married woman missing
-
Hyderabad: భర్తను ఫంక్షన్‌ను పంపి భార్య అదృశ్యం.. స్నేహితుడిపై అనుమానం
హైదరాబాద్: భర్తను ఫంక్షన్‌ను పంపిన భార్య అతను తిరిగి వచ్చేలోపు ఇంటి నుంచి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఎస్ఐ ఉదయ్ సమాచారం మేరకు... జి.ప్రశాంత్, తేజస్వినీలకు 2020 నవంబర్‌లో వివాహం అయింది. వారు రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ కొరియర్ బాయ్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కిరణ్ తదితర యువకులు పరిచయం అయ్యారు. తరచూ ఆ యువకులు ప్రశాంత్ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. కిరణ్ కూడా తేజస్వినీని అమ్మా అని, అక్కా అని వివిధ రకాలుగా సంబోధిస్తూ తనవారుగానే ఇతరులకు పరిచయం చేసుకున్నాడు. కాగా ఈ నెల 20వ తేదీ ప్రశాంత్ తమకు తెలిసిన వారి ఫంక్షన్‌కు వెళదామని భార్యను అడగ్గా నీవు ఒక్కడివే వెళ్లు నేను రానని చెప్పింది. అంతేగాకుండా భర్తను అందంగా ముస్తాబు చేసి, త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫంక్షన్‌కు పంపింది. అతను ఫంక్షన్‌కు వెళ్ల తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కనిపించలేదు. అంతేగాకుండా ఆమెకు సంబంధించిన దుస్తులు, నగదు, ఇతర వస్తువులు కనబడలేదు. చుట్టుపక్కల విచారించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కిరణ్ అనే వ్యక్తి మినహా అందరూ వచ్చి ఆమె కోసం గాలించారు. అయినా కనిపించకపోవతంతో ప్రశాంత్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు పిల్లలు లేరని, కిరణ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నెల రోజులుగా చెల్లితో హాస్టల్లో ఉంటూ.. ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి.
హైదరాబాద్: మహిళా అదృశ్యమైన ఘటన ఆసీఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. అడ్మిన్ ఎస్సై మహ్మద్ జాహేద్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం బర్పట, పటాచార్కుడి బార్మలికుచి ప్రాంతానికి చెందిన కె. కరిష్మాఖాతూమ్(30) వివాహిత. ఈమే గత నెలలో మెహిదీపట్నం అయోధ్యనగర్ కే.గీతారెడ్డి గర్ట్స్ హాస్టల్లో ఆమె చెలెల్లు బనితా దగ్గరకు వచ్చి ఉంటుంది. గత నెల 19న సాయంత్రం 6 గంటలకు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారు, బంధుమిత్రుల వద్ద వాకాబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె భర్త అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్త ఉద్యోగరీత్యా చైన్నెలో.. వివాహిత అదృశ్యం
హుజూర్నగర్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన హుజూ ర్‌నగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. హుజూర్‌నగర్‌లోని చింతలబజార్కు చెందిన రేపన జానకమ్మ చిన్న కుమార్తె రెపన శాంతికి ఆరేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన కృష్ణంరాజుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కాగా, శాంతికి ఆరోగ్యం బాగోలేక నెల రోజులుగా పట్టణంలోని తల్లి వద్దనే ఉంటుంది. ఆమె భర్త కష్ణరాజు ఉద్యోగరీత్యా చైన్నెలో ఉంటున్నాడు. అయితే, శుక్రవారం శాంతి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లి జానకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
సాక్షి,మెదక్ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్‌పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే ఆ బైక్ , ఇద్దరి చెప్పులు మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్ఐ నర్సింలు పేర్కొన్నారు. -
అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..
సాక్షి, సంగారెడ్డి: వివాహిత అదృశ్యమైన సంఘటన శనివారం జరిగింది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగల్గిద్ద మండలం ఇరక్‌పల్లికి చెందిన జంగెదొడ్డి సునీల్ (30), జంగెదొడ్డి సునీత (25) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో నారాయణఖేడ్‌లోని సువర్ణ షెట్కార్ టాకీసు సమీపంలో అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త బందువులు, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. సునీల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నర్సాపూర్‌రూరల్: విద్యార్థిని అదృశ్యమైన సంఘటన శనివారం జరిగింది. నర్సాపూర్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్‌కు చెందిన నర్సింలు కూతురు పూజిత (19) శనివారం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. కాని అక్కడికి రాకపోవడంతో ఆందోళనకు గురైన పూజిత అన్న మల్లికార్జున్‌తోపాటు కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..) -
భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం
అల్లిపురం (విశాఖ దక్షిణ): ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యమైన ఘటనపై మహారాణిపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట, తాడివీధికి చెందిన ఎలుజుల లీలావతికి 12 సంవత్సరాల క్రితం శాంతరాజు అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఒక బాబు, పాప సంతానం. భర్తతో గొడవపడిన లీలావతి గత ఐదు సంవత్సరాలుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి తాడివీధిలో గల కన్నవారింట్లో ఉంటుంది. చదవండి: నువ్వు చనిపోతావ్.. నీ భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది.. చివరికి ట్విస్ట్ ఈ నేపథ్యంలో గత నెల 27న తన ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో తల్లి లింగాల ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 9440796010లో తెలియజేయాలని కోరారు. -
అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..
చేవెళ్ల: అర్థరాత్రి ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని భర్త మందలించటంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలు... చేవెళ్ల మండలంలోని కమ్మెట గ్రామానికి చెందిన బండ మహేశ్ వ్యవసాయం చేసుకుంటూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య బండ అమృత (19) బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుతుండటం చూసి ఈ సమయంలో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావని మందలించాడు. అంతే వెంటనే ఫోన్ కట్ చేసి పడుకుంది. భర్త మరో గంట తర్వాత లేచి చూసేసరికి భార్య కనిపించలేదు. బెడ్రూం డోర్ గడియ బయట నుంచి పెట్టి వెళ్లిపోయింది. ఎలాగోలా బయటకు వచ్చిన భర్త మహేశ్ చుట్టుపక్కల ఎంత వెతికిన కనిపించలేదు. ఆమె ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేయగా ఒకసారి రింగ్ అయి తర్వాత మళ్లీ చేస్తే స్విచ్ఆఫ్ వస్తుందని తెలిపారు. దీంతో గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించటం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పెళ్లి బంధంతో ఒక్కటైన మూగ జంట) -
పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య..
సాక్షి, హైదరాబాద్: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్‌కు చెందిన మౌనికకు గతేడాది కొండాపూర్‌కు చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. నాటి నుంచి ఆమెను భర్త పుట్టింటికి పంపించలేదు. ఈ క్రమంలో మౌనిక తొమ్మిది రోజుల క్రితం తన బాబాయ్ గోపాల్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి భర్తకు చెప్పకుండానే హాజరైంది. ఈ నెల 3న తన అత్తింటికి వెళ్తున్నానని మౌనిక బయలుదేరింది. అదే రోజు సాయంత్రం గోపాల్ ఆమె కోసం ఆరా తీయగా ఇంటికి చేరుకోలేదని తెలిసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో ఆమె జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య) -
సార్.. నా భార్య కనిపించడం లేదు..
చిత్తూరు (ఏర్పేడు) : తన భార్య కనిపించడం లేదంటూ ఫోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మండలంలోని రాజులపాలెం వ్యవసాయ పొలాల్లో ఓ వివాహిత పై భర్త ఫిర్యాదు చేసినట్లు బాదితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం ఏర్పేడు సీఐ శ్రిహరి తెలిపిన వివరాలు.. వలమనేరు మండలవ జండామఠ గ్రామానికి చెందిన నరేంద్ర బాతులు మేపుతూ కుంటుంబాన్ని ఫోషిస్తున్నాడు. బాతులను భార్య అమ్ము(24) తో కలసి మండలంలోని రాజులపాలెంకు ఈ నెల 11వ తేదిన వచ్చాడు. గ్రామ పొలాల్లో టెంట్ వేసుకుని బాతులు మేపి అక్కడే ఇద్దరూ నిద్రించారు. అయితే మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ప్రాంతంలో నరేంద్రకు మెలకువ వచ్చి చూడగా భార్య కనిపించలేదు. ఆమె కోసం స్వగ్రామంలో పాటు పలుచోట్లా గాలించినా ఆచూకి లభించకపోవడంతో మంగళ వారం ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ గ్రామనికి చెందిన ఆటో డ్రెవర్ చిన్నా తన భార్యను కిడ్నాప్ చెసినట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె అచూకి తెలిస్తే 9440900729 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు -
వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?
మాడుగుల రూరల్(విశాఖ జిల్లా): ముకుందపురం గ్రామానికి చెందిన వివాహిత చెలిబోయిన దేవి (22) ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించడంలేదని శుక్రవారం ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ రామారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. చోడవరం మండలం ఖండిపల్లి గ్రామానికి చెందిన పోలిబాబుతో దేవికి ఏడాది క్రితం వివాహం జరిగింది. చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది.. అయితే ఇటీవల సొంతూరు మాడుగుల మండలం ముకుందపురం వచ్చిన ఆమె ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9440796091, 08934–224233 నంబరుకు తెలియజేయాలని ఎస్ఐ కోరారు. -
డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి..
సాక్షి,పహాడీషరీఫ్(రంగారెడ్డి): ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ యాసిన్ తొమ్మిదేళ్ల క్రితం సాల్హె బాన్ (27)ను వివాహం చేసుకోగా ప్రస్తుతం నలుగురు పిల్లలు సంతానం. కాగా ఇటీవల చిన్న విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 22న ఉదయం 7 డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా జాడ కనిపించలేదు. ఈ విషయమై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కానీ, 94906 17241 నంబర్లో కానీ సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. చదవండి: నువ్వు లేకపోతే బతకలేనని, నమ్మించి శారీరకంగా లోబర్చుకుని.. -
తాగుడుకు బానిసైన భర్త.. సహనం కోల్పోయి ముగ్గురు పిల్లలతో కలిసి..
సాక్షి, నారాయణఖేడ్( సంగారెడ్డి): తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక నాగల్గిద్ద మండలంలోని మోర్గి గ్రామానికి చెందిన వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు నాగల్గిద్ద ఎస్ఐ విజయరావు బుధవారం తెలిపారు. మనూరు మండలం డోవూరు గ్రామానికి చెందిన వినోదకు నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన సంజీవ్‌కుమార్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు అంకిత (8), అర్చన (6), అరుణ్ (5). వినోద జూలై 28న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని అత్తతో చెప్పి వెళ్లింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసినవారిన విచారించినా తల్లీపిల్లల ఆచూకీ లభించలేదు. వినోద తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
Banjara Hills: ‘నా వైవాహిక జీవితం బాలేదు.. అందుకే వెళ్ళిపోతున్నా’
సాక్షి, బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్ఎన్.నగర్లో నివసించే జితేంద్ర సోదరి కీర్తి(28) కాచిగూడలో నివాసముంటోంది. నెల క్రితం కీర్తి తన సోదరుడి వద్దకు వచ్చింది. ఈ నెల 12 మధ్యహ్నం ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్ళిపోయి తిరిగిరాలేదు. తన వైవాహిక జీవితం బాగా లేదని అందుకే వెళ్ళిపోతున్నానంటూ జితేందర్‌కు మెసేజ్ చేసింది. సోదరుడు పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌లో అదృశ్యం.. కొత్తూరులో మృతదేహం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు కొత్తూరు గ్రామ శివారులో శవమై తేలాడు. రహ్మత్‌నగర్‌లో నివసించే శ్రీకాంత్(27) సోదరుడు శివకాంత్తో కలిసి ఉంటున్నాడు. గత జనవరిలో శ్రీకాంత్ వివాహం కాగా బీదర్‌లో కొద్ది రోజులు ఉండి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి రహ్మత్‌నగర్‌లోని సోదరుడి వద్ద ఉంటున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ కనిపించడం లేదంటూ సోదరుడు శివకాంత్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొత్తూరు శివారులో మృతదేహంగా తేలాడు. ఆత్మహత్య చేసుకున్నాడా..? ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ (ఫైల్) -
ఇద్దరు పిల్లలు సహా గృహిణి అదృశ్యం
చాంద్రాయణగుట్ట: కూరగాయలకని ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడ లలితాబాగ్ ప్రాంతానికి చెందిన నసీర్ హుస్సేన్ మాలిక్, మెహాక్ బేగం (30)లు దంపతులు. వీరికి కూతురు ఫూల్ భాను (12), కుమారుడు బషీర్ (8)లు సంతానం ఉన్నారు. ఈ నెల 14న రాత్రి 7 గంటలకు మెహాక్ బేగం తన ఇద్దరు పిల్లలు భాను, బషీర్‌లతో కలిసి ఉప్పుగూడ జెండా వద్ద కూరగాయల కోసమని ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో భర్త నసీర్ హుస్సేన్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040– 27854788లో సమాచారం అందించాలని సూచించారు. -
వివాహిత అదృశ్యం
విశాఖపట్నం , మునగపాక : మండలంలోని ఒంపోలుపేటకు చెందిన వివాహిత కొంత పార్వతి(21) అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఒంపోలుపేటకు చెందిన కొంతం పార్వతి జనవరి 30న పరవాడలోని ఫార్మాసిటీలో పనిచేస్తున్న తన భర్త వెంకట సత్యనారాయణకు భోజనం క్యారేజి కట్టింది. భర్త అదేరోజు మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పార్వతి కనిపించలేదు. బంధువులు, స్వేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ కనిపించలేదు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 5న పార్వతి ఇంటికి వచ్చింది. అదేరోజు మళ్లీ ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించారు. 18 రోజుల పాటు వెతికినా పార్వతి కనిపించకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఎస్ఐ కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ అదృశ్యం
కీసర: ఓటు వేసేందుకు బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ ప్రకాష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాల గ్రామం, ఇందిరమ్మ కాలనీకి చెందిన జయశ్రీ దిశా పాఠశాల్లో కేర్‌టేకర్‌గా పనిచేసేది. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన జయశ్రీ భర్త రాజు మంగళవారం ఉదయం కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెడపల్లిలో వివాహిత అదృశ్యం
పుట్టపర్తి అర్బన్: పెడపల్లికి చెందిన మంజుల అనే వివాహిత నెల రోజుల నుంచి కనిపించడం లేదు. ఎన్నిచోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ఈ మేరకు భర్త ఆనంద్ పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
గృహిణి అదృశ్యం
రాజేంద్రనగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాస్త్రీపురం ఓవైసీ హిల్స్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రషీద్ భార్య సమీనాబేగం(21) గృహిణి. ఇంట్లో అందరూ నిద్రకు ఉపక్రమించిన తరువాత ఇంట్లోని బంగారం తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఉదయం లేచి చూసేసరికి సమీనాబేగం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు
భర్తే హతమార్చాడని అనుమానం నెల్లూరు(క్రైమ్): వివాహిత అదృశ్యంపై శుక్రవారం రాత్రి నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు అందింది. భర్తే హత్యచేసి ఉంటాడని వివాహిత తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలు.. కర్నూలు జిల్లా ధర్మవరానికి చెందిన విశ్రాంత కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నతానియన్ నాలుగో కుమార్తె వినీత(28). నాలుగేళ్ల క్రితం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన సుధీర్‌కుమార్‌బాబు ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతుండగా వినీతతో పరిచయం ఏర్పడింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి నాలుగేళ్ల క్రితం తిరుమలలో వివాహం చేసుకున్నారు. ఏడాదిగా దంపతులిద్దరూ అరవిందనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సుధీర్‌కుమార్ బాబు ప్రస్తుతం నారాయణ మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్‌గా పనిచేస్తున్నారు. వినీతపై అతనికి అనుమానంతో దంపతుల నడుమ కలతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సుధీర్‌కుమార్ తన మామ నతానియన్‌కు ఫోన్ చేసి వినీతను చంపేశానని చెప్పి ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. కుమార్తె ఫోన్‌కు చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. నతానియన్ నెల్లూరు పోలీసులకు విషయం చెప్పడంతో నాలుగో నగర ఇన్స్పెక్టర్ సీతారామయ్య అరవిందనగర్‌లోని సుధీర్‌కుమార్ బాబు ఇంటికి వెళ్లాడు. తలుపు తాళం పగలగొట్టి పరిశీలించగా అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. ఇదే విషయాన్ని నతానియన్‌కు ఫోన్లో తెలిపారు. శుక్రవారం రాత్రి నెల్లూర చేరుకున్న నతానియన్ తన కుమార్తె అదృశ్యంపై నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినీతను భర్తే హత్యచేసి మాయం చేసి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేపట్టారు. సదరు ఇంటి వద్దకు వెళ్లి విచారించగా సుధీర్‌కుమార్‌బాబు రెండు పెద్ద సూట్‌కేసులను తీసుకొని కారులో గురువారం తెల్లవారుజామున వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. మరోవైపు సుధీర్‌కుమార్‌బాబు భార్యను హత్యచేసి రెండు ముక్కలుగా చేసి సూట్‌కేసుల్లో తిరుపతికి తీసుకెళ్లాడనే వదంతులు వినిపిస్తున్నాయి. సదరు బ్యాగ్‌లను అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సుధీర్‌బాబు కోసం తిరుపతిలో గాలిస్తున్నామని వెల్లడించారు. -
చైతన్యపురిలో వివాహిత అదృశ్యం
హైదరాబాద్(చెతన్యపురి): ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ జైరాం ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... చైతన్యపురి వాసవి హోమ్స్‌లో నివాసముండే సాఫ్ట్వేర్ ఉద్యోగి సయ్యద్ అబీబ్ఉల్లాఖాద్రీ భార్య సమీమ్ఉన్నిసా అలియాస్ షబాణా(41) ఈ నెల 2న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఎక్కడ వెతికినా ఆమె జాడ తెలియపోవడంతో చైతన్యపురి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అదృశ్యం
బోడుప్పల్ (హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ వీరారెడ్డి కాలనీలో నివసించే దంపతులు డి. కవిత(40) బహుదూర్‌సింగ్ ఈ నెల 6న గొడవ పడ్డారు. ఆ తర్వాత కవిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.