
కాంగ్రెస్ ‘ఫలితం’అనుభవించింది: గంటా
తిరుమల : ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి తీర్పు వస్తుందో కాంగ్రెస్‌పార్టీకి తెలిసి వచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటరమణ ఉన్నారు.