
కొంతం పార్వతి, ఒంపోలుపేట
విశాఖపట్నం , మునగపాక : మండలంలోని ఒంపోలుపేటకు చెందిన వివాహిత కొంత పార్వతి(21) అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఒంపోలుపేటకు చెందిన కొంతం పార్వతి జనవరి 30న పరవాడలోని ఫార్మాసిటీలో పనిచేస్తున్న తన భర్త వెంకట సత్యనారాయణకు భోజనం క్యారేజి కట్టింది. భర్త అదేరోజు మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పార్వతి కనిపించలేదు. బంధువులు, స్వేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ కనిపించలేదు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 5న పార్వతి ఇంటికి వచ్చింది. అదేరోజు మళ్లీ ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించారు. 18 రోజుల పాటు వెతికినా పార్వతి కనిపించకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఎస్‌ఐ కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment