విశాఖపట్టణం: విశాఖ ఏజెన్సీలో సోమవారం పలుచోట్ల వడగాళ్ల వాన కురిసింది. పాడేరు మండలం గుత్తులపుట్టు పరిసర ప్రాంతాల్లో సుమారు 3 గంటల పాటు వర్షం కురిసింది.
ఎక్కడచూసినా కుప్పలు తెప్పలుగా వడగళ్లు కురవడంతో స్థానికులు వర్షాన్ని ఆస్వాదించారు. ధారకొండ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అంతర్రాష్ట్ర రహదారిపై చెట్టు కూలడంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే చెట్టును గిరిజనులు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. సీలేరు ప్రాంతంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మామిడితో పాటు పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
విశాఖలో వడగళ్ల వాన
Published Mon, Apr 4 2016 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement