జగనన్నకి తామంతా రుణపడి ఉంటాం. – వీజే అజయ్‌కుమార్, దళితనేత విభజనతో సంక్షేమఫలాలు కార్పొరేషన్ విభజనతో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతా యి. జిల్లాలో దళితులం ఎక్కువగా ఉన్నా మాకు ఏ ప్రభుత్వం న్యా యం చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరిగింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే మా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేషన్ విభజనతో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. – పాకా సత్యనారాయణ -
‘ఇంటి’గుట్టు రట్టు!
సాక్షి, విశాఖపట్నం: నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ గృహ నిర్మాణం పథకం కింద అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలనేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఈ మేరకు ఇప్పటికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరో వైపు ఇళ్ల కోసం ‘స్పందన’లో భారీ సంఖ్యలోనే వినతులు దాఖలవుతున్నాయి. ఆయా దరఖాస్తులను బట్టి జిల్లాలోని రూరల్‌లో 68,520, అర్బన్‌లో ఇండివిడ్యువల్ ఇళ్లు 13,898 అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి మొత్తం 82,418 ఉన్నప్పటికీ ఈ సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటి నిర్మాణం కోసం రూరల్‌లో 1,354, అర్బన్‌లో 1,199 ఎకరాలు అవసరం అవుతాయని అంచనా. అవకతవకలకు చెల్లు.. గత టీడీపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు ఇస్తామని ఊరించినప్పటికీ తొలి నాలుగేళ్లూ మంజూరు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే తరుణంలో ఇళ్లు మంజూరు కు తెరలేపింది. అర్హతలతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన పేర్లన్నీ జాబితాలో చేరిపోయాయి. టీడీపీ ప్రభుత్వం మంజూరైతే చేసింది కానీ నిర్మాణాలకు పైసా కూడా విదల్చలేదు. దీంతో చాలావరకూ నిర్మాణాలు ప్రారంభించలేదు. చాలా చోట్ల పునాది రాయి కూడా వేయలేదు. ఇలాంటివాటిని రద్దు చేయాలన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు క్షేత్ర పరిశీలన చేశారు. 19,054 ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇందులో భాగంగా చోడవరంలో జీ ప్లస్ 3 ఇళ్లు 3,936 రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్ (ప్రస్తుతం వైఎస్సార్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు మారింది) కింద జిల్లాలో మంజూరైన మరో 10,042 ఇళ్లను రద్దు చేయడానికి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ స్కీమ్‌లో లబ్ధిదారులంతా ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ వాటినీ టీడీపీ నాయకులు స్కీమ్‌లో చేర్చేశారు. కొత్త ఇళ్ల మాదిరిగానే సొమ్ము వస్తుందని ఆశ చూపించడం గమనార్హం. మిగతా స్కీమ్‌లన్నీ కొనసాగింపు.. గతంలో మంజూరై పిట్టగోడలు, శ్లాబ్ దశలో ఆగిపోయిన 68,201 ఇళ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ పథకాల కింద మంజూరైన 20,158 ఇళ్లను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ రూరల్ హౌసింగ్ పథకం 2016–17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 415 ఇళ్లు, 2017–18లోని 1,896 ఇళ్లు, 2018–19లోని 3,648 ఇళ్లు, 2019–20లోని 1,983 ఇళ్లు మొత్తం 7,942 ఇళ్లకూ నిధుల విడుదలకు అడ్డంకి ఏమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పీఎంఏవై–వైఎస్సార్ (గ్రామీణ్) 2016–17 స్కీమ్‌లోని 1,879 ఇళ్లు, 2017–18లోని 1,543 ఇళ్లనూ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అర్బన్‌లో పీఎంఏవై–వైఎస్సార్(యూ) బీఎల్సీ 2016–17లోని 1,126 ఇళ్లు, 2017–18లో సిఫారసు చేసిన 468 ఇళ్లతో పాటు మంజూరైన 5,053 ఇళ్లను, అలాగే పీఎంఏవై–వైఎస్సార్ (యూ) యూడీఏ స్కీమ్ 2018–19లో ఎంపిక చేసిన 19,690 ఇళ్లతో పాటు మంజూరైన 37,956 ఇళ్ల నిర్మాణాలకు ఢోకా లేదు. అర్హులందరికీ ఇళ్లు.. ఒక్క వైఎస్సార్ స్పెషల్ హౌసింగ్ 2018–19 స్కీమ్ తప్ప మిగతా 11 రకాల హౌసింగ్ స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.32 కోట్ల వరకూ బకాయిలు ఉండిపోయాయి. ప్రస్తుతం అవి రూ.64 కోట్లకు చేరాయి. వీటిని ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆచరణలోకి వచ్చిన వెంటనే ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన వారందరికీ ఇల్లు వస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. – సి.జయరామాచారి, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గృహనిర్మాణ శాఖ -
తెలుగు తమ్ముళ్ల అవినీతి కంపు...
దోచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగిన ‘పచ్చ’ తమ్ముళ్లు ఆఖరికి మరుగుదొడ్లను కూడా వదల్లేదు. బాబు సర్కారు హయంలో జరిగిన అవినీతిలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. తాజాగా చోడవరం మండలం చాకిపల్లి పంచాయతీలోని రామజోగిపాలెం గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.10 లక్షల మేర అవినీతి జరిగినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. సాక్షి, చోడవరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతి బాగోతాలు ఒకొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణంలో మోసాలు వెలుగు చూసి రెండు రోజులు కాకముందే అదే పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి బాగోతం బయటపడింది. చోడవరం మండలం రామజోగిపాలెంలో తాజాగా స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.10 లక్షల మేర అవినీతి జరిగి నట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు, అసంపూర్తిగా నిర్మాణాలు చేసి పూర్తిగా బిల్లులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రూ.లక్షలు దోచుకున్నట్టు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాకిపల్లి పంచాయతీకి గత టీడీపీ హయాంలో 268 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రూ.38 లక్షల 40వేలు నగుదును లబ్ధిదారులకు పేమెంట్స్ ఇచ్చేశారు. ఈ పంచాయతీ శివారు గ్రామమైన రామజోగిపాలేనికి వీటిలో 145 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.18 లక్షల రూ.80 వేలు చెల్లించారు. రామజోగిపాలెంకు మంజూరైన వాటిలో సుమారు 100 మరుగుదొడ్లలో భారీగా అవినీతి జరిగినట్టు తెలు స్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు అప్పటి అధికారులు సహకరించడంతో వీటి నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో మొత్తం సుమారు 190 ఇళ్లు ఉండగా వీటిలో సగానికిపైగా తమ సొంత నిధులతో ఇళ్లు, మరుగుదొడ్లు కట్టుకున్నారు. మరికొన్ని ఇందిరమ్మ, ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో ఇళ్లతో పాటు మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ఇవి కాకుండా స్వచ్ఛభారత్ మిషన్ పథకంలో ఏకంగా మరో 145 మరుగుదొడ్ల మంజూరు చేసి అందులో భారీగా అవినీతికి పాల్పడ్డారు. దీనిపై గతంలోనే స్థాని కులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకే చెందిన వారు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వివిధ పథకాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అప్పట్లో ఎటువంటి విచారణ జరగలేదు. కదిలిన అవినీతి డొంక.. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్డబ్ల్యూఎస్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు విచారణకు రావడంతో అవినీతి డొంక కదిలింది. మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో ఒకొక్క విషయం బయటపడుతుంటే అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ వి. రవికుమార్, చోడవరం డీఈఈ జి.శివకృష్ణ, జేఈ కనకమ్మ, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కో–ఆర్డినేటర్, శ్రీనివాస్, మండల కో–ఆర్డినేటర్ ప్రకాష్ , గ్రామ వలంటీర్లు కలిసి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. లబ్ధిదారుల జాబి తాతో ప్రత్యక్ష విచారణకు వచ్చిన అధికారులకు ఇక్కడ వెలుగు చూస్తున్న విషయాలు ఆశ్చర్యపరిచాయి. నందికోళ్ల ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతోపాటు బంధువుల పేరున ఎనిమిది మరుగుదొడ్లు మంజూరు చేయించుకుని ఒక్కటి కూడా కట్టకుండానే బిల్లులు తీసుకున్నట్టు తేలింది. కిల్లి రమణ, వెన్నెల పైడమ్మ, నందికోళ్ల మన్మథరావు, పోతల నాగరాజుతోపాటు అనేక మంది లబ్ధిదారుల పేరున ఉన్న మరుగుదొడ్ల నిర్మాణానికి గోతులు తవ్వకుండా, పైకప్పులులేనివి , బేసిన్లు, తలుపులు లేనినివి ఇలా అసంపూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటికి పూర్తిగా బిల్లులు ఇచ్చేసినట్టు తేలింది. సగానికి పైగా నిర్మాణాలు చేయకుం డానే బిల్లులు చేసినట్టు తెలుస్తోంది. ఒకొక్క మరుగుదొడ్డికి రూ.12నుంచి 15వేలు వరకు బిల్లులు చేశారు. సుమారు 100కు పైగా మరుగుదొడ్లలో రూ.10 లక్షలకు మించే అవినీతి జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అయితే విచారణకు జిల్లా స్థాయి అధికారులు వచ్చినప్పటికీ గ్రామ కార్యదర్శి మాత్రం వీరితో పరిశీలనకు రాలేదు. అప్పటి ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతోనే టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని గ్రామస్తులు పోతల అప్పరావు, పోతల ప్రసాద్ , రమణబాబు ఆరోపించారు. ఇదిలావుండగా గ్రామ కార్యదర్శి విచారణ సమయంలో రాకపోవడంతో విచారణ ప్రాథమికంగా జరిగిందని, ఆయన వచ్చాక పూర్తిస్థాయి విచారణ పూర్తవుతుందని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ శివకుమార్ తెలిపారు. -
ఆడుకుంటూ అనంత లోకాలకు...
పాయకరావుపేట: అంతవరకు తోటి స్నేహితులతో గెంతులేస్తూ ఎంతో ఆనందంగా ఆడుకున్న తన గారాలపట్టి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ సమయంలో భర్త కూడా ఊరిలో లేకపోవడంతో ఏం చేయాలో తోచక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక శోకసంద్రంలో మునిగిపోయింది. పాయకరావుపేట పట్టణంలో గల ప్రశాంతినగర్‌లో ట్రాక్టరు ఢీకొని ఐదు సంవత్సరాల బాలుడు దుర్మరణం చెందాడు. రాపేటి సురేష్, జానేశ్వరి దంపతులు స్థానిక ప్రశాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.వీరిలో రెండో కుమారుడు వినయ్(5) సోమవారం ఉదయం స్నేహితులతో వీధిలో ఆడుకుంటూ ఉండగా మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. పోలవరం కాలువ వైపు నుంచి గ్రావెల్‌తో వస్తున్న ట్రాక్టర్ బాలుడిని ఢీకొంది. దీంతో వినయ్ తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వినయ్ తండ్రి సురేష్ హైదరాబాద్ వెళ్లడంతో ఆయనకు సమాచారం అందించారు. తల్లి జ్ఞానేశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎం.విభీషణరావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు. -
‘స్పందన’.. ప్రజాసంద్రం
సాక్షి, నెట్వర్క్: సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు దరఖాస్తులు అందించేందుకు ‘స్పందన’ కార్యక్రమానికి సోమవారం ప్రజలు భారీగా పోటెత్తారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుతోపాటు భూసమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందించారు. గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘స్పందన’కు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో వారు ఎక్కువసేపు నిరీక్షించకుండా అధికారులు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇంటి స్థలాల కోసం ఏకంగా ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా గతవారం వరకు 20,763 దరఖాస్తులు రాగా, అందులో 14,671 పరిష్కరించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 5,941 మంది వినతిపత్రాలు ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడు కోసం ఒకరు.. పింఛన్ కోసం మరొకరు.. వైద్యసాయం అందించాలని మరికొందరు తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో మొత్తం 1167 అర్జీలు స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 1,518 అర్జీలు అధికారులకు అందాయి. అక్క భర్త పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు – స్పందన కార్యక్రమంలో 14 ఏళ్ల బాలిక ఫిర్యాదు పట్నంబజారు (గుంటూరు): ‘నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నా సోదరి భర్త నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నన్ను ఉంచుకుంటానంటూ వేధిస్తున్నాడు’ అంటూ గుంటూరు అర్బన్ పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ బాలిక కన్నీరుమున్నీరైంది. బాలిక కథనం మేరకు.. గుంటూరులోని ఒక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తల్లి మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటోంది. గతేడాది నుంచి బాలిక సోదరి షెహనాజ్ బేగం భర్త అష్రఫ్ అలీ.. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు అనకూడని మాటలు అంటున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక బాలిక పది రోజులుగా స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. తన తల్లి ఆస్తులపై అతడికి కన్ను ఉందని, అందుకే తనను వేధిస్తున్నాడని, ప్రాణభయం ఉందని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. మాజీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు – గుంటూరు రూరల్ ఎస్పీకి యువకుడి ఫిర్యాదు వైఎస్సార్ జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే తిరువీధుల జయరాములు వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినా ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఫోన్లు చేసి ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాలపాటి ఫ్రాన్సిస్ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఆర్.జయలక్ష్మికి ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు.. పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్‌గా జయరాములు పనిచేసే సమయంలో ఆయనతో ఫ్రాన్సిస్‌కు పరిచయం ఏర్పడింది. 2014లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయరాములు 2015లో పిడుగురాళ్లకు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్లో విద్యార్థుల దుస్తులు శుభ్రం చేసే కాంట్రాక్టు ఇప్పిస్తాననీ, పూర్తిగా సహకరిస్తానని నమ్మించారు. లాండ్రీ షాపు ఏర్పాటుకు డబ్బులు అవసరమై జయరాములు నుంచి రూ.2 లక్షలు ఫ్రాన్సిస్ అప్పుగా తీసుకున్నాడు. విడతల వారీగా రూ.1.80 లక్షలు జయరాములుకు తిరిగి చెల్లించాడు. కొద్ది రోజుల తర్వాత తనకు ఇంకా రూ.10 లక్షలు ఇవ్వాలంటూ జయరాములు తన అనుచరులతో ఫోన్ చేయిస్తూ డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు. -
విశాఖ జిల్లాలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం
-
వైఎస్ఆర్సీపీ చేరిన కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు రామజోగి
-
విశాఖ జిల్లాలో పవన్ పోరాటయాత్ర