
సాక్షి, అనంతపురం: ఇంఛార్జి మంత్రి హోదాలో మున్సిపల్‌శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ సోమవారం తొలిసారి జిల్లాలో పర్యటించారు. అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకాలను అర్హలందరికీ నిష్పక్షపాతంగా అందజేస్తూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు.. అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉషాశ్రీచరణ్, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment