
ఎడ్‌సెట్ ప్రశాంతం
రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులలో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్‌కు విశాఖ జిల్లాలో 85.78 శాతం విద్యార్థులు హాజరైనట్టు ప్రాంతీయ సంయుక్త సమన్వయకర్తలు ఆచార్య టి.షారోన్‌రాజు...
- జిల్లాలో 85.78 శాతం విద్యార్థుల హాజరు
- పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఏయూ వీసీ
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులలో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్‌కు విశాఖ జిల్లాలో 85.78 శాతం విద్యార్థులు హాజరైనట్టు ప్రాంతీయ సంయుక్త సమన్వయకర్తలు ఆచార్య టి.షారోన్‌రాజు, డాక్టర్ కె.రాములు తెలిపారు. నగరంలో 12 కేంద్రాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు.
ఉదయం 10 గంటల నుంచే పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించారు. ఐదు మెథడాలజీలలో పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 5791 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 4965 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ జి.ఎస్.ఎన్ రాజు పరిశీలించారు. పరీక్ష ప్రశాతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎడ్‌సెట్ కన్వీనర్ నిమ్మ వెంకటరావు, ఏయూ రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాల్ సిహెచ్.వి.రామచంద్రమూర్తి, డీన్ టి.కోటేశ్వరరావు, టి.వెంకటకృష్ణ, ఆచార్యులు జి.నాగేశ్వరరావు, వి.వల్లీ కుమారి, టి.రాఘవరావు, పి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.