కొట్టుకునిపోయి మృత్యువాత పడిన మూడు గేదెలు
విశాఖ బీచ్ రోడ్డులోని పలుచోట్ల ముందుకొచి్చన సముద్రం
చేపలుప్పాడ వద్ద భారీగా కోతకు గురైన తీరం
కొమ్మాది/బీచ్‌రోడ్డు : విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో కాపులుప్పాడ గెడ్డ నుంచి కె.నగరపాలెం మీదుగా భారీఎత్తున వరద పోటెత్తింది. ఈ క్రమంలో కె.నగరపాలెంలో మూడు గేదెలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. అనంతరం ఇవి మృతిచెందినట్లు గుర్తించారు. అలాగే, గోవుపేట, గంగడపాలెం ప్రాంతాలు పూర్తిస్థాయిలో నీట మునగడంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరదేశిపాలెం గెడ్డ కూడా పెద్దఎత్తున ప్రవహించడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బీచ్ రోడ్డులో చేపలుప్పాడ వద్ద సముద్రం ముందుకు రావడంతో ఇక్కడ తీరం భారీస్థాయిలో కోతకు గురైంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. మంగమారిపేట, రుషికొండ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచి్చంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండలో బోటు షికారు నిలిపివేయడంతో బోట్లన్నీ తీరానికి పరిమితమయ్యాయి. ఇక మృతిచెందిన గేదెలకు రూ.37,500, పడ్డకి రూ.20వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరోవైపు.. బీచ్‌రోడ్డులో కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు రక్షణ గోడను తాకుతూ కెరటాలుఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకురావటంతో చూసేందుకు సందర్శకులు ఎక్కువగా బీచ్‌కు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment