minister quarters
-
బీఆర్ఎస్ నేతల ధర్నా.. అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో నీట్ మెడికల్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం(బీఆర్ఎస్వీ) నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 15) బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లేందుకు యత్నంచిన మరికొందరు బీఆర్ఎస్వీ నేతలను బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్వీ నేతలకు వాగ్వాదం జరిగింది. పోలీసులను నెట్టివేసి వెళ్లేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలి. ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కుట్ర చేస్తున్నారు. జీవో నెంబర్ 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ స్థానికుడే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలి’అని గెల్లు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
HYD: మినిస్టర్ క్వార్టర్స్‌లో చోరీ
హైదరాబాద్, సాక్షి: అది నగరంలో వన్ ఆఫ్ ది వీవీఐపీ ఏరియా. ఏకంగా రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాలు ఉండే చోటు. కాబట్టి, భద్రత కూడా కట్టుదిట్టంగానే ఉంటుందని అంతా భావిస్తాం. అయితే.. అలాంటి చోట చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో దొంగతనం జరిగింది. క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచిన నిర్మాణ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. అర్ అండ్ బీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మాణ సామాగ్రిలో తలుపుల్ని, స్టీల్‌ను దుండగులు మాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. అత్యంత పటిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ చోరీ జరగడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కిందిస్థాయి అధికారుల పనే అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
‘క్రైస్తవ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, హైదరాబాద్ : క్రైస్తవుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపాడుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వారి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చదువుకొని ఉద్యోగాలు లేని వారికి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం ఆదుకుంటున్నామన్నారు. నగరంలోని మినిస్టర్స్ క్వాటర్స్‌లో శుక్రవారం క్రిస్టియన్ మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని క్రైస్తవులు కోరుకున్నారన్నారు. (అంబేడ్కర్ విగ్రహం నమూనా విడుదల) ‘ఈ ఆరేళ్లలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయుతనందిస్తోంది. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కూడా కేటాయించి అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తాం. కోవిడ్ కారణంగా మరణించిన క్రిస్టియన్ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పథకాలను కూడా క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ఉద్దేశ్యంతో సమూల మార్పులు జరుగుతున్నాయి’. అని పేర్కొన్నారు.(‘డబుల్ ఇళ్లు చూపిస్తామని పారిపోయారు’) -
మినిష్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం
బంజారాహిల్స్: ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు బంజారాహిల్స్‌లోని మినిష్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ చారి, నగర అధ్యక్షుడు బత్తుల నాని ఆధ్వర్యంలో విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మినిష్టర్స్ క్వార్టర్స్ వైపు ర్యాలీగా బయలుదేరారు. క్వార్టర్స్‌కు చేరుకునేలోపే ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని బత్తుల నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ముట్టడి కార్యక్రమం తలపెట్టామన్నారు. మినిష్టర్స్ క్వార్టర్స్ వైపు దూసుకెళ్లేందుకు యత్నిస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో విద్యార్థి విభాగం నేతలు అశోక్, శివారెడ్డి, అక్షయ్, వినోద్, సంజయ్, దీపక్, వాసు, భరత్, మధు, తదితరులు ఉన్నారు. -
మినిస్టర్ క్వార్టర్స్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా
హైదరాబాద్: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు బుధవారం ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్షిప్పులు వెంటనే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. -
మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఉదయాన్నే ఏబీవీపీ శ్రేణులు మంత్రుల నివాస సముదాయంలోకి చొరబడటానికి ప్రయత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మినిష్టర్ క్వార్టర్స్‌లో బతకమ్మ సందడి
-
మాజీ మంత్రులకు కరెంటు కష్టాలు!
-
మంత్రుల క్వార్టర్స్‌కు కరెంట్ కట్
హైదరాబాద్: అధికార దర్పం వెలగబెడుతున్న నాయకలకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. విద్యుత్ వాడుకుని బిల్లులు చెల్లించకపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయినికి విద్యుత్ సరఫరా ఆపేశారు. 24 లక్షలు రూపాయల విద్యుత్ బకాయి ఉండటంతో కరెంట్ నిలిపేశారు. బిల్లులు కట్టకుంటే ఎవరినైనా ఉపేక్షించబోమన్న సందేశానిచ్చారు. ఇప్పటికైనా నాయకులు విద్యుత్ బకాయిలు చెల్లిస్తారో, లేదో చూడాలి. బిల్లులు చెల్లించే వరకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించబోమని అధికారులు అంటున్నారు. -
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్
-
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే చెల్లించాలని, రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయవద్దంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్‌లను చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.