
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో లాక్‌డౌన్ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సాయంత్రం(గురువారం) నుంచి నేటి సాయంత్రం(శుక్రవారం) ఆరు గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 929 కేసులు నమోదు చేశామని తెలిపారు. 8 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 54 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. రూ.3,34,355 అపరాధ రుసుం విధించామని పేర్కొన్నారు. కచ్చితంగా లాక్‌డౌన్, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని.. ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
(రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న)
Comments
Please login to add a commentAdd a comment