
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్‌లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు సెలూన్‌పై దాడులు చేశారు.
ప్రకాశ్ అనే వ్యక్తి.. ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పది మంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెలూన్‌ను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment