
సాక్షి, నారాయణఖేడ్( సంగారెడ్డి): తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి గ్రామానికి చెందిన వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు నాగల్‌గిద్ద ఎస్‌ఐ విజయరావు బుధవారం తెలిపారు. మనూరు మండలం డోవూరు గ్రామానికి చెందిన వినోదకు నాగల్‌గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన సంజీవ్‌కుమార్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు పిల్లలు అంకిత (8), అర్చన (6), అరుణ్ (5). వినోద జూలై 28న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని అత్తతో చెప్పి వెళ్లింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసినవారిన విచారించినా తల్లీపిల్లల ఆచూకీ లభించలేదు. వినోద తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment