
ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారు, బంధుమిత్రుల వద్ద వాకాబు చేసినా
హైదరాబాద్: మహిళా అదృశ్యమైన ఘటన ఆసీఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. అడ్మిన్ ఎస్సై మహ్మద్ జాహేద్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం బర్పట, పటాచార్‌కుడి బార్మలికుచి ప్రాంతానికి చెందిన కె. కరిష్మాఖాతూమ్(30) వివాహిత.
ఈమే గత నెలలో మెహిదీపట్నం అయోధ్యనగర్ కే.గీతారెడ్డి గర్ట్స్ హాస్టల్‌లో ఆమె చెలెల్లు బనితా దగ్గరకు వచ్చి ఉంటుంది. గత నెల 19న సాయంత్రం 6 గంటలకు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారు, బంధుమిత్రుల వద్ద వాకాబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె భర్త అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.