విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష | ys jagan mohan reddy review meeting with visakha ysrcp leaders | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

Published Fri, Nov 21 2014 12:15 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష - Sakshi

విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా నేతలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై ఆయన...జిల్లా నేతలతో చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

 

కాగా ధర్నా అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement