
హైదరాబాద్, సాక్షి: అది నగరంలో వన్ ఆఫ్ ది వీవీఐపీ ఏరియా. ఏకంగా రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాలు ఉండే చోటు. కాబట్టి, భద్రత కూడా కట్టుదిట్టంగానే ఉంటుందని అంతా భావిస్తాం. అయితే.. అలాంటి చోట చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.
బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో దొంగతనం జరిగింది. క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచిన నిర్మాణ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. అర్ అండ్ బీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
నిర్మాణ సామాగ్రిలో తలుపుల్ని, స్టీల్‌ను దుండగులు మాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. అత్యంత పటిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ చోరీ జరగడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కిందిస్థాయి అధికారుల పనే అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment