Banjara Hills: ‘నా వైవాహిక జీవితం బాలేదు.. అందుకే వెళ్ళిపోతున్నా’ | Married Woman Missing In Banjarahills Due To Family Issues | Sakshi
Sakshi News home page

Banjara Hills: ‘నా వైవాహిక జీవితం బాలేదు.. అందుకే వెళ్ళిపోతున్నా’

Published Sat, Jul 17 2021 2:03 PM | Last Updated on Sat, Jul 17 2021 2:03 PM

Married Woman Missing In Banjarahills Due To Family Issues - Sakshi

 అదృశ్యమైన కీర్తి

సాక్షి, బంజారాహిల్స్‌: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైంది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌.నగర్‌లో నివసించే జితేంద్ర సోదరి కీర్తి(28) కాచిగూడలో నివాసముంటోంది. నెల క్రితం కీర్తి  తన సోదరుడి వద్దకు వచ్చింది. ఈ నెల 12 మధ్యహ్నం ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్ళిపోయి తిరిగిరాలేదు. తన వైవాహిక జీవితం బాగా లేదని అందుకే వెళ్ళిపోతున్నానంటూ జితేందర్‌కు మెసేజ్‌ చేసింది. సోదరుడు పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

జూబ్లీహిల్స్‌లో అదృశ్యం.. కొత్తూరులో మృతదేహం
బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు కొత్తూరు గ్రామ శివారులో శవమై తేలాడు. రహ్మత్‌నగర్‌లో నివసించే  శ్రీకాంత్‌(27)  సోదరుడు శివకాంత్‌తో కలిసి ఉంటున్నాడు. గత జనవరిలో శ్రీకాంత్‌ వివాహం కాగా బీదర్‌లో కొద్ది రోజులు ఉండి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి రహ్మత్‌నగర్‌లోని సోదరుడి వద్ద ఉంటున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శ్రీకాంత్‌ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్‌ కనిపించడం లేదంటూ సోదరుడు శివకాంత్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొత్తూరు శివారులో మృతదేహంగా తేలాడు. ఆత్మహత్య చేసుకున్నాడా..? ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


శ్రీకాంత్‌ (ఫైల్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement