![Married Woman Missing In Visakha District - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/5/Married-Woman-Missing.jpg.webp?itok=_7vy3Jcb)
దేవి (ఫైల్)
మాడుగుల రూరల్(విశాఖ జిల్లా): ముకుందపురం గ్రామానికి చెందిన వివాహిత చెలిబోయిన దేవి (22) ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించడంలేదని శుక్రవారం ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ రామారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. చోడవరం మండలం ఖండిపల్లి గ్రామానికి చెందిన పోలిబాబుతో దేవికి ఏడాది క్రితం వివాహం జరిగింది.
చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది..
అయితే ఇటీవల సొంతూరు మాడుగుల మండలం ముకుందపురం వచ్చిన ఆమె ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9440796091, 08934–224233 నంబరుకు తెలియజేయాలని ఎస్‌ఐ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment