విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మర్రిపాలెం వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గర్భిణీతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.